Sunday, April 28

మధుమేహా నివారణకు...


  1.  * రాచఉసిరి కాయలు ఎండించి వాటి చూర్ణం చేసి దానికి సమానంగా పసుపు కలిపి ఈ చూర్ణాన్ని ఉదయం , సాయంత్రం అరచెంచాడు చొప్పున తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.
  2. * ప్రతినిత్యం అరటి పువ్వు చూర్ణం 2 స్పూన్స్ తినుచున్న మధుమేహరోగం తగ్గును.
  3. * నల్లతుమ్మ బెరడు, నల్ల తుమ్మ జిగురు చూర్ణం చెంచా , అరకప్పు నీటిలో కలిపి తాగుచున్న మధుమేహం తగ్గును.
  4. * మర్రిచెట్టు బెరడు చూర్ణం చెంచా గాని బెరడు కషాయం ఒక పావుకప్పు రోజూ తీసుకొనుచున్న మధుమేహం నిశ్చయంగా తగ్గును. చాలా మంచి మందు.
  5. * ఉసిరికాయ కషాయం లేక ఉసిరిగింజల కషాయం రోజుకి అరకప్పుచొప్పున తాగవలెను.
  6. * లేత మామిడి ఆకుల చూర్ణం రోజుకి చెంచా చొప్పున తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.
  7. * బూరుగ చెట్టువేళ్ళ చూర్ణం అరచెంచాడు ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.
  8. * ప్రతినిత్యం త్రిఫల చూర్ణం రాత్రి సమయంలో ఆహారం తీసుకున్న రెండు గంటల తరువాత ఒక కప్పు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగుచున్నంతవరకు మధుమేహాం రాదు .
  9. చాలా మంది త్రిఫలా చూర్ణం అనగా
  10. కరక్కాయ పెచ్చులు ఒక భాగం , తాటికాయ రెండు భాగాలు , ఉసిరికాయ చూర్ణం నాలుగు భాగాలు తీసుకుని దేనికదే విడిగా చూర్ణం చేసి అన్ని కలుపుకుని ఒకే చూర్ణంగా ఒక గాజుసీసాలో నిలువచేసుకోవాలి . దీనిని ప్రతినిత్యం రాత్రి సమయం నందు ఒక కప్పు నీటిలో కలిపి వాడుకోవాలి . ఇది మదుమేహం రాకుండా అద్బుతంగా కాపాడును.
  11. * మదుమేహం 250 నుంచి 300 మధ్యలో ఉన్నప్పుడు 9 మారేడు ఆకులు ఉదయాన్నే పరగడుపున రాత్రి ఆహారానికి గంట ముందు తిని,మధ్యాహ్నం మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయ ప్రతి నిత్యం తింటూ బయటకు వెళ్ళు సమయంలో చిన్న దాల్చినచెక్క ముక్క నోటిలో వేసుకొని చప్పరింస్తూ ఉన్న తగ్గును
  12. వేడిని పెంచే ఆహారం తగ్గించాలి.
  13. నీడలో ఎండించి చూర్ణం చేసిన నేరేడు గింజల చూర్ణం , ఒక స్పూన్ పొడపత్రి చూర్ణం ఉదయాన్నే ఒక గ్లాసు గొరువెచ్చటి నీటిలో వేసి అలా ఉంచి రాత్రి ఆహారానికి గంట ముందు ఆ కషాయాన్ని త్రాగి, మరలా రాత్రి సమయము నందు పైన చెప్పిన మోతాదులోనే మరొక గొరువెచ్చటి చిన్న గ్లాసు నీటియందు చూర్ణాలు వేసి ఉదయాన్నే పరగడుపున తాగించాను . మధుమేహం పూర్తినియంత్రణ లోకి వస్తుంది.
  14. మధుమేహం లో వచ్చు అతిమూత్రవ్యాధికి నీడలో ఎండించిన తంగేడు పువ్వులను 10 తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న అతిగా మూత్రం పోవడం తగ్గును.

నువ్వులతో ఆరోగ్యం...

  1. నువ్వులతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. బీపీ, షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. నువ్వుల్లో మాంస కత్తులు, అమినోయాసిడ్‌లు సమద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం శాతం కూడా అధికంగా ఉంటుంది. నువ్వుల నూనె వాడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
  2. నల్ల నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తహీనతతో బాధపడేవారు, బలహీనంగా ఉండేవారు ఈ నువ్వులను ఆహారంగా తీసుకుంటే మంచిది. నువ్వుల్లో సెసమాల్‌ అనే యాంటీయాక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది. 
  3. ఇది హృద్రోగం నుంచి కాపాడుడుతంది. నువ్వుల్లో ఉండే మోనోశాచురేటెడ్‌ కొవ్వు శాతాన్ని నియంత్రిస్తుంది. నువ్వుల్లో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
  4. రక్తనాళాలు, ఎముకలు, కీళ్ల్లు, సక్రమంగా పనిచేసేందుకు నువ్వులు ఎంతగానో దోహదపడుతాయి. నువ్వులను తరచూ ఆహారంగా తీసుకుంటే ఉబ్బసం నివారించవచ్చు. వీటిలో ఉండే జింక్‌, కాల్షియం ఎముకలను పటిష్టంగా ఉంచుతాయి.
  5. నువ్వు మొక్కలను కాల్చి, మసి చేసి పెరుగుతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే మూత్ర పిండాల్లో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. పల్లేరుకాయలు, నువ్వు పువ్వులు, తేనె సమపాళ్లలో మెత్తగా నూరి కేశాలు రాలినచోట రుద్దితే తిరిగి జుట్టు పెరుగుతుంది.
  6. నువ్వుల నూనె చర్మాన్ని మదువుగా ఉంచుతుంది. నూనె ముఖానికి రాసుకొని మర్దనా చేసి, శనగ పిండితో నలుగు పెట్టి, గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది. పాదాలకు పగుళ్లు ఉన్నచోట నువ్వుల నూనె రాసుకొని, సాక్సులు వేసుకుంటే పగుళ్లు తగ్గుముఖం పడుతాయి.
  7. నువ్వుల నూనెలో ఒమేగా 3, 6, 9 ప్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ ఇస్తాయి. నువ్వుల నూనెను తరుచూ తలకు మర్దన చేసుకుంటే తలలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. తద్వారా జుట్టుకుదుళ్లు దఢంగా తయారవుతాయి. జుట్టు పొడిబారడం, రాలడం, పలుచబడటం తదితర సమస్యలను దూరం చేస్తాయి.

