Friday, March 31

అనుక్షణం అవస్థే..

చికెన్‌పాక్స్‌ (ఆటలమ్మ) అంటువ్యాధి. దీన్ని వ్యవహారిక భాషలో 'అమ్మవారు' అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా చికెన్‌పాక్స్‌కి మించిన అంటువ్యాధి లేదు. వేసవిలో ఇది ప్రబలుతుంది. దీని బారినపడిన రోగి మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటి నుంచి వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుంది. చికెన్‌పాక్స్‌ వచ్చిన వారు పడే అవస్థలు వర్ణనాతీతం.

చికెన్‌పాక్స్‌ అనేది 'హెర్పెస్‌ జోస్టర్‌' వైరస్‌ వల్ల వ్యాపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా ప్రబలే అంటువ్యాధి ఇది. పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంది. దీని వల్ల దద్దుర్లు ఏర్పడతాయి. ఒకసారి చికెన్‌పాక్స్‌ వస్తే రెండోసారి వచ్చే అవకాశం లేదు. చికెన్‌పాక్స్‌ వచ్చిన తర్వాత శరీరంలో యాంటీబాడీస్‌ పెరిగి రోగ నిరోధక శక్తి పెంపొందడం వల్ల మళ్లీ ఈ అంటువ్యాధి రాదు.
లక్షణాలు :-
చికెన్‌పాక్స్‌ వచ్చిన తర్వాత 10 రోజుల నుంచి మూడు వారాల వరకు లక్షణాలు కనిపిస్తాయి. చికెన్‌పాక్స్‌ వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత లక్షణాలు కనిపించడానికి మధ్య కొంత సమయం పడుతుంది. అంటే.. వెంటనే లక్షణాలు కనిపించవన్నమాట. వైరస్‌ బారిన పడ్డప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 10 రోజుల తర్వాత మెల్లమెల్లగా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మొదటి సంకేతంగా జ్వరం వస్తుంది. ఒంట్లో అసౌకర్యంగా ఉంటుంది. తర్వాత శరీరంపై నీటి బొబ్బలు ఏర్పడతాయి. ఇవి ఏ భాగానికైనా రావచ్చు. ఈ నీటి బొబ్బలు దురద పుట్టిస్తాయి. కొన్ని రోజుల తర్వాత అవి పగిలిపోతాయి. ఆ భాగంలో చర్మం గట్టిగానూ, పెళవంగానూ మారుతుంది. నెమ్మదిగా నయమవుతుంది. సుమారు రెండు వారాల్లో ఇవి పూర్తిస్థాయిలో తగ్గుతాయి.
షింగిల్స్‌ కూడా అలాంటిదేనా?
షింగిల్స్‌ అనేది చికెన్‌పాక్స్‌కు సంబంధించిన వ్యాధి మాత్రమే. లక్షణాలు మాత్రం వేరు. చికెన్‌పాక్స్‌ వచ్చిన తర్వాత వైరస్‌ శరీరంలో అంటిపెట్టికుని ఉంటుంది. తర్వాతి దశలో అత్యంత చురుగ్గా మారిపోతుంది. దీన్నే షింగిల్స్‌ అంటారు. షింగిల్స్‌ ఉంటే చర్మంపై దురుద పుట్టించే బొబ్బలు మచ్చలుగా మారుతాయి. కొద్ది రోజుల వరకు మానకుండా ఉంటాయి. ఇవి భరించలేని నొప్పి కలిగిస్తాయి.
చికెన్‌పాక్స్‌ ఎలా వ్యాపిస్తుంది?
చికెన్‌పాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ ఉన్న వ్యక్తిని తాకినప్పుడు లేదా అతడు/ఆమె శ్వాస పీల్చినప్పుడు ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. చికెన్‌పాక్స్‌ వచ్చిన రెండు రోజుల తర్వాత దద్దుర్లు వస్తాయి. తర్వాత అవి నీటి బొబ్బలుగా మారుతాయి. ఆ తర్వాత పగిలిపోతాయి. ఆ సమయంలోనే చికెన్‌పాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. చికెన్‌పాక్స్‌ ఉన్నవారితో సన్నిహితంగా మెలగడం, కనీసం ఐదు నిమిషాలు ఎదురుగా నిలబడి మాట్లాడటం, చికెన్‌పాక్స్‌ ఉన్నవారున్న గదిలో కనీసం 15 నిమిషాలు గడపడం వల్ల కూడా వైరస్‌ వ్యాపిస్తుంది.
గర్భధారణ సమయంలో వస్తే..
ఇంతకు ముందే చికెన్‌పాక్స్‌ వచ్చి ఉంటే గర్భిణులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇంతకు ముందు రాకపోతే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టరును సంద్రించి ముందు జాగ్రత్తలు పాటించాలి. గర్భధారణ సమయంలో దద్దుర్లు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
ఎలాంటి అవలక్షణాలు కనిపిస్తాయి?
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు చికెన్‌పాక్స్‌ వచ్చినట్టయితే ఎలాంటి అవలక్షణాలు కనిపించవు. పిల్లలు, రోగ నిరోధకశక్తి తక్కువ ఉన్న పెద్దల్లో, గర్భిణుల్లో చికెన్‌పాక్స్‌ వచ్చినట్టయితే అంటువ్యాధులు ప్రబలుతాయి. బ్యాక్టీరియాకు సంబంధించిన అంటువ్యాధులు, న్యుమోనియా, రక్తంలో అంటువ్యాధి, అతిసార తదితర వ్యాధులు దరిచేరుతాయి.
వాక్సిన్‌ తీసుకుంటే సరిపోతుందా?
గర్భిణులు చికెన్‌పాక్స్‌ వాక్సిన్‌ తీసుకోవద్దు. అలాగే.. ఈ వాక్సిన్‌ తీసుకున్నప్పుడు అలర్జీ బారినపడిన వ్యక్తులూ తీసుకోకూడదు. ఇతర కారణాల వల్ల అనారోగ్యంగా ఉన్నవాళ్లు పూర్తిగా కోలుకున్న తర్వాత చికెన్‌పాక్స్‌ వాక్సిన్‌ తీసుకోవాలి.
మరకలు శాశ్వతంగా తొలగిపోతాయా?
చికెన్‌పాక్స్‌ వల్ల ఏర్పడిన నీటి బొబ్బలు పగిలిపోయి మచ్చలుగా ఏర్పడతాయి. ఇవి శరీరంపై వికారంగా కనిపిస్తాయి. అయితే.. కొంతకాలం తర్వాత ఈ మచ్చలు తగ్గిపోతాయి. ఇవి పోవడానికి ప్రత్యేకంగా మందులు వాడాల్సిన అవసరం లేదు. కొన్ని వారాల తర్వాత వాటంతట అవే కనుమరుగవుతాయి.

