Monday, December 25

యాలకుల లాభాలు ఇవే :


1.భోజనం చేసిన వెంటనే ఒకటి రెండు యాలకులను నములుతూ ఉంటె నోటి దుర్వాసన పోతుంది ,జీర్ణ సమస్యలు ఉండవు
2.ఆస్తమా ,దగ్గు ,జలుబును తగ్గించడంలో యాలకులు మెరుగ్గా పని చేస్తాయి.రోజు మూడు నాలుగు సార్లు యాలకులను తీసుకొని బాగా నమిలి చప్పరిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
3.యాలకులను రోజు తింటుంటే గుండె సమస్యలు పోతాయి
రక్త సరఫరా మెరుగుపడుతుంది
4.రక్త హీనత సమస్య ఉన్నవారు రోజు యాలకులను తినాలి దీంతో రక్తం పెరుగుతుంది
5.శరీరంలో ఉన్న విష ,వ్యర్ధ పదార్ధాలు భయటకు వెళ్ళిపోతాయి శరీరం అంతర్గతంగా శుబ్రమవుతుంది

Sunday, December 24

బాలింతలలో పాలు వృద్ధిచేయు దివ్య యోగాలు -

* అతిమధుర చూర్ణం పాలలో కలిపి తీసుకొనిన స్త్రీలకు పాలు వృద్ది అగును.
* అనుములు పప్పుగా చేసి ఉడకబెట్టి తినిన స్త్రీలకు పాలు పడును. చారుగా కూడా తయారుచేసి వాడుకోవచ్చు .
* ఆకుపత్రి చూర్ణం 2 గ్రాములు గొరువెచ్చటి నీటితో తీసుకొన్న బాలింతలలో పాలు ఉత్పత్తి అగును.
* ఆవుపాలు , వాము , వాము వాటర్ పాలుపడజేయును .
* కర్బుజా పండు తీసుకుంటూ ఉన్న యెడల పాలు వృద్ది అగును.
* గోధుమ పిండితో చేసిన పూరి పాలల్లో నానబెట్టి తినిపించుచున్న పాలు ఎక్కువగును .
* చేపలను నిప్పుల మీద కాల్చి వాటిని తినిన పాలు వృద్ది అగును.
* చిట్టాముదపు ఆకులకు ఆముదం పూసి వెచ్చచేసి స్త్రీ చన్నులపై వేసి జారకుండా బట్టతో కట్టి 12 గంటలపాటు ఉంచిన తప్పక పాలు వృద్ది అగును.
* పండిన బొప్పాయి తినినచో పాలు వృద్ది అగును.
* లేత మునగ ఆకు కూర ప్రసవానంతరం ఇవ్వడం వలన స్త్రీలలో పాలు వృద్ది అగును.
* ఆవుపాలలో బియ్యము వేసి వండి పటికబెల్లం కలుపుకుని తినుచున్నచో పాలు వృద్ది అగును.

పెరుగును ఈ పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్భుత ఫలితాలు పొందండి...

1. కొద్దిగా జీల‌క‌ర్ర ‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య ‌లు దూర‌మ‌వుతాయి. ప్ర ‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.
4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.
7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.
8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.
9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.
10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స ‌ర్ లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర ‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష ‌ న్లు వెంట‌నే త‌గ్గుతాయి.

Saturday, December 23

తులసీ ఆకుల రసాన్ని..?

ఆయుర్వేద చిట్కాలు:
* ఉసిరికాయను బాగా నమిలి తింటే పళ్లు, చిగుళ్లు దృఢమవుతాయి.
* అల్లాన్ని దంచి రసం తీసుకుని తేనె కలిపి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తపోటు దూరమవుతుంది.
* కిడ్నీలో రాళ్లుంటే బొప్పాయిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* తులసీ ఆకుల రసాన్ని రాత్రి ముఖానికి పట్టించి, తెల్లవారు జామున కడిగేస్తే మీ చర్మం కాంతివంతమవుతుంది.
* పుదీనా ఆకులను నీటిలో మరగనించి ఆ నీటిని తాగితే జలుబుతో వచ్చే జ్వరానికి చెక్ పెట్టవచ్చు.

* నీరసం తగ్గాలంటే అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే సరిపోతుంది.
* నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మామిడిని రోజూ తీసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చు.

* 200ml పాలులో ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tuesday, December 12

ఇ'లావు'oటే కష్టమే..!

ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న అనేక సమస్యల్లో స్థూలకాయం (ఓబెసిటీ) ఒకటి. అందుకే.. అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ దీన్ని ఒక వ్యాధిగా వర్గీకరించింది. అనేక రుగ్మతలకు ఇది ప్రధాన కారణమని తేల్చింది. గుండె జబ్బు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి స్థూలకాయం వల్లే సంభవిస్తాయని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అయితే.. మరేం చేయాలి? దీని నుంచి ఉపశమనం లేదా? కచ్చితంగా ఉంది.
పెరుగుతున్న సాంకేతికత, యంత్ర వినియోగం వల్ల చాలామంది కనీస వ్యాయామాలకు, శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ఒళ్లు వంచకుండా బద్ధకస్థులుగా తయారవుతున్నారు. కదలకుండా యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూర్చుండిపోతున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ కూర్చొవడమే కాకుండా ఇంటికి వచ్చాక కూడా అదేపనిగా టీవీ వీక్షణం, సోషల్‌ మీడియాలో చాటింగ్‌తో అధిక సమయం గడుపుతున్నారు. పైగా వీరు ఆ సమయంలో చిరుతిళ్లు కూడా తినేస్తుంటారు. భోజనం చేసి త్వరగా నిద్రపోవాలనుకోరు. ఆలస్యంగా నిద్రపోయి ఆసలస్యంగా లేస్తారు. ఆ తర్వాత ఉరుకులు పరుగులు షురూ. ఇక దైనందిన జీవితంలో శారీరక శ్రమకు చోటేది? అది లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి, ఉద్వేగాలు పెరుగుతున్నాయి. అనేక శారీరక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు.. స్థూలకాయానికి ఇవి ప్రధాన కారణమవుతున్నాయి.
చాలా మంది. ఆధునిక జీవనశైలికి అలవాటుపడి చెత్తాచెదారంతో కడుపు నింపుకుంటున్నారు. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, ప్యాకెజ్డ్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌, పిజ్జాలు, బర్గర్లు, అధికంగా తీపి ఉండే పదార్థాలు, నూనె వేపుళ్లు, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తిని అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. కొందరు యాంటీ డిప్రస్సంట్స్‌, హార్మోన్స్‌ టాబ్లెట్స్‌ వాడటం, హైపోథైరాడిజం వల్ల స్థూలకాయానికి గురవుతున్నారు. మరికొం దరికి వంశపారంపర్యంగా ఈ సమస్య సంక్రమిస్తోంది.
సమస్య.. నివారణ :- అధిక రక్తపోటు, మధుమేహమే కాకుండా శ్వాసకోశ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు, మహిళల్లో సంతాన లేమి, రుతు సమస్యలు, గుండెపోటు, పక్షవాతం, హోర్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, మోకాళ్ల నొప్పులు, మూత్రం ఆపుకోలేకపోవడం, ఫ్యాటీ లివర్‌, సిర్రోసిన్‌, డిప్రేషన్‌, ఆత్మ నూన్యత వంటి సమస్యలు స్థూలకాయం వల్ల వస్తాయి.
కొందరుపని ఒత్తిడి వల్ల, మరికొందరు నిర్లక్ష్యం, ఇంకొందరు సరైన అవగాహన లేకపోవడం వల్ల తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. తద్వారా వీరు దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే.. జీవనశైలిని మార్చుకుంటే ఇలాొంటి సమస్యలేమీ ఉండవు. బరువు తగ్గి, మంచి శరీరాకృతి కలిగి ఉండాలని దృఢ సంకల్పం ఉంటేనే అది సాధ్యమవుతుంది. దైనందిన చర్యల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మంచి ఆరోగ్యం, శరీరాకృతి, మానసిక ఉల్లాసం వస్తుంది. ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఆహారంలో మార్పులు, శారీరక శ్రమను పెంచడం, డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడటం లాంటివి ఇందుకు దోహదం చేస్తాయి. వీటిలో శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లలో మార్పు అనేవి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. ఆహారాన్ని నియంత్రించడం అన్నింటికన్నా ముఖ్యం. అలాగని ఉపవాసం పాటించడం, తిండి మానేయడం లాంటివి అస్సలు చేయొద్దు. ఆహారం తినేటప్పుడు పరిమాణాన్ని తగ్గించుకుంటే చాలు.
తినకూడనివి/తగ్గించుకోవాల్సినవి:- కొవ్వు ఎక్కు వున్న మాసం (రెడ్‌మీట్‌), ఫామ్‌ ఆయిల్‌, గుడ్డులోని పచ్చసొన, కాలేయం, కొవ్వు ఎక్కువున్న పాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, ప్యాకేజ్డ్ణ్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌, పిజ్జాలు, బర్గర్లు, పూరీ, అధిక మసాలాలు, నూనె వేపుళ్లు.
ఎక్కువగా తినాల్సినవి:- చేపలు, పౌల్ట్రీ చికెన్‌, వండిన బీన్స్‌, బ్రౌన్‌ రైస్‌, గోధుమలు, జొన్నలు, రాగులు, తాజా పండ్లు, తాజా కూరగాయలు, ఆకు కూరలు.
వ్యాయామం:- నడక చాలా సులువైన, చవకైన వ్యాయామ సాధనం. నడవాలనే ఆలోచన రాగానే వెంటనే అందుకు ఉపక్రమించాలి.
'రేపటి నుంచి' అని వాయిదా వేసుకుంటూ పోవద్దు. అలాగైతే ఎప్పటికీ వాకింగ్‌ చేయలేరు. కనీసం రోజూ 45 నిమిషాల నుంచి ఒక గంట నడవాలి. 2-3 రోజులు నడిచి ఆపేయొద్దు. కనీసం వారంలో ఐదు రోజులు వాకింగ్‌ చేయాలి. మొదటి ఐదు నిమిషాలు మెల్లగా నడుస్తూ శరీరాన్ని నడకకు సన్నద్ధం చేయాలి. తర్వాత 30-40 నిమిషాలు వేగంగా నడవాలి. రోజురోజుకూ నడక సమయాన్ని పెంచాలి. వేగంగా వల్ల ఆయాసం రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న దూరాలకు వాహనాలు వాడకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. మెట్లు ఎక్కి దిగడం, చిన్న చిన్న పనులు చేయడం, యంత్రాల సహాయం లేకుండా ఇంటి పనులు చేయడం తప్పనిసరి. శారీరక శ్రమ పెంచి, కాలరీలు కరిగించుకుంటే స్థూలకాయాన్ని క్రమేణా తగ్గించుకోవచ్చు.
మందులు:- బరువును తగ్గించే మందులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ.. సరైన వ్యాయామం, ఆహార నియంత్రణ లేకుండా అవి మంచి ఫలితాలు ఇవ్వవు. మందులు వాడటం, శస్త్రచికిత్స చేయించుకోవడం లాంటివి డాక్టర్‌ సలహా మేరకే పాటించాలి. సొంత వైద్యం ప్రమాదానికి దారి తీయొచ్చు.

Thursday, December 7

ఒక చెంచా వాములో !

పోపుల డబ్బాలో కాకుండా విడిగా ఓ చిన్నడబ్బాలో మాత్రమే కనిపించే వాములోని ఔషధగుణాలు అన్నీ ఇన్నీ కావు అంటున్నారు పరిశోధకులు. వీటిలో ఉండే అనేక రసాయనాలు జీర్ణక్రియకి ఎంతగానో సహాయపడతాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా కాపాడుతాయి...
  • వాములో అధికంగా ఉండే థైమల్‌ అనే రసాయనం బ్యాక్టీరియా, ఫంగల్‌ వ్యాధుల్ని నిరోధిస్తుంది. యాంటీ సెప్టిక్‌గానూ పని చేస్తుంది.
  • అలాగే ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. తలనొప్పి, జలుబు, అలసట, మైగ్రెయిన్‌ వంటి వాటికి వాము మందులా పని చేస్తుంది.
  • గర్భిణుల్లో ఆకలిని పెంచి గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వాము కడుపునొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా వాము కలిపి తాగితే అజీర్తి తగ్గి, ఆకలి పెరుగుతుంది. గ్యాస్‌ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
  • వాము నుంచి తీసిన నూనె కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుంది. ముక్కు బాగా బిగిసిపోయి ఉంటే వామును నూరి పలుచని బట్టలో కట్టి వాసన చూస్తే త్వరగా ఉపశమనం పొందుతారు. ఒక చెంచా వామును గ్లాసు నీళ్లల్లో మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు, జలుబు సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • వాము నీళ్లని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. వాముని తేనెతో కలిపి వరుసగా పది రోజులు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగే అవకాశం ఉందట. 

