Thursday, June 29

వర్షాకాలం.. జాగ్రత్తలు

    వాన నీటితో నేలంతా బురదగా మారుతుంది. పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయి. దీంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అంటురోగాలు ప్రబలడం ఖాయం. వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల నీళ్ల విరేచనాలు, చీము-రక్త విరేచనాలు, కలరా, అమిబియాసిస్‌, టైఫాయిడ్‌, కొన్ని రకాల పచ్చకామెర్లు, పోలియో, నులిపురుగుల వ్యాధులు ఎక్కువగా వస్తాయి. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువై మలేరియా, మెదడువాపు, డెంగ్యూ జ్వరం, చికున్‌గున్యా, బోధవ్యాధి రావచ్చు. 


వీటిని నివారించేందుకు జాగ్రత్తలు అవసరం :-
  1. బాగా కాచి చల్లార్చిన నీరు తాగండి. 15 నిమిషాలపాటు నీళ్లను కాచండి. కాచిన పాత్రలోనే చల్లార్చండి. అవసరమనుకుంటే కాచే ముందు వడగట్టండి. ఈచర్యతో నీటి కాలుష్యపు వ్యాధులు నిరోధించొచ్చు.
  2. దోమ తెరలు వాడండి. తద్వారా దోమలు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందండి.
  3. తాగునీటి వనరుల్లో ఆరోగ్య కార్యకర్త సహాయంతో బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపించండి.
  4. చెరువులు, గుంటలు, కాల్వల నీటిని అస్సలు తాగొద్దు.
  5. మీ ప్రాంతంలో నీటి కాలుష్యపు వ్యాధులొస్తే దగ్గరలోని ఆరోగ్య కార్యకర్తకు తెలపండి. నివారణ చర్యలు చేపట్టేలా చూడండి.
  6. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించండి.
  7. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయొద్దు.
  8. వ్యర్థ పదార్థాలను పరిశుభ్రంగా, సురక్షితంగా పారేయండి.
  9. ఆహారం తినే ముందు, మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో కడగండి.
  10. శుభ్రత పాటించని హోటళ్లలో ఆహారం తినకండి. కాచి చల్లార్చిన నీరు ఇవ్వమని అడగండి.
  11. వీధుల్లో విక్రయించే పళ్ల రసాలు తాగొద్దు.
  12. కాచి చల్లార్చిన, క్లోరినేషన్‌ చేసిన నీటితో తయారు చేసిన ఐస్‌ ముక్కలనే వాడండి.
  13. బాగా ఉడికించిన ఆహారమే తినండి.
  14. చలిగాలులకు వీలున్నంత వరకు దూరంగా ఉండండి.
  15. వానాకాలం పాదాలను పొడిగా ఉంచుకోవడం చాలా అవసరం.

Friday, June 23

చిలకడ దుంపలో అద్భుతమైన పోషకాలెన్నో...

చిలకడ దుంపలు అంటే కొందరికి చిన్నచూపు ఉంటుంది. అది సరికాదని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య సంబంధ ప్రయోజనాలున్నాయని పౌష్టికాహార నిపుణులు సూచిస్తారు. సమతుల ఆహారంలో చిలకడదుంపలకే అగ్రస్థానం. వీటిలో తగినన్ని క్యాలరీలు మాత్రమే కాదు, బోలెడన్ని పోషకాలున్నాయి. సాధారణంగా సంప్రదాయ పండుగల సందర్భంగా, ఉపవాస దీక్షల తర్వాత సమతుల ఆహారం కోసం వీటిని తింటారు. ఉపవాస సమయాల్లో, ఆ తర్వాత కూరగాయలు, గింజ ధాన్యాలకు బదులుగా ఎండించిన డ్రైఫ్రూట్స్‌ గింజలు, విత్తనాలు, పాలు, చిలకడదుంపలు, పెండలం, బంగాళాదుంపలు లాంటివి వాడతారు. చిలకడ దుంపలలో ఉండే అద్భుతమైన పోషకాలను పరిశోధించిన పౌష్టికాహార నిపుణులు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. సువాసనలు వెదజల్లుతూ చిలకడదుంపలు పలురంగులలో వివిధ ప్రాంతాల్లో పండుతాయి. వంగ పండు, ఎరుపు, పసుపుపచ్చ, తెలుపు చిలకడ దుంపలు లభిస్తాయి. విత్తనరకాలు, భూసారం, వాతావరణం, ఖనిజ లవణాల లభ్యత తదితర అంశాల ఆధారంగా వీటి రంగు ఉంటుంది.
ఎర్రగా ఉండే దుంపలు సువాసన వెదజల్లుతుంటాయి. ప్రత్యేకించి వీటిని ఉడికించేటప్పుడు వచ్చే పరిమళం కొందరు బాగా ఇష్టపడతారు. ఎరుపురంగు చిలకడ దుంపలలోని బీటా కెరోటిన్‌ మూలంగా ఈ రంగు వచ్చి ఉంటుంది. బీటాకెరోటిన్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎరుపురంగు అధికంగా కనిపిస్తుంది. ఇన్ని పోషక విలువలున్న చిలకడదుంప తింటే లావు అవుతామనే అపోహ కొందరిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమేనని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో గ్లిసోమిక్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువసేపు పొట్టనిండుగా అనిపించవచ్చు. అందువల్ల మితిమీరి తినకూడదు.