జాగ్రత్తలు ఇవీ.. 
  1.  దద్దుర్లను, బొబ్బలను గీరకూడదు.. చిట్లించొద్దు.
  2. వీలైనంత వరకు పిల్లలకు గోళ్లు లేకుండా చేయాలి. నిద్రలో గోక్కోకుండా చేతులకు శుభ్రమైన గుడ్డ గానీ, గ్లౌజులు గానీ తొడగాలి.
  3. వీలైనంత వరకు చల్లని, గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. దీంతో దురద కాస్త తగ్గుతుంది.
  4. జ్వరం, దగ్గు అధికంగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి.
  5. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
  6. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.
  7. చికెన్‌పాక్స్‌ ఉన్న వారి వస్తువులు, బట్టలు, సబ్బు వేరుగా ఉంచాలి. విడిచిన దుస్తులను వేడి నీళ్లతో శుభ్రపర్చాలి.
  8. వ్యక్తిగత శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి.  
- డాక్టర్‌ శిల్పా అరలికర్‌, 
 కన్సల్టెంట్‌ ఫిజిషియన్‌, 
కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌-హైదరాబాద్‌  

ఎసిడిటీకి సింపుల్, సూపర్ మెడిసిన్..!

ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎసిడిటీ.. సమయానికి తినకపోవడం, కారం, మసాలా వంటి స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్ వెరసి ఎసిడిటీ, గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏ రోగానికైనా చికిత్స కన్నా నివారించడమే మంచి మార్గం. ఎసిడిటీ వంటి సమస్యలను నివారించడం ద్వారానే ఇబ్బంది లేకుండా ఉండగలుగుతాం.. సరైన సమయంలో సరైన తిండి తింటే ఎసిడిటీ సమస్య అనేదే రాదు. ఒక వేళ వచ్చినా కింది వీడియోలో చెప్పిన విధంగా చేస్తే నివారణ సులువవుతుంది. పైగా ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండి సులభంగా త్వరగా తయారు చేసుకోగలిగిన ఈ మిశ్రమం గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి..