కెఫిన్‌ పదార్థాలకు దూరంగా...

 తలమీద సుత్తితో బాదుతున్నట్లు అనిపించడం, తలంతా నొప్పి, కండ్లు మూతలు పడుతుండటం వంటివి మైగ్రెయిన్‌ లక్షణాలు. ఈ బాధ నుంచి ఉపశమనం పొందడానికి కొందరు పెయిన్‌ కిల్లర్లు వేసుకుంటారు. అయితే ఎక్కువగా వీటిని వేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. మైగ్రెయిన్‌ కారణంగా వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది...
  1. తాజా ద్రాక్ష పండ్ల జ్యూస్‌ తాగడం వల్ల మైగ్రెయిన్‌ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ను రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది.
  2. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడే అల్లం మైగ్రెయిన్‌ నొప్పిని కూడా తగ్గిస్తుంది.
  3. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకొని 30 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
  4. వెలుతురు ఎక్కువగా వచ్చే చోట కూర్చోవడం కూడా కొన్నిసార్లు అసౌకర్యానికి, తలనొప్పి పెరగడానికి కారణం అవుతుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కాసేపు లైట్లను ఆఫ్‌ చేసి విశ్రాంతి తీసుకుంటే చాలావరకు ఉపశమనం కలుగుతుంది.
  5. మైగ్రెయిన్‌ నొప్పిని తగ్గించే మరో తేలికైన పద్ధతి మసాజ్‌. తలనొప్పి బాధపెడుతున్నప్పుడు మెడ, తల భాగాన్ని మెల్లగా మసాజ్‌ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరిగి పెయిన్‌ తగ్గుతుంది. నిద్రలోకి జారుకుంటే చాలావరకు రిలాక్స్‌ అవుతారు. నొప్పి కూడా తగ్గుతుంది.
  6. కెఫిన్‌ ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే నొప్పి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి కెఫిన్‌ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. 

Saturday, April 27

గోళ్లు ఆరోగ్యంగా...


మందార పువ్వు తో ఎన్నో ప్రయోజనాలు..!!

     మనం నిత్యం చూసే వృక్షాలు, పువ్వులు, కాయల్లో ఎన్నో ఔషదాలు దాగి ఉన్నవిషయం తెలియదు. అయితే పురాతన కాలం నుండి భారతదేశంలో అనేక ఆయుర్వేద మందులను మూలికలు మరియు వేర్లను ఉపయోగించి తయారు చేస్తున్నారు. కొన్ని పూలల్లో కూడా అద్భుతమైన ఔషదాలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మందార ఒకటి. మందార పువ్వు ఎరుపు, తెలుపు, పసుపు, పింక్ రంగులలో ఉంటుంది.  ఆయుర్వేదం మందులలో ఎక్కువగా ఎరుపు రంగు మందార పువ్వులను ఉపయోగిస్తారు.

   మందార రసం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మందార పువ్వు రేకలు మరియు ఆకుల వలన ఉన్న  ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మందారను ఉపయోగించటానికి ముందు, వాటిని శుభ్రం చేసి ఫ్రిజ్ లో ఉంచాలి.మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌందర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పతాయి. ఈ మొక్క నుంచి నూనె తీస్తారు. మందార నూనెతో తలవెంట్రుకలను కాపాడుకోవడమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మందార నూనెలో తేమ ఉంటుంది. కనుక చర్మం, కేశాలను మృదువుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలకు మరింత అందాన్ని, మెరుపుని ఇస్తుంది.

  ఈ నూనెతో మసాజ్‌ చేస్తే చుండ్రు నివారించుకోవచ్చు. జుట్టు రాలటం తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేశాలు తెల్లబడకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉంచేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. కేశాలకు వృధాప్య చాయలు దరి చేరకుండా చూస్తుంది. చర్మం నునుపుగా ఉండేలా చూస్తుంది.

1. మందార పూలను ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2. ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు.

3. విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు.

4. మందారపువ్వును హెర్బల్ టీ, కాక్టేల్ రూపాలలోను సేవించవచ్చు. పూలను ఎండబెట్టి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలంటే… నీటిని ఉడకబెట్టిన తర్వాత ఎండిన మందార పువ్వులను అందులో వేయండి. అందులో చక్కెర, కాస్త టీపొడి కలుపుకుని టీలాగా తయారు చేసుకోండి. దీంతో హైబిస్కస్ హెర్బల్ టీ తయారవుతుంది. ప్రతి రోజు దీనిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు.

5. అలాగే కాక్టేల్ టీ కొరకు దీనిని చల్లగా చేసి అందులో కొన్ని ఐసు ముక్కలు వేసుకుని తాగితే అదే కాక్టేల్ టీ. ఇలా ప్రతి రోజు తీసుకుటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Friday, April 26

ఆరోగ్యానికి సబ్జాలు...