Sunday, December 3

ఆలుబుఖారాలో ఆరోగ్య రహస్యం...


ఈ పండులో పోషకాలు మెండు. ఇందులో కేలరీలు చాలా తక్కువ. సాధారణంగా పండ్లు తీసుకుంటే గ్లూకోజ్‌ లెవల్స్‌ పెరుగుతాయి. ఆలుబుఖారాలో ఇలాంటి దోషాలేవీ ఉండవు. 'గ్లాసిమిక్‌ ఇండెక్స్‌' చాలా తక్కువగా ఉండటమే దీనికి కారణం.
  1. ఈ పండులో విటమిన్‌-సీ మోతాదు ఎక్కువ. రోగ నిరోధకశక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఇది కాపాడుతుంది.
  2. ఇందులో విటమిన్‌-ఏ, బీటా కెరోటిన్‌ కూడా ఎక్కువే. ఆరోగ్యంగా ఉండేందుకు ఇవెంతో తోడ్పడతాయి.
  3. మనం తీసుకునే ఆహారంలోని ఐరన్‌ని శరీరం గ్రహించేందుకు ఆలుబుఖారా దోహద పడుతుంది.
  4. ఇందులోని ప్రోసైయానిడిన్‌, నియో క్లోరోజెనిక్‌ యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ లాంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి.
  5.  ఈ పండులో ఫైబర్‌ స్థాయిలు ఎక్కువ. జీర్ణ శక్తిని మెరుగుపర్చేందుకు ఇది దోహదపడు తుంది.
  6. ఆలుబుఖారాలో పొటాషియం ఎక్కువ. గుండె జబ్బులు, రక్తపోటు రాకుండా ఇది కాపాడుతుంది.
  7. శరీర ఉష్ణోగ్రత సమతుల్యతకు ఆలుబుఖారా దోహదపడుతుంది.
  8. ఈ పండులో ఉండే విటమిన్‌ ఎముకల దృఢత్వా నికి, ఆల్జీమర్స్‌ని నివారించేందుకు తోడ్పడతాయి.
  9. కంటిచూపును మెరుగుపర్చే లక్షణం ఆలుబు ఖారాలో ఉంది.
  10. జ్వరం, మలబద్ధకం తగ్గేందుకు ఈ పండు బాగా పనిచేస్తుంది.
  11. మోనోపాజ్‌ దశ దాటిన మహిళల్లో సాధార ణంగా కనిపించే బోలు ఎముకల వ్యాధి (ఆస్ట్రియో పోరోసిస్‌)ని కూడా ఇది నివారిస్తాయి.

Thursday, November 30

నొప్పి నివారణ ఇలా...

ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. ప్రతిఒక్కరూ ఏదోక శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీటిలో నడుము , వెన్ను, కాళ్ల నొప్పులు ముఖ్యమైనవి. దైనందిన జీవితంలో ఇవొక రుగ్మతగా మారింది. దీన్ని నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని జాగ్రత్తలు అవసరం...
  1. అధిక బరువు అనేది అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం. నడుము, కాళ్ల నొప్పులు రావడానికి కూడా ఇదే ముఖ్య కారణం. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు వల్ల నడుము, కాళ్లపై అధిక బరువు పడుతుంది. దీంతో నొప్పి వస్తుంది. శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవు.
  2. గంటల కొద్దీ కూర్చొని పనిచేసే వారు శారీరక నొప్పులతో బాధపడు తుంటారు. ముఖ్యంగా వెన్ను నొప్పి వీరిని సతాయిస్తుంది. ఇలాంటి వారికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వెన్నుకు ఆసరాగా ఉండే కుర్చీల్లో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మోకాళ్లు తుంటికి కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోకుండా అరగంటకోసారైనా నా రెండు నిమిషాల పాటు లేచి నిలబడాలి. అటూ ఇటూ నాలుగు అడుగులు వేయాలి.
  3. కొంతమంది డ్యూటీలో భాగంగా ఎక్కువసేపు నిలబడాల్సిన వస్తుంది. ఇలాంటి సమయంలో సాధ్యమైనంత వరకు తలను నిటారుగా పెట్టి, పొట్టను లోపలికి లాక్కుని నిలబడేందుకు ప్రయత్నించాలి. కూరున్నప్పుడు గానీ, నిలబడినప్పుడు గానీ అసౌకర్యంగా అనిపించినా కండరాలు బిగుసుకు పోయినట్టు అనిపిస్తే భంగిమను మార్చుకోవాలి.
  4. బరువులు ఎత్తే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నడుము నొప్పి, మెడనొప్పి వస్తుంది.
  5. బరువైన వస్తువులను పైకి ఎత్తేటప్పుడు నడుమును ముందుకు వంచకూడదు. ఎత్తాల్సిన వస్తువును శరీరానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మోకాళ్లను వంచి, పొట్ట కండరాలను లోపలికి లాక్కుంటూ పైకి లేపాలి.బరువు చేతిలో ఉన్నప్పుడు శరీరాన్ని పక్కలకు తిప్పకూడదు. వస్తువులను లాగడం కన్నా తోయడం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.
  6. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నడుము, మెడ నొప్పులు వేధిస్తుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో శరీర పటుత్వం పెరుగుతుంది. కండరాలు బిగుసుకుపోవడం, వాపులు రావడం లాంటి సమస్యలు తగ్గుతాయి.

Monday, November 27

ఇంగువ... ప్రయోజనాలు ఎక్కువ

మన వంటకాల్లో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంది. సుగంధ ద్రవ్యాలు కలిపి వండిన వంటలతో పోలిస్తే ఇంగువ కలిపి వండిన వంట రుచికరంగా ఉంటుంది. వాసనలోనూ తేడా ఉంటుంది. దీనిని పప్పు, చారు, సాంబార్‌, పులిహౌర, శాకాహార వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. తాలింపు, పచ్చళ్లలో కూడా దీనిని వాడతారు. ఒకప్పుడు ఇంగువ లేని వంటకమే ఉండేది కాదు. ఇప్పుడు దీనిని చాలా మంది విస్మరిస్తున్నారు. అయితే.. ఇంగువ వంటకాల్లో మాత్రమే వాడుకునే పదార్థమనే విషయం అందరికీ తెలుసు. ఇందులో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉన్నాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అదెలాగో తెలుసుకుందాం...  
  1. పుచ్చుపళ్లతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు కాస్త ఇంగువను ఆ పంటిపై ఉంచితే అందులో ఉన్న క్రిములు మటుమాయమ వుతాయి.
  2. శరీరంలో ఎక్కడైనా ముల్లు గుచ్చుకుని అందులోనే ఉంటే ఆ ప్రాంతంలో ఇంగువ ద్రావకం పోయాలి. కాసేపటి తర్వాత అది దానంతట అదే బయటికి వచ్చేస్తుంది.
  3. ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, ఇతర చర్మ వ్యాధులతో బాధ పడుతున్నవారు కాసింత నీటిలో ఇంగువను కలిపి ఆ ద్రవాన్ని చర్మంపై పూస్తే ఉపశమనం కలుగుతుంది.
  4. ఊపిరితిత్తులు, ఉదర సంబంధమైన వ్యాధులకు ఇంగువ మంచి ఔషధం.
  5. మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ఇంగువ చూర్ణం తీసుకోవాలి.
  6. కడుపులో పురుగులు ఉంటే ఇంగువను నీళ్లలో కలిపి తీసుకోవాలి.
  7. రోజూ భోజనంలో ఇంగువ ఉండేలా చూసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
  8. ఇంగువ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
  9. నరాలను ఉత్తేజపరుస్తుంది.

Sunday, November 26

సిజేరియన్‌ డెలివరీ.. జాగ్రత్తలు..!

బిడ్డను కనడానికి సిజేరియన్‌ని ఎవరూ ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో ఇది తప్పనిసరి అవుతుంది. తల్లీబిడ్డల ప్రాణాలను దక్కించుకోవడానికి ఇదోక మార్గం. అయితే... నార్మల్‌ డెలివరీకంటే సిజేరియన్‌ తర్వాత తల్లి శరీరంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. త్వరగా కోలుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
  1.  సిజేరియన్‌లో శరీరంలోని ఫూ ్లయిడ్స్‌ని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. సిజేరియన్‌ చేయించుకున్న వాళ్లు త్వరగా కోలుకోవాలంటే మెల్లగా కదలడం (ఇతరుల సహాయంతో) మొదలు పెట్టాలి.
  2.  డాక్టర్‌ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. దీని వల్ల త్వరగా కోలుకోవచ్చు.
  3.  సర్జరీ జరిగిన శరీర భాగంలో తడి తగలకుండా జాగ్రత్త పడాలి.
  4.  సర్జరీ తర్వాత చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి. లేదా వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సింపుల్‌ డైట్‌ని కొన్ని రోజులు ఫాలో కావాలి.
  5.  మూత్ర విసర్జనకు ఏమాత్రం ఆలస్యం చేయొద్దు.
  6.  సిజేరియన్‌ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ బరువు ఎత్తకూడదు. కొన్ని వారాలపాటు ఇది పాటించాలి. లేదంటే.. సర్జరీ అయిన శరీర భాగంలో ఒత్తిడి పెరుగుతుంది.
  7.  నిద్రించే సమయంలో కుట్లు వేసి భాగంపై ఒత్తిడి పడొద్దు. ఇందుకు మరోవైపు తిరిగి పడుకోవాలి.
  8.  సర్జరీ తర్వాత బిగుతుగా ఉండే జీన్స్‌, లెగ్గింగ్స్‌ వేసుకోకూడదు. ఇవి పొట్టపై ఒత్తిడి పెంచుతాయి. అంతేకాదు.. ఇది చాలా ప్రమాదకరం.
  9.  సర్జరీ తర్వాత 40 రోజుల వరకు సెక్స్‌లో పాల్గొనకపోవడం మంచిది.

Friday, November 24

ఆరోగ్య ప్రదాయిని మునగ...

ఇది చాలా సులువుగా పెంచుకోగలిగే మొక్క. దీని ఆకులు, కాయలను కూరగా వాడతారు. వీటిలో రుచితో పాటు ఔషధ గుణాలు ఎక్కువ. మునగలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. దీని ఆకుల ఎదిగే పిల్లలకు టానిక్‌లా ఉపయోగ పడుతుంది...
  1. పాలలో మునగ రసం కలిపి తాగితే ఎముకలు ధృడమవుతాయి. గర్భిణులు దీన్ని తాగడం వల్ల కాల్షియం, ఐరన్‌, విటమిన్స్‌ లభిస్తాయి. సుఖ ప్రసవానికి ఇది తోడ్పడుతుంది.
  2. కాస్తంత నీటిలో మునిగాకులు వేసి ఉడికించాలి. ఉప్పు జోడించి తీసుకుంటే ఆస్తమా, క్షయ సమస్యలకు మంచి మందుగా పని చేస్తుంది .
  3. మునగలో యాంటీ బాక్టీరియా గుణాలు ఉంటాయి. దీని సూప్‌ దగ్గు, చర్మ సమస్యలను నివారిస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
  4. కలరా, కామెర్లు వచ్చినప్పుడు కొంచెం తేనెతో మునగాకుల రసాన్ని కలిపి కొబ్బరి నీరుతో రోజూ రెండుసార్లు తాగాలి.
  5. మధుమేహులు ఒక టీ స్పూన్‌ మునగ రసంలో 10 గ్రాముల లావు ఉప్పు కలిపి రోజుకోసారి తాగడం వల్ల అతి మూత్ర సమస్య తగ్గుతుంది.
  6. మునగాకు రసం, తేనె, కొబ్బరి నీరు కలిపి చిన్న కప్పు చొప్పున రోజూ రెండు, మూడుసార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి.
  7. కామెర్లు ఉన్నవారు చెంచా మునగాకు రసాన్ని రెండు చెంచాల కొబ్బరి నీటిలో కలిపి వారం రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.
  8.  మునగాకు రసంలో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి పరగడుపున తీసుకుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
  9. మూత్రంలో మంట , ఉష్ణతత్వం ఉన్నవారు మునగాకు, క్యారెట్‌, దోసకాయల రసాలను జత చేసి రోజుకు గ్లాసు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  10. అధిక బరువు, మధుమేహం ఉన్నవారు ఎండబెట్టిన మునగాకు పొడిని తేనెతో కలిపి రోజుకో చెంచా చొప్పున భోజనానికి ముందు తీసుకోవాలి.