Saturday, March 25

అసలు పండ్లు భోజనం ముందు తినాలా ? లేక భోజనం తరువాత తినాలా?

చాలామందికి అర్థం కాని ప్రశ్న. కొంతమంది భోజనానికి ముందే తినాలి అని అంటారు, మరికొందరేమో భోజనం తరువాతే తినాలంటారు. ఇంతకి ఎప్పుడు తినొచ్చు?

అసలు ఫ్రూట్స్ తినటానికి ఇది సరైన సమయం అనే సమయమే లేదు. అలాగే ఈ టైమ్ లో పండ్లు తినకూడదు అని వాదించటం కూడా దండగే. నిజానికి పండ్లను భోజనానికి ముందు తినొచ్చు, భోజనం తరువాత తినొచ్చు, భోజనంతోపాటే తినొచ్చు.

మరి భోజనం వేరుగా ఉంటుంది, పండ్లు వేరుగా ఉంటాయి, రెండూ ఓకేసారి తింటే జీర్ణక్రియపై అది ప్రభావం చూపదా అని మీకో డౌటు రావొచ్చు. మన కడుపులో రకరకాల ఆహారానికి రకరకాల డైజెస్డీవ్ ఎంజైమ్‌లు ఉంటాయి. అందుకే, రెండు భిన్న రకాల ఆహారాన్ని ఒకేసారి తీసుకోవడం వలన ఎలాంటి ఇబ్బంది రాదు. దీని వెనుక చాలా సింపుల్ లాజిక్. భోజనం చేసేటప్పుడు మనం అన్నంలో ఒకేరకమైన కూరని వాడట్లేదుగా, కాస్తంత కూరతో, కాస్తంత పచ్చడితో, కాస్తంత పెరుగుతో తింటుంటాం.

సో, మన ఆహారంలో ఎప్పుడూ ఒకే రకమైన న్యూట్రింట్స్ ఉండవు. భిన్నమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి మన కడుపుకి ఉంటుంది. అందుకే, పండ్లను ఎప్పుడైనా తినొచ్చు, భోజనానికి ముందైనా, తరువాతైనా!

Friday, March 24

7రోజులు క్రమం తప్పక కొబ్బరి నీళ్ళు తాగితే ఉహించని ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!

చాలామందికి ఎండలో బాగా తిరిగినా బాగా అలసటగా అనిపించినా వెంటనే గుర్తొచ్చేది కొబ్బరి బోండాం. మార్కెట్లో ఎన్నో రకాల శీతలపానీయాలు దొరుకుతున్నా దాహార్తిని తీర్చి మెరుగైన ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది కొబ్బరి బోండాం మాత్రమే. ప్రకృతి నుంచి లభించే కొబ్బరి బొండా నీటిని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. కొబ్బరి బొండాం నీటిని వారం క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు...
* నిత్యం కొబ్బరి బొండాం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* శరీరంలో బ్యాక్టీరియాను బయటకు పంపి, యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి తోడ్పడుతుంది.
* శీతాకాలంలో కూడా కొబ్బరి బోండాం తాగడం వల్ల జలుబు రాకుండా ఉంటుంది.
* కొబ్బరిబొండాన్ని వారం పాటు తీసుకుంటే ఇంతకు ముందు లేని ఉత్సాహం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
* కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్‌ తొలగడమే కాక కిడ్నీల్లో రాళ్లు కూడా క్రమేపి తగ్గుతాయి.
* కొబ్బరి బోండాం నిత్యం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. షుగర్‌ పేషెంట్లు కూడా డాక్టర్ల సలహా మేరకు కొబ్బరి బోండాం తాగడం మంచిది.
* శరీరానికి కావలసిన ఫైబర్‌ను కొబ్బరిబొండాంలోని నీళ్లు అందిస్తాయి.
* వారం రోజులు క్రమం తప్పకుండా కొబ్బరి బోండాం తాగితే బాడీలో కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
* కొబ్బరినీళ్లు తాగితే డీహైడ్రేషన్‌ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
* చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొబ్బరినీళ్లు వారం రోజులపాటు తాగితే చర్మకాంతి మెరుగుపడుతుంది.
* తల్లి పాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ కొబ్బరి బోండాం నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఈ నీళ్లను పిల్లలు తాగితే మానసిక, శారీరక ఎదుగుదల చక్కగా ఉంటుంది.
* గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్బాశయంలో ఉన్న సమస్యలు తగ్గి, బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
* కొబ్బరినీళ్లు కంటిచూపు మెరుగుపరచడానికీ తోడ్పడతాయి.
* కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మంపై ముడతలు రావడం తగ్గి, వయసు తక్కువగా కనపడుతుందంటున్నారు బ్యూటీషియన్లు.