   సబ్జా గింజలు చూసేందుకు పరిమాణంలో చిన్నగా ఉన్నా అవి చేసే మేలు అంతా ఇంతాకాదు... ప్రతి రోజూ కొన్ని గింజల ను ఏదో ఒక రూపంలో ఆహారంలో తీసుకుంటే ఎంతో ఆరోగ్యం. పలు అనారోగ్య సమస్యలూ దూర మవుతాయి...
  1. సబ్జా గింజలను నీటిలో నానబెట్టాలి. అవి పది నిమిషాలకు జెల్‌లా మారిపోతాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్‌ సలాడ్స్‌, పండ్ల రసాలు, మజ్జిగ వంటి వాటితో కలిపి తినవచ్చు.
  2. అధిక బరువుతో బాధ పడేవారికి సబ్జా గింజలు చక్కని ఔషధం. ఎందుకంటే వీటిని స్వల్ప పరిమాణంలో తిన్నా చాలు ..త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతోపాటు ఎక్కువ సమయం ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
  3. సబ్జా గింజలను పైన చెప్పిన విధంగా నీటిలో వేసుకుని తింటే జీర్ణ సంబంధ సమస్యలు కూడా పోతాయి. ప్రధానంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. డైటరీ ఫైబర్‌ అధికంగా ఉండడంతో మలబద్దకం బాధించదు. గ్యాస్‌, అసిడిటీ సమస్యలు కూడా పోతాయి.
  4. సబ్జాగింజలు గాయాలు మానడానికి కూడా సహాయపడతాయి. కొద్దిగా సబ్జా గింజలను తీసుకుని పొడి చేయాలి. దాన్ని గాయాలపై వేసి కట్టు కడితే అవి త్వరగా మానుతాయి. అంతేకాదు, ఇన్‌ఫెక్షన్లను కూడా దరి చేరనివ్వవు.
  5. సబ్జా గింజలను నీటిలో కలిపి తింటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న వారు కూడా ఇలా చేయవచ్చు. దీంతో సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  6. రక్తాన్ని శుధ్ది చేసే గుణాలు సబ్జా గింజల్లో ఉన్నాయి. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది. బీపీ కూడా అదుపులోకి వస్తుంది.
  7. సబ్జా గింజలు శ్వాస సంబంధిత సమస్యలను దరిచేరనియ్యవు. గోరు వెచ్చని నీటితో కొంత తేనె, అల్లం రసం కలిపి దాంతోపాటు కొన్ని సబ్జాగింజలను కూడా అందులో వేసి ఆ మిశ్రమం తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి.
  8. ఉదయాన్నే సబ్జా గింజలను నీటిలో వేసుకుని తాగితే తద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. కీళ్ల నొప్పుల సమస్యతో బాధ పడుతున్న వారు సబ్జా గింజలను తింటే ఫలితం ఉంటుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
  9. యాంటీ బయోటిక్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు సబ్జా గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలర్జీలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి.
  10. సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే డిప్రెషన్‌ వెంటనే దూరమవుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి.

ఇలాయిచి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం...

   సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. వీటిని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం... 
 
1. భోజనం చేసిన తరువాత యాలకులు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు యాలకులను పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలిపి సేవిస్తే అసిడిటీ బారి నుండి ఉపశమనం లభిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.

2. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి.
3. ఆస్తమా వ్యాధితో బాధపడేవారు యాలకుల పొడిని పాలలో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
4.  హైబీపీతో బాధపడేవారు ప్రతిరోజూ అన్నంలో యాలకుల పొడి కలిసి తింటే సమస్య అదుపులో ఉంటుంది.
5. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. మధుమేహ వ్యాధి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

6. కమ్మని సువాసన, రుచిని అందించే యాలకుల గింజలను పొడిచేసి ఈ పొడితో పళ్ళు తోముకుంటే చిగుళ్ళ సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. ముఖ్యంగా పళ్ల నుండి రక్తం రాదు.

7. తలనొప్పితో బాధపడేవారు యాలకుల పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలుపుకుని నుదిటిపై రాసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

8. కంటి చూపును మెరుగపరచుటకు యాలకులు చాలా మంచివి.

తంగేడు చెట్టు ఉపయోగాలు...

* ఈ చెట్టు యొక్క వేరు కషాయం కాచుకొని తాగిన నీళ్ల విరేచనాలు తగ్గును. లేదా 4 గ్రాముల తంగేడు బెరడు నమిలి రసం మింగినా కూడా విరేచనంలో చీము వంటి పదార్థం పొవడం తగ్గుతుంది .

* 5ml తంగేడు చెట్టు యొక్క బెరడు రసాన్ని రోజుకి ఒకసారి చొప్పున 3 రోజులపాటు తాగితే టాన్సిల్స్ సమస్య తొలగిపోవును .

* తంగేడు చెట్టు లేత ఆకు నమిలి మింగితే దగ్గు తగ్గును.

* తంగేడు చిగుళ్లు దంచి కడితే తేలు విషం విరిగి మంట తగ్గును.

* తంగేడు లేత ఆకుతో పాటు రెండు వెల్లుల్లి రెక్కలు , రెండు మిరియాలు కలిపి మెత్తగా నూరి ముద్దచేసి ఒకే రోజున మూడు మోతాదులు పెరుగు అనుపానంతో కలిపి ఇస్తే చీముతో కూడిన విరేచనాలు తగ్గుతాయి .

* తంగేడు ఆకుని నీడలో ఎండించి ఆ చూర్ణాన్ని గొరువెచ్చటి నీటితో రోజు తీసుకోవడం వలన మలబద్దకం తగ్గును.

* రేచీకటి తో భాదపడుతున్న వారు కోడి లేక మేక చేదుకట్టు , లివరు , మసాలా దినుసులు కలిపి మెత్తగా నూరి కోడికూర కాని మేకకూర కాని వొండుకొని తింటూ ఉంటే రేచీకటి బాధ నుంచి విముక్తం అవ్వుదురు .

* తంగేడు చిగుళ్లు మెత్తగా నూరి పెరుగులో కలుపుకుని పరగడుపున తాగితే నీళ్ల విరేచనాలు నశించును.

* తంగేడు చిగుళ్లు మజ్జిగలో నూరి పాదాల మడమలు కు రాస్తే కాలిపగుళ్ళు తగ్గుతాయి.

* తంగేడు చిగుళ్లు నేతితో వెచ్చచేసి కన్నులకు కట్టిన కంటి ఎరుపులు , పోట్లు నివారించును.

* మూత్రం బంధించి ఉన్నప్పుడు తంగేడు పువ్వులతో కషాయం పెట్టి దానియందు పంచదార చేర్చి ఇచ్చినచో మూత్రం వెంటనే బయటకి వెడలును.

* తంగేడు విత్తనాల చూర్ణం 3 గ్రాములు తీసుకుని దానియందు తేనే కలిపి పుచ్చుకొనిన అతిమూత్రం కట్టను.