Wednesday, November 15

బరువు తగ్గించే క్యాలరీలు...

శరీర బరువు అదుపులో ఉండాలంటే ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటించుకుంటూ వ్యాయామం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా అవసరం. అవి ఆరోగ్యానికే కాదు శరీర బరువును అదుపులో ఉంచుతాయి...
  1. క్యాప్సికం:- క్యాప్సికంలో విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అలాగే రుచిగా, కారంగా ఉంటాయి. 100 గ్రా|| క్యాప్సికం శరీరానికి అవసరమైన 20 శాతం క్యాలరీలను అందిస్తాయి.
  2. ఆపిల్‌:- ఆపిల్‌ పండు ముక్కలను రోజు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఖనిజ లవణాలు, విటమిన్లు, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 100 గ్రా||ఆపిల్‌ పండ్లు, 50 శాతం క్యాలరీలను అందిస్తుంది.
  3. పాలకూర:- పాలకూరలో పోషకాలు, విటమిన్లు, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తొలగించటానికి ఉపయోగపడతాయి. 100 గ్రా|| పాలకూర, 23 శాతం క్యాలరీలను అందిస్తుంది.
  4. క్యాబేజీ:- క్యాబేజీలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. 100 గ్రా|| క్యాబేజీ, 25 శాతం క్యాలరీలను అందిస్తుంది.
  5. బ్లూ బెర్రీ:- బ్లూ బెర్రీలో ఎక్కువ శాతం న్యూట్రీన్లు ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి. ఇవి అధిక రక్తపోటు ఉన్న వారు తింటే సరిపోతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. 100 గ్రా|| బ్లూ బెర్రీ, 57 శాతం క్యాలరీలను అందిస్తాయి.
  6. క్యారెట్స్‌:- క్యారెట్‌లో బీ-కెరోటిన్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌ను రోజు జ్యూసు చేసుకొని తాగితే ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది. వీటిలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ ముఖ్యంగా శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తాయి. 100 గ్రా|| క్యారెట్స్‌, 40 శాతం క్యాలరీలను అందిస్తాయి.
  7. డార్క్‌ చాక్లెట్‌:- డార్క్‌ చాక్లెట్‌ న్యూట్రినల్‌ గుణాలను కల్గి ఉంటుంది. దాంట్లో ఉండే ఫ్లేవినాయిడ్స్‌, పాలీఫినొల్స్‌, నూట్రీన్లు ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుతాయి. డార్క్‌ చాక్లెట్‌ ముఖ్యంగా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 100 గ్రా|| డార్క్‌ చాక్లెట్‌, 500 క్యాలరీలను అందిస్తుంది.

Friday, November 10

నిత్య వ్యాయామం తప్పనిసరి...

కంప్యూటర్ల ముందు గంటల గంటలు కూర్చోవడం.. కాసేపు విరామం దొరికినా స్మార్ట్‌ ఫోన్లను చూస్తూ కాలం గడపడం.. సమయం ఉన్నా కూడా వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే చోట ఫేస్‌ బుక్‌లు, వాట్సాప్‌లకు అలవాటు పడి కదలకుండా ఉండిపోవడం ద్వారా ఊబకాయం తప్పుదు. ప్రస్తుతం ప్రపంచ జనాలంతా ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్నారు. ఈ ఫాస్ట్‌ లైఫ్‌లో వ్యాయామం చేయడానికి తీరిక ఉండట్లేదు. ఒక వేళ ఉన్నా వ్యాయామం, శారీరక శ్రమతో కూడిన పనుల్ని చేసేందుకు చాలామంది ఇష్టపడట్లేదు.
ఆఫీసుకు వెళ్ళామా ఇంటికొచ్చామా.. ఏదో సినిమా చూశామా.. ఇంకా టైముంటే స్మార్ట్‌ ఫోన్లు చూస్తూ కూర్చుండిపోయామా అని చాలామంది కాలం గడుపుతున్నారు. అయితే వ్యాయామం లేకపోతే.. అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ లేని కారణంగా ఊబకాయం బారిన పడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.3 మిలియన్ల మంది చనిపోతున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
శారీరక శ్రమ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించే వారిలో ఒబెసిటీతో పాటు మతిమరుపు పూర్తిగా తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకుంటే మతిమరుపు దూరం కావడంతో పాటు చురుకుదనం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయని వారు సెలవిస్తున్నారు.

Thursday, November 9

విరామ సమయంలో...

ఎక్కువ ఒత్తిడికి గురైతే సహజంగానే శరీరం బరువు తగ్గుతుంది, నీరసంగా అనిపిస్తుంది. అదే విధంగా తదేకంగా కొన్ని గంటల పాటు కదలకుండా పని చేస్తే సహజంగానే ఎదో తెలియని బాధకు గురి కావటం, శరీరం అలసిపోవటం, కండ్లు మంట పుట్టటం, తల నొప్పి రావటం జరుగుతుంది. అలాంటి సమయంలో ఒక ఐదు నిమిషాలు పనిలో విరామం తీసుకుంటే మెదడు ప్రశాంతంగా ఉండటంతో పాటు తాజాదనంతో నిండిపోతుంది. పనిలో ఒత్తిడి తగ్గటానికి విరామ సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు...
  1. అలసటను దూరం చేయటంలో అద్భుతమైన ఔషధం సంగీతం. ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు ఇష్టమైన సంగీతం వినటం మంచిది. ఇలా చేయటం వల్ల మెదడులోని అలసట భావన దూరం అవుతుంది.
  2. ఒత్తిడిని తగ్గిం చటంలో గ్రీన్‌ టీ పాత్ర కీలకం. ఎందుకంటే గ్రీన్‌ టీ ఆకుల్లో ఎమినో ఆమ్లాలు అధికంగా ఉంటాయట. ఇవి ముఖ్యంగా ఆందోళనను తగ్గించి ప్రశాంతంతను కల్గిస్తాయి. అలాగే శరీరంలోకి డొపమైన్‌, సెరొటొనిన్‌ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి ఆనందాన్ని కలిగించటంతో పాటు డిటాఫ్సికేషన్‌కు తోడ్పడుతాయి.
  3. అలాగే పనిలో ఆందోళనను తగ్గించటంలో నిద్ర పాత్ర కీలకం. నిద్ర సరిగ్గా పోవటం వల్ల చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే పని చేసే సమయంలో బాగా నిద్ర వస్తే ఒక 15 నిమిషాలు నిద్ర పోతే చాలు కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు.
  4. గంటల తరబడి కదలకుండా కూర్చోవటం వల్ల శరీర కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి. నడుము నొప్పి, తల నొప్పి వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే పని చేసే సమయంలో పది నిమిషాలకోసారి అటుఇటూ తిరగటం లేదా శరీరాన్ని కదిలించటం వంటివి చేస్తుండాలి. అలాగే ప్రతి రోజు కండరాలను సంబంధించిన వ్యాయామం తప్పని సరి.

Wednesday, November 8

నీళ్లతో వైద్యం...

తాగేనీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను నివారించొచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేమిటో చూద్దాం...
  1. నీరు వేడి చేసి అందులో కాసింత ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, టాన్సిల్స్‌ తగ్గుతాయి.
  2. నీటిని మరిగించి కొద్దిగా పసుపు లేదా రెండు చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి ఆవిరి పడితే జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.
  3. ఐస్‌ ముక్కల్ని నుదిటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
  4. గ్లాసుడు గోరువెచ్చని నీటిని నెమ్మదిగా సిప్‌ చేస్తూ తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  5. కరిస్తే సబ్బునీటితో ఆ భాగం కడిగి శుభ్రం చేయాలి. ఏకధారగా గాయం మీద నీరు పోస్తే రేబీస్‌ కలిగించే సూక్ష్మజీవులు తొలగిపోతాయి.
  6. చర్మం కాలితే వెంటనే చల్లటి నీటితో గాయాన్ని తడపాలి. దీనివల్ల కాలిన గాయం చల్లబడి మరింత పెరగకుండా ఉంటుంది.
  7. వేడినీరు తాగితే కఫం కరుగుతుంది. పసుపును మరిగేనీటిలో వేసి ఆవిరి పడితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
  8. చిన్న చిన్న గాయాలను చల్లటి నీటిలో కడిగితే మలినాలు, సూక్ష్మజీవులు పోతాయి. రక్తం నెమ్మదిగా గడ్డకడుతుంది. రక్తం కారడం తగ్గుతుంది.
  9. వేడి నీళ్లలో ఉప్పు వేసి కాపడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
  10. రాత్రి రాగి చెంబులో నీరు పోసి పరగడుపున తాగితే మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
  11. ముక్కులోంచి రక్తం పడుతుంటే చల్లటి నీరు తలమీద పోయాలి. నుదుట/ ముక్కుమీద తడిగుడ్డ వేయాలి.
  12. గోరువెచ్చని నీటిలో ఉప్పువేసి పుక్కిలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది.
  13. ఎక్కువనీరు తాగితే రక్తం పలచబడుతుంది. యూరిక్‌ యాసిడ్‌ లెవెల్‌ తగ్గుతుంది. మూత్రం ద్వారా యూరిక్‌ ఆమ్లం బయటికిపోతుంది.
  14. నీరు ఎక్కువగా తాగితే సూక్ష్మజీవులు వేగంగా మూత్రం ద్వారా బయటకు పోయి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.

Monday, November 6

స్నాక్స్‌లో పండ్ల ముక్కలు...

కొన్ని సార్లు ఆహారం విషయంలో ఎన్నీ జాగ్రత్తలు పాటించినా అనారోగ్యం వెంటాడుతుంది. అలాంటి సమయంలో పౌష్టికాహారం తీసుకున్నా ఫలితం కనిపించదు. ఎందుకంటే ఆ వ్యాధిని దూరం చేసే యాంటీ ఆక్సిడెంట్‌ ఆహార పదార్థాలను తీసుకుంటేనే కొంచెం ఫలితం కనిపిస్తుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది విటమిన్‌ 'కె'. ఇది గుండె సంబంధిత వ్యాధులను, రక్తం గడ్డ కట్టడానికి, ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది. ఇన్ని లాభాలున్న విటమిన్‌ 'కె' లభించే ఆహార పదార్థాలేంటో ఓ సారి చూద్దాం...
  1. ఆకుకూరల్లో పుష్కలంగా విటమిన్‌ 'కె' లభిస్తుంది. అత్యధికంగా విటమిన్‌ 'కె' పాలకూరలో ఉంటుంది. పాలకూరను వారానికి మూడు సార్లు తిన్న శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇలా చేయడటం వల్ల శరీరానికి అవసరమైన 445 మై|గ్రామ్స్‌ల న్యూట్రీన్లు సమృద్ధిగా అందుతాయి.
  2. నల్లద్రాక్షల్లో కూడా విటమిన్‌ 'కె' సమృద్ధిగా ఉంటుంది. రోజూ ఒక కప్పు ద్రాక్ష పండ్లు తినటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  3. అలాగే కూరలో రుచి కోసం ఉపయోగించే కొత్తిమీర, కరివేపాకులో కూడా విటమిన్‌ 'కె' ఉంటుంది. ఈ ఆకుకూరలు ఎండిపోయినా కూడా విటమిన్లను కోల్పోకుండా ఉంటాయి.
  4. కూరగాయలలో ముఖ్యంగా బెండకాయలో విటమిన్‌'కె' ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. రెండు రోజులకు ఓ సారి తిన్నా ఆరోగ్యంగా ఉంటారు.
  5. గుడ్డులో కూడా విటమిన్‌ 'కె' పుష్కలంగా ఉంటుంది. రోజూ ఉడికించిన గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారు. గుడ్డులో ముఖ్యంగా ఐరన్‌, ప్రోటీన్లు, ఫోలిక్‌ ఆమ్లం ఉంటాయి.
  6. వేసవి కాలంలో ఎక్కువగా చిరుతిళ్ళు తినడానికే ఇష్టపడతారు. స్నాక్స్‌గా దోసకాయ ముక్కలను, క్యారెట్‌ ముక్కలను తినటం మంచిది. ఇవి శరీరాన్ని డిహైడ్రేట్‌ కాకుండా కాపాడుతాయి. అలాగే అవసరమైన పోషకాలను అందిస్తాయి.

