Monday, October 8

మిరియాలు ఔషధ ఉపయోగాలు

ఇవి జీర్ణం కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఆయుర్వేదంలో కృష్ణమరీచంగా పిలిచే మిరియాలు అద్భుతమైన వంటింటి ఔషధం. కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్‌, చావిసైన్‌ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. ఒక్క జలుబు, దగ్గుమాత్రమే కాదు.. మరెన్నో విధాల మేలుచేస్తాయి మిరియాలు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడతాయి. లాలాజలం ఊరేలా చేస్తాయి. ఉదరంలో పేరుకున్న వాయువును వెలుపలికి నెట్టివేసే శక్తి మిరియాల సొంతం. శరీరంలో రక్తప్రసరణా వేగవంతం అవుతుంది. కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. వీటి వాడకం వల్ల శరీరంలో స్వేద ప్రక్రియ పెరుగుతుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. కండర నొప్పులు దూరం... జలుబు, దగ్గు, ఆయాసంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే... గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడిచేసి.. చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని.. గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి.. తేనెతో రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకోవాలి. అలాగే.. అజీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు.. మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాతబెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఉదరంలో వాయువులు ఏర్పడినపున్పడు... కప్పు మజ్జిగలో పావుచెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే.. ఫలితం ఉంటుంది. కండరాలు, నరాలు.. నొప్పిగా అనిపించినప్పుడు.. చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకోవాలి. దప్పిక తీర్చే.... కఫం అధికంగా ఉన్నవారు.. అధికబరువుతో బాధపడుతున్నవారు.. భోజనానికి గంటముందు అరగ్రాము మిరియాలపొడిని తేనెతో తీసుకుని.. వేడినీళ్లు తాగితే.. గుణం ఉంటుంది. కొందరు అధిక దప్పికతో బాధపడుతుంటారు. ఇలాంటివారు.. కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే.. మంచిది. తరచూ జలుబు, తుమ్ములు వేధిస్తుంటే.. పసుపు, మిరియాలపొడిని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగాలి. చిగుళ్ల వాపు, నోటినుంచి నెత్తురు కారడం.. వంటి సమస్యలు బాధిస్తుంటే.. చిటికెడు రాళ్లఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి.. గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే ఉపశమనం ఉంటుంది. కీళ్లవాతంతో బాధపడే వారికి.. మిరియాలను నువ్వుల నూనెలో వేయించి.. పొడిచేసి నొప్పి ప్రాంతంలో కట్టు కడితే.. నొప్పి, వాపు తగ్గుతుంది. చర్మవ్యాధులు, గాయాలు :మిరియాల పొడిని, నెయ్యితో కలిపి రాసుకుంటే ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. మిరియాల పొడిని, పసుపుతో కలిపి మూడు, నాలుగు రోజుల పాటు ముఖానికి రాసుకుంటే మొటిమలు ఇట్టే తగ్గిపోతాయి. గాయలు తగిలినపుడు మిరియాల పొడి పెడితే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రక్తస్రావం ఆగిపోతుంది.

కడుపులో మంట ఉన్నవారు.. వేళకు ఆహారం సక్రమంగా తీసుకోనివారు.. అధిక శరీర వేడి ఉన్నవారు.. మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలోని ఘాటైన ద్రవ్యాలు మరీ వేడిని పెంచి.. సమస్య తీవ్రమయ్యే ఆస్కారముంటుంది. అందుకే ఈ సూచన. వైద్యుల సలహా ప్రకారం వాడితే.. ఏ ఇబ్బందీ ఉండదు. చిన్నపిల్లలకు పావుచెంచా.. పెద్దవాళ్లు అరచెంచా చొప్పున తీసుకోవచ్చు. మిరియాల పొడి...లాభాలు మరికొన్ని చిట్కాలు : మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. అవి మనకు, మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నోలాభాలను కలిగిస్తుందని చెబుతున్నారు వైద్యులు.

