Monday, October 31

బరువు పెరగటానికి 10 చిట్కాలు

బరువు పెరగటం అంత తెలికిన విషయం కాదు, ప్రణాళిక లేని బరువు పెరుగుదల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేసే అవకాశం ఉంది. ఇక్కడ తెలిపిన చిట్కాల ద్వారా సులువుగా ఆరోగ్యకరమైన బరువును పెంచుకోవచ్చు. 
1.ప్రణాళికలో శక్తిని అందించే ఆహారాన్ని జోడించండి :-
శక్తిని అనిదించే ఆహర పదార్థాలు అయినట్టి మిల్క్ షేక్స్, నట్స్, వెన్న, ఫాట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు, అవకాడో మరియు సీడ్స్ వంటివి మీరు తీసుకునే ఆహరానికి జోడించండి. శక్తిని అందించే ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో క్యాలోరీలను కలిగి ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు, కానీ బరువు పెరగాలి అనుకునే వారికి మాత్రం ఈ ఆహారాలు చాలా ముఖ్యం అని చెప్పవచ్చు.
2. క్రమబద్దమైన భోజనాలను నిర్వహించండి :-
మిమ్మల్ని పెద్ద మొత్తంలో సంవిధాన పరిచే, పోషకాహరాలు అయినట్టి, నట్స్, వెన్న, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, యొగ్ హార్ట్, పాలు, చెస్ మరియు అవకాడో వంటి ఆహారాలను మీ భోజనంలో కలుపుకోండి. రోజు క్రమం తప్పకుండా సమయానికి భోజనాన్ని తీసుకోవటం ఒక అలవాటుగా మార్చుకోండి. కొంత సమయాన్ని కేటాయించి తగినట్టుగా మీ ఆహర ప్రణాలికను రూపొందించుకోండి, కనీసం రోజులో మూడు సార్లు భోజనం చేసే విధంగా మీ ఆహర ప్రణాలికను తయారు చేయండి.
 3. పరిమాణాన్ని పెంచండి :-
మీరు తీసుకునే ఆహర పరిమాణాలను పెంచటం వలన కలిగే వైవిధ్యాలను మీరే గమనిస్తారు. ఒకవేళ మీ ఆహర స్థాయిలను పెంచటం వలన అసౌకర్యానికి గురైతే, వెంటనే చిన్న చిన్న ఆహర భాగాలుగా రోజులో ఎక్కువ సార్లు తీసుకోటానికి లేదా మధ్యాన్న భోజనంలో చీస్ లేదా మాంసాలను స్వీకరించండి. ఇలా చిన్న చిన్న భాగాలుగా, ఎక్కువ సార్లు ఆహరం తీసుకోవటం వలన మీరు సౌకర్యంగా భావిస్తారు మరియు ఎక్కువ ఇబ్బందులు లేకుండా బరువు పెరుగుతారు.
4. స్నాక్స్ (చిరుతిళ్ళు) చేర్చండి :-
సంవిధాన పరిచే ఆహర పదార్థాలు అయినట్టి నట్స్, సీడ్స్, ఎండిన పండ్లు, తాజా పండ్ల వలన పోషకాలను పొందటమే కాకుండా సులభంగా బరువు పెరుగుతారు, ఇంటికి దూరంగా ఉన్న సమయంలో వీటిని మీతో పర్స్'లలో తీసుకెళ్ళవచ్చు. రెండు లేదా మూడు గంటలకు ఒకసారి తినటం వలన మీ క్యాలోరీల స్థాయిలను మెరుగుపరుస్తాయి.
5. క్యాలోరీలను అందించే ద్రావణాలను జోడించండి :-
నీరు లేదా ఇతర ద్రావణాకు బదులుగా పోషక విలువలు కలిగినట్టి పండ్ల రసం, పాలను ఎంచుకోండి. తక్కువ పోషకాలు కలిగిన లేదా ఎక్కువ ఫాట్'లు ఉన్న ద్రావణాలకు బదులుగా ఇంట్లోనే తాజా పండ్లు మరియు యొగ్ హార్ట్'లతో చేసిన ద్రావణాలను తాగటానికి ప్రయత్నించండి.
6. ప్రోటీన్'లను తీసుకోటాన్ని అధికం చేయండి :-
ప్రోటీన్'లను నిర్మాణ భాగాలుగా చెప్పవచ్చు మరియు మీ శరీరానికి సరరైన మొత్తంలో ప్రోటీన్'లను అందించకపోవటం వలన ఎక్కువగా ఆకలిగా భావిస్తుంటారు. దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన కండరాల పెరుగుదలకు శరీర బరువులోని ప్రతి ఒక కిలోగ్రామ్'కి చొప్పున 2.5 గ్రాముల కన్నా తక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు.
7. రోజు 500 క్యాలోరీలను తీసుకోండి :-
వారానికి శరీర బరువులో ఒక పౌండ్ బరువు పెరుగుటకు, ప్రతి రోజు 500 క్యాలోరీలను తీసుకోవాలి. ఆహర తయారీలలో వెన్న మరియు చీస్'లను కలపటం వలన రోజులో 500 క్యాలోరీలు తీసుకోవటం సాధ్యమవుతుంది. కొవ్వు ఉన్న పాల పదార్థాల కన్నా హోల్ మిల్క్'ను తాగండి. ఎక్కువ నీరు ఉన్న ఆహర పదార్థాల కన్నా పిండి పదార్థాలు అధికంగా ఉండే బటానీలు, లిమా బీన్స్ లేదా మొక్కజొన్నలను ఎంచుకోండి.
8. ప్రగతిని నోట్ చేయండి :-
మీరు అనుసరించే ఆహర నియమాలను సేకరించే జర్నల్స్'లను, మీరు తీసుకునే ఆహర పదార్థాల స్థాయిలను నోట్ చేసుకోండి. దీని వలన మీరు మార్చే ఆహర నియమాల వివరాల గురించి  తెలుసుకోవచ్చు. వీటి పట్ల అవగహన గురించి, మీ హెల్త్ కేర్ ప్రొవైడర్'తో మాట్లాడి వారి సహాయం తీసుకోండి.
9. రోజు వ్యాయమాలను చేయండి :-
బరువు పెరుగుదలలో బలమైన కండర నిర్మాణం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు క్యాలోరీలు తీసుకోటాన్ని పెంచినపుడు మీ శక్తి వినియోగం కూడా అంతే మోత్తంలో ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఈ పద్దతి ద్వారా బరువు పెరగటమే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడతాయి.
10. ఆహర పరిమితులను పాటించండి :-
ఎక్కువ మొత్తంలో క్యాలోరీలను కలిగి ఉండే ఆహరం, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలలో ఎక్కువ సోడియం, తక్కువగా విటమిన్ మరియు మినరల్ స్థాయిలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకొని, పోశాకాహర లోపానికి గురవకుండా జాగ్రత్త పడండి.

Sunday, October 23

ఇవి రోజూ తింటే పొడవు పెరుగుతారట!

సరైన ఎత్తు పెరగాలని అందరూ కోరుకుంటారు. టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు దోహదపడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
1. ఎర్ర ముల్లంగి :-
ఎర్రముల్లంగిని తరుచూ తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.

2. బీన్స్ :-
ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపద ర్థాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

3. బెండకాయ :-
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటవిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

4. బచ్చలికూర :-
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. సాధరణంగా దీనిని దక్షణ ఆసియాలో వాడుతారు. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటుంది.

5. బఠాని :-
బఠానిలు రోజు తీసుకోనడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటిన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి.

6. అరటిపండు :-
బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది.

7. సోయాబీన్ :-
ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రే ట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

8. పాలు :-
రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు.దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.

Saturday, October 22

దానిమ్మ వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు...