Thursday, November 2

ప్రతి నొప్పి గుండెపోటు కాదు...

గుండె దడ అనేది చాలా మందిలో ఉండే రుగ్మత. ఛాతీ నొప్పిని కూడా చాలా మంది ఎదుర్కొంటారు. అంత మాత్రాన గుండె జబ్బు అనుకోవద్దు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అలాగని ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం కూడా చేయొద్దు. ముందుగా వైద్యుడిని సంప్రదించి జబ్బు ఏమిటో నిర్ధారించుకోవాలి. గుండె సమస్య అయితే తగిన చికిత్స చేయించుకోవాలి.
ఎలాంటి వారికి గుండె జబ్బు వస్తుంది?
డయాబెటిస్‌, అధిక రక్తపోటు, హైకొలెస్ట్రాల్‌ ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ జబ్బులతో బాధపడుతున్న వారు అనారోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. ఇటీవల కాలంలో యువకుల్లో సైతం గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. స్మోకింగ్‌, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు.
వ్యాధి లక్షణాలు
కొద్ది దూరం నడవగానే ఆయాసం, ఛాతీ ఒక్కోసారి పట్టేసినట్టుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతుండటం లాంటి లక్షణాలను గుండె జబ్బుగా అనుమానించాల్సిందే. అయితే... ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని అనుకోవద్దు. దీనిని నిర్ధారించుకోవడానికి తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి.
క్రమంగా చెకప్‌ చేయించుకోవాలి..
నలభై ఏండ్లు దాటిన వారు రెగ్యులర్‌గా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా ముందస్తుగా జాగ్రత్త పడొచ్చు. ఈసీజీ, 2డీ ఎకో, కొలెస్టరాల్‌, టీఎంటీ పరీక్షల ద్వారా గుండె పనితీరు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి, చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
గుండె జబ్బు అంటే...
పరీక్షల ద్వారా గుండె జబ్బు ఉందని తేలితే మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సమస్య ఎక్కువగా ఉందా.. ఎన్ని చోట్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయి? తదితర విషయాలు తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్‌ పరీక్ష అవసరమవుతుంది. ఒకటి లేక రెండు బ్లాక్‌లు ఉన్నట్లయితే యాంజియోప్లాస్టి చికిత్స ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. మూడు లేక అంతకంటే ఎక్కువ బ్లాకులు ఉన్నా గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం (ఎల్‌ఎంసీఏ)లో సమస్య ఉన్నట్లయితే బైపాస్‌ సర్జరీ అవసరమవుతుంది. ప్రస్తుతం ఔషధ పూరిత స్టెంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించినట్లయితే స్టెంటుల్లో మళ్లీ బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి. స్టెంట్లు వేసినా, బైపాస్‌ సర్జరీ జరిగినా మళ్లీ గుండె సమస్య తలెత్తకుండా ఉండటానికి తగిన మందులు వాడటం చాలా అవసరం. కొందరు ఆపరేషన్‌ జరిగింది కదా.. మందులు ఆపేస్తుంటారు. ఇది సరికాదు. రెగ్యులర్‌గా మందులు వాడుతూ డైట్‌ కంట్రోల్‌ చేస్తుంండాలి. వ్యాయామం చేయడం మరువొద్దు.
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
ఆరోగ్యానికి నడక చాలా మంచిది. రోజూ అరగంటపాటు నడక తప్పనిసరి చేసుకోవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు. అలాగే కొలెస్టరాల్‌ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం, వేపుళ్లకు దూరంగా ఉండటం అవసరం. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ గుండె పది కాలాలపాటు పదిలంగా ఉంటుంది.
అప్రమత్తత అవసరం
చిన్న వయసులోనే గుండెపోటుకు గురైన వారస్తత్వ చరిత్ర ఉన్న వారు ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చర్యలు చేపట్టాలి. కొలెస్ట్రాల్‌ పెరగడమంటే ఆ వ్యక్తి లావుగా ఉన్నాడా.. సన్నగా ఉన్నాడా అనేది ముఖ్యం కాదు. లావుగా ఉన్న వారిలో కొలెస్ట్రాల్‌ నార్మల్‌గానే ఉండొచ్చు. సన్నగా ఉన్న వారిలో చాలా ఎక్కువగానూ ఉండొచ్చు. అవన్నీ రక్త పరీక్షల్లో తేలవాల్సిందే తప్ప శరీరం బరువు ఆధారంగా మాత్రం కాదు.
అయితే... లావుగా ఉన్న వారిలో ఎక్కువ మందికి ఈ సమస్య ఉండొచ్చు. కుటుంబ చరిత్ర ఉన్న వారు చిన్న వయస్సు నుంచే కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం చాలా ముఖ్యం. తీవ్రతను అనుసరించి ఆహార నియమాలు పాటించడం గానీ, కొన్ని మందులు వేసుకోవడం ద్వారా గానీ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచొచ్చు. అలాగే గుండెపోటు రావడానికి మధుమేహం ఒ క ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్న వారు వ్యాధిని పూర్తి నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. కనీసం ప్రతి మూడు నెలలకోసారి డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉంటే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడొచ్చు.
నిజానికి పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె పోటు తక్కువ. అయితే... మద్య వయసు వచ్చాక పురుషులతో సమానంగానే వీరూ గుండె పోట్లకు గురవుతున్నారు. సహజంగా మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ నిలిపోవడం అన్నది చాలా తక్కువ. కాకపోతే.. మెనోపాజ్‌ తర్వాత మాత్రం పరిస్థితి మారిపోతుంది. దీనికి తోడు గర్భాశయాన్నీ, అండాశయాన్ని కూడా తొలిగించే వారిలో పురుషులకు సమానం గానే గుండెపోటు వస్తుంది. అలా అని హార్మోన్‌ సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా ఈ స్థితిని అరికట్టలేం. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడం పెను ముప్పే. గుండె కండరానికి అవ సరమైన రక్తం అందదు. ఈ పేరుకుపోవడం అన్నది నిదానంగా జరిగితే ఆ లక్షణాలు కూడా అంతే నిదానంగా కనిపిస్తాయి. అలా కాకుండా ఏ కారణంగానైనా ఒక్కోసారి ఈ కొలెస్ట్రాల్‌ చిట్లిపోవచ్చు. సరిగ్గా అదే సమయంలో రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోతుంది. అప్పటి దాకా ఏ 70 శాతమో ఉన్న ఆటంకం క్షణాల్లో నూరు శాతంగా మారిపోతుంది. ఆ వెంటనే గుండె పోటు వచ్చేస్తుంది. గుండె వేగం విపరీతంగా పెరిగిపోయి ఆ తర్వాత చాలా మందిలో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఈ స్థితి ఏర్పడిన వారిలో సుమారు 50 శాతం మంది ప్రాణాలు కోల్పోవచ్చు. కొలెస్ట్రాల్‌ చితకడానికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా శారీరక, మానసిక ఒత్తిళ్లు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. అందుకే.. కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించుకోవాలి. పొగతాగడం కానీ, పొగాకు సంబంధిత వస్తువులు వాడటం గానీ పూర్తిగా మానుకోవడం ముఖ్యం.

Sunday, October 29

కీళ్ల నొప్పులు తగ్గాలంటే...

వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు రావడం సర్వసాధారణం. కొందరికి వయసుతో నిమిత్తం లేకుండానే ఈ సమస్య వస్తుంది. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు దీనికి ప్రధాన కారణం. అయితే.. ఈ కీళ్ల నొప్పులను కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చంటు న్నారు ఆయుర్వేద నిపుణులు. అవేమిటో చూద్దాం...
ఆవనూనెతో క్రమం తప్పకుండా రోజూ రెండు పూటలా మర్దన చేస్తుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
కొంచెం దానిమ్మ చిగుళ్లు, సైంధవ లవణం కలిపి నూరాలి. శనగ గింజంత మాత్రలు చేసుకుని ఓక్కొక్కటి మూడు పూటలా తీసుకోవాలాలి.
మిరియాలు ఒక స్పూను, విషముష్టి గింజలు ఒక స్పూను తీసుకుని అల్లం రసంలో మూడు రోజుల పాటు నాన బెట్టాలి. ఆ తర్వాత మెత్తగా చేసి చిన్న చిన్న కంది గింజలంత మాత్రలు చేసుకుని ప్రతిరోజూ రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి కీళ్ల మీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి.
కప్పు నువ్వుల నూనెలో నాలుగు వెల్లుల్లిపాయ రేకులు వేసి బాగా మరగించాలి. చల్లారాక నూనెను వడగట్టి కీళ్ల నొప్పులున్న చోట మర్దన చేయాలి.

Wednesday, October 25

ముక్కు నుంచి రక్తం కారితే...

ఎండ వేడిమి ఎక్కువైతే కొంత మందిలో ముక్కులో నుంచి రక్తం విపరీతంగా కారుతుంది. వేడి ఎక్కువగా ఉన్న శరీరంలో అయితే ఈ ప్రభావ తీవ్రత అధికంగా కనిపిస్తుంది. ఇలా రక్తం కారిన ప్రతిసారి ఆందోళనపడటం, భయపడటం చేస్తుంటారు. రక్తం కారటాన్ని తగ్గించుకోటానికి ఎన్నో రకాల మందులను ఉపయోగిస్తారు. అలా చేయటం వల ్ల సైడ్‌ ఎఫెక్ట్సు వస్తాయి. అలా కాకుండా సహజ సిద్ధంగా ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది...
  1. ముక్కులో నుంచి ఎక్కువగా రక్తం కారుతుంటే.. ముక్కు బిగ్గరగా, వేడిగా, ముక్కు నరాలు ఒత్తిడికి గురి కావటం, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఉల్లిగడ్డను గుండ్రంగా కట్‌ చేసుకొని, ఆ ఉల్లి ముక్కను ముక్కు దగ్గర పెట్టుకుని బిగ్గరగా శ్వాస తీసుకుంటే సరిపోతుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. ఇలా చేయటం సత్వర ఉపశమనం పొందుతారు.
  2. రక్తం కారటాన్ని తగ్గించటంలో కొత్తిమీర పాత్ర కీలకం. కొత్తిమీర సహజంగానే చల్లదనాన్ని కల్గి ఉంటుంది. ఇది ముక్కుకు సంబంధించిన అన్ని రకాల ఎలర్జీలను నివారించటంలో మంచి ఔషధంలా పని చేస్తుంది. ముక్కు నుంచి రక్తం అధికంగా కారితే కొత్తిమీర నూనె లేదా తాజా రసాన్ని ముక్కు లోపలి అంచులకు కొన్ని నిమిషాలు రాసుకుంటే సరిపోతుంది.
  3. నరాల నొప్పిని, రక్తం కారటాన్ని తగ్గించటంలో తులసి మంచి ఔషధం. తులసి రసాన్ని ముక్కులో రెండు చుక్కలు వేసుకోవటం లేదా తాజా తులసి ఆకులను నమలటం వల్ల కూడా ఎలర్జీ సమస్యలు దూరం అవుతాయి.
  4. చిన్న పిల్లలకు ముక్కులో నుంచి రక్తం ఎక్కువగా కారితే విటమిన్‌ 'ఇ' అధికంగా ఉండే నూనెలో కొంచెం పెట్రొలియం జెల్లీ కలిపి ముక్కులో రెండు చుక్కులు వేసుకుంటే తొందరగా ఉపశమనం పొందుతారు.
  5. ఈ సమస్య అధికంగా వేధిస్తుంటే విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు రోజూ తినటం మంచిది.
  6. అలాగే గోధుమలు, గోధుమ గడ్డితో తయారు చేసిన పదార్థాలను రోజూ తినటం మంచిది. ఎందుకంటే గోధుమల్లో జింక్‌, ఐరన్‌, నూట్రీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక రక్త ప్రసరణను అదుపులో ఉంచుతాయి.