కొన్ని రుగ్మతలకు మిరియాలు :-

దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి.

దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పుకలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే మిరియాల చారు తాగమంటున్నారు వైద్యులు. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.

శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం వుంటుంది. దీనికి ఓ చిన్నగిన్నెలో నీరు తీసుకుని ఉప్పు, చిటికెడు ఇంగువ, పసుపు వేసి మరిగించాలి. దీనికి ఒక చెంచా మిరియాల పొడి చేర్చి మరోసారి మరిగించాలి. ఈ నీటికి జీలకర్ర, ఆవాల పోపు పెట్టాలి. వీలైతే కరివేపాకు, కొత్తిమిరి, వెల్లుల్లి, అల్లం, టమోటా వేసుకోవచ్చు.

గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అరచెంచా చొప్పున వేసి తేనె ఒకచెంచా కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
 ఔషధ ఉపయోగాలు :-
* మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది.
* వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం.. రొమ్ము కేన్సర్‌ కణితి ఉన్న వారిలో అది పెరిగే వేగాన్ని నియంత్రిస్తుంది.
* ఆహార పదార్థాల్లో వీటి పొడిని చే రిస్తే, చెమట, మూత్ర విసర్జన బాగా జరిగి శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటికి వె ళ్లిపోతాయి.
* మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి.
* వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది.
* మిరియాలకు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ను వృద్ధి చేసే శక్తి ఉంది. దీనివల్ల జీర్ణశక్తి చక్కబడుతుంది.
* కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలా వరకు త గ్గుతుంది.
* వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్‌ అంశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే పలు వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.
దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది.
* మిరియాలతో చేసిన టీ, కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, అజీర్ణం మరియు మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
* చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన టీలో కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
* ప్రతి రోజు పెరిగే ఒత్తిడి వలన శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ఒత్తిడిని మిరియాల టీ తాగటం ద్వారా తగ్గించుకోవచ్చు.
* మిరియాలతో చేసిన టీ విటమిన్ ‘C’ని కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది.

Saturday, October 6

మలబద్దకం నిరోధించుట కొరకు సులభ యోగాలు...

ఈ మధ్యకాలం లో చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మలవిసర్జన కు వెళ్తున్నాం మాకు మలబద్దకం లేదు అని అనుకుంటున్నారు . కాని అది సరియయినది కాదు . ఆరోగ్యవంతమైన మానవుడు రోజుకి రెండు సార్లు మలవిసర్జన చేయవలెను అని ఆయుర్వేద గ్రంథాలలో స్పష్టంగా ఉంది.

మలబద్దకం అనేది మానవ శరీరంలో వ్యాధులు ప్రారంభం అవుటకు మొదటి మెట్టు . మలబద్దకం ప్రారంభం అయిన వెంటనే గ్యాస్ సమస్య కూడా మొదలు అవుతుంది. కావున మలబద్ధకం అనే సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించుకోవలెను .

ఈ మలబద్దకం అనే సమస్య పరిష్కరించుకొనుటకు కొన్ని సులభయోగాలు మీకు తెలియచేస్తాను .
యోగాలు :-

* మిరియాలను నూరి చూర్ణం చేసి అరటిపండుతో అద్దుకొని భుజిస్తే మలబద్దకం తగ్గును. చిటికెడు మిరియాల చూర్ణం చాలు .

* తెల్ల తెగడ ఆయుర్వేద షాపుల్లో దొరకును . దానిని పాలల్లో ఉడికించి ఎండబెట్టి చూర్ణం చేసి అణా ఎత్తు చూర్ణాన్ని అనుదినం సేవిస్తున్న యెడల మలబద్దకం పోతుంది .

* మాచిపత్ర ఆకుల కషాయం తాగుతున్న మలబద్దకం నివారణ అగును.

* సీతాఫలం వేరు నూరి ఆ రసాన్ని తీసి తాగిన సుఖవిరేచనం అగును.