* తంగేడు పువ్వులను నీడ యందు ఎండించి చూర్ణం చేసి సమంగా పంచదార కలిపి పూటకు 2 నుంచి 3 గ్రాముల చొప్పున తీసుకున్న యెడల అతిమూత్ర వ్యాధి నివారణ అగును. 40 దినములు పాటించవలెను .

* తంగేడు లేత చిగుళ్లు మాడుమీద వేసి గట్టిగా తలకు బట్ట కట్టిన యెడల తలపోటు , తలనొప్పి నయం అగును. మరియు నేత్రరోగాలు నివారించబడును .

Wednesday, April 24

లవంగాలు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం...

           వంటకాల తయారీలో రుచికి, సువాసనకు ఉపయోగపడే సుగంధ ద్రవ్యంగానే కాక దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకములైన అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం చూపే ఔషధం లవంగాలు. ఇది మన శారీరక, మానసిక దోషాలను సమన్వయపరచి సమస్థితిలో ఉంచే లక్షణం లవంగంలో ఉంది. లవంగాన్ని వేయించి ఔషధంలా వాడుకోవాలి. లవంగం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం...

1. లవంగాల చూర్ణం, మిరియాల చూర్ణాలను పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం, రాత్రి పూట 4,5 చిటికెల పొడిని పావు టీ స్పూను నెయ్యి, అర టీస్పూను తేనె కలిపి సేవిస్తుంటే శ్లేష్మం తెగి పడిపోతుంది. గొంతులో గురగుర తగ్గిపోతుంది. అంతేకాకుండా దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి.

2. లవంగాల చూర్ణంలో తగినంత నీరు చేర్చి మెత్తగా నూరి ముక్కుపై లేపనంగా పూస్తే ముక్కుదిబ్బడ సమస్య తగ్గుతుంది.

3. లవంగాల పొడి, జాజికాయల పొడి, జీలకర్ర పొడి, పంచదారలను ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం పూటకు ఒక గ్రాము పొడిని తగినంత తేనె కలిపి సేవించడం వల్ల రక్తవిరేచనాలు, జిగురు, బంక, కడుపునొప్పితో కూడిన విరేచనాలు, విరేచనాలు కొద్దికొద్దిగా ఎక్కువసార్లు కావడం వంటి సమస్యలు తగ్గిపోతాయి.

4. లవంగాల చూర్ణానికి సమానంగా నల్ల జీలకర్ర చూర్ణాన్ని కలిపి ఉంచుకుని ప్రతిరోజు ఒకసారి తగినంత పొడిలో నీరు కలిపి పేస్టులా చేసి ముఖానికి పలుచగా పట్టించి అరగంట ఆగి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమల సమస్య పోతుంది.

5. ఐదు మి.లీ నువ్వుల నూనెలో ఒక లవంగాన్ని నలగగొట్టి వేసి ఆ నూనెను వేడి చేసి చల్లారాక రెండు మూడు చుక్కల నూనెను చెవిలో వేసుకోవడం వలన చెవిపోటు తగ్గుతుంది.

తలనొప్పి తగ్గడానికి...

1. జాజికాయ గంధము కనతలకు పెట్టిన తగ్గును
2. మునగాకు రసం మిరియాల పొడి కణతలకు రాస్తే తలనొప్పి తగ్గుతుంది.
3. యూకలిప్టస్ ఆయిల్ కణతలకు రాసిన తలనొప్పి శిరోభారం తగ్గును.
4. మునగ జిగురును పాలతో కలిపి కణతలకు పట్టించిన తలనొప్పి త్వరగా తగ్గను.
5. ఆముదం ఆకులు కచ్చాపచ్చాగా దంచి తల మీద కట్టు కట్టుకున్నచో వేడి వలన వచ్చిన తలనొప్పి వెంటనే తగ్గుతుంది.
6. బచ్చలాకు మెత్తగా నూరి నుదుట , రసం రాయాలి.

Saturday, April 20

సీతాఫలం చెట్టు ఉపయోగాలు...

* మంచిగా పండిన సీతాఫలం తీసుకోవడం వలన రక్తం వృద్ది చెందును .

* శరీరం నందు మాంస శాతాన్ని పెంచును. బక్కపలచగా ఉండువారు ఈ పండు తీసుకోవడం వలన మంచి కండ పొందగలరు.

* శరీరం నందు వేడిని హరించును .

* సీతాఫలం చెట్టు యెక్క ఆకు రసం 3 నుంచి 4 చుక్కలు దంత రంధ్రములో వేసిన క్రిములు ఊడిపడును.

* ఈ చెట్టు ఆకురసం పుండ్లపై పూసి పిమ్మట ఆ ఆకును ముద్దగా నూరి పుండ్లపైన వేసి కట్టు కట్టిన పుండ్లు మానును .

* ఈ పసరు పుండ్లపై పూయుట వలన పురుగులు పట్టిన పుండ్లు లలో పురుగులు చచ్చిపోయి పుండ్లు శీఘ్రంగా మానును .

ఈ యోగాన్ని పశువుల పుండ్లుపై నేను ప్రయొగించాను . చాలా మంచిఫలితాలు వచ్చాయి . రసాన్ని పుండుపై పిండి ఆకువేసి కట్టాను .

* దీని గింజలు రుబ్బి తలకు పట్టించిన పేలు పోవును .

* శీతాఫలం చెట్టు యొక్క లేత ఆకుల కషాయం ఇచ్చునచో చిన్న పిల్లల లో పేగు మలద్వారం నుంచి బయటకి వచ్చు సమస్య తీరిపోవును .

* శీతాఫలం చెట్టు కాండం పైన ఉన్న చెక్క కషాయం ఇచ్చినచో జ్వరం , ఉబ్బసం ద్వారా వచ్చే దగ్గు మానును

* శీతాఫలం తీసుకోవడం వలన గుండెకు అద్బుత బలం చేకూర్చును .

* శీతాఫలం యొక్క పండు గుజ్జు గడ్డలపైన వేసి కట్టినచో గడ్డలు పగులును .

* దీనిఆకు పసరు గజ్జి , తామర నయం చేయును .

* దీని విత్తనాల పొడిని పేపర్లో కొంచం కట్టి బట్టల మధ్యలో పెడితే బట్టలకు పురుగుల సమస్య ఉండదు.