టెన్షన్‌ వద్దు...

హోమియో వైద్యంతో థైరాయిడ్‌ నియంత్రణ
థైరాయిడ్‌ సమస్య అనేది సర్వసాధారణమైపోయింది. మారుతున్న జీవన శైలి, పాశ్చాత్య అలవాట్లు, పెరుగుతున్న మానసిక, శారీరక ఒత్తిళ్లు, జన్యుపరమైన లోపాలు ఈ గ్రంథిపై ప్రభావం చూపుతున్నాయి. థైరాయిడ్‌ అసమతు ల్యత కారణంగా భారతదేశంలోని 42 మిలియన్ల మంది సతమతమవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
మానవ శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం లేదా అసమతుల్యతకు గురికావడం వల్ల అనేక రుగ్మతలు దాడి చేస్తాయి. అయితే.. థైరాయిడ్‌ సమస్యలన్నీ ఒక్కటి కావు. అందరిలోనూ అన్ని లక్షణాలు ఉండాలని లేదు. జన్యు నిర్మాణాన్నిబట్టి అవి ఉంటాయి. చాలామంది థైరాయిడ్‌ సమస్యను సకాలంలో గుర్తించరు. అశ్రద్ధ, అజ్ఞానం కారణంగా సరైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోరు. సకాలంలో చికిత్స పొందరు. తద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులను కొనితెచ్చుకుంటారు.
థైరాయిడ్‌ సైనటైటిస్‌, ఇన్‌ఫెక్షన్లు
శిశువు జన్మించినప్పుడు బరువు అధికంగా లేదా చాలా తక్కువగా ఉండటం, ఎదుగుదల లోపాలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపాలు, మందబుద్ధి, తరచూ జలుబు, దగ్గు, తరచూ ఇన్‌ఫెక్షన్లు, జ్వరం, అలర్జీల బారిన పడటం కనిపించొచ్చు. అలాగే మధ్య వయసులో నీరసం, త్వరగా అలసిపోవడం, చిరాకు, కోపం, ఆందోళన, గుండె దడ, మానసిక ఒత్తిడి, సైనసైటిస్‌, మైగ్రేన్‌ లేదా తలనొప్పి, ముఖంలో వాపు, తరచూ టాన్సిల్స్‌ లేదా నోటి ఇన్‌ఫెక్షన్లు, తరచూ తుమ్ములు, వాంతులు, విరేచనాలు, ముక్కు నుంచి నీరు కారడం తదితర లక్షణాలు ఉంటాయి.
థైరాయిడ్‌ సొరియాసిస్‌
థైరాయిడ్‌ గ్రంథి అసమతుల్యతో చాలామందిలో చర్మంపై పొలు సులు లేదా పొట్టు రాలడం, పొడిబారడటం, పిగ్మంటేషన్‌ సమస్యలు కనిపిస్తాయి. వీటితోపాటు సొరియాసిస్‌ లక్షణాలు మొదలవుతాయి. లేదా ఎక్కువుతాయి. సొరియా సిస్‌ లక్షణాలు శరీరంలో ఎక్కుడైనా మొదలుకావచ్చు. ముఖ్యంగా తలలో డాండ్రాఫ్‌ లేదా చుండ్రుగా కనిపించొచ్చు. అజాగ్రత్త చేస్తే జట్టు రాలిపోతుంది. చెవుల వెనుక పొట్టుతో కూడిన పొలుసులు మొదలవుతాయి. ఆ తర్వాత శరీరమంతటా అవి వ్యాపిస్తాయి. మరికొంత మందిలో కేవలం చర్మం పొడిబారడం పిగ్మెంటేషన్‌ లేదా మచ్చలు కనిపిస్తాయి. వీటితోపాటు గొంతు ముందు భాగంలో వాపు రావడం, అధిక ఆందోళన, మానసిక వ్యాకులత, నీరసం, గుండె దడ, గ్యాస్ట్రో సమస్యలు, మలబద్ధకం ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో సొరియాసిస్‌ లక్షణాలతోపాటు థైరాయిడ్‌ హార్మోన్లు వల్ల నెలసరి సక్రమంగా లేకపోవడం, కడుపు నొప్పి, తెల్లబట్ట కావడం, మైగ్రేన్‌ తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
థైరాయిడ్‌ ఆర్థరైటిస్‌
థైరాయిడ్‌ అసమతుల్యత వల్ల బరువు పెరగడం లేదా తగ్గడం, జట్టు రాలడం, తెల్లబడటం, కండ్ల కింద నల్ల చారలు రావడం, గొంతు పైన వాపు రావడం, కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, కాళ్ల వాపులు, నరాలు లాగడం, కాళ్లు లాగడం, తిమ్మిర్లు, నడకలో మార్పు రావడం, తలనొప్పి, తల తిరగడం, బైర్లు కమ్మడం, మల, మూత్ర విజర్జనపై నియంత్రణ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
సంతానలేమి
థైరాయిడ్‌ అసమతుల్యత వల్ల సంతాన లేమి సమస్య తలెత్త వచ్చు. ఇది ఒకే రకమైన కారణాల వల్ల మొదలు కావచ్చు. అందువల్ల దీన్ని అసమతుల్యత సంబంధిత అనారోగ్యంగా గుర్తిస్తారు. అయితే.. ఏదీ అనివార్యం కాదు. పూర్తిగా మానవ జన్యు నిర్మాణం, ప్రేరేపకాలపై ఆధారపడుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే.. ఒకే ప్రేరేపకం అందరిలో ఒకే రకమైన అనారోగ్యాన్ని కలిగించాలనేమీ లేదు. ఇది పూర్తిగా జన్యువులపై ఆధారపడి ఉంటుంది. గర్భాశయం, ఫాలోపియన్‌ టూల్స్‌, అండశయాలు, సర్వెక్స్‌ సంతానోత్పత్తికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్క అవయవం ఇన్‌ఫెక్షన్ల బారిన పడినా సంతాన లేమికి దారి తీస్తుంది. ఫైబ్రాయిడ్స్‌, పీసీఓడీ, నెలసరి సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత తదితర ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స తీసుకోకపోవడం థైరాయిడ్‌ వల్ల కలిగే సంతాన లేమిపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది.
స్పాండిలైటిస్‌
జీవక్రియ అసమతుల్యత వల్ల కలిగే ఒత్తిడి థైరాయిడ్‌ గ్రంథి తట్టుకోలేనంతగా ఉన్నప్పుడు ప్రతిక్రియలు ఏర్పడతాయి. థైరాయిడ్‌ అసమతుల్యకు గురై స్పాండిలైటిస్‌కి దారి తీస్తుంది.
అరచేతిలో లేదా అరకాళ్లలో తిమ్మిర్లు, మంటలు, అకస్మాత్తుగా నొప్పి రావడం, సూదలతో గుచ్చుతున్నట్టు మంటలు, అప్పుడప్పుడు నొప్పి రావడం, చిన్న శ్రమ చేసినా కాళ్లు, చేతులు నొప్పి రావడం,
నడుమునొప్పి, కండరాలు అకస్మాత్తుగా బిగుసుకుపోవడం, మెడనొప్పి, తలనొప్పి, కండరాలనొప్పి, డిస్క్‌ సమస్యల వల్ల భరించలేనంత నొప్పితో కదలలేకపోవడం, కంటి చూపులో మార్పులు రావడం, కండ్లు తిరగడం, సిమాటక లక్షణాలు, నరాలపై ఒత్తిడి వల్ల కనిపించడం, పురుషుల్లో లైంగిక సమస్యలు, నరాల బలహీనత, నరాల నొప్పి తదితర లక్షణాల ఉంటాయి.
థైరాయిడ్‌ అలర్జీలు
థైరాయిడ్‌ సమస్యల వల్ల తొందరగా అలర్జీకి గురవుతారు. చర్మంపై దురద, దుద్దర్లు, ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తాయి. ఆహారం జీర్ణం కాకపోవడం, విరేచనాలు, వాంతులు, కండ్ల దురద, దగ్గు చెవుల ఇన్‌ఫెక్షన్‌, గ్యాస్టిక్‌ సమస్యలు వస్తాయి. అశ్రద్ధ కారణంగా థైరాయిడ్‌ సమస్యలను రోగి గుర్తించకపోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఇది దీర్ఘకాలంలో ఒబెసిటి, కొలెస్ట్రాల్‌, అస్టియోప్రాసిస్‌, బీపీ, డయాబెటిస్‌, లివర్‌, కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది.
నిర్ధారణ
టీ3, టీ4, టీ5హెచ్‌ లాంటి సాధారణ పరీక్షలతోపాటు రక్త కాల్షియం, థైరాయిడ్‌ యాంటీబాడీస్‌, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగులు, బయాప్సీ తదితర ఆధునిక పరీక్షలు వ్యాధి లక్షణాలను అంచనా వేసేందుకు దోహదపడతాయి.
హోమియో వైద్యం
థైరాయిడ్‌, దాని పర్యావసానంగా వచ్చే ఆరోగ్య సమస్యలు వంశపారపర్యంగా వస్తాయని, వీటికి సరైన చికిత్స లేదని ప్రచారం ఉంది. ఇది అపోహ మాత్రమే. కొన్ని కారణాల వల్ల థైరాయిడ్‌ గ్రంథి అసమతుల్యతకు గురవుతుందని, తద్వారా జఠిల అనారోగ్య పరిస్థితులు ఎదురవు తాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే.. కొన్ని వందల ఏండ్ల క్రితమే ఈ విషయ పరిజ్ఞానం హోమియో వైద్యంలో ఉందని ఆధునిక సమాజం గుర్తించింది. అన్ని కోణాల నుంచి శారీరక క్రియల పనితీరును తెలుసుకుని వ్యాధి మూలాలను కనుగొనడంలో హోమియో అగ్రభాగాన నిలిచింది. ఈ వైద్యం ద్వారా థైరాయిడ్‌ నియంత్రణతోపాటు అనేక వ్యాధుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.

Monday, September 4

నిద్ర సరిగా లేకపోతే అనర్థమే!

ఆధునిక మానవ జీవితంలో విశ్రాంతికి ప్రధాన్యత తగ్గింది. కంటి నిండా నిద్ర పోయేందుకు కూడా చాలా మందికి సమయం ఉండటంలేదు. అయితే.. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు పరిశోధకులు. సరిగా నిద్ర లేకపోతే జీవక్రియ వ్యాధుల (మెటబాలిక్‌ డిసీజెస్‌)కు గురికావాల్సి వస్తుందని హెచ్చరి స్తున్నారు. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైన పలు అంశాలు ఆందోళన కలిగి స్తున్నాయి. 1,615 మందిని పరిశోధించగా సరైన నిద్రలేని వారు బ్లడ్‌షుగర్‌, బ్లడ్‌ప్రెషర్‌, బ్లడ్‌ కొలెస్ట్రాల్‌, థైరాయిడ్‌ లాంటి రుగ్మతలతో అత్యధుకులు బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరంతా ఆరు గంటలకు మించి నిద్రపోని వారే. వీరు స్థూలకాయ సమస్యను కూగా ఎదుర్కొంటున్నారని పరిశోధకులు గుర్తించారు.

పిల్లల నిద్ర గురించి...