* కాకరకాయ కూర భోజనంలో కొంచంగా తింటూ ఉంటే సుఖవిరేచనం అవుతుంది.

* ఎండిన ఎర్ర రేగిపళ్ళు గాని , వాటి వడియాలు గాని తింటూ ఉంటే సుఖవిరేచనం అగును.

* ప్రతిపూటా కొంచం చింతపండు తింటూ ఉన్నా సుఖవిరేచనం అగును. ఎక్కువ తినినచో విరేచనాలు అగును. అందుకే మలబద్దకం లేకుండా ఉండుటకు రోజూ చాలా మంది భోజనంతో చింతపండు చారు కప్పుడు తాగుతారు.

* బాగుగా మిగుల పండిన అరటిపండ్లు మూడు అరటిపండ్లు తినినచో సుఖవిరేచనం అగును. పచ్చి అరటిపండు తింటే విరేచనాలు తగ్గును.

* నాగజెముడు , ఆకుజెముడు , బొంతజెముడు వీటిలో ఏ రకమైన జెముడు రసం పది చుక్కలు తీసుకుంటే విరేచనాలు అవుతాయి . అయిదు చుక్కల మోతాదు సరిపోతుంది.

* ఇంగువ కుంకుడు గింజ అంత లొపలికి తీసుకున్నచో కడుపులో ఉన్న మలం అంతా బయటకి వెళ్లి కడుపు శుభ్రం అగును.

* సునాముఖి చూర్ణం ఒక చెంచా మోతాదు నిద్రకు ఉపక్రమించబోయే సమయాన ఒక గ్లాస్ గొరువెచ్చటి నీటిలో కలిపి తీసుకున్నచో ఉదయానికి సుఖవిరేచనం అయ్యి వ్యర్థాలు బయటకి వెళ్లును.

మీ ఆహరం యొక్క అరుగుదల , మీ యొక్క మోషన్ సిస్టం సక్రమంగా ఉంచుకున్నచో మీకు అనారోగ్య సమస్యలు అంతతొందరగా దరిచేరవు .

Friday, October 5

జీలకర్ర అజీర్ణ నివారిణిగా పనిచేస్తుంది.

*జీలకర్ర ఔషధ గుణాలు*
కడుపులో వికారంగా ఉండి పుల్లని తేనుపులతో బాధపడేవారు కొంచం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశనం కలుగుతుంది.
కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరుచు నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న
నులిపురుగులను నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి.
జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే ఎలర్జీ వలన కలిగే బాధలు తగ్గుతాయి.
నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే షుగర్, బీ.పీ.ని అదుపులో ఉంచుతుంది.
గుండె నొప్పులు రాకుండా కాపాడుతుంది. డయేరియాతో బాధపడేవారు ఒక టీ స్పూన్ జీలకర్ర నీటిలో తీసుకుని ఒక టీస్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటుంటే డయేరియా తగ్గుతుంది. భోజనం తర్వాత రోజుకు రెండుసార్లు ఇలా తీసుకోవాలి.
నల్ల జీలకర్ర మూలశంకకు మంచి మందు.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నల్లజీలకర్రను వేయించి మగ్గిన అరటిపండుతో తీసుకుంటే నిద్రలేమి సమస్య పరిష్కారం అవుతుంది.
గొంతు సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా జీలకర్ర చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.
నీళ్ళలో కొద్దిగా అల్లం వేసి బాగా కాయాలి. ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, గొంతు మంట, జలుబు, జ్వరం తగ్గుతాయి.
వేడిచేసే గుండం దీనికి ఉంది. అతిగా సేవించకూడదు.
కనీసం వారానికి ఒకసారి జీలకర్ర రసాన్ని ఒక ఔన్స్ సేవిస్తే గుణం కనిపిస్తుంది.
కఫ సమస్యలతో బాధపడేవారు జీలకర్ర కషాయం సేవిస్తే గుణం కనిపిస్తుంది.
వాంతులతో బాధపడేవారు జీలకర్ర నమిలి రసాన్ని మింగితే వాంతులను నివారిస్తుంది.చలువచేస్తుంది.