శీతాఫలం ఎక్కువ తీసుకోవడం వలన కలుగు దోషాలు -

* శరీరంలో శ్లేష్మము పెంచును.

* కొద్దిగా పైత్యం చేయును .

* జీర్ణక్రియ సరిగ్గా లేనివారికి జ్వరం తెచ్చును

* అతిమూత్ర వ్యాధి కలిగినవారు దీనిని వాడరాదు.

* గర్భిణి స్త్రీలు దీనిని అసలు తినరాదు. దీనికి గర్భస్రావం కలిగించే గుణము కలదు .

ఏ సిరిధాన్యం ఏ వ్యాధులను తగ్గిస్తుంది...

1. కొర్రలు (Foxtail Millet):- నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ధయిటిస్, పార్కిన్సన్, ముస్క్యూలెర్ డిస్ట్రోఫీ, మూర్ఛరోగాల నుండి విముక్తి.

2. అరికలు (Kodo Millet):- రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయబిటిస్, | మలబద్ధకం, మంచినిద్ర.

3. ఊదలు (Barnyard Millet):- లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్), కొలెస్టరాల్ తగ్గించడం, కామెర్లు.

4. సామలు (Little Millet):- అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, సంతానలేమి సమస్యల నివారణ.

5. అండు కొర్రలు (Browntop Millet):- జీర్ణాశయం, ఆర్థయిటిస్, బి.పి. థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.

సిరిధాన్యాల వాడుటకు ముఖ్య సూచనలు:-

ఒక్క అండు కొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి.
మిగతా సీరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు.


సమయాభావం ఉంటే ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు.

ఈ సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు.

దేనికి అది విడివిడిగా వండుకోవాలి. కలగలిపితే ఏ రకమైన ప్రయోజనం కలుగదు.

ఏ ఆరోగ్య సమస్యలు లేనివారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్నే వాడాలి. తరువాత రెండు రోజులు వేరొక సిరిధాన్యాన్ని వాడాలి.

అలాగ ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున వాడుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో మొదలు పెట్టాలి.


వీటితోపాటు కషాయాలు కూడా తీసుకుంటే ఇంకా మంచిది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి సమస్యనుబట్టి ఈ సిరిధాన్యాలలో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావొచ్చును. ఉదాహరణకు, ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పైన వివరించిన పట్టికలో సూచించిన విధంగా వారికి అవసరమైన సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వాడుకుని తిరిగి ముందు ఎంపిక చేసుకున్న ధాన్యాలను మరల మూడు రోజుల చొప్పున వాడుకోవాలి.

ఉదాహరణకు, సుగర్, కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటే వారు అరికలు 3 రోజులు, ఊదలు 3 రోజులు తింటూ మిగతా 3 రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి. ఆ సమస్యతో పాటు ప్రాస్యేటు సమస్య కూడా ఉంటే సామలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్కరోజు తినాలి.
పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చును. సముద్రపు ఉప్పు గానుగ నూనె వాడుకోవాలి..

వీటితో పాటు కొన్ని రకాల ఆకు కషాయాలు తీసుకుంటే ఇంకా మంచిది.

మహిళల సమస్యలకు గోంగూర ఆకుల కషాయం బాగా పనిచేస్తుంది.

రోగ నిరోధకశక్తి పెంపొందించకోవడానికి గరికే కషాయం పనిచేస్తుంది. కొత్తిమీర, పుదీనా, నిమ్మగడ్డి ఆకుల కషాయాలు ఎవరైనా వాడవచ్చును.

ఏ కషాయమైనా ఒకవారం మాత్రమే వాడాలి. ఒకదాని తరువాత ఒకటి వాడుకోవాలి. సుగర్ ఉన్న వారికి దొండ ఆకుల కషాయం, దాల్చిన చెక్క కషాయం మంచివి. ఇవి పరగడుపున తీసుకోవాలి.

కషాయం తయారు చేసే విధానం:-

రాగి పాత్రలో ఉంచిన 150-200 మి.లి. నీరు తీసుకుని, (రాగి పాత్రలలో వేడివంట చెయ్యకూడదు) వేరే గిన్నెలో నీరు మరిగించి, దానిలో మనకు అవసరమైన 5-6 ఆకులు వేసి నాలుగు నిమిషాలపాటు ఉంచి, స్టవ్ కట్టేసిన తరువాత 2 నిమిషాలు మూతపెట్టి, ఆ తరువాత వడగట్టి, ఆ నీటిని త్రాగాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చెయ్యాలి. ఉదయం పరగడుపున ఒకసారి, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఒక గంట ముందు తీసుకోవాలి.

రక్తహీనతకు 3 రోజులు అరికెలు. 3 రోజులు సామలు రోజుకి 3 పూటలు తినాలి. తరువాత 3 రోజులు ఒక్కొక్క సిరిధాన్యాం 3 పూటలు తినాలి.

దీనితోపాటు పరగడుపున క్యారెట్, ఉసిరి, జామ లేదా బీట్రూట్, రసం తీసుకోవాలి, సాయంత్రం 20 కరివేప ఆకులు, 1 గ్లాసు పల్చటి మజ్జిగతో మిక్సీలో వేసి తిప్పి, 15-20 నిమిషాల తరువాత, భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే ఒక నెలలో రక్తహీనత నివారింపబడుతుంది.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు 3 రోజులు సామ బియ్యం, ఒక రోజు అరికెలు, ఒక రోజు ఊదలు, ఒక రోజు కొర్రలు, ఒకరోజు అండు కొర్రలు వండుకుని మూడుపూటలు అదే తినాలి. తిరిగి 3 రోజులు సామలు, తరువాత నాలుగు రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తినాలి. దీనికి తోడు మెంతి ఆకుల కషాయం ఒక వారం, పుదీన ఆకుల కషాయం ఒక వారం, తమలపాకుల కషాయం ఒక వారం రోజుకి 2-3 సార్లు తీసుకోవాలి.
గానుగలో స్వయంగా తీయించుకున్న కొబ్బరినూనె రోజూ ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తీసుకుటే 20 వారాలలో అన్నిరకాల మందులు మానివేయవచ్చును. రోజూ కనీసం అరగంట వాకింగ్ చెయ్యాలి.