Sunday, March 19

చక్కటి ఆరోగ్యానికి రెండు అద్భుత గ్రంథాలు....!

మన ప్రాచీన గ్రంథాలలో, వేదాలలో ఇమిడి ఉన్న సంప్రదాయక ఆరోగ్య పరిరక్షణ పద్ధతులను వెలికి తీసి వాటిని అందరికీ ఉపయోగపడేలా చేయాలని స్వామి మైత్రేయ సంకల్పించారు. ఆ సంకల్పానికి అక్షర రూపమే ‘ముద్రల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం’, ‘మధుమోహమే మధుమేహం’. మొదటి దానిని ఆయన శిష్యురాలు శ్రీమతి లక్ష్మీమైత్రేయ రాయగా, రెండవ దానిని మరో శిష్యులు శ్రీమతి విజయలక్ష్మీ మైత్రేయ అందించారు.
‘అరచేతిలో ఆరోగ్యం’అనే పుస్తకంలో మన ఆరోగ్యంపై హస్తముద్రలు ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుపుతూ, మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వాటి ప్రాముఖ్యతను సులభశైలిలో వివరించారు. ప్రతిముద్రనూ ఎలా వేయాలో రేఖాచిత్రాలు, ఫొటోల రూపంలో చూపించడమేగాక ఏ రకమైన రుగ్మతకు ఏ ముద్ర వేయాలో చెబుతూ దానికి తీసుకోవలసిన జాగ్రత్తలతో సహా వివరించే ఈ పుస్తకం అవశ్య పఠనీయం.
లేచింది మొదలు పడుకునేవరకు కాలంతో పోటీ, రోజంతా క్షణం తీరిక లేని పని ఒత్తిడి. ఫలితంగా వయసుతో పని లేకుండా అనేకమంది స్ర్తీలు, పురుషులు మధుమేహవ్యాధికి గురవుతున్నారు. అనేక రకాల భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి, ఇతర శారీరక, మానసిక అనారోగ్యాలు కూడా మధుమేహానికి దారితీస్తున్నాయి. దానివల్ల కలిగే బాధలు సామాన్యమైనవి కావు.
ఒకసారి మధుమేహవ్యాధి వచ్చిందా అంటే ఇక జీవితాంతం ఔషధ సేవ తప్పదని వైద్యులు చెబుతున్నారు. అయితే శారీరక వ్యాయామం, ఆసనాలు, షట్కర్మ క్రియలు, ప్రాణాయామాలు, ముద్రలు తదితరాలను ఆచరించడం ద్వారా మధుమేహ వ్యాధిని మన దరి చేరకుండా చేయవచ్చునని, ఒకవేళ వచ్చినా సులభంగా నివారించుకోవచ్చునన్నది ‘మధుమోహమే మధుమేహం’ పుస్తకసారాంశం. ఇందులో మన జీవనశైలి, ఆహారవిధానాలు, ఆరోగ్యసూత్రాలను పాటించడం ద్వారా ఆ వ్యాధిని ఎలా నివారించుకోవచ్చో చక్కగా వివరించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి మార్గదర్శనం చేసే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగ్గది.

Thursday, March 16

తేనెలో నానబెట్టిన ఉసిరికాయని పరగడుపున తింటే బోలెడన్ని లాభాలు...