  1. *దానిమ్మ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
  2. *దానిమ్మ రసం వృద్దాప్య, సూర్యకాంతి వలన ఏర్పడే చ చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
  3. *దానిమ్మ విత్తనాలు చర్మంపై తెగుళ్ళను & మరకలను తొలగిస్తాయి.
  4. *దానిమ్మ పొడిచర్మ సమస్యలను, దురదలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
దానిమ్మ, వైద్య గుణాలను కలిగి ఉన్నందు వలన, నిజానికి క్రీస్తూ పూర్వం 1552 కాలం నుండి దానిమ్మను వాడుతున్నారు. మొదటగా, ఈజిప్షియన్ పాపిరస్ దానిమ్మను వైద్యం కోసం వాడి, రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, గ్రీకు వైద్యులు ఆర్థరైటిస్, జీర్ణాశయ సమస్యలను, రక్త ప్రసరణ సమస్యలను మరియు ఇన్ఫెక్షన్ లను తగ్గించుటకు వాడి సఫలం చెందారు. చర్మ సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందు వలన సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడుతున్నారు.
రోజు దానిమ్మ పండును తినటం ద్వారా వీటి వలన కలిగే ప్రయోజనాలు పొందవచ్చు, అంతేకాకుండా, చర్మాన్ని సంరక్షించే గుణాలను కలిగి ఉన్నందు వలన నేరుగా చర్మానికి ఆపాదించవచ్చు. చర్మానికి, దానిమ్మ వాడటానికి గల కారణాల గురించి కింద వివరించబడింది.
మొటిమలు తగ్గించుటకు
సాధారణంగా, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత లేదా జీర్ణాశయ సమస్యల వలన మొటిమలు కలుగుతాయి. ఇలాంటి సమస్యలను దానిమ్మ తగ్గిస్తుంది. ఈ రకం పండు, మొటిమలు ఏర్పడే ప్రక్రియను మొదట్లోనే నివారిస్తుంది. దానిమ్మ, జీర్ణాశయ సమస్యలను తగ్గించి, శరీరంలో ఆరోగ్యకర రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా, దానిమ్మ విత్తనాల నుండి సేకరించిన రసాన్ని, నేరుగా మొటిమలపై అప్లై చేయటం వలన మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇలా నేరుగా ప్రభావిత ప్రాంతంలో దానిమ్మను అప్లై చేయటం వలన నూతన కణజాలం ఉత్పత్తి చెంది, మొటిమలు మరియు మచ్చలు తగ్గుతాయి.

వృద్దాప్య నివారణ :-
సూర్యకాంతి లేదా వృద్దాప్యం వలన చర్మంలో కలిగే మార్పులను నివారించుటలో దానిమ్మ శక్తివంతంగా పని చేస్తుంది. దానిమ్మ ఈ రకమైన ప్రమాదాలను నివారించి, మృదువైన మరియు చర్మాన్ని యవ్వనంగా కనపడేలా చేస్తుంది. అంతేకాకుండా, ఫైబ్రో బ్లాస్ట్స్ కణాల (కొలాజన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తికి భాద్యత వహించే కణాలు) జీవితకాలాన్ని పోడిగిస్తాయి. కొలాజన్ మరియు ఎలాస్టిన్ లు చర్మానికి మృదుత్వాన్ని, సాగే గుణాలను అందిస్తాయి. ఫలితంగా, చర్మం యవ్వనంగా కనపడటమేకాకుండా, వృద్దాప్యం వలన కలిగే వలయాలను తగ్గిస్తాయి.

తెగుళ్లను & మచ్చల తగ్గింపు :-
నయం చేసే గుణాలను కలిగి ఉండే దానిమ్మ పండు విత్తనాలు గాయాలు మరియు చర్మంపై ఏర్పడే చిన్న చిన్న తెగుళ్ళను సమర్థవంతంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే సమ్మేళనాలు ఇన్ఫెక్షన్ లతో పోరాడే శక్తిని కలిగి ఉండి, గాయాల వలన కలిగే మచ్చలను కూడా తగ్గిస్తాయి.

పొడి చర్మం :-
చర్మ సంరక్షణకు దానిమ్మ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవి కలిగి ఉండే సూక్ష్మ నిర్మాణం చర్మ అంతర్భాగాల వరకు చేరుతుంది. ఔషదా గుణాలను కలిగి ఉండే దానిమ్మ చర్మ రకం మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తి సమ్మేళనాలపై ఆధారపడి ఉంటుంది. చర్మ అంతర్భాగంలో చేరి నూనెలను ఉత్పత్తి చేసే దానిమ్మ పొడి చర్మం వలన కలిగే సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

దానిమ్మ పొడితత్వాన్ని, పగిలిన చర్మాన్ని మరియు కలిగే దురదలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా-5 ఫాటీ ఆసిడ్ లుగా పేర్కొనే ‘ప్యూరిసిన్ ఆసిడ్’ లు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచటమేకాకుండా, తేమను కోల్పోకుండా చూస్తాయి.
జిడ్డు చర్మం :-
దానిమ్మలో ఉండే రసాలు జిడ్డు చర్మంపై కూడా పని చేసే గుణాలను కలిగి ఉన్నందు వలన జిడ్డు చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయరీలో కూడా వాడుతున్నారు. మొటిమల పగుళ్ళ ఏర్పడే మచ్చలు, మరకలు మరియు దురదల వలన చర్మంపై ఏర్పడే మచ్చలను తగ్గించుటలో దానిమ్మ శక్తివంతంగా తగ్గిస్తుంది.

Thursday, October 20

పెరుగును రోజులో ఎప్పుడు తింటే మంచిది..? దాని వ‌ల్ల ఏం ఉప‌యోగాలు ఉన్నాయో


మీగ‌డ కట్టిన గ‌డ్డ పెరుగును చూస్తే ఎవ‌రికి మాత్రం నోరూర‌దు చెప్పండి. అయితే కేవ‌లం ఆహారంగానే కాక పెరుగును నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మండే వేస‌విలో పెరుగును రోజూ తీసుకుంటే ఎంతో మంచిది. దీని వ‌ల్ల శ‌రీరం నుంచి అధిక ఉష్ణం బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. అంతేకాకుండా జీర్ణ‌శ‌క్తి వృద్ధి చెందుతుంది. క‌డుపులో మంట తొల‌గిపోతుంది. శారీర‌క దృఢ‌త్వం క‌లుగుతుంది. పెరుగులో పుష్క‌లంగా ల‌భించే కాల్షియం ఎముక‌లకు చాలా మంచిది. అయితే పెరుగును రోజులో ఎప్పుడు తీసుకోవాలి? తెలుసుకుందాం రండి.
పాల‌లో మీగ‌డ తీయ‌కుండా త‌యారైన పెరుగును మాత్ర‌మే తినాల‌ట‌. ఎందుకంటే మీగ‌డ తీసిన పెరుగు ద్వారా ఎలాంటి పోష‌కాలు మ‌న‌కు అంద‌వ‌ట‌. అదేవిధంగా ప‌గ‌టి పూట పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చాలా మేలు క‌లుగుతుంద‌ట‌. రాత్రి పూట పెరుగును తింటే శ‌రీరంలో మ్యూక‌స్ ఎక్కువ‌గా వృద్ధి చెందుతుంద‌ట‌. దీని వ‌ల్ల జ‌లుబు, అధిక క‌ఫం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.
పెరుగును చిలికి త‌యారు చేసే చ‌ల్ల చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌ను తాగితే వేస‌విలో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డవ‌చ్చు. ద‌ప్పిక‌ను అరిక‌ట్టే గుణాలు మ‌జ్జిగ‌లో ఉన్నాయి. ఇది మెద‌డుకు కూడా చ‌లువ చేస్తుంది.

చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు కూడా పెరుగు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మానికి మృదుత్వాన్ని అందించే గుణాలు పెరుగులో ఉన్నాయి. పెరుగు చ‌ర్మానికి స‌హ‌జ కాంతిని ఇస్తుంది. నిత్యం కొంత పెరుగును తీసుకుని చ‌ర్మానికి మ‌ర్ద‌నా చేస్తే శ‌రీరం కాంతిని సంత‌రించుకుంటుంది
శిరోజాల సంర‌క్ష‌ణ‌కు కూడా పెరుగు బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. షాంపూ క‌న్నా పెరుగు వాడ‌డం ఉత్త‌మ‌మని ఆయుర్వేదం కూడా చెబుతోంది. స్నానం చేయ‌బోయే ముందు కొద్దిగా పెరుగును తీసుకుని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా మ‌ర్ద‌నా చేసి, అనంతరం త‌ల‌స్నానం చేస్తే శిరోజాలు మృదుత్వాన్ని సంత‌రించుకుంటాయి. అంతేకాదు వెంట్రుక‌ల‌కు దృఢ‌త్వం క‌లుగుతుంది. చుండ్రు కూడా త‌గ్గుతుంది.
ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో ఒక టీ స్పూన్‌ నారింజ లేదా నిమ్మరసాన్ని కలిపి, ఆ మిశ్రమాన్ని మెడ వెనుక భాగంలో, ముఖానికి బాగా రాయాలి. 10 నిమిషాల తర్వాత మెత్తని బట్టతో తుడిచి, నీటితో కడ‌గాలి. అనంతరం టవల్‌తో నెమ్మ‌దిగా తుడ‌వాలి. ఇలా చేస్తే ఆయా భాగాల్లోని చ‌ర్మం మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.
కొద్దిగా పెరుగును తీసుకుని అందులో శ‌న‌గ‌పిండిని క‌లిపి, ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాయాలి. కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. దీని వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గిపోతాయి.
కొంత పెరుగును తీసుకుని అందులో ముల్లంగి ర‌సాన్ని క‌లిపి, ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసి, 30 నిమిషాల త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖానికి కాంతి వ‌స్తుంది.
నాలుగు చుక్కల బాదం నూనె, పన్నీరు, ఒక టీ స్పూన్ పెరుగుల‌ను కలిపి మిశ్ర‌మాన్ని త‌యారు చేయాలి. దీన్ని స్నానానికి ముందు శరీరానికి, మెడకు, ముఖానికి రాసుకోవాలి. అనంత‌రం 30 నిమిషాల పాటు ఆగాలి. త‌ర్వాత క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది.
ఎండ వ‌ల్ల చర్మం కమిలిపోతే 2 టీ స్పూన్ల టమాటా రసంలో 5 టీ స్పూన్ల పెరుగు కలిపి రాసుకుని కొద్దిసేపయ్యాక కడిగేయాలి. 4 టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా వెనిగర్‌ కలిపి కాళ్ళకు పట్టించాలి. అనంత‌రం కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కాళ్ల‌కు మృదుత్వం వ‌స్తుంది.
మంచి గ‌డ్డ పెరుగును తీసుకుంటూ ఉంటే విరేచ‌నాలు కూడా ఆగిపోతాయి.

Wednesday, October 19

అనారోగ్యానికి మ్యూజిక్ చేసే మ్యాజిక్…

సంతోషం:- మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డొపామైన్ అనే రసాయనం రిలీజ్ చేయడం వల్ల.. సంతోషంగా ఫీలవుతారు. సంగీతం వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా.. ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఓ 15 నిమిషాల పాటు.. మ్యూజిక్ వినండి. 
రన్నింగ్ కెపాసిటీ పెంచుతుంది:- మ్యూజిక్ వింటూ పరుగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే.. మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్ గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరుగెత్తవచ్చు.
 ఒత్తిడి, ఆరోగ్యం:- అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం. కాబట్టి మ్యూజిక్ వినడం అలవరుచుకోండి. సంగీతం మనసుకు ఉల్లాసాన్నే కాదు.. ఒత్తిడిని తగ్గించగలదు. మ్యూజిక్ ఇంస్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. అలసటగా అనిపిస్తే.. వెంటనే రేడియో ఆన్ చేయండి.. ఎక్కడలేని ఉత్సాహం పొందవచ్చు. 
నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే:- 45 నిమిషాలు శాస్త్రీయ సంగీతం వింటే, రిలాక్సేషన్ తో పాటు మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే. పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి.. హాయిగా నిద్రలోకి జారుకుంటారు. మెమరీ పవర్: సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది. కానీ.. మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది.

Sunday, October 16

బరువు తగ్గాలి అనుకుంటున్నారా?

  1. బరువు తగ్గించుకోవాలనుకున్నపుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.
  2. ఇక్కడ పేర్కొన్న చాలా ఆహార పదార్థాలు అనారోగ్యకరం.
  3. ఇవి బరువు పెంచే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.
  4. ఈ ఆహార పదార్థాలు మీ ప్రణాళికలో ఉన్నాయో లేవో చూసుకోండి.

బరువు తగ్గటం అనేది, బిగుతుగా ఉండే తాడుపై నడవటం లాంటిది. తప్పటడుగు ఒక్కటి వేసిన మీరు కింద పడిపోయే అవకాశం ఉంది. పనిలో ఏకాగ్రత, ఎలాంటి తప్పులు లేని విధి నిర్వహణ ద్వారా మాత్రమే ఎలాంటి ఆటంకాలు లేని లక్ష్యాన్ని చేరుకుంటారు. ఏ విషయంలో మీరు తప్పదడుగు వేస్తున్నారో తెలుసుకొని, సరిచేసుకుంటే మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాగే బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వారు చేసే ప్రతి పనిపై అవగాహన కలిగి ఉండాలి. వారు చేసే వ్యాయామాలు ముఖ్యంగా, తినే ఆహార పదార్థాలపై సరైన అవగాహన కలిగి ఉండాలి. బరువు తగ్గించుకోవాలనుకునే వారు ఇక్కడ తెలిపిన ఆహారాలను తినకూడదు.

వైట్ రైస్

వైట్ రైస్ లోనే కాదు, బ్రౌన్ రైస్ లో ఉండే పోషకాలు ఎక్కువే. ఈ పోషకాలు వేగంగా రక్త ప్రసరణలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా శక్తి కూడా త్వరగా ఖర్చు చేయబడుతుంది, ఫలితంగా తిరిగి త్వరగా ఆకలిగా అనిపించటం వలన అనారోగ్యకర ఆహార పదార్థాల వైపు మొగ్గుచుపుతారు. కావున వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ఎక్కువగా తీసుకోండి.

ద్రాక్ష పండ్లు :-

ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ, ఇవి అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటాయి. కావున ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవటం వలన బరువు తగ్గించుకోటానికి చాలా కష్ట పడాల్సి వస్తుంది. ఒకవేళ బరువు తగ్గించుకోటానికి తయారు చేసుకున్న ఆహార ప్రణాళికలో ద్రాక్ష పండ్లను చేర్చుకోవాలి అనకుంటే వీటితో పాటుగా తక్కువ కేలోరీలను కలిగి ఉండే ప్రోటీన్ ఆధారిత ఆహార పదార్థాలను కలుకోవటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు నిశ్చలంగా ఉంటాయి.

డైట్ సోడా :-

డైట్ సోడా బరువు పెంచే కృత్రిమ చక్కెరలు ఉంటాయని పరిశోధనలలో తెలుపబడింది. వీటిని తాగటం వలన ఆకలి పెరుగుతుంది మరియు రోజు డైట్ సోడా తాగే వారి యొక్క శరీర బరువు పెరుగుతుందని నిరూపించబడింది. కారణం ఏదైన డైట్ సోడాకు దూరంగా ఉంటే పెరిగే మీ శరీర బరువులో కొన్ని పౌండ్లనైన తగ్గించుకున్న వారవుతారు.

తృణధాన్యాలు :-

అల్పాహారంగా తీసుకునే చాలా తృణధాన్యాలు తక్కువగా కొవ్వు పదార్థాలను కలిగి ఉండి, చక్కెరలను అధికంగా కలిగి ఉంటాయి. చక్కెరలు ఆకలిని అధికం చేస్తాయి మరియు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కావున సహజ లేదా సేంద్రియ తృణ ధాన్యాలను ఎంచుకోండి ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్ లతో పాటూ ఫైబర్ లు కూడా ఉంటాయి.

చల్లబరచిన ఆహారాలు :-

చల్లబరచిన ఆహారాలు మరియు పిజ్జా వంటివి చాలా ఆకర్షిస్తాయి. ఇవి ఎక్కువ కాలం ఉండేలాగా వీటిలో ఉప్పు అధికంగా కలుపుతారు. వీటిని తినటం వలన ఇందులో ఉప్పును విలీనం చెందటం కోసం గానూ, ఎక్కువ నీటిని తాగాల్సి వస్తుంది. ఇలాంటి చర్యల వలన బరువు తగ్గించుకోవలన్నా మీ లక్ష్యం దెబ్బతింటుంది. కావున వీటికి దూరంగా ఉండటం మంచిది. 
 

మహిళలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే చిట్కాలు...