చిన్న పిల్లలకి నిద్ర చాలా ముఖ్యమైనది. మంచి నిద్ర ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి, మేధాశక్తి మీద నిద్ర ప్రభావితం చాలా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల నిద్ర కు సంభందించిన కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే...!
సమయానుసారంగా...
క్రమబద్ధమైన నిద్ర మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతే కాకుండా సమయానికి పడుకోవడం లేదా లేవడం వంటి అలవాటు పద్ధతిగా జరగాలి. ఇది వాళ్ళ స్లీప్‌ సైకిల్‌ ని క్రమబద్దపరచామే కాకుండా పిల్లల్ని మరింత శక్తివంతంగా తయారు చేస్తుంది. ఇది చిన్న పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఎంతైనా అవసరం.
సానుకూలంగా...
సుఖమయమైన నిద్ర సానుకూలంగా ఆలోచించేలా చేస్తుంది. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం, పెరుగుదలకు దోహదపడుతుంది. ముఖ్యంగా పిల్లలు ఆడుకునే ముందు స్నానం చేయడం, పళ్లుతోము కోవడం, నైట్‌ డ్రెస్‌ వేసుకోవడం, స్టోరీస్‌ చెప్తూ నిద్రపోవడం పిల్లలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు, సంబంధాల పట్ల గౌరవ మర్యాదలు పెరగడానికి తోడ్పడతాయి.
ఆహ్లాదకరమైన పడకగది...
పరిపూర్ణ నిద్రకి పడక గదికి చాల సన్నిహితమైన అనుబంధం ఉంది. పడక గది పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలను బెడ్‌ రూమ్‌ లో లేకుండా చూసుకోవాలి.
కెఫిన్‌, జంక్‌ పదార్థాలు...
పడుకునే ముందు జంక్‌ పదార్థాలు తినడం లేదా కాఫీ తాగడం వంటివి చేయవద్దు. దీని వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. జంక్‌ పదార్థాలు షుగర్‌ లెవెల్స్‌ ను పెంచుతాయి. ఇది నిద్ర లేమికి దారి తీయడమే కాదు, నిద్రను దూరం చేస్తుంది. రాత్రి ఏడున్నర లోపు డిన్నర్‌ లో వోల్‌ గ్రేయిన్స్‌ తో కూడినవి తీసుకోవడం మంచిది.

Monday, August 28

మీజిల్స్‌, రుబెల్లా నివారణ ఎలా?

తట్టు(మీజిల్స్‌)ను చిన్నమ్మవారు అని కూడా అంటారు. ఇది అంటు వ్యాధి. వైరస్‌ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీని పర్యవసానంగా ఆరోగ్యపరంగా సంక్లిష్ట సమస్యలు ఎదురవు తుంటాయి. న్యూమోనియా, ఎన్‌సెఫలిటీస్‌( మెదడు వాపు) వంటివి సంక్రమిస్తాయి. దీంతో ఒక్కోసారి మరణం సంభవించొచ్చు.
పొంగు (రుబెల్లా) అనేది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. పిల్లలు వాక్సిన్‌ తీసుకోని కారణంగా ఇది సంక్రమిస్తుంది. యువత, వృద్ధుల్లోనూ పొంగు వచ్చే అవకాశాలున్నాయి. వాక్సిన్‌ తీసుకోని మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఇదొస్తే తీవ్ర దుష్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలల వరకు పొంగు వస్తే గర్భస్త్రావం అవుతుంది. గర్భంలోనే శిశువు చనిపోవచ్చు. శిశువుకు పుట్టుకతోనే పొంగు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఏమిటీ వ్యత్యాసం?
తట్టు, పొంగుకు సంబంధించిన వైరస్‌లు వివిధ వైరస్‌ కుటుం బాలకు చెందినవి. కానీ ఈ రెండు రకాల పోలికలూ మాత్రం దగ్గరగా ఉంటాయి.

  1. మనుషులకు మాత్రమే ఈ వ్యాధులు సంక్రమిస్తాయి.
  2. ఒకరి నుంచి మరొకరికి దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తాయి.
  3. ఇన్‌ఫెక్షన్‌ తర్వాత జ్వరం వస్తుంది. చర్మం మీద దద్దుర్లు ఏర్పడతాయి.
పుట్టుకతో 'పొంగు' అంటే?
పుట్టుకతో పొంగు వ్యాధి రావడానికి ప్రధాన కారణం 90 శాతం వరకు తల్లి అవుతుంది. గర్భం దాల్చిన మహిళకు మొదటి పది వారాలలోపు పొంగు వస్తే బిడ్డకు పుట్టుకతో ఆ వ్యాధి సంక్రమిస్తుంది. తల్లికి పొంగు వ్యాధి రావడం వల్ల గర్భస్త్రావం అవుతుంది. లేదా శిశువుకు పుట్టుకతో లోపాలు తలెత్తొచ్చు. గుండె సంబంధిత వ్యాధులతోపాటు చెవిటి మూగ, మెదడు దెబ్బతినడం, కంటి సమస్యలు రావచ్చు. కాటరాక్ట్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వ్యాప్తి ఇలా...
తట్టు సర్వసాధారణంగా శ్వాస ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మీజిల్స్‌ వైరస్‌ వల్ల తట్టు వస్తుంది. దగ్గడం, తుమ్మడం ద్వారా గాలి ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్‌ సంక్రమిస్తుంది. నాలుగురోజుల్లోనే చర్మం మీద దద్దుర్లు ఏర్పడతాయి. పొంగు మాత్రం ముక్కు, నోరు నుంచి కారుతున్న స్రావాల ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తుంది. వాక్సిన్‌ వేసుకోని వారికి పొంగు దాడి చేసే ప్రమాదం ఉంది.
ముప్పు ఎవరికి?
ఎవరికైనా ఈ వైరస్‌ ముప్పు పొంచి ఉంటుంది. వాక్సిన్‌ తీసుకోని వారితో పాటు గతంలో పొంగు ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారికి పొంగు వచ్చే ప్రమాదముంది. తొమ్మిది నెలలలోగా తట్టు నివారణకు రెండు డోసులు వాక్సిన్‌ వేసుకోని వారికి మీసల్స్‌ వైరస్‌ సంక్రమిస్తుంది. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికి తట్టు, పొంగు వ్యాధులు వ్యాపిస్తుంటాయి. క్యాన్సర్‌ రోగులు తీసుకునే కీమోథెరపీ లేదా రేడియోథెరపీ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ డోస్‌ ఉన్న ఉత్ప్రేరక మందులు వాడటం వల్ల ఈ రెండు రకాల వ్యాధులు వస్తాయి.
నివారణ ఎలా?

  1. తట్టు, పొంగు నివారణకు రెండు డోసుల ఎంఎంఆర్‌(మీజిల్స్‌, మమ్ప్స్‌, రుబెల్లా) వాక్సిన్‌ తీసుకోవాలి. ఇది ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కాపాడుతుంది.
  2. ఈ వాక్సిన్‌ పిల్లలకు తొమ్మిది నెలలలోపే ఇవ్వాలి.
  3. రెండో డోసు ఎంఎంఆర్‌వీ(మీజిల్స్‌, మమ్ప్స్‌, రుబెల్లా, వెరిసెల్లా) వాక్సిన్‌ 15 నెలల వయసులో ఉన్న శిశువుకు ఇవ్వాలి. మూడో డోసు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇవ్వాలి.
  4. రెండు పర్యాయాలకన్నా ఎక్కువగానే ఈ వ్యాక్సిన్‌ ఇవ్వడం సురక్షితం.
  5. తట్టు వైరస్‌ సంక్రమించినవారు ఇంట్లోనే ఉండటం ఉత్తమం. దీంతో ఇన్‌ఫెక్షన్‌ సంక్రమించదు. కనీసం నాలుగురోజుల పాటు దద్దుర్లు ఉంటాయి. తట్టు లేనివారికి దూరంగా ఉండాలి.
  6. పొంగు వ్యాధి సంమ్రించిన గర్భిణికి వాక్సిన్‌ ఇవ్వకపోవడమే ఉత్తమం
నిర్ధారణ ఇలా...
పొంగు వ్యాధిని నిర్ధారించడం చాలా కష్టం. ఇతర వైరస్‌ల వల్ల అనారోగ్యం వాటిల్లినట్టుగానే ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. జ్వరం, దద్దుర్లు వస్తుంటాయి. రక్తపరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారణ చేసుకోవాలి.
తట్టును త్వరగా గుర్తించొచ్చు. దీని బారినపడిన వ్యక్తులకు అసౌ కర్యంగా ఉంటుంది. తరచూ దగ్గుతుంటారు. ముక్కు నుంచి స్రావాలు కారడం, జ్వరం, దద్దుర్లు వాటిల్లి తట్టు లక్షణాలుగా అనుమానించొచ్చు. తట్టు వ్యాధి లక్షణాలు కనిపించగానే రక్త పరీక్ష చేయించాలి. వ్యాధిని సులభంగా గుర్తించడానికి ముక్కు, గొంతు, మూత్రం నుంచి శాంపిల్స్‌ సేకరిస్తారు.
చికిత్స
తట్టు, పొంగు వ్యాధులను అరికట్టడానికి విశ్రాంతి చాలా అవసరం. పారాసెటమల్‌ మాత్రలు వేసుకోవడం వల్ల జ్వరం తగ్గుతుంది. ఫ్లూయిడ్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. తట్టు, పొంగు వ్యాధి వచ్చినవారికి ఇంట్లోనే ఉండే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేదంటే ఒకరి నుంచి మరొకరికి ఇవి వ్యాపిస్తాయి. వీటి లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం తీసుకోవాలి.

Sunday, August 27

ఎసిడిటీకి విరుగుడు...

ఎసిడిటీ ఏర్పడటానికి అనేక కారణాలుంటాయి. అధికంగా మసాలా తిండి, అతి ఆహారం వంటివి కొంత మేర ఎసిడిటీ తెస్తాయి. ఎసిడిటీ విరుగుడుగా ఎన్నోరకాల మందులు ఉన్నాయి. అయినా సహజ మార్గాలను ఎంచుకోవడమే మేలు.
  1. ఎసిడిటీ ఉంటే ఆహారంలో అరటిపండు తినండి. అది మంటను తగ్గించడంలో సహాయపడతుంది.
  2. మసాలాలు, వేపుడు కూరలు, ఊరగాయలు, చాక్లెట్లు వంటివాటికి దూరంగా ఉండండి.
  3. పచ్చి క్యాబేజి, పచ్చి ఉల్లి, రాడిష్‌, మిరియాలు వంటివి తినొద్దు. వాటి వల్ల ఎసిడిటీ మరింత పెరుగుతుంది.
  4. పండని పండ్లు తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. పూర్తిగా పండిన యాపిల్‌ అసలే వద్దు.
  5. ఆహారాన్ని బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి తప్ప బలవంతంగా తినొద్దు.
  6. హడావుడిగా ఆహారం తినే పద్ధతి మార్చుకోవాలి.
  7. భోజనానికీ భోజనానికీ మధ్య సమయం మరీ అధికంగా లేకుండా చూసుకోవడం మంచిది.
  8. నీటిని అధికంగా తీసుకోవడం చాలా మంచిది.
  9. రాత్రిపూట ఆహారం తీసుకునే సమయానికి, నిద్రపోయే సమయానికి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి.
  10. సిగరెట్‌, మత్తు పానీయాల అలవాటు బాగా తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి.

మధ్యాహ్నం నిద్ర ఇబ్బంది పెడితే...

మధ్యాహ్నం లంచ్‌ తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంది. భోజనం చేసినప్పుడు శరీరంలో క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి అయితేనే కదా బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌లో ఉండేది. ఈ క్రమంలో శరీరంలో ఇన్సులిన్‌ ఎక్కువైనప్పుడు మెదడుకు సంకేతాలు అందుతాయి. ఫలితంగా సెరటోనిన్‌, మెలటోనిన్‌ అనే రెండు హార్మోన్లను మెదడు ఉత్పత్తి చేస్తుంది. నిజానికి మెలటోనిన్‌ అనేది నిద్ర హార్మోన్‌. అది నిద్రను ప్రేరేపిస్తుంది. అయితే నిద్ర హార్మోన్ల వల్లే కాదు, మధ్యాహ్నం ఎక్కువగా తినడం వల్ల ఆ తిండిని జీర్ణ చేసేందుకు శరీరం 60 నుంచి 75 శాతం వరకు శక్తిని ఖర్చు పెడుతుందట. దీంతో మనకు పని చేయడానికి కావల్సినంత శక్తి లభించదు. ఫలితంగా శరీరం రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్తుంది. అప్పుడు నిద్ర తన్నుకు వస్తుంది. అదే లంచ్‌ తక్కువగా తీసుకుంటే నిద్ర రాదు. దీంతో యాక్టివ్‌గా ఉండవచ్చు. ఇదే సూత్రం రాత్రి పూట చేసే డిన్నర్‌కు కూడా వర్తిస్తుంది. అప్పుడు మనకు ఎటూ ఎక్కువ శక్తి అవసరం ఉండదు, కనుక తక్కువ తిన్నా చాలు. దాంతో అదనపు కొవ్వు చేరదు. అదేవిధంగా నిద్ర హార్మోన్ల ద్వారా కాకుండా సహజంగా వచ్చే నిద్రతోనే నిద్రలోకి జారుకోవచ్చు. అది మరుసటి రోజున మనల్ని యాక్టివ్‌ గా ఉంచుతుంది. అయితే మధ్యాహ్నం తక్కువగా తింటే మళ్లీ ఆకలి వేస్తే ఎలా..? అలా ఆకలి వేసినప్పుడు పండ్లు, నట్స్‌ వంటివి తినాలి. అవి కూడా లైట్‌గా తీసుకోవాలి. దీంతో నిద్ర రాదు, యాక్టివ్‌గా ఉంటారు.

న్యూమోనియా వస్తే అవస్థే...

ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్‌ఫెక్షనే న్యూమోనియా. ఇది ఒక అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి ఇది వ్యాపిస్తుంది. న్యూమోకోకస్‌, హెచ్‌ ఇన్‌ఫ్లూయెంజా అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. వాతావరణంలో ఉండే రకరకాల సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి శ్వాసకోశాల్లో ఇబ్బందులు కలుగజేస్తాయి. శ్వాసనాళాల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కొన్ని రకాల ద్రవాలతో శ్వాసకోశాలు నిండిపోతాయి. ఈ ద్రవాల కారణంగా శ్వాసకోశాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించ లేవు. దీంతో శరీరానికి అందాల్సిన ఆక్సీజన్‌ సరిగ్గా అందదు. దీంతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఊపిరితిత్తుల్లో నీరు లేక కళ్లె చేరడంతోపాటు శ్వాసగ్రంధులు మూసుకుపోతాయి. ఫలితంగా ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దీని వల్ల శ్వాస కండరాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఎటైపికల్‌ ఆర్గానిజమ్స్‌ వల్ల కూడా ఇది రావొచ్చు. సరైన పోషకాహారం అందకపోవడం వల్ల పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి అంతగా ఉండదు. దీంతో న్యూమోనియా వైరస్‌ వారిలోకి వేగంగా ప్రవేశిస్తుంది. మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, గుండె జబ్బులు, లివర్‌ సిర్రోసిస్‌ ఉన్నవారిలో న్యూమోనియా త్వరగా వస్తుంది.
న్యూమోనియా బారిన పడ్డవారిలో ఆయాసం ఎక్కువగా కనిపిస్తుంది. చల్లగాలి తగిలినా, చల్లని పదార్థాలు తీసుకున్నా సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. ఈ వ్యాధి సాధారణంగా వర్షాకాలం, శీతాకాలంలో ప్రబలుతుంది. కొంతమందికి ఆస్తమా తీవ్రరూపం దాల్చి న్యూమోని యాగా మారుతుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఎక్కువగా పిల్లలు, వృద్ధులు దీని బారిన పడతారు.
రకాలు :-
న్యూమోనియాలో కమ్యూనిటీ ఎక్వైర్డ్‌ న్యూమోనియా, హాస్పిటల్‌ ఎక్వైర్డ్‌ న్యూమోనియా, హెల్త్‌కేర్‌ అసోసియేటెడ్‌, వెంటిలేటర్‌ అసోసియేటెడ్‌ అనే రకాలు ఉన్నాయి. సాధారణంగా వచ్చేది కమ్యూనిటీ ఎక్వైర్డ్‌ న్యూమోనియా. హాస్పిటల్‌లో ఉండగా న్యూమోనియా వస్తే దాన్ని హాస్పిటల్‌ ఎక్వైర్డ్‌ అని, దీర్ఘకాలిక వ్యాధులు ఉండి లేదా మరే ఇతర కారణాల వల్ల లేదా ఇంటి దగ్గర లేదా హాస్పిటల్‌లో లేదా నర్సింగ్‌కేర్‌ ఉన్నా న్యూమోనియా వస్తే దాన్ని హెల్త్‌కేర్‌ అసోసియేటెడ్‌ న్యూమోనియా అని అంటారు. ఇవన్నీ సీరియస్‌ న్యూమోనియాలే. వీటిలో డ్రగ్‌ రెసస్టెన్స్‌ కూడా ఎక్కువగా ఉండొచ్చు.
లక్షణాలు :-
  1. ఆకలి బాగా తగ్గిపోతుంది.
  2. చలితో కూడిన జ్వరం వస్తుంది.
  3. బాగా నీరసంగా ఉంటారు.
  4. దగ్గు విపరీతంగా ఉంటుంది. దగ్గులో కళ్లే , ఒక్కోసారి రక్తం పడుతుంది.
  5. ఆయాసం, ఛాతీలో నొప్పిలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
  6. కొందరిలో ఊపిరితిత్తుల చుట్టూ నీరు లేదా చీము చేరుతుంది.
  7. శ్వాసకోశాల్లో ద్రవాలు ఎక్కువగా చేరడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది.
నిర్ధారణ-చికిత్స :-
రక్తపరీక్షలు, కళ్లె పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే తీసి న్యూమోనియా నిర్ధారిస్తారు. న్యూమో నియా అని నిర్ధారణ అయిన తర్వాత ఎంత తొందరగా యాంటీ బయోటిక్‌ మందులు వాడటం ప్రారంభిస్తే అంత త్వరగా కొలు కునే అవకాశం ఉం టుంది. మందులు అన్ని రకాల సూక్ష్మక్రిములను చంపే విధంగా ఉండాలి. చుట్టుపక్కల ప్రాంతాలలో క్రిములకి డ్రగ్‌ రెసిస్టెన్స్‌ ఎంత ఉందనే విషయం కూడా పరిగణనలోని తీసుకోవాలి. సరైన మోతాదులో మందులు వాడకపోతే.. జబ్బు ముదిరే ప్రమాదం ఉంది.
పిల్లలు జర జాగ్రత్త :-
  1. జనం గుంపులుగా ఉండే చోట్లకు పిల్లలను తీసుకెళ్లొద్దు.
  2. చల్ల గాలి తగలకుండా చూసుకోవాలి.
  3. ఉప్పు నీళ్లను తాగించాలి.
  4.  చల్లగా ఉండే ఆహార పదార్థాలను పెట్టకూడదు.
  5. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు పిల్లలకు దూరంగా ఉండాలి.
  6. జ్యూస్‌ల వంటి చల్లని ద్రవాలను తాగించకూడదు.
  7. పొగ తాగే వాళ్లకు దూరంగా ఉంచాలి.
  8. ఆరేళ్ల వరకు పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం ఉత్తమం.
  9. ఇంటి పరి సరాలు శుభ్రంగా ఉండేలా చూసుకో వాలి.
  10. పిల్లలను ఎత్తుకునే ముందు, వారికి ఆహారం తినిపించేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

Monday, July 24

తొందరగా మర్చిపోతున్నారా?

ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణం... చుట్టూ పచ్చదనం.. ఆడుకోవడానికి చాలా పెద్ద ఆరుబయలు. కానీ పరిస్థితులు మారిపోయాయి. పిల్లలకు ఆట స్థలాలు లేవు. స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, టీవీ వరకు ఇంట్లో ఎన్నో ఎలక్ట్రానిక్‌ వస్తువులు. ఇవన్నీ మూకుమ్మడిగా దాడి చేసి పిల్లల మెదడుపై ప్రభావం చూపుతున్నాయి. వాళ్ల జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తున్నాయి. మరి వాళ్లలో జ్ఞాపకశక్తి పెంచాలంటే ఏం చేయాలి? ఈ కింది టిప్స్‌ చదవండి!

నిద్ర ప్రధానం...
      పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే నిద్ర చాలా అవసరం. పిల్లలకు ఎన్ని గంటల నిద్ర అవసరమనేది వారి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ప్రీ-స్కూల్‌ వయసు పిల్లలయితే రోజుకు 10 నుండి 12 గంటలు, యుక్తవయస్కులయితే ఎనిమిది నుండి తొమ్మిది గంటల మధ్య నిద్ర అవసరం. తొమ్మిదేళ్ళ వయసులో దాదాపు 10 గంటల నిద్ర అవసరం. అంతేకాదు పిల్లలు పడుకునేందుకు సరదా సరదా కథలు చెప్తే మంచిది. వీడియో గేమ్స్‌, టెలివిజన్‌ వంటి ఉద్రేకపరిచే కార్యక్రమాలను చూడనివ్వకూడదు. బెడ్‌రూమ్‌ ప్రశాంతతను మెరుగుపరిచేలా, శరీర ఉష్ణోగ్రతను సమంగా ఉండాలి. శబ్ద్దాలు ఉండకుండా చూసుకోవాలి. అలాగే లేత రంగు కర్టెన్లను ఉపయోగించాలి. పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

టీవీ వద్దే వద్దు...
    చూసినా, చూడకపోయినా చాలా ఇళ్లలో టీవి అలా మోగుతూనే ఉంటుంది. పిల్లలు వాళ్లకి అర్ధమైనా కాకపోయినా టీవీ చూస్తుంటారు. ఇక పిల్లల కోసమే కొన్ని ఛానళ్లున్నాయి. కొన్ని ఇళ్లలో పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలని ఆ ఛానళ్లని పెట్టి పిల్లలను వాటి ముందు కూర్చోబెడుతుంటారు. ఈ కారణాల వలన పిల్లల మెదళ్లలోకి కొన్ని వందల రకాల శబ్దాలు చేరుతుంటాయి. ఇలా చిన్నతనంలో లెక్కకు మించిన భిన్న శబ్దాల హౌరు వారి చెవుల్లో పడుతుంటే పిల్లల్లో జ్ఞాపక శక్తి, తద్వారా నేర్చుకునే శక్తి తగ్గిపోతాయి. ముఖ్యంగా ఎక్కువ సమయం టీవీ ముందు కూర్చునే పిల్లల్లో కొత్త పదాలను నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. టీవీని ఎక్కువగా చూస్తున్న పిల్లలకంటే ప్రశాంతమైన వాతావరణంలో పెరుగుతున్న పిల్లల్లో జ్ఞాపకశక్తి, కొత్తపదాలను గుర్తుంచుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీవీ విషయంలో జాగ్రత్త పడండి.
ఆహారంలోనూ జాగ్రత్త అవసరం...
     జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు ఆహారం కూడా ఎంతో ఉపకరిస్తుంది. అందులో ప్రధానమైన పాత్ర బాదంపాలది. ముఖ్యంగా పడుకునే ముందు వీటిని తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది.
వీటితోపాటు పాలు, పాల ఉత్పత్తులను అధికంగా ఇవ్వండి. మీ పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రోటీన్లు, క్యాల్షియం, పొటాషియం, విటమిన్‌ డి శాతం అధికంగా ఉండేలా చూసుకోండి. స్ట్రాబెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన ఫ్రూట్స్‌, నేరేడు పండ్లను ఇవ్వడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌- సి, ఒమెగా 3 ఫాట్స్‌ వుండే పండ్లను కూడా పిల్లలకు ఇవ్వడం ద్వారా జ్ఞాపక పెరుగుతుంది. అలాగే ఓట్స్‌, ఎరుపు బియ్యంలో విటమిన్‌ బి, గ్లూకోజ్‌ అధికంగా ఉండటంతో రోజూ పిల్లలకు ఆహారంగా ఇవ్వొచ్చు. తద్వారా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక చేపల్లో ఒమెగా 3 ఫాట్స్‌ అధికంగా ఉండటం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుచేత వారానికి రెండుసార్లైనా పిల్లలకు ఇచ్చే ఆహారంలో చేపల్ని చేర్చుకోవాలి.
ఆటలతో మెదడుకు పదును...
      వీడియోగేములూ, కార్టూన్లతో టీవీలకు అతుక్కుని పోయే పిల్లలకి కాస్త భిన్నమైన ఆటలు నేర్పించండి. పిల్లలకు ఇష్టమైన నాలుగైదు వస్తువులు వరుసగా పేర్చండి. కళ్లు మూసి వాటి వరుస క్రమాన్ని మార్చేసి అందులోంచి ఒక వస్తువుని మాయం చేస్తాం అన్నమాట. కళ్లు తెరిచి ఇందులో అక్కడ పేర్చిన వాటిల్లో ఏది మాయమైందో చెప్పమనాలి. ఈ ఆట వల్ల వాళ్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇలా కార్లతో, రకరకాల బంతులతోనూ చేయొచ్చు. రంగులు, షేప్స్‌, ఇలా అన్నింటిని గుర్తు పెట్టుకునే విధంగా ఆటలాడించండి.
దాదాపు పదిహేను నుంచి ఇరవై రకాల వస్తువుల్ని ఓ చోట ఉంచండి. వాటిని ఐదు నిమిషాలు చూడనిచ్చి.. ఆ తరవాత తువాలు లాంటిది కప్పేయండి. ఇప్పుడు వాళ్లు చూసిన వస్తువుల్ని గుర్తుచేసుకుని వీలైనన్ని వస్తువుల పేర్లు చెప్పమనండి. దీనివల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

Thursday, June 29

వర్షాకాలం.. జాగ్రత్తలు

    వాన నీటితో నేలంతా బురదగా మారుతుంది. పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయి. దీంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అంటురోగాలు ప్రబలడం ఖాయం. వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల నీళ్ల విరేచనాలు, చీము-రక్త విరేచనాలు, కలరా, అమిబియాసిస్‌, టైఫాయిడ్‌, కొన్ని రకాల పచ్చకామెర్లు, పోలియో, నులిపురుగుల వ్యాధులు ఎక్కువగా వస్తాయి. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువై మలేరియా, మెదడువాపు, డెంగ్యూ జ్వరం, చికున్‌గున్యా, బోధవ్యాధి రావచ్చు. 


వీటిని నివారించేందుకు జాగ్రత్తలు అవసరం :-
  1. బాగా కాచి చల్లార్చిన నీరు తాగండి. 15 నిమిషాలపాటు నీళ్లను కాచండి. కాచిన పాత్రలోనే చల్లార్చండి. అవసరమనుకుంటే కాచే ముందు వడగట్టండి. ఈచర్యతో నీటి కాలుష్యపు వ్యాధులు నిరోధించొచ్చు.
  2. దోమ తెరలు వాడండి. తద్వారా దోమలు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందండి.
  3. తాగునీటి వనరుల్లో ఆరోగ్య కార్యకర్త సహాయంతో బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపించండి.
  4. చెరువులు, గుంటలు, కాల్వల నీటిని అస్సలు తాగొద్దు.
  5. మీ ప్రాంతంలో నీటి కాలుష్యపు వ్యాధులొస్తే దగ్గరలోని ఆరోగ్య కార్యకర్తకు తెలపండి. నివారణ చర్యలు చేపట్టేలా చూడండి.
  6. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించండి.
  7. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయొద్దు.
  8. వ్యర్థ పదార్థాలను పరిశుభ్రంగా, సురక్షితంగా పారేయండి.
  9. ఆహారం తినే ముందు, మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో కడగండి.
  10. శుభ్రత పాటించని హోటళ్లలో ఆహారం తినకండి. కాచి చల్లార్చిన నీరు ఇవ్వమని అడగండి.
  11. వీధుల్లో విక్రయించే పళ్ల రసాలు తాగొద్దు.
  12. కాచి చల్లార్చిన, క్లోరినేషన్‌ చేసిన నీటితో తయారు చేసిన ఐస్‌ ముక్కలనే వాడండి.
  13. బాగా ఉడికించిన ఆహారమే తినండి.
  14. చలిగాలులకు వీలున్నంత వరకు దూరంగా ఉండండి.
  15. వానాకాలం పాదాలను పొడిగా ఉంచుకోవడం చాలా అవసరం.

Friday, June 23

చిలకడ దుంపలో అద్భుతమైన పోషకాలెన్నో...

చిలకడ దుంపలు అంటే కొందరికి చిన్నచూపు ఉంటుంది. అది సరికాదని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య సంబంధ ప్రయోజనాలున్నాయని పౌష్టికాహార నిపుణులు సూచిస్తారు. సమతుల ఆహారంలో చిలకడదుంపలకే అగ్రస్థానం. వీటిలో తగినన్ని క్యాలరీలు మాత్రమే కాదు, బోలెడన్ని పోషకాలున్నాయి. సాధారణంగా సంప్రదాయ పండుగల సందర్భంగా, ఉపవాస దీక్షల తర్వాత సమతుల ఆహారం కోసం వీటిని తింటారు. ఉపవాస సమయాల్లో, ఆ తర్వాత కూరగాయలు, గింజ ధాన్యాలకు బదులుగా ఎండించిన డ్రైఫ్రూట్స్‌ గింజలు, విత్తనాలు, పాలు, చిలకడదుంపలు, పెండలం, బంగాళాదుంపలు లాంటివి వాడతారు. చిలకడ దుంపలలో ఉండే అద్భుతమైన పోషకాలను పరిశోధించిన పౌష్టికాహార నిపుణులు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. సువాసనలు వెదజల్లుతూ చిలకడదుంపలు పలురంగులలో వివిధ ప్రాంతాల్లో పండుతాయి. వంగ పండు, ఎరుపు, పసుపుపచ్చ, తెలుపు చిలకడ దుంపలు లభిస్తాయి. విత్తనరకాలు, భూసారం, వాతావరణం, ఖనిజ లవణాల లభ్యత తదితర అంశాల ఆధారంగా వీటి రంగు ఉంటుంది.
ఎర్రగా ఉండే దుంపలు సువాసన వెదజల్లుతుంటాయి. ప్రత్యేకించి వీటిని ఉడికించేటప్పుడు వచ్చే పరిమళం కొందరు బాగా ఇష్టపడతారు. ఎరుపురంగు చిలకడ దుంపలలోని బీటా కెరోటిన్‌ మూలంగా ఈ రంగు వచ్చి ఉంటుంది. బీటాకెరోటిన్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎరుపురంగు అధికంగా కనిపిస్తుంది. ఇన్ని పోషక విలువలున్న చిలకడదుంప తింటే లావు అవుతామనే అపోహ కొందరిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమేనని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో గ్లిసోమిక్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువసేపు పొట్టనిండుగా అనిపించవచ్చు. అందువల్ల మితిమీరి తినకూడదు.

రాత్రి ఉద్యోగమా?

మీరు రాత్రిపూట పనిచేసే ఉద్యోగంలో ఉన్నారా..? అయితే మీరు కాస్త మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వారికి షుగర్‌ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
రాత్రి వేళల్లో అది కూడా షిప్టుల్లో పనిచేసే ఉద్యోగుల్లో గ్లూకోజ్‌ నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుందని ఫలితంగా వారికి టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన క్రిష్టోఫర్‌ మోరిస్‌ మాట్లాడుతూ పగలు పనిచేసే వారికన్నా రాత్రి పూట పనిచేసే వారిలో ఇన్సులిన్‌ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని తమ పరిశోధనలో స్పష్టమైందన్నారు. ఈ పరిశోధనలో తేలిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఒక్కరోజు రాత్రి షిప్టులో పనిచేసినందుకే వారిలో గ్లూకోజ్‌ నియంత్రణ వ్యవస్థ గణనీయంగా క్షీణించిందని, ఇన్సులిన్‌ స్థాయి పెరిగిందని తెలిపారు. 

Wednesday, June 14

నిమ్మకాయ, బొప్పాయి కలిపి తీసుకుంటే ఇవి బాగా పెరుగుతాయంట!


పౌష్టికాహారం తినాల్సిందే ...

ఏ ఆహారం తినాలన్న చాలా భయపడిపోతుంటారు. నోటికి రుచిగా ఉంటే తప్ప ముద్ద దిగదు. అలా నోటికి రుచిగా నచ్చిన ఆహారం తినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త శ్రద్ధ వహించాల్సిందే అని చెబుతున్నారు నిపుణులు...
  1. ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్‌ 'సి', 'ఎ', 'కె' లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన న్యూట్రీన్లు అధికంగా ఉంటాయి. అలాగే ఐరన్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి.
  2. క్యాలీ ఫ్లవర్‌లో ఎక్కువగా మినరల్స్‌, విటమిన్స్‌, న్యూట్రీన్స్‌, యాంటీ ఆక్సిడెంట్‌లతో పాటు క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తుంది. అలాగే కిడ్ని ల పని తీరును మెరుగుపరచటంతో పాటు అధిక రక్త పోటును అదుపులో ఉంచుతుంది. క్యాలీ ఫ్లవర్‌లో ముఖ్యంగా విటమిన్‌ 'సి', 'కె', ప్రోటీన్లు, మెగ్నిషియం, పొటాషియం, పాస్పరస్‌, మాంగనీస్‌ వంటి పోషకాలు చాలా ఉంటాయి.
  3. అధిక రక్త పోటును అదుపులో ఉంచటంలో బీట్‌రూట్‌ జ్యూస్‌ బాగా పని చేస్తుంది. అలాగే రక్త కణాలను పెంచటంలో బీట్‌రూట్‌ పాత్ర కీలకం. బీట్‌రూట్‌లో ఉండే కణాలు ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
  4. బాదం, బీన్స్‌, శనగలు, చిక్కుడు వంటి గింజల్లో ప్రోటీన్స్‌, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించటంలో ప్రాముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే వీటిలో కొలెస్ట్రాల్‌ చాలా తక్కువగా ఉంటుంది.

మెడ నలుపు తగ్గాలంటే!

గిల్టు నగలు ఎలర్జీ ఉన్నవారు ధరించకూడదు. 
వాటిని ధరిస్తే మెడనలుపుగా తయారవుతుంది. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు...
  1. చెంచా పెరుగులో నాలుగైదు చుక్కలు నిమ్మరసం కలిపి ఆ మిశ్రమముతో మెడకు మసాజ్‌ చేస్తే మెడ నలుపు పోతుంది.
  2. నిమ్మరసం, పాలు కలిపిన మిశ్రమాన్ని మెడకు రాసి పావుగంట తరువాత సున్నిపిండితో కడుక్కోవాలి. ఈవిధంగా రోజూ చేస్తే మెడ నలుపు తగ్గుతుంది.
  3. కొందరికి మెడ మడతలలో మురికి చేరి ఉంటుంది. సబ్బుతో ఎంత రుద్దినా పోదు. అటువంటి వారు పెరుగులో బియ్యప్పిండి కలిపి మెడకు రాసి ఐదు నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మెడ శుభ్రంగా ఉంటుంది.
  4. క్లెన్సింగ్‌క్రీమ్‌ మార్కెట్లో దొరుకుతుంది. ఆ క్రీమ్‌ దూదితో తీసుకుని మెడకు రాసి రెండు నిమిషాలాగి తుడిచేయాలి. దీనివల్ల మెడమీద మురికి, నలుపు పోతుంది.
  5. ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుంటే మెడ లావు తగ్గుతుంది.
  6. మెడకు ఎక్కువ చెమట పడుతుంటే మీరు నగలు ధరించాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా! అటువంటప్పుడు ఆస్జ్రిజెంట్‌ లోషన్‌ని దూదితో తీసుకుని మెడకు రాసి ఐస్‌క్యూబ్స్‌తో రబ్‌ చేయండి. తరువాత టవల్‌తో అద్ది లైట్‌గా పౌడర్‌ జల్లుకోండి. తరువాత మీ ఇష్టం వచ్చినన్ని నగలు ధరించవచ్చు.