తేనె వల్ల ఎలాంటి రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అలాగే ఈ కాలంలో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వల్ల కూడా మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ క్రమంలో ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే… అప్పుడు మన శరీరానికి ఇంకా ఎక్కువ పోషకాలు లభించడమే కాదు, దాంతో ఎన్నో అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. తేనెను, ఉసిరికాయలను కలిపి ఎలా తినాలో, ఆ మిశ్రమం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. దీంతో కింద చెప్పిన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
లివర్ సమస్యలకు…
పైన చెప్పిన విధంగా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది.
చర్మంపై వచ్చే ముడతలకు…
వయస్సు మీద పడడం వల్ల చర్మం ముడతలుగా తయారవుతుంటుంది. అయితే పైన చెప్పిన తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే దాంతో ఆ ముడతలు తగ్గిపోతాయి. దీని వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా కూడా మారుతుంది.
ఆస్తమాకు…
ఈ చలి కాలంలో ఆస్తమా అనేది చాలా మందిని ఇబ్బందులు పెడుతుంది. సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేరు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే దాంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే తేనె, ఉసిరి మిశ్రమంలో ఉండే సహజ సిద్ధమైన పోషకాలు ఆస్తమాను దూరం చేస్తాయి. శ్వాస కోశ సమస్యలు రాకుండా చూస్తాయి.
దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లకు…
తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. దీంతో ఈ మిశ్రమం వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి.
జీర్ణాశయ సమస్యలకు…
చలికాలం మన జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. తిన్నది ఓ పట్టాన జీర్ణం కాదు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే ఆ సమస్య ఉండదు. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అంతేకాదు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. ఆకలి మందగించిన వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా మంచిది. దీంతో ఆకలి పెరుగుతుంది. అంతేకాదు, మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
వ్యర్థ పదార్థాలకు…
తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా సేవిస్తుంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.
అధిక బరువుకు…
తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీని వల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. ఇది స్థూలకాయం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది.
సంతాన సాఫల్యతకు…
తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా అవుతుంది. పిల్లలు కలిగేందుకు అవకాశాలు పెరుగుతాయి. అదే మగవారిలో అయితే వీర్య నాణ్యత పెరుగుతుంది. లైంగిక పటుత్వం కలుగుతుంది.
వెంట్రుకల సంరక్షణకు…
తేనె, ఉసిరి మిశ్రమాన్ని సేవిస్తే వెంట్రుకలు కూడా సంరక్షింపబడతాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

Monday, March 6

పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది!!

అవును ఒకే ఒక ఉల్లిపాయతో షుగర్ పని పట్టొచ్చు. ఇది సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది. ఇటీవలి కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది. హల్లో పతి మందులకు లొంగని హై షుగర్ సైతం 50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుందని పేర్కొంటోంది. చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే.. ఇలా 7 రోజులు చేస్తే అద్భుత మైన ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది. పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఆచరించడంతో పాటుగా నలుగురికి తెలిసేలా షేర్ చేయండి..

ఇలా చేయాలి: 
* రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లి పాయలను ఖచ్చితంగా తినాలి.
* ఉదయం పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకుని తిన్నా సరే.. పచ్చిది మాత్రం తినాలి.
* 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.
* 7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.
* 50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.
* పచ్చి ఉల్లిపాయతో పచ్చిపులుసు చేసుకుని అన్నంతోపాటు తిన్నా సరిపోతుంది.
పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు:
* ఉల్లిపాయ‌ను స‌న్న‌ని ముక్క‌లుగా క‌ట్ చేసి ఆ ముక్క‌ల‌ను నీటిలో వేసి మ‌రిగించి తాగుతుంటే మూత్రంలో మంట త‌గ్గిపోతుంది.
* ఉల్లిపాయ‌ల‌ను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగ‌ర్‌కు క‌లిపి తింటూ ఉంటే జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోయి ఆ వ్య‌వ‌స్థ‌లు ప‌టిష్ట‌మ‌వుతాయి.
* ఉల్లిపాయ‌ను గుజ్జుగా దంచి దానికి చిటికెడు న‌ల్ల ఉప్పు పొడిని క‌లిపి రోజూ 2, 3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచ‌నాలు, వాంతులు అదుపులోకి వ‌స్తాయి.
* ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మ‌హిళ‌ల్లో వ‌చ్చే రుతుక్ర‌మ స‌మ‌స్య త‌గ్గిపోతుంది.
* అదే పురుషుల‌కి వీర్య క‌ణాల స‌మ‌స్య పోతుంది. పడక గదిలో జోష్ వస్తుంది.
* ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల బీపీ, గుండెపోటు, ఆస్త‌మా, అల‌ర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, ద‌గ్గు, జ‌లుబు, నిద్ర‌లేమి, స్థూల‌కాయం వంటి స‌మ‌స్య‌ల‌ను రావు.
* కాలిన గాయాల‌పై ప‌చ్చి ఉల్లిపాయ‌ను మ‌ర్ద‌నా చేయాలి. దీంతో ఆ ప్ర‌దేశంలో ఏర్ప‌డే మంట‌, నొప్పి త‌గ్గిపోతాయి. అంతేకాదు ఇన్‌ఫెక్ష‌న్లు కూడా రావు.

Sunday, March 5

మీరు తినడమే కాదు.. మీ పిల్లలకు కూడా ఈ తీపి విషాన్ని పెడుతున్నారు ! అవును పంచదార ఒక తియ్యని విషం...

మనం రోజు తినే ఆహారాలు ఎంతో కొంత పోషకాలను ఇస్తే... ఇంకొన్ని ఆ పోషకాలు ఇవ్వకపోవడమే కాకుండా విషంలా మన శరీరమంతా వ్యాపిస్తున్నాయి. దీంతో ఎంతో మంది రకరకాల జబ్బుల భారీన పడుతున్నారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన పదార్థం షుగర్. మనం తినే ఏ పదార్థాలలో కూడా లేనన్ని కెమికల్స్ ఒక్క షుగర్ లోనే ఉంటాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి.

అసలు షుగర్లో ఎలాంటి కెమికల్స్ కలుపుతారు, దీంతో తియ్యటి విషం ద్వారా ఎలాంటి రోగాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

  • 1866 లో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ బ్రిటిష్ లో ప్రారంభించారు.
  • భారతీయులు ఇదివరకు షుగర్కు బదులుగా బెల్లం ని తినేవారు. దీంతో చాలా అరుదుగా అనారోగ్యానికి గురయ్యేవారు.
  • షుగర్ తయారుచేయడానికి సల్ఫర్ ఉపయోగిస్తారు. సల్ఫర్ ని టపాసులు తయారుచేయడానికి వాడుతారు. సల్ఫర్ మన శరీరంలోకి ఒక్కసారి ప్రవేశించిందంటే తిరిగి బయటకు వెళ్ళే వీలు ఉండదు.
  • షుగర్ వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె పోటు కి ముఖ్య కారణం కొలెస్ట్రాల్.
  • షుగర్ శరీర బరువుని పెంచుతుంది. దీంతో మనిషి లావు అయిపోతాడు.
  • షుగర్ వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. మన బ్రెయిన్ కి నష్టం కలిగించే బ్లడ్ క్లాట్స్ షుగర్ వల్లనే ఏర్పడతాయి.
  • షుగర్ లో ఉండే సుక్రోజ్ మన శరీరంలో జీర్ణం కాదు.
  • షుగర్ లో దాదాపు 23 రకాల హానికారక కెమికల్స్ ఉంటాయి.
  • డయాబెటిస్ రాడానికి ముఖ్య కారణం షుగర్.
  • కడుపులో మంట రాడానికి కూడా కారణం షుగరే.
  • మన శరీరంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ని షుగర్ అమాంతంగా పెంచేస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.
  • పక్షవాతం(Paralysis) రాడానికి కూడా ముఖ్య కారణం షుగర్.
  • షుగర్ కి బదులుగా బెల్లం ని వాడండి.
దయచేసి ఈ పోస్టుని ఇతరులతో షేర్ చేయండి. ముఖ్యంగా మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కలిపించండి..!

కోడి గుడ్డుతో గుండెపోటును అడ్డుకునే చిన్న ట్రిక్..?

ఇటీవ‌ల మాన‌వ‌జీవ‌న విధానంలో వ‌చ్చిన జీవ‌న‌శైలీ మార్పుల వ‌ల్ల మ‌నిషిని ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టు ముడుతున్నాయి. వీటిల్లో గుండెపోటు ఒక‌టి. గుండెపోటు ఓసారి వ‌చ్చాక జాగ్ర‌త్త ప‌డ‌డం క‌న్నా… ఓ చిన్న ట్రిక్‌తో దానిని రాకుండా ముందే అడ్డుకోవ‌చ్చ‌ట‌.
అందుకోసం మీరు ల‌క్ష‌లు, వేలు ఖ‌ర్చు చేయ‌క్క‌ర్లేదు. గుండెపోటును అడ్డుకునే చిన్న ఆయుధం అదే కోడిగుడ్డు.
సగటున ఒక పెద్ద సైజ్ కోడిగుడ్డులో ఆరు గ్రాముల హై క్వాలిటి ప్రొటీన్, రెండురకాల యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,డి,ఈ ఉంటాయి. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు ఉడ‌క‌పెట్టిన కోడిగుడ్డు తింటే గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాలు 12 % త‌గ్గుతాయ‌ని తాజా ప‌రిశోధ‌న‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.
ఈ విషయంపై అమెరికాలో ఓ ప్రోఫేసర్ డామినిక్ అలెగ్జాండర్ రీసెర్చ్ చేశారు. గుడ్డులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాప‌ర్టీస్‌తో పాటు ప్రోటీన్లు బాగా ఉండ‌డంతో ఇవి బ్ల‌డ్ ప్రెష‌ర్‌ను కంట్రోల్ చేస్తాయ‌ట‌. ఈ రీసెర్చ్ చిన్న‌గా జ‌ర‌గ‌లేదు. ప్ర‌తి రోజు మూడు లక్షలమందికి డైట్ లో గుడ్లని రోజూ అందిస్తూ, కొన్నేళ్ళపాటు పరీక్షలు చేశారు. ఆ తరువాత జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రీషన్, అమెరికన్ ఎగ్ బోర్డ్ ఈ ఫలితాలు ప్ర‌క‌టించారు.

Saturday, March 4

ఈ ఆహార ప‌దార్థాల‌ను రెండో సారి వేడి చేసి అస్స‌లు తిన‌కూడ‌దు..!

ఏ ఆహార ప‌దార్థాన్న‌యినా వేడి వేడిగా వండుకుని తింటేనే ఆ ఆహారం బాగుంటుంది. చ‌క్క‌ని రుచి ఉంటుంది. వేడిగా ఉన్న‌ప్పుడు తింటేనే పోష‌కాలు అందుతాయి. కానీ… కొంద‌రు అలా కాదా. వేడిగా ఉన్న‌ప్పుడు కాకున్నా, చ‌ల్ల‌గా అయ్యాక దాన్ని మ‌ళ్లీ వేడి చేసుకుని తింటారు. దీంతో వేడిద‌నం త‌గిలి ఆహారం బాగుంటుంద‌ని వారు అనుకుంటారు. అయితే అది ఎంత మాత్రం క‌రెక్ట్ కాద‌ట‌. నిజంగా చెప్పాలంటే… ఆహారాన్ని తిరిగి వేడి చేసుకుని తిన‌డం మంచిది కాద‌ట‌. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన ఆహార ప‌దార్థాల‌నైతే అస్స‌లు రెండో సారి వేడి చేసుకుని తిన‌కూడ‌ద‌ట‌. అలా తింటే ఏమ‌వుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
ఆలుగ‌డ్డ‌లు :- ఆలుగ‌డ్డ‌ల‌ను మొద‌టి సారి వండిన‌ప్పుడే, వేడిగా ఉన్న‌ప్పుడే తినాలి. వాటితో వండిన కూర‌ను ఎక్కువ సేపు ఉన్నాక తిన‌కూడ‌దు. అలాగే ఆ కూర‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేసి తిన‌కూడ‌దు. అలా చేయ‌డం వ‌ల్ల వాటిలో విష ర‌సాయ‌నాలు త‌యార‌వుతాయి. అవి క‌డుపులోకి వెళ్తే మ‌న‌కు వికారం, వాంతులు, ఫుడ్ పాయిజన్ వంటి స‌మ‌స్య‌ల‌ను క‌లిగిస్తాయి.
అన్నం :- బియ్యం వండిన త‌రువాత త‌యార‌య్యే అన్నంలోనూ స్పోర్స్ అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన బాక్టీరియా ఉంటుంది. ఇది స‌మ‌యం గ‌డిచిన కొద్దీ త‌న ప్ర‌భావాన్ని చూపిస్తూ ఉంటుంది. అదే చాలా ఎక్కువ సేపు ఉంచాక అలాంటి అన్నం తింటే దాంతో ఆ బాక్టీరియా పెద్ద ఎత్తున మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. అలా ఎక్కువ సేపు ఉంచిన అన్నాన్ని వేడి చేసి కూడా తిన‌కూడ‌దు. ఎందుకంటే వేడి చేసినా ఆ బాక్టీరియా చావ‌దు. అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఆ అన్నాన్ని తింటే దాంతో డ‌యేరియా, వాంతులు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది.
గుడ్లు :- కోడిగుడ్లతో చేసిన కూర‌ను ఒకే సారి తినాలి. దాన్ని మ‌ళ్లీ మళ్లీ వేడి చేసి తిన‌కూడదు. అలా తింటే ఆ కూర‌లో పేరుకుపోయిన విష ప‌దార్థాలు మ‌న శ‌రీరానికి హాని చేస్తాయి. ప్ర‌ధానంగా ప‌లు జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు.
చికెన్‌ :- చికెన్‌ను కూడా మొద‌టి సారి వండిన‌ప్పుడే తినాలి. రెండోసారి వేడి చేసి తిన‌కూడ‌దు. అందులో ఉండే విష ప‌దార్థాలు జీర్ణ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతాయి. అజీర్ణం స‌మ‌స్య త‌లెత్తుతుంది.
పాల‌కూర‌ :- పాల‌కూర మాత్ర‌మే కాదు, ఇత‌ర ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల్లో నైట్రేట్స్, ఐర‌న్‌లు ఉంటాయి. అయితే ఆహారాన్ని ప‌దే ప‌దే వేడి చేయ‌డం వ‌ల్ల ఇవి కాస్తా నైట్రైట్స్ గా మారుతాయి. దీంతో వాటి వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.
నూనెలు :- వంట‌ల కోసం ఉప‌యోగించే నూనెల‌ను కూడా ఒకేసారి వాడాలి. ఒక‌సారి వాడిన నూనెను కాగ‌బెట్టి మ‌ళ్లీ వాడితే అందులో పేరుకుపోయి విష ప‌దార్థాలు మ‌న శ‌రీరంలోకి వెళ్లి ప‌లు వ్యాధుల‌ను క‌లిగిస్తాయి. క‌నుక నూనెల‌ను ఒకేసారి వాడ‌డం ఉత్త‌మం. వేడి చేసి మ‌ళ్లీ మ‌ళ్లీ వాడ‌కూడదు.
పుట్ట గొడుగులు :- చికెన్‌, ఎగ్స్ లాగే పుట్ట గొడుగుల్లోనూ ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందుకని వీటితో కూర వండుకుంటే ఒకేసారి తినాలి. అంతేకానీ ఆ కూర‌ను మ‌ళ్లీ వేడి చేసుకుని తిన‌కూడ‌దు. అలా తింటే వాటిలో ఉండే విష ప‌దార్థాలు గుండె స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడ‌తాయి.
బీట్ రూట్‌ :- పాల‌కూర‌లాగే బీట్‌రూట్ కూడా ఉంటుంది. దీన్ని ఒకేసారి వండుకుని తినాలి. అలా వండిన దాన్ని వేడి చేసి మ‌ళ్లీ తిన‌కూడ‌దు. తింటే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి.

Friday, March 3

రాత్రి పూట ఈ రెండు పచ్చడ్లు అస్సలు తినకండి! ఎందుకు తినకూడదు? అసలు ఏమి పచ్చడి తినకూడదు..?

చాలా మంది కి అలవాటు రాత్రి పూట పెరుగు వేసుకోని తినడం. ఆ పెరుగులో నంచ్చుకోవడానికి ఒక పచ్చడి కూడా తప్పని సరి. ఈ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా తమ అభిరుచికి తగ్గటు తింటారు. 

తాజాగా వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం రాత్రులు పూట నిమ్మ, ఉసిరి కాయ పచ్చడి తినకూడదంట. ఎందుకంటే ఇవి తినటం వల్ల వాతం వచ్చే ఛాన్స్ లు ఎక్కువంట
వీటిని తినటం తలలోని కొన్ని నాడులు పగిలిపోయే అవకాశాలు వున్నాయట. దీని వల్ల పక్షవాతం రోగం వస్తుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. అందుకే ఈ రెండు పచ్చళ్ళను రాత్రులు తినకూడదని అంటున్నారు వైద్య నిపుణులు.. 

అలాగే వాతం వున్న వారు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, చింతకాయ, ఊసిరి తినకూడదు అని కూడా తేల్చి చెప్పారు వైద్యులు..