  1. ఆరోగ్యకమైనవి తినటం వలన ఒత్తిడి తగ్గి, వెంట్రుకలు పెరుగుతాయి.
  2. ఆవాల నూనె, ఉసిరి, మెంతి విత్తనాలతో చేసిన మిశ్రమం జుట్టుకు మంచివి.
  3. క్రమంగా జుట్టు కత్తిరించని ఎడల వెంట్రుకల పెరుగుదల నిలిచిపోతుంది.
  4. స్టైలింగ్ ఉత్పత్తుల, కలర్ లలో ఉండే రసాయనాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

TV లలో వచ్చే ప్రకటనలలో చూపించే విధంగా పొడవైన ఆకర్షణీయమైన జుట్టును పొందుటకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలం అయ్యారా? మరేం ఫరవాలేదు. ఈ వ్యాసం మీ కోసమే...

మార్కెట్లో జుట్టుకు బహిర్గతంగా అప్లై చేసేమందులు, జెల్ లు, టానిక్ లు మరియు ఇతరేతర ఉత్పత్తులు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటికి మన జేబు ఖాళీ అవటమే కాకుండా, నాణ్యమైన జుట్టు అనారోగ్యం భారినపడుతుంది. వీటికి బదులుగా కొన్ని సులువైన సూచనలు పాటిస్తే మహిళల జుట్టు ఆరోగ్యం చాలా మెరుగుపడి, పొవవైన జుట్టు మీ సొంతం అవుతుంది. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

ఆరోగ్యకరమైనవి తింటూ అనుకూలంగా ఆలోచించండి

జుట్టు రాలటం తగ్గినపుడు మాత్రమే మన జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. మనలో చాలా మంది ఒత్తిడితో కూడిన జీవనశైలి అనుసరించటం వలన త్వరగా బట్టతల కలుగుతుంది. కావున రోజు ఆరోగ్యకర ఆహర సేకరణ తప్పని సరి. ప్రతి రోజు 3 సార్లు తింటూ, మధ్య మధ్యలో 5 రంగులు గల పండ్లను తప్పక తినండి.

జిడ్డుగా ఉండే జుట్టు

మార్కెట్లో లభించే చాలా రకాల ఉత్పత్తులతో జుట్టును కడిగినపుడుల్లా వెంట్రుకలు పొడిగా మారిపోతుంటాయి. కావున మీ జుట్టుపై ప్రయోగాలు ఆపి, ఇంట్లో సహజంగా తయారు చేసుకున్న ఔషదాలను వాడండి. ముఖ్యంగా, సగం కప్పు ఆవాల నూనె తీసుకొని వేడి చేయండి. వేడి అవటం ప్రారంభం అవగానే ఈ ఆవాల నూనెకు తరిమిన ఉసిరి మరియు మెంతి విత్తనాలను కలిపి, చెంచాతో బాగా కలపండి. తరువాత మిశ్రమాన్ని చల్లబరచి, వెంట్రుకల మొదళ్లకు అప్లై చేసి, పూర్తి రాత్రి అలాగే ఉంచండి. మరుసటి రోజు గాడతలు తక్కువగా గల షాంపూతో కడగండి. ఇలా ప్రతి రెండు లేదా మూడు నెలలకి ఒకసారి అనుసరించండి. ఇలా చేయటం వలన జుట్టు పెరుగుదల మాములుగా ఉన్నప్పటికన్నా రెట్టింపు అవుతుంది.

వెంట్రుకలను కత్తిరించండి

మీరు జుట్టు కత్తిరించటం మానేసారా? అయితే మీ వెంట్రుకల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. వెంట్రుకల కొనలు తెగటానికి కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు. ప్రతి రెండు సంవత్సరాలకి జుట్టు కత్తిరించటం వలన జుట్టు పెరగటమేకాకుండా, వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను వాడకండి

మీ వెంట్రుకలకు కలర్ మరియు రీ-బాండింగ్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించండి. ఇలాంటి రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడటం వలన మీ జట్టు ఆరోగ్యాన్ని మీరే పాడుచేసిన వారవుతారు. కావున మీ జుట్టును కండిషన్ లో ఉంచుతూ, ప్రతి రోజు కడగండి. జుట్టు పొడిగా మారటం వలన పొలుసులుగా మారి, పెరుగుదల నిలిచిపోతుంది.

సురక్షిత హెయిర్ ప్యాక్ లను వాడండి

మార్కెట్లో చాలా రకాల హెయిర్ ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయి. మంచి పేరు, ప్రఖ్యాతులు గల బ్రాండ్ కు చెందిన ఉత్పత్తులను మాత్రమే వాడండి. అంతేకాకుండా, వేడికి వీలైనంత దూరంగా ఉండండి. మీరు తీవ్రమైన సూర్యకాంతికి బహిర్గతం అవటం వలన వెంట్రుకలు పాడవుతాయి. ఇలాంటి సమయంలో గొడుగు, లేదా స్కార్ఫ్ ను తలపై కప్పుకొని వెళ్ళండి.

అంతేకాకుండా, రోజు పడుకునే ముందు జుట్టును ముడి వేయటం మరవకండి. మీ వెంట్రుకల నాణ్యత మరియు వాటి నిర్మాణం గురించి తెలుసుకోండి. జిడ్డు వెంట్రుకలను కలిగి ఉన్నవారు రోజు షాంపూ చేసుకోవటం వలన వారి సమస్యలు తీరదు. వీరు ప్రతి 15 రోజులకు ఒకసారి హెన్న లేదా గోరింటాకు తో చేసిన హెయిర్ ప్యాక్ ను వాడాలి. ఇలా చేయటం వలన వీరు మంచి ఫలితాలను పొందుతారు.  

పిల్లలలో బరువు పెంచే ఆహార ప్రణాళికలు...

  1.  పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి బరువు తప్పక పెరగాలి.
  2. పిల్లల భోజనాలలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
  3. వైట్ బ్రెడ్ కి బదులుగా హోల్ గ్రైన్ బ్రెడ్ ను తినిపించండి.
  4. పాల ఉత్పత్తులు అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి.
 పిల్లలు వయసు పెరిగిన కొలది బరువు పెరుగుతుంటారు, కానీ కొంత పిల్లలు వయసు పెరినప్పటికీ బరువు పెరగరు. మీ పిల్లలు బరువు పెరగాలి అనుకుంటున్నారా? అయితే తల్లి-దండ్రులకు వారి పిల్లలు బరువు పెరగటానికి అందించాల్సిన ఆహార పదార్థాలు మరియు వాటి గురించి ఇపుడు తెలుసుకుందాం...
బరువు తక్కువగా ఉన్న పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు గురవకుండా ఉండాలంటే వారి శరీర బరువు పెరగాల్సిందే. పిల్లల తల్లి-దండ్రులు వారి బరువు పెరగటానికి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. అది కూడా వారి శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరగకుండా, ఆరోగ్యకర మార్గాల ద్వారా బరువు పెరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మంచి పోషకాహరం :-

పిల్లలు ఎక్కువగా షుగర్ డిసెర్ట్ వంటి క్యాలోరీలు పూర్తిగా లేని వాటిని తీసుకోవటం వలన వారు బరువు పెరగలేరు. వీటికి బదులుగా మంచి పోషకాలు మరియు అధిక క్యాలోరీలు గల ఆహార పదార్థాలను వారికి అందించటం వలన శరీర బరువు పెరుగుతుంది. కావున తల్లి-దండ్రులు ప్రతి రోజు భోజనంలో పోషకాలు ఎక్కువగా గల ఆహార పదార్థాలను సమకూర్చాలి. మీరు ప్రేమించే మీ పిల్లల కోసం పోషకాలు అధికంగా గల ఆహార పదార్థాలతో ఆహార ప్రణాళికను తయారు చేసి వాటిని అనుసరించేలా ప్రేరేపించండి.


పాల ఉత్పత్తులు :-


పాలు, పెరుగు, వెన్న, చీస్ వంటి పాల ఉత్పత్తులు అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా, కాల్షియం మరియు ఐరన్ లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ రకం పాల ఉత్పత్తులు అన్ని ఫుల్-క్రీమ్ పాలతో చేస్తారు. వీటిని పిల్లలకు తినిపించటం వలన వారి శరీరంలో ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు నిండేలా చేస్తాయి. వీటికి బదులుగా, పాల ఉత్పత్తులను స్మూతీస్ లలో కూడా కలుపుకొని తినవచ్చు.

హోల్ గ్రైన్స్ :-

హోల్ గ్రైన్ వీట్, గ్రానోలా, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు, కార్న్ బ్రెడ్ మరియు పాస్తా వంటి హోల్ గ్రైన్స్ సంబంధిత ఆహార పదార్థాలు పిల్లలలో బరువు పెంచుతాయి. "యూనైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్" వారు తెలిపిన దాని ప్రకారం, బరువు తక్కువగా గల పిల్లలలో హోల్ గ్రైన్స్ లను రోజులో ఆరు సార్లు తినిపించాలని తెలిపారు.

క్యాలోరీల లెక్కింపు :-

ఆరోగ్యకర క్యాలోరీలను అందించే బోన్ లెస్ చికెన్ బ్రెస్ట్ లేదా చిలకడ దుంప వంటివు పిల్లల ఆహార ప్రణాళికలో కలపండి. ఫ్రై చికెన్, లేదా ఫాస్ట్ ఫుడ్ వంటి అనారోగ్యకర క్యాలోరీలను లేదా క్యాలోరీలు లేని ఆహారాలకు దూరంగా ఉంచండి. వైట్ బ్రెడ్ కు బదులుగా అధిక మొత్తంలో పోషకాలను అందించే హోల్ గ్రైన్ బ్రెడ్ ను తినిపించండి. ఇవి మాత్రమేకాకుండా, నట్స్, డార్క్ చాక్లెట్ మరియు పచ్చని ఆకుకూరలు, పండ్లను వారి ఆహార ప్రణాళికలో కలపండి. మీ పిల్లలకు సరైన స్థాయిలో క్యాలోరీలు అందించబడని ఎడల, అదనపు ఆరోగ్యకర ఆహారాలను లేదా పాటించే ఆహార ప్రణాళికలను మార్చండి.

పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ మంచి పెరుగుదల ఉండాలని ప్రతి తల్లి-దండ్రులు కోతుకుంటారు. బరువు తక్కువగా ఉండే పిల్లలు తక్కువ సమయంలో ఆరోగ్యకర బరువు పెరగాలంటే కష్టమే. ఒకవేళ మీ పిల్లలు సాధారణ బరువు మరియు ఆరోగ్యంతో ఉండి, BMI ప్రకారం తక్కువ బరువుగా ఉంటే బరువులో పెరుగుదల తప్పని సరి అవసరం.
కావున వారి ఆరోగ్యం కోసం పోషకాహార నిపుణులను కలిసి మంచి ఆహార ప్రణాళికను తయారు చేసి అనుసరించేలా తగిన జాగ్రత్తలు తెసుకోండి.
 

Saturday, October 15

తల వెంట్రుకల్లోని బ్యాక్టీరియాకు జింక్ పైరిథియోన్ చెక్


తలపైన చుండ్రు పెద్ద సమస్య కాదు. తల వెంట్రుకలు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల తన వాసన వేస్తూ ఉంటుంది. తలపైనగల చర్మం పొడిగా ఉన్నట్లయితే చుండ్రు వస్తుందన్నది అపోహ మాత్రమే. తల వెంట్రుకలు తక్కువగా శుభ్రం చేస్తారనీ, అలా ఉందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ వాస్తవంగా ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడే చుండ్రు ఉంటుంది. 
 
దీనిని నివారించేందుకు క్రమంతప్పకుండా షాంపూతో తలస్నానం చేస్తూ ఉంటే చర్మంపైన పొట్టు లేకుండా ఉంటుంది. ఓటీసి డాండ్రఫ్ షాంపూను వాడితే ఫలితం వుంటుంది. జింక్ పైరిథియోన్(ఇది ఫంగస్ బ్యాక్టీరియా నాశని) వాడితే తలపైగల బ్యాక్టీరియా నిర్మూలింపబడుతుంది. కొన్ని వారాలపాటు ఇలా చేసినప్పటికీ చుండ్రు తగ్గకపోయినట్లయితే డాక్టరను సంప్రదించాలి.

Thursday, October 13

కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచే బీన్స్..


చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటారు. దీంతో గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే, కొలెస్ట్రాల్‌ను ఎల్లవేళలా నియంత్రణలో ఉంచాలంటే... బీన్స్ ఉడికించి తిన్నాసరే.. వేయించి తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు. 
 
నిజానికి బీన్స్‌ను ప్రతి రోజూ కాకపోయినా.. వారానికోసారైనా ఆరగించాలని సలహా ఇస్తున్నారు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం బాగా తగ్గుతుంది. దీనికి కారణం చిక్కుడు, ఇతర బీన్స్‌లో సులభంగా జీర్ణమయ్యే పీచు పదార్థం అధికంగా ఉండటమేనని చెపుతున్నారు. దీనికి కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంటుంది. ఈ బీన్స్‌లో బి విటమిన్, ఫోలేట్ అధికంగా ఉంటుంది. 
 
అంతేకాకుండా, ఈ రెండింటిలోనూ గుండె ఆరోగ్యం పెంపొందించే ఎమైనో ఆమ్లం ఉంది. గుండె ఆరోగ్యంతో పని చేయడానికి అవసరమైన పొటాషియమ్ బీన్స్‌లో సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యం కోరుకునేవారంతా బీన్స్‌ని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. 

Tuesday, October 11

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా.. అయితే



 బీట్ రూట్ రసాన్ని తాగండి..

 

మారుతున్న టెక్నాలజీతో పాటు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో అనేక మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఇంగ్లీష్ మందులను వాడుతూ.. రక్తపోటును నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారు ఇంట్లో చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అధిక రక్తపుపోటుతో బాధపడేవారు ప్రతి రోజూ బీట్‌రూట్ రసం తీసుకోవడం వల్ల దీన్ని నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. 
 
పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉన్నట్టు వెల్లడైంది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్‌ సమృద్ధిగా ఉన్న కూరగాయలు ఆకుకూరలు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

Sunday, October 9

మోతాదుకు మించి మంచి నీరు తాగితే కోమాలోకి వెళతారా?


సాధారణంగా ప్రతి వ్యక్తి ప్రతి రోజూ ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. కానీ, నీళ్లు మరీ ఎక్కువ తాగినా కూడా ప్రమాదమేనని తాజాగా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనిషి శరీరంలో అసలు ఎన్ని నీళ్లు కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ ఉంటుందని, ఎక్కువ నీళ్లు తాగకుండా అదే ఆపుతుందని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెపుతున్నారు.
 
అయినా పట్టించుకోకుండా ఎక్కువ నీళ్లు తాగితే 'హైపోనెట్రేమియా' అనే సమస్య వస్తుందంటున్నారు. దానివల్ల రక్తంలోని సోడియం గణనీయంగా పడిపోతుందన్నది వారి అభిప్రాయంగా ఉంది. దానివల్ల వాంతులు, వికారంతో మొదలుపెట్టి ఒక్కోసారి ఏకంగా మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. నీళ్లు మరీ ఎక్కువ తాగినపుడు మనిషి మెదడు కూడా స్పందించి ఆ విషయాన్ని తెలియజేస్తుందట.
 
మన శరీరానికి ఎంత కావాలో అంతే నీళ్లు తాగితే పర్వాలేదని, కేవలం దాహం వేసినప్పుడే తాగాలి తప్ప.. కావాలని నీళ్లు ఎక్కువగా తాగకూడదని పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్‌ ఫారెల్ తెలిపారు. ఇందుకోసం కొంతమందిని తీసుకున్న ఈ బృందం వారిలో సగం మందిని సరిగ్గా దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలని చెప్పి, మిగిలిన సగం మందిని మాత్రం ఎక్కువ నీళ్లు తాగమని చెప్పారు.

Saturday, October 8

ఈ పండ్లు తింటే ఉపయోగాలేంటో తెలుసా...?!

సిట్రస్‌ జాతికి చెందిన కమలాఫలం, నారింజ, బత్తాయి, నిమ్మ వంటి ఏ ఫలాన్ని అయినా సరే వాడితే విటమిన్‌-సి పుష్కలంగా అందుతుంది. తక్షణమైన ఫలితం కావాలంటే కమల ఫలాల రసంలో కాస్త ఉప్పు లేక పంచదార వేసుకుని తాగితే నిస్సత్తువపోతుంది. 
 
అంతేకాదు తరచుగా జలుబుతో బాధపడేవారు కమలాఫలాన్ని తరచు వాడుతూ ఉంటే వారికి రోగనిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుతుంది. కామెర్ల రోగం వచ్చిన వారు పులుపు తినకూడదు అంటారు. కానీ కమలా ఫలాలలో దేనినైనా సరే రసం తీసి పంచదార కలుపుకుని తరుచు త్రాగుతుంటే కామెర్లు త్వరగా తగ్గిపోతాయి.
 