రాత్రి ఉద్యోగమా?

మీరు రాత్రిపూట పనిచేసే ఉద్యోగంలో ఉన్నారా..? అయితే మీరు కాస్త మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వారికి షుగర్‌ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
రాత్రి వేళల్లో అది కూడా షిప్టుల్లో పనిచేసే ఉద్యోగుల్లో గ్లూకోజ్‌ నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుందని ఫలితంగా వారికి టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన క్రిష్టోఫర్‌ మోరిస్‌ మాట్లాడుతూ పగలు పనిచేసే వారికన్నా రాత్రి పూట పనిచేసే వారిలో ఇన్సులిన్‌ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని తమ పరిశోధనలో స్పష్టమైందన్నారు. ఈ పరిశోధనలో తేలిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఒక్కరోజు రాత్రి షిప్టులో పనిచేసినందుకే వారిలో గ్లూకోజ్‌ నియంత్రణ వ్యవస్థ గణనీయంగా క్షీణించిందని, ఇన్సులిన్‌ స్థాయి పెరిగిందని తెలిపారు. 

Wednesday, June 14

నిమ్మకాయ, బొప్పాయి కలిపి తీసుకుంటే ఇవి బాగా పెరుగుతాయంట!


పౌష్టికాహారం తినాల్సిందే ...

ఏ ఆహారం తినాలన్న చాలా భయపడిపోతుంటారు. నోటికి రుచిగా ఉంటే తప్ప ముద్ద దిగదు. అలా నోటికి రుచిగా నచ్చిన ఆహారం తినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త శ్రద్ధ వహించాల్సిందే అని చెబుతున్నారు నిపుణులు...
  1. ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్‌ 'సి', 'ఎ', 'కె' లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన న్యూట్రీన్లు అధికంగా ఉంటాయి. అలాగే ఐరన్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి.
  2. క్యాలీ ఫ్లవర్‌లో ఎక్కువగా మినరల్స్‌, విటమిన్స్‌, న్యూట్రీన్స్‌, యాంటీ ఆక్సిడెంట్‌లతో పాటు క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తుంది. అలాగే కిడ్ని ల పని తీరును మెరుగుపరచటంతో పాటు అధిక రక్త పోటును అదుపులో ఉంచుతుంది. క్యాలీ ఫ్లవర్‌లో ముఖ్యంగా విటమిన్‌ 'సి', 'కె', ప్రోటీన్లు, మెగ్నిషియం, పొటాషియం, పాస్పరస్‌, మాంగనీస్‌ వంటి పోషకాలు చాలా ఉంటాయి.
  3. అధిక రక్త పోటును అదుపులో ఉంచటంలో బీట్‌రూట్‌ జ్యూస్‌ బాగా పని చేస్తుంది. అలాగే రక్త కణాలను పెంచటంలో బీట్‌రూట్‌ పాత్ర కీలకం. బీట్‌రూట్‌లో ఉండే కణాలు ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
  4. బాదం, బీన్స్‌, శనగలు, చిక్కుడు వంటి గింజల్లో ప్రోటీన్స్‌, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించటంలో ప్రాముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే వీటిలో కొలెస్ట్రాల్‌ చాలా తక్కువగా ఉంటుంది.

మెడ నలుపు తగ్గాలంటే!

గిల్టు నగలు ఎలర్జీ ఉన్నవారు ధరించకూడదు. 
వాటిని ధరిస్తే మెడనలుపుగా తయారవుతుంది. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు...
  1. చెంచా పెరుగులో నాలుగైదు చుక్కలు నిమ్మరసం కలిపి ఆ మిశ్రమముతో మెడకు మసాజ్‌ చేస్తే మెడ నలుపు పోతుంది.
  2. నిమ్మరసం, పాలు కలిపిన మిశ్రమాన్ని మెడకు రాసి పావుగంట తరువాత సున్నిపిండితో కడుక్కోవాలి. ఈవిధంగా రోజూ చేస్తే మెడ నలుపు తగ్గుతుంది.
  3. కొందరికి మెడ మడతలలో మురికి చేరి ఉంటుంది. సబ్బుతో ఎంత రుద్దినా పోదు. అటువంటి వారు పెరుగులో బియ్యప్పిండి కలిపి మెడకు రాసి ఐదు నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మెడ శుభ్రంగా ఉంటుంది.
  4. క్లెన్సింగ్‌క్రీమ్‌ మార్కెట్లో దొరుకుతుంది. ఆ క్రీమ్‌ దూదితో తీసుకుని మెడకు రాసి రెండు నిమిషాలాగి తుడిచేయాలి. దీనివల్ల మెడమీద మురికి, నలుపు పోతుంది.
  5. ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుంటే మెడ లావు తగ్గుతుంది.
  6. మెడకు ఎక్కువ చెమట పడుతుంటే మీరు నగలు ధరించాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా! అటువంటప్పుడు ఆస్జ్రిజెంట్‌ లోషన్‌ని దూదితో తీసుకుని మెడకు రాసి ఐస్‌క్యూబ్స్‌తో రబ్‌ చేయండి. తరువాత టవల్‌తో అద్ది లైట్‌గా పౌడర్‌ జల్లుకోండి. తరువాత మీ ఇష్టం వచ్చినన్ని నగలు ధరించవచ్చు.

Friday, June 9

క్యారెట్‌తో మెదడుకు మేలు...

పిల్లలను చురుగ్గా ఉంచి, వారిలో మేథోవికాసం కలిగించడానికి క్యారెట్‌ చాలా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు...
  1. వండితే తినేందుకు కొంతమంది ఇష్టపడని క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చు. దీనివల్ల మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుంది.
  2. క్యారెట్‌లో విటమిన్‌ -ఎ ఉంటుంది. ఇది కంటిచూపునకు ఎంతో మేలు చేస్తుంది.
  3. పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల క్యారెట్‌లో రోగ నిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇందులోని రోగ నిరోధకశక్తి వలన కఠినమైన మొండి రోగాలు, దీర్ఘ వ్యాధులకు ఉపశమనంగా ఉంటుంది.
  4. క్యారెట్‌ ప్రకృతి సిద్ధమైన సహజ ఔషధంగా కూడా పనిచేస్తుంది.
  5. క్యారెట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరం ఎంతో చైతన్యవంతమవుతుంది.
  6. కాలిన గాయాలతో బాధపడేవారికి పచ్చి క్యారెట్‌ రసం గానీ, దాని పిప్పిగానీ కాలిన చోట రాసినట్లయితే, గాయం త్వరగా మానడమే కాక, చల్లగా ఉండి బాధ నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. అంతేకాక కాలిన గాయాల మచ్చలు కూడా త్వరగా మానిపోతాయి.
  7. చిన్నారులు క్యారెట్‌ జ్యూస్‌ను కొన్ని వారాలపాటు తాగితే వారికి కడుపునొప్పి సమస్య ఉండనే ఉండదు. ఎందుకంటే క్యారెట్‌ చిన్నారుల కడుపుల్లో ఉండే నులిపురుగులు మలం ద్వారా బయటికి వెళ్ళేందుకు దోహదపడుతుంది.
  8. క్యారెట్‌ జ్యూస్‌లోని పీచు పదార్థం పేగుల గోడలను శుభ్రం చేసి, మలినాలను బయటికి పంపించేస్తుంది.
  9. ఉదరకోశం, పిత్తం, వాతం, కఫం లాంటి సమస్యలకు కూడా క్యారెట్‌ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. క్యారెట్‌ను క్రమం తప్పకుండా ఆహారంతోపాటు తీసు కుంటే, ఇందులోని అధిక కేలరీలు చిన్నారుల మేధోవికాసానికి ఎంతగానో దోహదపడతాయి.
  10. క్యారెట్‌ను తీసుకోవడం వల్ల, దాని ప్రభావం మెదడుపై పనిచేసి, మెదడును ఉత్తేజపర్చడమే కాక, ఆలోచనాశక్తిని పెంచుతుంది.
  11. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఇంటర్వ్యూ లకు వెళ్ళేవారు క్యారెట్‌ జ్యూస్‌ను తీసుకున్నట్లయితే, అది మంచి ఉత్ప్రేరకంగా పని చేసి, వాళ్ళను ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంచుతుంది.
  12. కీడాకారులు కూడా ఆటల్లో రాణించేందుకు క్యారెట్‌జ్యూస్‌ను సేవిస్తుంటారు. ఇది వారికి ఓ మంచి టానిక్‌లా ఉపయోగ పడుతుంది.
  13. రక్తహీనతను నివారించడానికి క్యారెట్‌ మంచి ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్‌ జ్యూస్‌ తప్పక సేవించాలి.
  14. క్యారెట్ల జ్యూస్‌, క్యారెట్‌ను పచ్చిగా అలాగే తింటే నోటి అల్సర్‌ నివారణ సాధ్య మవుతుంది.

కలతనిద్రతో కిడ్నీ ఫెయిల్యూర్‌...

కలత నిద్ర వల్ల కిడ్నీలకు ముప్పు ఉందట. ఈ విషయం ఓ అధ్యయనంలో తేలింది. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ (ఈఓఈ)తో బాధపడుతున్న సుమారు 432 మందిపై నిర్వహించిన పరిశోధనలో ఇది వెల్లడైంది. వీరిలో రోజూ రాత్రి సమయంలో ఆరున్నర గంటలు, అంతకన్నా తక్కువసేపు నిద్రపోయే వారు ఉన్నారు. వీరందరూ కలత నిద్రతో బాధపడుతున్న వారే!. కొన్ని నెలల అనంతరం వీరి కిడ్నీల పనితీరును గమ నించారు. ఆరున్నర గంటల కన్నా తక్కువ నిద్ర పోయే వారిలో కిడ్నీల పనితీరు దెబ్బతినగా, 49 మంది మ తిచెందారు. అయితే.. కిడ్నీ ఫెయిల్‌ కావడానికి కలత నిద్ర ఒక్కటే కారణం కాదని పరిశోధకులు అంటున్నారు. బాడీ మాస్‌ ఇండెక్స్‌, రక్తపోటు, షుగర్‌ తదితర సమస్యలు కూడా దోహదం చేస్తాయని చెబుతున్నారు.

Sunday, June 4

హాయ్ ఫ్రెండ్స్ ...?ఒక్క 2 నిముషాలు ఇది చదవడం కోసం కేటాయించండి .

మీ జీవితాన్ని తక్కువ సమయంలో స్తిరపడే అవకాశం మీ సొంతం చేసుకోండి Digital India
*ట్రై చేయండి*
It's government registered company.
ఇది నిజమే ఫ్రెండ్స్
స్పాన్సర్ ఐడి : 16151124
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓
🏡 🏠 ఇంట్లో కూర్చొని Android mobile 📱 తో సంపాదించండి 8000 నుండి 15000 వేల రూపాయలు ప్రతి నెల🗓...
📲 PLAY STORE నుండి
#CHAMPCASH app ని
Download చేసుకొని
Registration చేసుకోండి.
🌹 SPONSOR ID:...16151124 🌹
(ఎక్కడైనా note చేసుకోండి. sponsor id లేకుండా మీరు signup కాలేరు.)

📌Task: (7-9 apps ఒక్కొక్కటీ download చేసుకోండి).
2 ని;ల వరకు open చేయండి.
🕰2 గం; ల తర్వాత uninstall కూడా చేసుకోవచ్చు..
👉🏿 ఇదంతా చేశాక మీ mobile screen 📱 పై మీ REFER ID కనబడుతుంది.
👉🏿 అప్పుడు మీరు కంపెనీలో ACTIVE member 👥👤అయినట్లు మీకు $1= 62 Rs 💵 💰 singup Bonus లభిస్తాయి.
👉🏿 మీరు మీ friends నీ Whatsapp Facebook ద్వారా invite 💕 చేయవచ్చు.
👉🏿 మీరు 10 మందిని join చేసి వారు కూడ 10 మందిని join చేస్తే మీకు 7 Level వరకు డబ్బులు లభిస్తాయి....
👀 See Example 👇 👇
Level Team Rs. Total (Rs.)
LEVEL 1- 10×30=300
LEVEL 2- 100×6=600
LEVEL 3- 1000×6=6000
LEVEL 4- 10,000×6=60000
LEVEL 5- 1 Lac×6=6 Lakh
LEVEL 6- 10 Lac×3=30 Lak
LEVEL 7- 1 Crore×3=3 Cr. Total Income = Rs. 3,36,66,900/- (3 crore 36 lac
👉🏿 ఆలోచించండి ఒకవేళ మీరు కేవలం 10% success అయినా కూడా మీకు ,Rs 33,66,690/- 💰 💰 (33+ lac) లభిస్తాయి. అది కూడ ఎలాంటి ఖర్చు లేకుండా....
📇SPONSOR ID - 16151124. 📇
👉🏿మీ challenge complete అయ్యాక మిమ్మల్ని Champcash WhatsApp group ‍‍‍👦లో add చేయబడుతుంది.
అందులో మీకు 4-5 రోజుల్లో దీని గురించి మొత్తం అర్థమవుతుంది.
📝Plz note: .
📌ఇది 100% free earning system
SPONSOR ID : 16151124...