Friday, April 19

వేసవి కాలం జాగ్రత్తలు...

     వేసవి తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం.
       రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు...


వేసవి చిట్కాలు:-

1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.

2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.

4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.

5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.

6) కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.

7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.

8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.

9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.

10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.

11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.

12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.

13. తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.

14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.

15. వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి

16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS packets పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.

17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.

18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.

19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

20. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకుని వెళ్ళండి

దాల్చిన చెక్క కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం...

   కొద్దిగా వగరుగా, తియ్యతియ్యగా, ఘాటుగా వుండే దాల్చిన చెక్క కొద్దిగా వేడిచేసిచేయవచ్చును గానీ, కడుపులో వాతాన్ని అమాంతం తగ్గిస్తుంది!
అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని కల్గించడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని అన్నంలో ఆహారపదార్ధంగానే కాక, మెత్తగా దంచిన పొడినిగాని, నీళ్ళతోనూతీసిన రసంగానీ విడిగా తీసుకొంటే మనకు కావలసిన ఫలితాలన్నీ దక్కుతాయి.

దాల్చిన చెక్కు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుందో గమనించండి!

గొంతులో కఫాన్ని కరిగిస్తుంది. దగ్గు జలుబు ఆయాసం, ఎలెర్జీ వ్యాధులన్నిలోనూ మేలు చేస్తుంది.

వాత వ్యాధులన్నింటిలో దాల్చిన చెక్క రసంగాని, దాల్చిన చెక్క పొడినితీసుకొంటే వాతం తగ్గుతుంది. అందువలన నొప్పి తీవ్రత కంట్రోల్లోకి వస్తుoది.

పైత్యం చేసిన అన్ని సందర్భాల్లోనూ దాల్చిన చెక్క మంచిది. కడుపులో మo ట, గుండెలో మంట, కడుపులో నొప్పి, గ్యాస్ ట్రబుల్ వున్నప్పుడు దాల్చిన
చెక్క మేలు చేస్తుంది!

జిగట విరేచనాలు, నీళ్ళ విరేచనాలు, రక్తంతో కూడిన విరేచనాలు,అజీర్తివిరేచనాలు కట్టుకోవడానికి దాల్చిన చెక్క చక్కగా తోడ్పడుతుంది. వాంతులు కూడా తగ్గుతాయి.
కల్తీ కలిసిన వస్తువులు తిన్నార అనుమానం ఉన్నప్పుడు సరిపడిని వస్తువులు తిన్నప్పుడు దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది ఎలర్జీ తీవ్రతను కలిగించదు.
దాల్చిన చెక్క పొడినిగానీ, దాల్చిన చెక్క రసాన్నిగానీ తీసుకోండి

మైగ్రేన్ తలనొప్పిలో దాల్చిన చెక్కని రోజూ తినండి. తలనొప్పి తీవ్రత తగ్గుతుంది

గుండె జబ్బులున్నవారు దాల్చిన చెక్కని తీసుకుంటే గుండె బలంగా ఉంటుంది

లివర్ వ్యాధులు అన్నింటిలోనూ దాల్చిన చెక్క మంచిది. కామెర్లలో కూడా తీసు కోవచ్చు. లివరీని బలసంపన్నం చేస్తుంది.

కళ్ళకు కాంతినిస్తుంది. కంటి రోగాలతో బాధపడేవారు దాల్చిన చెక్కతీసుకోండివ్యాధులు త్వరగా తగ్గుతాయి.
శరీరానికి నీరు పట్టినప్పుడు దాల్చిన చెక్కని రోజూ తింటే నీరు తగ్గుతుంది.

స్త్రీ గర్భాశయ వ్యాధులన్నింటిలో దాల్చిన చెక్కకి మంచి ప్రభావం వుంది!
నెలసరి వచ్చే నొప్పి తగ్గుతుంది.
ఋతురక్తం సక్రమంగా అయ్యేలా చేస్తుంది!ఋతు దోషాల్ని పోగొడ్తుంది.తేలికగా ప్రసవం అయ్యేలా చేస్తుంది.
గర్భాశయ దోషాల్ని పోగొడుతుంది.

గొంతును శుభ్రం చేస్తుంది. గురగురని పోగొట్టి గొంతును శ్రావ్యంగా చేస్తుంది.దాల్చిన చెక్కని బుగ్గని పెట్టుకొని చప్పరిస్తూ వుంటే స్వరపేటికలో వాపు తగ్గతుంది.
తేనె కలిపి రోజూ తింటే 15 రోజుల్లో వీర్యవృద్ధిని కల్గిస్తుందని వైద్యశాస్త్రంలో ఉంది

అశ్వగంధ గురించి- ఔషధ ఉపయోగాలు...

అశ్వగంధ ని తెలుగులో "పెన్నేరు దుంప" అని పిలుస్తారు . దీనికి బల్య , వాజీకరి , కామరూపిణి అని రకరకాల పేర్లు కలవు.

     పెన్నేరు క్షుప జాతి చెట్టు. భూమి నుంచి 4 అడుగుల ఎత్తువరకు పెరుగును . విశేషముగా కొమ్మలు కలిగి ఉండును. ఆకులు గుండ్రముగా ఉండును. ఆకులకు కొనలు కలిగి ఉమ్మెత్త ఆకుల వలే మందముగా ఉండును. తెల్లని పువ్వులు పూయును . కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా , పండిన తరువాత ఎర్రగా ఉండును. కాయ యందు చాలా బీజాలు ఉండును. దీనికి భూమిలో చిన్న ముల్లంగి దుంప వంటి దుంప పొడవుగా , మృదువుగా ఉండును. ఈ దుంపలను ఎండించి ఆవుపాలలో శుద్ది చేసి ఔషధాలలో ఉపయోగిస్తారు .

    nపెన్నేరు దుంప కారముగా , వేడిగా , చేదుగా , బలాకరంగా ఉండును. ఈ అశ్వగంధకు ఇండియన్ జెన్సాంగ్ అనే పేరు కలదు. అనగా భారత దేశపు యొక్క సర్వరోగ నివారిణి అని పిలుస్తారు . తెలుగులో కూడా ఒక సామెత కలదు. " పేరులేని రోగానికి పెన్నేరే మందు " అని ఒక నానుడి.