Thursday, October 4

ఉడికించిన వేరుశనగల్లో దాగున్న అమేజింగ్ హెల్త్ సీక్రెట్స్..!!

          రోడ్లపై ఎక్కడ చూసినా ఘుమఘుమ సువాసనలతో.. ఉడికించిన వేరుశనగలు కనిపిస్తూ ఉంటాయి. పల్లెటూర్లలో అయితే.. వేరశనగ పంట చేతికి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో వీటిని ఉడికించి స్నాక్స్ గా తింటూ ఉంటారు.మీరూ వేరుశనగ పప్పును ఇష్టపడతారా ? ఉడికించిన వేరుశనగలు చూస్తే చాలు తినేస్తారా ? అయితే ఈ అలవాటు మంచిదే. వేరుశనగలను పచ్చిగా తినడం కంటే కాస్త ఉప్పు వేసి ఉడికించి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఉడికించిన వేరుశనగల్లో దాగున్న అమేజింగ్ హెల్త్ సీక్రెట్స్ తెలుసుకుందామా..
       తక్కువ క్యాలరీలు డ్రైఫ్రూట్స్ తో సమానంగా.. వేరుశనగ గింజల్లో పోషకాలుంటాయి. అయితే ఉడికించిన వేరుశనగల్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయట. ఒక కప్పు ఉడికించిన వేరుశనగల్లో 90 క్యాలరీలుంటాయి. అదే వేయించిన డ్రై వేరుశనగల్లో అయితే 166క్యాలరీలుంటాయి. కాబట్టి ఉడికించిన వేరుశనగ గింజలు తినడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది. ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ ఉడికించిన వేరుశనగల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. దీనివల్ల.. క్యాన్సర్, హార్ట్ డిసీజ్, డయాబెటిస్ వంటి వ్యాధుల రిస్క్ ని తగ్గిస్తాయి. ఫైబర్ ఉడికించిన వేరుశనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన వేరుశనగ గింజల్లో 2.5గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఉడికించిన వేరుశనగలు తీసుకోవడం వల్ల.. కాన్ట్సిపేషన్ అరికట్టవచ్చు, ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. అలాగే హార్ట్ డిసీజ్, డయాబెటిస్ రిస్క్ ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఉడికించిన వేరుశనగల్లో ఉండే ఫ్యాట్ అంతా గుండె ఆరోగ్యానికి సహాయపడే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్. డైట్ లో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్ చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎనర్జీ అరకప్పు ఉడికించిన వేరుశగన గింజల్లో 12గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల న్యాచురల్ షుగర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి మధ్యలో ఉడికించిన వేరుశనగలు తింటే.. కావాల్సినన్ని పోషకాలు అందడమే కాకుండా.. మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. బ్రెయిన్, కండరాలు ఉడికించిన వేరుశగనలు స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల.. మెదడు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. విటమిన్స్ ఉడికించిన వేరుశనగల ద్వారా విటమిన్ ఈ పుష్కలంగా పొందవచ్చు. కండరాలు, అవయవాల డెవలప్ మెంట్ లో కీలకపాత్రపోషించే బి కాంప్లెక్స్ విటమిన్స్ ని పొందవచ్చు. బి విటమిన్స్ శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి సహాయపడతాయి. ఎముకలు, నరాలకు అరకప్పు ఉడికించిన వేరుశగనల్లో 30 శాతం మెగ్నీషియం ఉంటుంది. ఇందులో ఉండే మినరల్స్ ఎముకలు, పళ్లకు మంచిది. అలాగే మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుకి సహాయపడతాయి. అలాగే ఆహారాన్ని ఎనర్జీగా మారుస్తాయి.

Sunday, June 3

రాగులు తినడం వలన కలిగే ఉపయోగాలు...