నారింజ, కమలాఫలాల తొక్కలు కూడా ఉపయోగపడతాయి. ఈ తొక్కలను పారెయ్యకుండా ఎండలో బాగా ఎండబెట్టి ఆ తరువాత పాడిచేసి ఆ పొడిని వేడినీళ్లలో కలిపి స్నానంచేస్తే శరీరం తాజాగా సువాసనలు వెదజల్లుతోంది. చర్మవ్యాదులు కూడా తొలగిపోతాయి. ఎంతకూ మానని పుళ్ళు ఉన్న సంధర్భంలో తరచుగా కమలాఫలం తింటే పుళ్ళు త్వరగా మానిపోతాయి.
 
కమలాఫలం రోజుకు ఒకటి రాత్రి పడుకోబోయే ముందు తింటే ఉదయానికి సుఖ విరేచనం అవుతుంది. మలబద్థకం అలవాటుగా మారినవారు ఈ విధంగా చేస్తే ఉపయోగం ఉంటుంది. కమలాఫలం తరచుగా వాడటం వల్ల పంటిచిగుళ్ళ నుంచి రక్తం కారడం తగ్గుతుంది. కమలాఫలం విటమిన్‌ సి మాత్రమే కాక కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి. 0.8గ్రాముల ప్రోటీన్లు, 0.3గ్రాముల కొవ్వు పదార్థాలు ఉన్నాయి. వీటితో పాటుగా 9గ్రాముల పిండి పదార్థాలు కూడా ఉన్నాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇది పైత్యాన్ని అరికడుతుంది.జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. చలువ చేస్తుంది. దాహమును అరికడుతుంది.

మహిళ నడుం చుట్టు కొలత 34.6 అంగుళాలు దాటితే...

సాధారణంగా మధుమేహ వ్యాధి బారిన ప్రతి ఒక్కరూ పడుతున్నారు. దీంతో భారత్‌తో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నారు. అయితే, ఒక వ్యక్తికి చక్కెర సోకిందో లేదో తెలుసుకునేందుకు నడుం చుట్టుకొలతతో గ్రహించవచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు. 
 
సాధారణ వ్యక్తుల కంటే కూడా నడుం చుట్టూ ఎక్కువ కొవ్వు కలిగి ఉన్న వ్యక్తులే ఐదు రెట్లు అధికంగా టైప్ 2 డయాబెటిస్ వ్యాధి బారిన పడతారని తెలిపింది. పురుషుల్లో నడుం చుట్టుకొలత 40 అంగుళాల కంటే ఎక్కువ ఉన్నవారు టైప్ 2 మధుమేహం బారిన పడే అవకాశం అధికమని, మహిళల్లో నడుం చుట్టుకొలత 34.6 అంగుళాలు దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్టేనంటున్నారు.

తెల్ల వెంట్రుకలకు చెక్ పెట్టాలా? నల్లనువ్వుల నూనె లేదా ఆవనూనెతో మసాజ్ చేసుకోండి...


మీకు చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయా..? దీంతో జుట్టుకు రంగు వేసుకోవడంపై ఆధారపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి.

రెండు టేబుల్‌ స్పూన్ల హెన్నా పౌడర్‌ను, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ మెంతిపొడి, టేబుల్‌ స్పూన్‌ కాఫీ పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల పుదీనా రసం, రెండు టీ స్పూన్ల తులసి రసం తీసుకుని ఈ మిశ్రమాలను చక్కగా కలిపి దీన్ని ఒక గంటపాటు అలాగే ఉంచి తర్వాత తలకు పట్టించుకోవాలి. 
 
ఒక గంటపాటు దీన్ని తలపైనే ఉంచుకుని తర్వాత నేచురల్‌ షాంపూతో చక్కగా తలస్నానం చేస్తే కాస్త మెరుగుపడుతుంది. ఇలా కనీసం నెలకు ఒకసారి చేసినా సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు. అలాగే అల్లం రసాన్ని, తేనెను సమపాళ్లలో కలిపి రోజుకు ఒక టీస్పూను చొప్పున ఉదయం పూట తీసుకోవాలి. అలాగే విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఉసిరి, ఇంకా ఆకుకూరలు, ఐరన్‌ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు, విటమిన్‌ ఇ ఉండే చేప ఉత్పత్తులను ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. 
 
అప్పుడప్పుడు తలకు నూనెతో మసాజ్‌ చేయించుకోవాలి. దీనివల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి. మసాజ్‌కు నల్లనువ్వుల నూనెగానీ, లేదా ఆవనూనెగానీ ఉపయోగించాలి. ఇలా చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే వెంట్రుకలు తెల్లబడడాన్ని నివారించడంతోబాటు జుట్టు పొడిబారడం వంటి సమస్యకు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు.

Friday, October 7

శరీరాన్ని మైదా పిండి క్రమంగా చంపేస్తుందని తెలుసా..? పరోటా, సమోసా అసలేం చేస్తాయి?

మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే.. మైదా వాడితే పదార్థాలు చూడటానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్లో ఫలానాది తింటే చాలా బావుందని చెబుతుంటారు. కాని మైదా పిండి వాడటం మూలాన వచ్చే నష్టాలు తెలిస్తే మళ్లీ జన్మలో వాటి జోలికి వెళ్లరు.
 
మైదాలో విషపూరిత రసాయనాలు…
* మిల్లులో బాగా పాలిష్ చేయబడిన గోధుమ పిండి. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. 
* బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదాలో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. 
* గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్‌లో ఇష్టారీతిన వాడేస్తున్నారు.
 
మైదా తింటే ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది…
* మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి. అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి. అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.
* సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది. 
* ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.
* దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.
* కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
* గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 
* మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.
* కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామమాత్రంగా ఉంటాయి.
* మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
* మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
* రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే.
* స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది. 
* ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు. ఆ ఫుడ్స్ తినాలనిపించదు.

Wednesday, October 5

నాలుక తెల్లగా ఉంటే క్యాన్సర్ కు సంకేతమా...?

మీరు ఏదైనా ఆహారం తిన్నప్పుడు, టేస్ట్ డిఫరెంట్ గా తెలుస్తున్నదా.. లేదా మీ నాలుక చాలా మందంగా..ఏది తిన్నా రుచికరంగా అనిపించుట లేదా..? ఇంకా బ్యాడ్ బ్రీత్ ఫీలింగ్ మీకు కలుగుతున్నట్లైతే ఖచ్చితంగా అది వైట్ టంగ్ (నాలుక తెల్లగా ఉంటుంది)ఒక సారి చెక్ చేసుకోండి.. సహజంగా మన నాలుక పింక్ కలర్లో ఉంటుంది. అయితే నాలుక మీద వైట్ కోటింగ్ ఉన్నట్లైతే అది చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. పైన సూచించిన లక్షణాలన్నీ కూడా వైట్ టంగ్ కు కారణమవుతాయి. వైట్ టంగ్ (నాలుక)తెల్లగా మారడానికి ఆహారాలు కారణం కావచ్చు, డెడ్ స్కిన్ సెల్స్ మరియు బ్యాక్టీరియా కూడా కారమవ్వొచ్చు, . ఇంకా నోటి సరైన నోటి శుభ్రతను పాటించకపోవడం, ఎక్కువగా స్మోక్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, డీహైడ్రేషన్ వల్ల నోరు డ్రైగా మారుతుంది. ఇవన్నీ నాలుకు తెల్లగా మారడానికి కారణమవుతుంది.
అలాగే హైఫీవర్ తో బాధపడే వారిలో లేదా జాండీష్ ఉన్న వారిలో నాలుక తెల్లగా ఉంటుంది. ముఖ్యంగా మెడిసిన్స్ తీసుకోవడం, లేదా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల నాలుక తెల్లగా మారుతుంది. తరచూ నాలుక తెల్లగా మారుతుంటే..వెంటనే డాక్టర్ ను కలవాలి. లేదంటే ఇది క్రోనిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. క్రమంగా లుకోప్లాకియా లేదా క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి నాలుక తెల్లగా మారడం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా క్యాన్సర్ బారీనా పడుతారు. అలా జరకుండా ఉండాలంటే కొన్ని మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే వైట్ టంగ్ నివారించుకోవడానికి కొన్ని మౌత్ వాష్ లు మెడికల్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. 
వీటితో పాటు కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...
అలోవెర:- కలబందలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇవి నాలుక తెల్లగా మారకుండా నివారిస్తాయి. అలోవెర జ్యూస్ ను నాలుక మీద వేసుకుని రుద్ది వాష్ చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం టుంది.
పసుపు: పసుపులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలున్నాయి. కొద్దిగా పసుపు తీసుకుని నాలుక మీద వేసుకుని రబ్ చేయాలి. తర్వాత నోటి నిండా నీళ్ళు పోసి పుక్కలించి వాష్ చేసుకోవాలి. ఇది బ్యాడ్ బ్రీత్, వైట్ టంగ్ ను నివారిస్తుంది.
గోరువెచ్చని ఉప్పు నీళ్ళు: గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఉప్పు వేసి, నోట్లో పోసుకుని పుక్కలించాలి. ఈ నేచురల్ మౌత్ వాష్ ను ఉపయోగించడం వల్ల వైట్ టంగ్ ను నివారిస్తుంది.
బేకింగ్ సోడ: నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నాలుక మీద వేసి రుద్దాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నాలుక మీద తెల్లన పొర తొలగిపోతుంది.
పెరుగు: పెరుగు ప్రోబయోటిక్ రెమెడీ. ఇది బ్యాక్టీరియాను మరియు ఫంగస్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డైలీ డైట్ లో పెరుగు చేర్చుకోవడం మంచిది.
నిమ్మరసం : నోట్లో బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దాంతో నాలుక మీద వైట్ లేయర్ తొలగిస్తుంది. ఫ్రెష్ గా ఉండే నిమ్మరసం తీసుకుని నీటిలో మిక్స్ చేసి శుభ్రం చేసుకోవాలి.
వెల్లుల్లి: వెల్లుల్లిలో యాంటీఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది నాలుక మీద బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి రెబ్బలు చేర్చుకోవాలి. లేదా పచ్చి వెల్లుల్లిని నమిలి తినాలి.
గ్లిజరిన్ : కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని నాలుక మీద వేసుకుని బ్రష్ చేయాలి. ఇది నాలుక మీద ఉన్న వైట్ లేయర్ ను తొలగిస్తుంది.
నీళ్ళు : రోజూ నీళ్ళు ఎక్కువగా తాగాలి. శరీరంను సాధ్యమైనంత వరకూ హైడ్రేషన్ లోఉంచుకోవాలి. ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల వైట్ టంగ్ ను నివారించుకోవచ్చు.
వేప: వేపలో నేచురల్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కొన్ని వేప ఆకులను తీసుకుని, నీటిలో వేసి బాయిల్ చేయాలి. చల్లారిన తర్వాత నోట్లో పోసుకుని శుభ్రం చేసుకోవాలి. వైట్ టంగ్ సమస్య ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది.

Sunday, October 2

కీళ్లనొప్పులు – ఆయుర్వేద పరిష్కారాలు


ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు.
‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు.
అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, (స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించడం, రాత్రి ఎక్కువగా మేల్కొని ఉండటం వంటివి) కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు.
ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేదశాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు.
1. సంధివాతం – Oesteo arthritis
2. ఆమవాతం – Rheumatoid arthritis
3. వాతరక్తం – Gout

సంధి వాతం (Oesteo arthrities) :-
సంధివాతాన్ని ఆస్టియో ఆర్ధరైటిస్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్లనుండి శబ్దాలు (Crepites) ఉంటాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియల్ ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50-60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తూంటుంది.
ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆహారంలో పోషకవిలువల లోపం వలన కూడా (విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్) ఈ వ్యాధి వస్తుంది.
జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన లేదా వీపుమీద మోయటం ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం… ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి.
ఆమ వాతం (Rheumatoid arthritis) :-
రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వల్న ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవటం వలన, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు (Swelling), తీవ్ర వేదన (Pain), కొద్దిపాటి జ్వరం (Mild Temp) కీళ్లు బిగుసుకుపోవటం (Stiffness), ఆకలి మందగించటం, మలబద్దకం (Constipation) లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది (Including small joints).
వాత రక్తం (Gout) :-
Goutను వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్యవయసు వారిలో ఎక్కువగా వస్తూంటుంది.
కారణాలు:- ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం (హై ప్రొటీనిక్ ఆహారం) ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహారపదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉండే ఆహారపదార్థాలు తినటం వలన అలాగే వీటితోపాటు శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వీటన్నిటివలన వాతం, రక్తం ఈ రెండు దుష్టి చెంది వాత రక్తంగా సమస్య ఏర్పడుతుంది. క్లినికల్‌గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి.
లక్షణాలు:- ఎరుపు, వాపు, నొప్పితో కూడిన కాలిబొటన వేలు నుండి ప్రారంభమై, తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది.
ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు
ఆయుర్వేద శాస్త్రంలో…
1. నిదాన పరివర్జనం
2. ఔషధ సేవన
3. ఆహార విహార నియమాలు
ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు.
1. నిదాన పరివర్జనం:- వ్యాధి కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టటం.
2. ఆహార విహార నియమాలు:- ఆహారం సరైన టైమ్‌కి తినటం, వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, తగు వ్యాయామం, సరైన టైమ్‌కి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం.
3. ఔషధ సేవన:- ఔషధ సేవన విషయానికి వస్తే, ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఎ) శమనం 
                            బి) శోధనం
ఎ) శమనం:- అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం.
బి) శోధనం:- అంటే పంచకర్మ. పంచకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు) తరువాత వమన, విరేచన, వస్తి (ప్రధాన కర్మలు) తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, బానువస్తి, పత్రపోటలీ, వాలుకాస్వేదం మొదలగు బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Saturday, October 1

సులభంగా శరీర బరువు పెంచే పండ్లు...

బరువు తక్కువగా ఉండటం ప్రస్తుత కాలంలో చాలా సాధారణం. ఈ కాలంలో పెరిగే ఒత్తిడి, క్రమంలేని ఆహార సేకరణ మరియు అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, భౌతిక కార్యాలను చేయకపోవటం మరియు జన్యుపరంపర సంక్రమణ వంటి కారణాలు తక్కువ బరువుకు కారణం అని చెప్పవచ్చు. బరువు పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఆరోగ్య నిపుణుడి సూచనల మేరకు కొవ్వు పదార్థాలు లేని, అధిక క్యాలోరీలను అందించే భోజనాలతో కూడిన ఆరోగ్యకర ఆహార ప్రణాళిక మంచి మార్గంగా చెప్పవచ్చు. త్వరగా ఫలితాలను పొందుటకు భౌతిక వ్యాయామాలను అనుసరించటం కూడా అవసరమే. 

ఇంట్లోనే చేసుకోగల, బరువు పెంచే పదార్థాల గురించి కింద తెలుపబడింది...


బననా మిల్క్ షేక్

ఒక గ్లాసు అరటిపండు మరియు పాలు కలిపి తయారు చేసిన బననా మిల్క్ షేక్ ను రోజులో రెండు సార్లు తాగండి. దీనికి బదులుగా రోజు 3 అరటిపండు తిన్నను సరిపోతుంది. ఇలా తిన్న వెంటనే ఒక గ్లాసు పాలు లేదా గిన్నె నిండా పెరుగు తినండి. ఒకవేళ బననా తినటానికి ఇష్టం లేకపోతే, వివిధ రకాల పండ్లు, పాలు కలిపిన మిశ్రమాన్ని తినండి. ఈ పండ్ల ద్వారా శరీరానికి చక్కెరలు మరియు పాల నుండి ప్రోటీన్ లు అందించబడతాయి.


ఖర్బుజ

ఖర్బుజ కూడా శరీర బరువు పెరుగుటలో సహాయపడుతుంది. త్వరగా మంచి ఫలితాలను పొందుటకు, రోజులో 3 సార్లు అధిక మొత్తంలో ఖర్బుజను తినండి.


వేడి పాలు

ఒక చెంచా తేనె కలిపిన గ్లాసు వేడి పాలను రోజు తాగండి. పిడికెడు ఖర్జూర, ఫిగ్స్ మరియు బాదంలను పాలలో కలిపి కొద్ది సమయం వరకు వేడి చేయండి. తక్కువ బరువు ఉన్న వారు ఇలాంటి వాటిని తాగటం వలన శరీర బరువు సులువుగా పెరుగుతుంది.


ప్రోటీన్ అధికంగా గల ఆహారాలను తినండి :-

ప్రోటీన్ ఆధికంగా గల ఆహార పదార్థాలు పిల్లల బరువును సులభంగా పెంచుతాయి. గుడ్డు చీస్, పీనట్ బటర్, లేగ్యూమ్స్, మాంసం మరియు పెరుగు వంటి ఆహార పదార్థాలు అదనపు ప్రోటీన్ లను కలిగి ఉంటాయి.

పాలు ఎక్కువగా తాగించండి :-

పిల్లల బరువు పెంచుటకు అందుబాటులో ఉన్న సులభ మార్గం- ఎక్కువగా పాలను తాగించటం. ఒకవేళ మీ పిల్లలు పాలు తాగటానికి విముకతవ్యక్తం చేస్తే, అతడు / ఆమెను పాలు తాగమని ఒత్తిడి చేయకండి. కేవలం పాలు మాత్రమే కాకుండా, చాలా రకాల మార్గాల ద్వారా పాలను తాగేలా చేయవచ్చు. ముఖ్యంగా, పాలతో కలిపిన వివిధ రకాల షేక్స్ లేదా పండ్లు మరియు పాలు కలిపిన షేక్స్ వంటి వాటి ద్వారా పాలను తాగేలా చేయవచ్చు. పాలతో చేసిన స్మూతీ లేదా ఐస్ క్రీమ్ లను తయారు చేసి వారికి తాగించండి. పిల్లలు వీటిని తాగటానికి కూడా ఇష్టపడతారు.

బరువు పెంచే కిస్మిస్ :-

పిల్లలలో బరువు పెంచే మరొక ఆహర పదార్థం- కిస్మిస్. మీ పిల్లలు రోజులో దాదపు 30 గ్రాముల కిస్మిస్ తింటే, వారు సులభంగా బరువు పెంచే అవకాశం ఉంది.

బరువు పెంచే ఖర్బుజ :-

ఖర్బుజ పుష్కలంగా సహజ చక్కెరలను కలిగి ఉంటుంది. మీ పిల్లల కోసం తయారు చేసుకున్న ప్రణాళికలో వీటిని కలపటం ద్వారా వారి బరువు త్వరగా పెరుగుతుంది.


బరువు పెంచే మామిడిపండు :-

సహజ చక్కెరలను అందించే మరొక పండు- మామిడి పండు. దీనితో పాటూ, పాలను కూడా కలిపి ఇవ్వటం వలన మీ పిల్లలకు కాల్షియం మరియు అదనపు ప్రోటీన్ వంటి పోషకాలను అందించినవారవుతారు.

దంచిన బంగాళదుంప :-

దంచిన బంగాళదుంపకు క్రీం కలిపి మీ పిల్లలకు తినిపించవచ్చు. ఇవి మీ పిల్లల శరీర బరువు పెరగటానికి సహాయపడతాయి. బంగాళదుంపతో పాటూ అధిక కేలోరీలను కలిగి ఉండే కూరగాయాలు, కార్న్, పీస్ మరియు చిలకడదుంప వంటి వాటిని కూడా పిల్లలకు తినిపించండి.


నట్స్

పీకాన్, పీ నట్, బాదం, జీడిపప్పు మరియు ఇతర గింజలు పిల్లల శరీర బరువును పెంచుతాయి. చిప్స్ వంటి అనారోగ్యకర ఆహార పదార్థాలకు బదులుగా పిడికెడు గింజలను వారికి ఇవ్వండి.

వంటగది శుభ్రతకే ప్రాధన్యాత...?

ప్రతి కుంటుంబంలో.. ఇంట్లో ఏ గది ఉన్నా లేకపోయినా వంటగది తప్పనిసరి. అది ఇంట్లోవారి సంబంధ భాందవ్వాలతో పాటు.. స్నేహభావాలతో పాటు ఇంట్లో వాళ్ల శుభ్రత, క్రమపద్ధతిని కూడా ప్రతిబింబిస్తుంది. అంతే కాకుండా ఇంటి ఆరోగ్యం ఈ గది మీదనే ఆధారపడి ఉంటుంది. వంటగదిని సక్రమంగా నిర్వహించడం ఇల్లాలికి చాలెంజింగ్ జాబ్ అనే చెప్పాలి. హెల్దీ ఫ్యామిలీ... హెల్దీ కిచెన్‌తోనే సాధ్యం. 
అందుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి.. 
 1. రోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్లాలి. ఇది అలవాటుగా మారితే అనేక అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు. 
2. వంటగదిలోకి తగినంత సూర్యరశ్మి, గాలి ప్రసరిస్తుండాలి. గాలి రావడానికి, వెళ్లడానికి వీలుగా కిటికీలను తెరిచి ఉంచాలి. 
3. స్టౌ పెట్టే ప్లాట్‌ఫామ్‌ను, నేల మీద పడిన నూనె మరకలు, ఆహారపదార్థాలను ఎప్పటికప్పుడు తుడిచేయాలి. వాటిని అలాగే వదిలేస్తే బ్యాక్టీరియాకు ఆవాసాలవుతాయి. ప్లాట్‌ఫామ్ మీద వెనిగర్ చల్లి తుడిస్తే బ్యాక్టీరియా నశిస్తుంది. 
4. కిచెన్ బిన్‌లోని వ్యర్థాలను పారేసి సరిపెట్టుకోకుండా డస్ట్‌బిన్‌ను రోజూ శుభ్రంగా కడగాలి. 
5. డోమెక్స్, బ్లీచింగ్ వంటి క్లీనింగ్ ఎలిమెంట్స్‌ను ఆహార పదార్థాలు, వంటదినుసులకు దగ్గరగా ఉంచకూడదు. వీటి కోసం విడిగా ఒక అర కేటాయించాలి. 
6. వంటగదిని రోజూ సాధారణంగా శుభ్రం చేయడంతోపాటు పర్తిస్థాయిలో శుభ్రం చేయడానికి ఒక క్యాలెండర్ మెయింటెయిన్ చేసుకోవడం మంచి పద్ధతి. వారంలో ఫలానా రోజు అనుకుంటే ఇది పెద్ద కష్టంతో కూడిన పనిగా అనిపించదు. 
7. అలాగే ఫ్రిజ్..అదే రోజు ఫ్రిజ్‌లో మిగిలి పోయిన ఆహార పదార్థాలు, పాడైన కూరగాయలు, పురుగుపట్టిన పప్పు దినుసులను పారవేసి టిన్నులను శుభ్రం చేసుకోవాలి. 
8. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తరచూ నేల, ప్లాట్‌ ఫామ్‌ తోపాటు కిచెన్ షెల్ఫ్‌ లు అన్నింటినీ శుభ్రం చేయాలి. సింక్‌ లో అర కప్పు ఉప్పు చల్లి నిమ్మ చెక్కతో రుద్ది పది నిమిషాల తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది కడగాలి. 
9. వంటగదిలో వాడే టవల్స్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. డిటర్జెంట్‌తో ఉతికిన తర్వాత వేడినీటిలో ముంచి, బాగా ఎండ తగిలే చోట ఆరేయాలి. వాడిన టవల్స్‌ను తడిపి సింక్‌లో వదిలేయడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు. 
10. కటింగ్ బోర్డ్, చాకులను వారానికి ఒకసారి బ్లీచింగ్, వెనిగర్ కలిపిన వేడినీటిలో వేసి శుభ్రం చేయాలి. కూరగాయలను ప్లాస్టిక్ కటింగ్ బోర్డు మీద తరిగినప్పుడు కూరగాయలతోపాటు చిన్న ప్లాస్టిక్ రేణువులు కూడా ఆహారంలో కలుస్తాయి. కాబట్టి ఉడెన్ కటింగ్ బోర్డు వాడడం మంచిది. 
11. చిన్న కప్పులో బోరిక్ యాసిడ్ వేసి వంటగది మూలల్లో ఉంచితే బొద్దింకలు రావు. 
12. ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయరాదు. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే రసాయనాలు, విషపదార్థాల అవశేషాలు ఆహారపదార్థాలను విషపూరితం చేస్తాయి.