ఔషధ ఉపయోగాలు -

* అశ్వగంధ యొక్క పచ్చి ఆకు రసం పూయుట వలన వ్రణాలు తగ్గును. గొంతు చుట్టు మాల వలే వ్రణాలు ఏర్పడే గండమాల అనే రోగం తగ్గును.

* రక్తమును శుద్ది చేయడం లో ఇది చాలా అద్బుతంగా పనిచేయును . కుష్టు , బొల్లి వంటి చర్మ సమస్యలతో ఇబ్బంది పడువారు చికిత్సా ఔషధాలతో పాటు దీనిని కూడా వాడుచున్న చర్మ సమస్యలు త్వరగా నివారణ అగును.

* శరీరములో వాతాన్ని పోగొట్టడంలో దీనికిదే సాటి.

* అశ్వగంధ వాడుచున్న త్వరగా ముసలితనం రానివ్వదు.శరీరం యొక్క కాంతిని పెంచును.

* అనేక రకాల వ్యాధుల వలన శరీరం బలహీనంగా అయ్యినవారు ఈ అశ్వగంధని వాడటం వలన మంచి శరీరపుష్టి వచ్చును. శరీరం నందు బలహీనత పోయి బలవంతులుగా తయారగును.

* మోకాళ్ల నొప్పులు , సయాటికా నొప్పులు , మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన సమస్యల నుంచి త్వరగా విముక్తి పొందుతారు.

* శరీరము నందు కఫం పెరిగి ఇబ్బంది పడే వారు అశ్వగంధని వాడటం వలన కఫ సంబంధ సమస్యల నుంచి విముక్తి చెందుతారు.

* పిండోత్పత్తి చేయు అవయవాలకు బలాన్ని ఇచ్చును. స్త్రీల గర్భాశయ దోషాలను నివారించి గర్భం ధరించే అవకాశాలను పెంచును.

* అశ్వగంధని నిత్యం వాడుట వలన శరీరం నందలి టాక్సిన్స్ మరియు వ్యర్ధ పదార్దాలను బయటకి వెళ్లునట్లు చేసి శరీరమును శుద్ది చేయును .

* అశ్వగంధ యొక్క పచ్చి దుంపను నూరి కట్టినను లేదా ఎండు దుంపను నీటితో నూరి కట్టినను మానని మొండి వ్రణాలు మానును .

* అశ్వగంధ ఆకులకు ఆముదం పూసి వెచ్చచేసి కట్టిన రాచపుండ్లు , గడ్డలు కరిగిపోవును.

* అశ్వగంధ ఆకుల యొక్క పలచటి కషాయం లొపలికి ఇచ్చుచున్న జ్వరాన్ని హరించును .

* మూత్రం బిగించి పొట్ట ఉబ్బి ఉన్న సమయంలో అశ్వగంధ పండ్లు తినిపించిన మూత్రం ధారాళంగా బయటకి వెడలును .

* నిద్రపట్టక బాధపడువారు అశ్వగంధ చూర్ణమును , ఆవునెయ్యి, పటికబెల్లం చూర్ణం మూడు సమాన బాగాలుగా తీసుకుని లేహ్యములా కలుపుకుని తినుచున్న సుఖవంతమైన నిద్రని తెచ్చును.

* బలం లేక ఎండిపోతున్న పిల్లలకు శుద్ది చేసిన పెన్నేరు చూర్ణం పాలలో కలిపి ఇవ్వవలెను. సంవత్సరం దాటిన పిల్లలు అయితే తేనెతో లేదా దేశివాళి ఆవునెయ్యితో ఇచ్చుచుండిన కృశించిన పిల్లలు బలిష్ఠులుగా తయారగును.

* పక్షవాతంతో బాధపడువారు ఈ అశ్వగంధ చూర్ణమును ఉదయం మరియు సాయంత్రం రెండుపూటలా తీసుకొనుచున్న నరాలకు సత్తువ చేయును .

* అతిరక్తం , తెల్లబట్ట వంటి సమస్యలతో బాధపడు స్త్రీలు ఈ అశ్వగంధ చూర్ణంను వాడుట వలన శారీక బలహీనతలు పోయి సమస్య నుంచి బయటపడుదురు.

ఈ అశ్వగంధ మరెన్నో రోగాలకు అద్భుతమైన ఔషధంగా పనిచేయును . థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ ఔషధం వాడుట వలన మంచి ఫలితాలు వచ్చును.

ఇప్పటివరకు మీకు చెప్పిన ఫలితాలు అన్నియు శుద్ధిచేసిన అశ్వగంధ వాడినప్పుడే వస్తాయి. 11 సార్లు నాటు ఆవుపాలతో మాత్రమే శుద్ది చేయవలెను . బయట మార్కెట్లో దొరికే అశ్వగంధ చూర్ణం పొలాల్లో నుంచి తీసుకొచ్చి చూర్ణం చేసినటువంటిది. అలాంటి చూర్ణం కేవలం 40 % ఫలితాలు మాత్రమే ఇస్తుంది నూటికి నూరు శాతం ఫలితాల కోసం శుద్ది చేసిన అశ్వగంధ చూర్ణం మాత్రమే వాడవలెను. బయట దొరికే చూర్ణం లేత కాఫీ రంగులో ఉండును. శుద్ది చేసినది క్రీం రంగులో ఉండును.

శుద్ది చేసిన అశ్వగంధ చూర్ణం అనుభవ ఆయుర్వేద వైద్యుల ద్వారా చేయించుకొని మాత్రమే వాడవలెను. ఖరీదు కొంచం ఎక్కువుగానే ఉండును.

దగ్గు హరించుటకు...

* పిప్పిళ్ల చూర్ణం , తేనెతో కలిపి సేవించిన దగ్గు హరించబడును.

* తిప్పతీగ కషాయంలో పిప్పిళ్ల చూర్ణం కలిపి సేవించిన దగ్గు తగ్గును.