     రాగులు బలవర్దకమయిన ధాన్యం. రాగి సంగటి అనగానే గుర్తొచ్చేది రాయలసీమ. ఆ జిల్లాల్లో ఇప్పటికీ దానినే ఆహారంగా తీసుకుంటుంటారు. ఇక ఒకప్పుడు దీనిని పొద్దున్నే జావగా చేసి పాలల్లో, మజ్జిగలో కలుపుకుని తాగేవారు మన పెద్దవాళ్ళు. అయితే ఇంకా చెప్పాలంటే మన ఇళ్ళల్లో కోళ్ళకు వీటినే బలమైన ఆహారంగా పెట్టేవారు ఒకప్పటి తరం వారు. ఎందుకంటే దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. రాగి జావకు, రాగి సంగటికీ రాగులతో చేసిన ఇతర ఆహార పదార్థాల వల్ల శరీరానికి అంత బలం చేకూరుతుంది. రాగుల వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందామా..!

1. రాగుల వల్ల జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.
2. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
3. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.
4. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.
5. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుం ది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.
6. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.
7. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
8. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.

Saturday, February 24

మగవాళ్లు ఆదివారం తలస్నానం చేస్తే ఏమవుతుందంటే..!

తల స్నానం చేయడంలో శారీరక శుభ్రత మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఫలితాలు కూడా ఉన్నాయనేది ఆధ్యాత్మికుల నమ్మకం. అందుకే దైవ భక్తి కలిగిన వారు ఏరోజు పడితే ఆరోజు తల స్నానం చేయరు.. ఆడపిల్ల అంటే లక్ష్మి దేవితో సమానం కాబట్టి మన పెద్దలు శుక్రవారం తలంటు అలవాటు చేశారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయకూడదట. ఎంతో తప్పనిపరిస్థితి అయితేనే మాత్రమే చేయాలట. స్త్రీలు శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. బుధవారం చేస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. సోమవారం తలంటు చేస్తే నిత్య సౌభాగ్యంతో వర్దిల్లుతారు. భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి.
కేవలం మహిళలే కాదు పురుషులు కూడా కొన్ని రోజుల్లో తలస్నానం చేయరాదట. పురుషులు శనివారం తల స్నానం చేస్తే మహా వైభోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపంతోపాటు ఆ కోరికలు పెరుగుతాయట. సోమవారం తలంటు స్నానం అందం మరింత ద్విగుణీకృతమవుతుందట. మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుందట. బుధవారం తలం స్నానంతో లక్ష్మి దీవెనలు, గురువారం తలంటు స్నానంతో ఆర్ధిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి. శుక్రవారం తలంటుకుంటే అనుకోని ఆపదలు సంభవిస్తాయి. ఈ నియమాలకు అనుగుణంగా స్త్రీ, పురుషులు తలం స్నానం ఆచరిస్తే మంచిదట.

Friday, February 16

ఎండుద్రాక్ష...

చాలామంది ఎండు ద్రాక్షను మిఠాయిల తయారీలో మాత్రమే వాడుతుంటారు. నిజానికి వీటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
అజీర్తి, రకరకాల కారణాల వల్ల మలబద్దకం బాధిస్తుంటుంది. అలాంటివారు ఎండుద్రాక్షను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆ సమస్యా తగ్గుతుంది. దానికి కారణం వాటిల్లో పీచు ఎక్కువగా ఉండటమే.
* బరువు తగ్గాలనుకునేవారికి ఎండుద్రాక్ష ఎంతో మేలుచేస్తుంది. వీటిల్లోని గ్లూకోజ్‌ శరీరానికి శక్తినిస్తుంది. రోగ నిరోధకశక్తినీ పెంచుతుంది. పైగా కొన్నే తిన్నా పొట్టనిండినట్లు అనిపిస్తుంది. కుదిరితే వ్యాయామం తరవాత వీటిని తీసుకోవచ్చు.
* చిన్నారులూ, క్రీడాకారులూ వీటిని రోజూ తీసుకోవాలి. ఎండుద్రాక్షలో ఉండే క్యాల్షియం, బోరాన్‌ పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి.
* రోజూ ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, క్యాన్సర్‌ కారకాలూ దూరమవుతాయి.

* ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరికి నోటి దుర్వాసనా, చిగుళ్ల సమస్యలు బాధిస్తుంటాయి. అలాంటివారు ఎండుద్రాక్షల్ని నోట్లో వేసుకుని ఎక్కువసేపు నములుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు అదుపులోకి వస్తాయి.
* అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే సమస్య రక్తహీనత. ఆ సమస్య ఉన్నవారు ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల ఇనుము, రాగి, విటమిన్‌ బి పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవన్నీ ఎర్రరక్తకణాల వృద్ధిని పెంచడం, రక్తప్రసరణలో లోపం లేకుండా చూస్తాయి.

Saturday, February 10

ఏక మూత్ర పిండం.. అనర్థదాయకం...

మానవ దేహంలో రెండు కిడ్నీలు ఉంటాయనేది సర్వసాధారణ విషయం. అయితే... ఒక కిడ్నీతో పుట్టే వారు కూడా ఉంటారని మీకు తెలుసా? అవును.. సింగిల్‌ కిడ్నీ పర్సన్స్‌ కూడా ఉంటారు. ఇది అరుదైన విషయం. చాలామందికి దీనిపై అవగాహన ఉండకపోవచ్చు. తాము ఏక మూత్రపిండంతో కాలం వెళ్లదీస్తున్నామనేది చాలా మందికి తెలియకపోవచ్చు. తమ బిడ్డ ఈ లక్షణంతో జన్మించాడనేది తల్లిదండ్రులు తెలుసుకోలేక పోవచ్చు. ఏదేమైనా సింగిల్‌ కిడ్నీ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ఒక వ్యక్తి ఒక కిడ్నీ మాత్రమే కలిగి ఉన్నా... శరీరంలో ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తున్నా దానిని వైద్య పరిభాషలో 'సాలిటరీ కిడ్నీ' అంటారు. అలాంటి పరిస్థితి కలిగిన వ్యక్తిని 'సింగిల్‌ కిడ్నీ స్టేటస్‌' అనంటారు. సగటున 400 ప్రత్యక్ష జననాల్లో ఒకరు ఏక మూత్ర పిండంతో జన్మించొచ్చు. లేదా ఆ బిడ్డకు రెండు కిడ్నీలు ఉన్నప్పటికీ అందులో ఒకటి మాత్రమే పనిచేయొచ్చు. లేదా పుట్టిన తర్వాత ఇంకొక కిడ్నీ వ్యాధి బారిన పడి పనిచేయకపోవచ్చు. ఇదిలాగుండగా కిడ్నీ దానం చేసిన వ్యక్తులు కూడా 'సాలిటరీ కిడ్నీ' కలిగి ఉంటారు. అలాంటి వారు సాధారణ, ఆరోగ్యకర జీవితాన్నే గడుపుతారు. ఇక్కడ రెండు కిడ్నీల పనిని ఒక కిడ్నీ మాత్రమే చేస్తుంది.
తాము సింగిల్‌ కిడ్నీతో జన్మించామనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. తమకు పుట్టిన బిడ్డకు ఇలాంటి లోపం ఉందనే విషయం తెలియరాకపోవచ్చు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా మాత్రమే దీనిని గుర్తించే అవకాశముంది. పుట్టుకతో ఒక కిడ్నీ మాత్రమే కలిగి ఉన్న వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాలిటరీ కిడ్నీ కారణంగా అధిక రక్తపోటు, మూత్రం ద్వారా శరీరంలోని ప్రొటీన్‌ బయటకు వెళ్లిపోవడం, వడబోత సామర్థ్యం తగ్గడం లాంటి దీర్ఘకాలిక రుగ్మతలు ఏర్పడొచ్చు. ఈ పరిస్థితులు నియంత్రణలో ఉన్నంత వరకు శరీరంపై ఎలాంటి దుష్పప్రభావం చూపించదు. అయినప్పటికీ దీనిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. పుట్టిన బిడ్డకు ఒక కిడ్నీ మాత్రమే ఉందని నిర్ధారణైతే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎదుగుతున్న ఆ కిడ్నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన పర్యవేక్షణ అవసరం. ఇలాంటి వారి జీవన శైలిలో మార్పులు తీసుకురావడం తప్పనిసరి.
తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు :-
  1. సింగిల్‌ కిడ్నీ కలిగి ఉన్న బిడ్డల విషయంలో పలు ముందు జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి కారణం లేకుండా జ్వరం వస్తే యూరిన్‌ కల్చర్‌ సెన్సిటివిటి పరీక్ష చేయించాలి. ఫలితం పాజిటివ్‌గా వస్తే దానికి తగిన చికిత్స చేయించాలి.
  2. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడటానికి కారణాన్ని ఎంసీయూజీ, డీఎంఎస్‌ఏ స్కాన్ల ద్వారా నిర్ధారించుకుని తగిన వైద్యం చేయించాలి.
  3. సింగిల్‌ కిడ్నీతో జన్మించిన బిడ్డకు రెండేండ్ల వయసు వచ్చినప్పటి నుంచి తనంతట తానే టాయిలెట్‌కు వెళ్లడం నేర్పించాలి. ప్రతి రెండు గంటలకోసారి మూత్రానికి వెళ్లేలా పోత్సాహించాలి. వెనువెంటనే మూత్రం చేసే అలవాటు మాన్పించాలి.
  4. పాఠశాలలోని టాయిలెట్‌ పరిశుభ్రంగా లేకపోయినా మూత్రవిసర్జన చేయాల్సిందేనని పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. అపరిశుభ్రమైన టాయిలెట్‌ను ఉపయోగించడం ద్వారా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడదు. కానీ.. మూత్రాన్ని అలాగే బిగపట్టడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ కలుగుతుంది.
  5. పిల్లలు ఉదయాన్నే సులభంగా, సౌకర్యంగా మూత్రవిసర్జన చేసేలా తగిన శిక్షణ ఇవ్వాలి. ఇందుకు వారి ఆహారం, అలవాట్లలో తగిన మార్పులు చేయాలి. నిండిపోయిన పేగుల వల్ల యూరినరీ బ్లాడర్‌పై ఒత్తిడి కలిగి ఇరిటేషన్‌, మూత్రం నిలిచిపోవడం వంటి ఇతర సమస్యలు ఏర్పడొచ్చు.
ఆహారం :-
పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, తక్కువ కొవ్వు కలిగిన డైరీ ఉత్పత్తుల వంటి ఆరోగ్యకర ఆహారం తీసు కోవాలి. తక్కువ ఉప్పు, కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల దీర్ఘకాలం లో అధిక రక్తపోటు బారినపడే ప్రమాదం ఉంది. తద్వారా కిడ్నీకి నష్టం జరగొచ్చు. మాంసం, కోడి గుడ్డు లోని పచ్చ సొనలో కొలెస్ట్రాల్‌, ప్రొటీన్‌ అధిక మోతాదులో ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవడం తగ్గించాలి. చేపలు, చికెన్‌ తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.
దైనందిన చర్య :-
సింగిల్‌ కిడ్నీ కలిగి ఉన్న పిల్లలు తమ దైనిందిన కార్యకలాపాలను మామూలుగానే కొనసాగించొచ్చు. సాకర్‌, బాస్కెట్‌బాల్‌, హాకీ వంటి కఠిన ఆటలకు మాత్రం దూరంగా ఉండాలి. రెండు కిడ్నీల పనిచేసే ఈ ఒక్క కిడ్నీ పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. దీనినే కాంపెన్సెటరి హైపర్‌ట్రోపి అంటారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కిడ్నీ సులభంగా గాయపడే అవకాశం ఉంది.
జాగ్రత్తలు..!
ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు సాలిటరీ కిడ్నీ స్టేటస్‌ గురించి తెలియజేయడం తప్పనిసరి. కిడ్నీకి అపాయం కలిగించే మందులు కొన్ని ఉంటాయి. పరిస్థితిని ముందస్తుగానే డాక్టర్‌కు తెలిపితే వాటిని సిఫార్సు చేయకుండా జాగ్రత్త పడతారు. సింగిల్‌ కిడ్నీ గల వారు నిమెసులైడ్‌, మెఫానమిక్‌ యాసిడ్‌, ఇబూప్రూఫెన్‌ వంటి పెయిన్‌ కిల్లర్స్‌ వాడొద్దు. వాటి స్థానంలో 'పారాసిటమాల్‌' తీసుకోవాలి.
వైద్య పరీక్షలు :-
సాధారణ వైద్య పరీక్షలతోపాటు అధిక రక్తపోటు, యూరిన్‌లో ప్రొటీన్‌ వంటి టెస్టులను నెల నుంచి ఏడాది పాటు పర్యవేక్షించాలి. ఏదైనా సమస్యను ముందస్తుగానే గుర్తిస్తే మొత్తం మూత్రపిండం పనితీరుకు సంబంధించిన పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి.

Saturday, January 20

సైన్ధవ లవణం యొక్క ఉపయోగాలు -


* ఈ సైన్ధవ లవణం కొంచం మధురంగా ఉండును.
* శుక్రాన్ని వృద్దిచేయును .
* హృదయముకు బలమును ఇచ్చును.
* శరీరం నందు వాత,పిత్త,కఫ దోషములను పొగొట్టును.
* శరీరం నందు కొంచం ఉష్ణం కలుగచేయును .
* నేత్రములకు మంచి ఉపకారం చేయును .
* శరీరం నందు జీర్ణశక్తిని వృద్దిచేయును .
* వాతాన్ని హరించును .
* వ్రణాలను తగ్గించును .
* శరీరం నందు పైత్యం హరించును .
* దీనిని వాడటం వలన మలబద్దకం హరించును .
* గ్యాస్ పట్టినప్పుడు దీనిని గోరువెచ్చటి నీటిలో కలిపి త్రాగించి వాంతి చేయించిన ఉదరం శుభ్రపడును .
* ఒక చెంచా చనుబాలలో చిటికెలో పావు వంతు సైన్ధవ లవణం కలిపి కంటిలో 2 చుక్కలచొప్పున వేయుచుండిన కంటి సమస్యలు నివారణ అగును.
గమనిక :-
దీనిని అమితముగా పుచ్చుకున్న పైత్యం చేయును . అతిసార వ్యాధిని కలుగచేయును .

Thursday, January 4

గుండె పోటు :- దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి.


1)అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా).
2) మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు.
3) ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది
ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది.
మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం.
4) దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం.
5) మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం.
6) మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా?
చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు.
వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు.
7) అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని రక్షించుకోవచ్చు.
దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా.
ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి.
8) గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది.
బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది.
ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు.
9) ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు.
10) ఓ హృద్రోగ నిపుణులు ఏమంటారంటే ఈ సందేశం అందుకొన్న ఎవరైనా దయతో మరో పది మందికి పంపుదురు అని .ఇలా చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడలేమా అని మీరు సవాలుగా తీసుకోవాలని.
11) జోకులు గట్రా పంపటం లాంటివి కన్నా దయచేసి ఓ వ్యక్తి ప్రాణం నిలిపే ఈ సందేశాన్ని పదిమందికి
తెలియజేయండి.
12 ) ఇదే సందేశం పంపిన మీకే మరలా పదే పదే వస్తుంటే దయచేసి చికాకు పడకండి.
మీరంటే శ్రద్దతో ,ప్రేమతో ఈ గుండె పోటుని ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే మిత్రులు ఇందరున్నారా అని మీరు సంతోషపడే విషయం సుమా ఇది
మీ కోసం ఈ సందేశం పంపిన వారు.