* అల్లం రసంలో తేనె కలిపి సేవించుచున్న దగ్గు తగ్గును.

* ఉదయం సమయమున అల్లం రసం బెల్లంతోను , రాత్రుల యందు త్రిఫలా చూర్ణం తేనెతోను కలిపి తీసుకొనుచున్న దగ్గులు తగ్గును.

* లవంగాలు కాల్చి పొడిచేసి సేవించిన దగ్గు తగ్గును.

* మిరియాల చూర్ణంను వేడి నేతితో సేవించుచున్న దగ్గు తగ్గును.

* అరటిపండులో మిరియాల పొడి వేసి తినుచున్న దగ్గు తగ్గును.

* నిప్పులపైన వాము వేసి ఆపొగ పీల్చుతున్న దగ్గు తగ్గును.

* ఎండుజిల్లేడు ఆకులను చుట్టగా చుట్టి దానికి నిప్పు అంటించి ఆ పొగ లొపలికి పీల్చిన దగ్గు తగ్గును.

* గంటకొకసారి వెల్లుల్లిపాయ రేకును తినుచున్న దగ్గు తగ్గును.

* మోదుగు బెరడు కషాయాన్ని పూటకు పావుకప్పు చొప్పున తాగుచున్న దగ్గు తగ్గును.

Thursday, April 18

గ్యాస్ ట్రబుల్ అడ్డుకోవడమెలా..?

  కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, గ్యాస్,బ్రేవ్ బ్రేవ్ మంటూ త్రేన్పులు. కూర్చున్నచోట కూర్చోలేని పరిస్థితి. చికాకు, కోపం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ లక్షణాలే. ఈ సమస్యను అధిగమించాలంటే ఇవి పాటించాలి.

1. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి.

2. ప్రతిరోజూ విధిగా వ్యాయామం చేయాలి.

3. పీచు పదార్థాలు ఎక్కువగా వున్న తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

4. టీ, కాఫీలు మానేయాలి.

5. మసాలాలు, వేపుళ్లు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ మానివేయాలి.

6. వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్లు సరిపడినంత తాగాలి.

7. నిల్వ వుంచిన పచ్చళ్లు తినడం మానేయాలి.


సమస్యను అడ్డుకునేందుకు ఏం చేయాలి?
***************************
**********************
* శొంఠి చూర్ణంతో పాత బెల్లం సమంగా కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తిని ఆ తర్వాత వేడి నీళ్లు తాగితే కడుపులో వున్న గ్యాస్ సమస్య పోతుంది.


* ధనియాలు, శొంఠి సమభాగాలు చూర్ణం చేసి కలిపి ఒక టీ స్పూన్ ప్రతిరోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటితో తీసుకుంటే కడుపులో చెడుగాలి పోయి సాఫీగా విరేచనం అవుతుంది.

* అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి ఒక టేబుల్ స్పూన్ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది

Wednesday, April 17

ఆరోగ్యానికి అమృతం మజ్జిగ

   మజ్జిగ ఆరోగ్యానికి అమృతంలాంటిది. మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానీయాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది. మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి.

  1. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు మజ్జిగలో ఒక చెంచా సొంఠి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  2. వాంతులయ్యేటప్పుడు మజ్జిగతోపాటు జాజికాయను గీసుకుని మజ్జిగలో కలుపుకుని సేవించండి.
  3.  వేసవికాలంలో ప్రతిరోజు రెండుసార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో వేయించిన జీలకర్ర కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
  4. కాళ్ళ పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  5. ఊబకాయంతో బాధపడేవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయం సమస్యనుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తుంది.
  6. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది.
  7. ప్రతి రోజు మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది.
  8. మజ్జిగ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్ అందుతుంది. వివిధ జబ్బులను రానీయకుండా మజ్జిగ శరీరాన్ని కాపాడుతుంటుంది.

మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజు మజ్జిగను తీసుకునేందుకు ప్రయత్నించండి.

Monday, April 1

300 వ్యాధులకు సింపుల్ మెడిసిన్ మునగాకు...

🍀మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. 
🌿అసలు 4, 5వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. 
🌿ఆయుర్వేదంలో 300లకు 
పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. అందుకే దీనిని సాంప్రదాయకైన మందుగానూ చెబుతుంటారు మన పెద్దలు.
🌳మునగాకులో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషద గుణాలు
🌿 మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ Aని పదిరెట్లు అధికంగా మునగాకు 
ద్వారా పొందొచ్చు. 
🌿కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు.
🌿 పాల నుంచి లభించే క్యాల్షియం 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.
🌿 పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.
🌿 అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.
🌿 మహిళలు రోజుకి 7గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.
🌿ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషదం మునగాకు. 🌿లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో 
తేలింది. యాంటీ ట్యూమర్ గానూ ఆకు వ్యవహరిస్తుంది.
🌿థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.
🌿మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుందట.
అద్భుతమైన ఔషద సంజీవని మన మునగాకు.
🌿మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. 
🌿వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
నీరు – 75.9 శాతం
పిండి పదార్థాలు – 13.4 గ్రాములు
ఫ్యాట్స్ – 17 గ్రాములు
మాంసకృత్తులు – 6.7 గ్రాములు
కాల్షియం – 440 మిల్లీ గ్రాములు
పాస్పరస్ – 70 మిల్లీ గ్రాములు
ఐరన్ – 7 మిల్లీ గ్రాములు
‘సి’ విటమిన్ – 200 మిల్లీ గ్రాములు
ఖనిజ లవణాలు – 2.3 శాతం
పీచు పదార్థం – 0.9 మిల్లీ గ్రాములు
ఎనర్జీ – 97 కేలరీలు
🌳ఔషధ విలువలు అద్భుతం
ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి. 
🌿మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి. 🌿మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి. 
🌿మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. 
🌿గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం. 
🌿మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.

🌳మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు…
🌿మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. 
🌿గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. 
🌿పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. 🌿గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. 
🌿మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. 
🌿మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. 
☘ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. 
🌿మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగునా?