Thursday, October 17
Saturday, August 31
Sunday, June 30
Sunday, June 9
గ్యాస్ సమస్యకు చెక్...
Oppo F11 Mobiles
అల్లం:- గ్యాస్ సమస్యకు మంచి మందు అల్లం. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. తిన్నగా నమలలేకపోతే చక్కెర కలుపుకుని తినొచ్చు.
వెల్లుల్లి:- గ్యాస్ సమస్యకు వెల్లుల్లి చాలా చక్కటి సహజసిద్ధమైన మందు. దీనిని తిన్నగా నమలాలి. లేదా వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర విత్తనాలు, జీలకర్ర గింజలు తీసుకుని ఐదు నిమిషాల పాటు నీళ్లలో ఉడికించాలి. ఈ ద్రావణాన్ని తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు
దాల్చిన చెక్క:- దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూస్‌ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య పోతుంది.
కొబ్బరి నీళ్లు:- గ్యాస్ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు మంచిమందు. ఇందులో అసాధారణ ప్రోటీన్లు ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
కొత్తిమీర:- అజీర్తి నిర్మూలనకు కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒక గ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
నిమ్మరసం:- గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మరసం ఎంతో మేలు. ఒక కప్పు ఉప్పులో నిమ్మరసం, అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి తాగాలి. ఈ రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది.

Saturday, June 1
ఆరోగ్యం మనచేతుల్లోనే
రోజూ వ్యాయామం, పోషకాహారం, సరియైన నిద్ర మనం
ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతాయి. అంతే కాదు కొన్ని చిన్నచిన్న పనులే
అయినప్పటికీ మన ఆరోగ్యంపై అవి ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇవి
పాటించి చూడండి...
- నడక:- చీటికి మాటికీ వాహనాలను బయటకు తీయడం మానెయ్యండి. ఆఫీసులో భోజన సమయంలో గానీ ఇంటికి దగ్గర్లోని దుకాణానికి వెళ్లాల్సినపుడు గానీ కాసేపు నడవడం ప్రారంభించండి. ఇలా తక్కువ సేపు నడిచినా శరీరం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది.
- మెట్లు ఎక్కటం:- ఇంట్లో గానీ, ఆఫీసులో గానీ మెట్లు ఉంటే 'ఆ... ఏం ఎక్కుతాం లే' అని అనుకోకుండా కాస్త కాళ్లకు పని చెప్పండి. ఒక్కరోజుతోనే ఆగకుండా దాన్నొక అలవాటుగా మార్చుకోండి. క్రమంగా మెట్లను ఎక్కే, దిగే సంఖ్యనూ పెంచుకోండి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
- మరోగ్లాసు నీరు:- చాలా మంది దాహం వేసినప్పుడే నీరు తాగుతుంటారు. కానీ మనకు దాహం వేయటానికన్నా ముందే నీరు తాగడం మంచిది. తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సరిగా ఉంటుంది. కీళ్ల కదలికలు సాఫీగా సాగుతాయి. వెన్నుపాము, ఇతర సున్నితమైన కండరాలకు రక్షణ లభిస్తుంది. మూత్రం చెమట, మలవిసర్జన రూపంలో వ్యర్థాలు తేలికగా బయటకు వెళ్లిపోతాయి.
- నిటారుగా కూచోవటం:- వెన్ను ముందుకు వంగిపోకుండా నిటారుగా కూచుంటే నొప్పుల బారిన పడకుండా చూసకోవచ్చు. అలాగే నడుస్తున్నప్పుడూ భుజాలు వెనక్కి తల పైకెత్తి ఉండేలా చూసుకున్నా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం సొంతమవుతాయి.
- త్వరగా నిద్రించడం:- రాత్రిపూట గాఢంగా ఏడెనిమిది గంటలు పడుకోవడం గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉందనడానికి సూచిక. గాఢ నిద్ర మూలంగా శరీరం కొత్త శక్తిని పుంజుకోవడమే కాదు.. ఆహార అలవాట్లు గాడి తప్పకుండానూ ఉంటాయి. నిద్రలేమితో ఆకలిని తగ్గించే హార్మోన్ల ఉత్పత్తి పడిపోతుంది. ఇది ఎక్కువ ఆహారాన్ని తినడానికి, బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.
- ఒంటికాలిమీద నిలబడటం:- పది సెకండ్ల పాటు ఒక కాలుమీద నిలబడి, తర్వాత మరోకాలుమీద నిలబడటం చాలా తేలికైన వ్యాయామం. ఇది రోజువారీ పనులకు అవసరమైన శరీర నియంత్రణ, కదలికల వంటివి మెరుగుపడేలా చేస్తుంది.
- వారం వారం బరువు తూచుకోవడం :- బరువు తగ్గడానికి గానీ దాన్ని నియంత్రించుకోవడానికి గానీ ప్రతీ వారానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దాన్ని కాగితం మీద రాసుకొని ఎంత మేరకు దాన్ని చేరుకున్నారో చూసుకోండి. ప్రతీవారం ఒకే రోజున, ఒకేసమయాన, ఒకేరకం దుస్తులను ధరించి తూచుకుంటే తగ్గిన బరువు కచ్చితంగా తెలుస్తుంది.
- కేలరీల మోతాదుపై కన్ను:- ఉదయాన్నే ప్రోటీన్‌తో కూడిన పీచు అధికంగా గల అల్పాహారాన్ని తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలివేయకుండానూ అలసిపోకుండా పనులు చేసుకోవడానికీ తోడ్పడుతుంది. కేలరీల మోతాదు అధికంగా గల పదార్థాలు బరువు పెరగడానికి దారితీస్తాయి. కాబట్టి తక్కువ కేలరీల ఆహారం మీద దృష్టి పెట్టండి. వెన్నతీసిన పాల పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు తినటం అలవాటు చేసుకోవాలి. కొవ్వు ఎక్కువగా లేదా కృత్రిమ తీపి పదార్థాలకు బదులుగా తాజా పండ్లు తినడం మేలు.
Thursday, May 23
అలసట తీర్చే కొబ్బరి నీళ్లు...
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు
ప్రకతి సిద్ధంగా లభించే కొబ్బరి బోండాలు శ్రేష్ఠమైనవి. పుష్కలమైన లవణాలు,
పోషక విలువలు ఉండే కొబ్బరి నీళ్లు శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో ప్రతి ఒక్కరికీ దివ్యౌషధంలా
పని చేస్తాయి...
- కొబ్బరి నీరు అలసట, వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నీళ్లల్లో లవణాలు, పోషక పదార్థాలు, రోగ నిరోధక శక్తి ఆధికంగా ఉంటుంది. రక్తం శుద్ధి అవుతుంది. కంటిచూపు మెరుగు పడటమే కాకుండా జ్వరం, జలుబు ఉన్నవారికి టానిక్‌లా పని చేస్తుంది. వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో మంట తగ్గిస్తుంది. శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది.
- ఈ నీటిలో పొటిషియం, సోడియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాఫర్, సల్ఫర్, క్లోరైడ్‌లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీటిలో ప్రొటీన్ల శాతం ఆవుపాలలో కంటే ఎక్కువగా ఉంటాయి.
- కొబ్బరి నీళ్లు రోజూ తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్‌ఎటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు.
- తక్కువగా నీరు తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తరచూ తాగడం వల్ల చిన్నసైజ్ రాళ్లు త్వరగా కరిగిపోతాయి. అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.
- కొబ్బరి నీళ్లను రెగ్యులర్‌గా తాగడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే కొబ్బరి నీళ్లు మంచిగా పని చేస్తాయి. అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.
- కొబ్బరి నీరు జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉంటే ఇలాంటి తిమ్మిర్లు వస్తాయి. అయితే కొబ్బరి నీరు పొటాషియం స్థాయిని పెంచుతుంది. దీంతో కండరాల తిమ్మిరి సమస్య ఉండదు.
- బాగా అలసిపోయినపుడు కొబ్బరి నీళ్లు తాగితే చాలు. మీరు వెంటనే కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు.
- ఈ నీటిని తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. జుట్టు నిగనిగలాడుతుంది. వీటన్నింటి కోసం మీరూ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే చాలు.
ఇంట్లోనే ఫేస్‌ప్యాక్స్...
వేసవిలో ఎక్కువగా చర్మం కమిలిపోతుంటుంది. ముఖం,
చేతులపై సూర్యకిరణాలు పడి చర్మంలో కాస్త తేడా వస్తుంది. మరి చర్మం
కమిలిపోకుండా మన ఇంట్లోనే చేసుకునే ఫేస్ ప్యాక్‌లేంటో తెలుసుకుందాం...
- చాలామంది చర్మం కమిలిపోయిందే అని బ్లీచింగ్ చేయించడం, లేదంటే వెంటనే ఇతర కాస్మొటిక్ ట్రీట్‌మెంట్స్‌ని వెతుక్కోవటం చేస్తుంటారు. వీటి వల్ల వెంటనే చర్మంలో మెరుగుదనం వచ్చినట్లు కనిపిస్తుంది. అయితే అది దీర్ఘకాలికంగా ఉండదు. అందుకే కాస్త సహనంతో ఎండ తాకిడికి గురైన చర్మాన్ని నేచురల్ హౌమ్‌రెమెడీస్‌తో నయం చేయవచ్చు.
- విరివిగా కూరల్లో వాడే టమాట చక్కటి బ్యూటీ ప్రోడక్ట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సన్‌టాన్‌ని తొలగించటంలో టమటా ముఖ్యపాత్ర పోషిస్తుంది. టమోటాని బాగా గుజ్జు చేసి దానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఓట్స్ పిండి కలిపి మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత నీళ్లతో వాష్ చేసుకోవాలి. ముఖంలో కాంతి వస్తుంది.
- ముఖ వర్చస్సు పెంచడంలో నిమ్మరసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంతో పాటు, సమస్య ఉన్న మిగిలిన ప్రాంతాల్లో నిమ్మకాయని సగానికి కట్ చేసి డైరెక్ట్‌గా చర్మంపై అప్లై చేసుకోవచ్చు. నిమ్మరసానికి కాస్త తేనె కలిపి పట్టించుకోవచ్చు. డ్రై అయిన తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే స్కిన్ మెరిసిపోతుంది.
- సూర్యకిరణాలకు దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపర్చడానికి ఆలూ పర్ఫెక్ట్. ఇందులో ఉండే 'సి' విటమిన్ మంచి బ్లీచింగ్ ఏజెంట్‌లాగా ఉపయోగపడుతుంది. తొలుత ఆలుగడ్డపై ఉండే తోలు ఒలిచిన తర్వాత మెత్తగా చూర్ణం చేయాలి. దీనికి తగినంత నిమ్మరసం కలిపి కమిలిన ప్రాంతంలో అప్లై చేసి అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రపరచుకోవాలి. చక్కటి ఫలితం ఉంటుంది.
- శరీరానికి దోసకాయ చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే దోసకాయ అంటే అందరికీ ఇష్టం. ఇక ఇందులో ఉండే విటమిన్ 'సి' చక్కటి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. దోస ఫేస్ ప్యాక్ చేయటం చాలా సులువు. ముందు దోసకాయని జ్యూస్‌లాగా చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి. దీనికి తగినంత పరిమాణంలో నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి మిక్స్ చేయాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ని ముఖంతో పాటు కమలిన చేతులకి అప్లై చేసుకోవాలి. అరగంట ఆగాక కడిగేసుకోవాలి. ఇలా ఓ నాలుగుసార్లు దోసకాయ ఫేస్‌ప్యాక్‌ని వాడితే మునుపటిలా స్కిన్‌లో గ్లో వస్తుంది.
- అలోవెరా చర్మకాంతికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎండకు వాడిపోయిన చర్మానికి చక్కటి గ్లో తెస్తుంది. డైరెక్ట్‌గా అలోవెరా రసాన్ని మాయిశ్చరైజ్ చేస్తే ముఖంలో వెలుగు రావటంతో పాటు సున్నితత్వం వస్తుంది.
Wednesday, May 22
నిద్ర రావడం లేదా ఈ టిప్స్...
రాతిళ్ల్రు నిద్ర పట్టక ఇబ్బంది పడు తున్నారా.
బెడ్ ఎక్కిన తరువాత ఎంత ప్రయ త్నించినా నిద్ర రావడం లేదా. అయితే
సహజ సిద్ధమైన ఈ టిప్స్ పాటించి చూడండి...
- డమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎలాగంటే... ఎడమ వైపు పడుకుని చేతి వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి, ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శరీరంలో అధిక ఉష్ణోగ్రత వల్ల లేదా మెనోపాజ్ హాట్ ఫ్లషెస్ సమస్య వల్ల నిద్ర పట్టనప్పుడు ఈ పద్ధతి చాలా బాగా ఉపకరిస్తుంది.
- కండరాలకు విశ్రాంతి కలిగిస్తే శరీరం నిద్రపోయేందుకు సిద్ధమవు తుంది. ఇందుకు... వెల్లకిలా పడుకుని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు కాలి బొటనవేళ్లను పాదం కిందకి అదిమేలా వంచి యథాస్థితికి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు ఉపశమనం కలిగి నిద్ర మిమ్మల్ని పలకరిస్తుంది.
- కండ్లు మూసుకుని కనుగుడ్లను మూడుసార్లు గుండ్రంగా తిప్పాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. అంతేకాకుండా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ కూడా విడుదలవుతుంది.
- చేయాల్సిన పనుల జాబితాను పడక మీద గుర్తుచేసుకుంటే నిద్ర రాదు. అందుకని పడక మీదకు చేరే ముందు ఒక పేపర్ మీద చేయాల్సిన పనులన్నింటినీ రాయాలి. ఇలా చేయడం వల్ల మరుసటిరోజు ఉదయం నిద్రలేచే వరకు వాటిని బుర్రలోనుంచి పక్కకు నెట్టేయొచ్చు. Samsung Galaxy M20ర్రలో ఆలోచనల భారం దిగిపోయాక నిద్ర రాకపోవడం అనే సమస్యే తలెత్తదు.
- నిద్ర పోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. నిద్ర పట్టడం లేదు బాబోరు అంటుంటే ఇదేంటనుకుంటున్నారా.. అందులోనే ఉంది కిటుకు. దీన్నే 'స్లీప్ పారడాక్స్' అంటారు. ఇందులో భాగంగా కళ్లను విప్పార్చి 'నేను నిద్రపోవడంలేదు' అని పదేపదే అనుకోవాలి. సాధార ణంగా మెదడు ప్రతికూల విషయాలను సరిగా ప్రాసెస్ చేయదు. అందుకని మీరు నిద్రపోవద్దని చెప్పుకునే మాటల్ని నిద్రపోవడానికి ఇచ్చే సజెషన్స్‌గా భావిస్తుంది. కంటి కండరాలు కూడా అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు అని చెప్తున్నారు సైకోథెరపిస్టులు.
- బుర్రలో ఉన్న బాధల భారాన్ని బయటికి పంపేయాలంటే ప్రాపంచిక విషయాలను రివర్స్‌లో గుర్తుచేసుకోవాలి. మీరు ఆ రోజున మాట్లాడిన విషయాలు, చూసిన ప్రదేశాలు, విన్న ధ్వనులు.. వంటి అన్ని విషయాలను వెనక నుంచి ముందుకు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల మానసికంగా నిద్రకు సిద్ధమవుతారు. దాంతో నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఉండదు.
సులువైన చిట్కాలను నిత్యం పాటిస్తూ చక్కని కంటి చూపుని ఎలా పొందవచ్చో తెలుసుకోండి..!
1.రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే కంటి సంబంధ సమస్యలు వెంటనే దూరమవుతాయి. క్యారెట్లలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి దృష్టి సంబంధ సమస్యలను పరిష్కరిస్తాయి. చూపు స్పష్టతను పెంచుతాయి.
2.ఇటీవల స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువైంది. దీనికి తోడు బయట తిరగడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆ ప్రభావం కళ్లపై కూడా పడుతుంది. రోజూ పగటి సమయంలో కనీసం 3 గంటల పాటు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ ఒత్తిడి నుంచి సులభంగా బయటపడవచ్చు.
3.రోజులో కొంత సమయం పాటు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతిని చూడండి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఎంతగానో హాయి కలుగుతుంది. ఇది కళ్ళకు పూర్తి స్థాయిలో హాయినిస్తుంది.
4.కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువగా ధరించే వారు రోజులో కొంత సమయం పాటు వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. దీని వల్ల లెన్స్‌ల ద్వారా కళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది.
5.కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేసేవారు అవసరమైతేనే వాటిని వాడాలి. లేదంటే దూరంగా ఉండాలి. వీలైనంత వరకు కంప్యూటర్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
6.కళ్లను నిత్యం కొంత సమయం పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి కలుగుతుంది.
7.రోజూ ఒక అరగంట పాటు గోరు వెచ్చని తడి గుడ్డతో కళ్లను సున్నితంగా ఒత్తినట్టు చేయాలి. ఇది కళ్లకు హాయినిస్తుంది.
కంటి చూపు పెరగడానికి: -
*********************************
పొన్నగంటికూర పచ్చిరసము లీటరు తీసుకొని అందులో త్రిఫలాల బరక చూర్ణము వేసి సన్నటి మంటపయి
అరళీటారు మిగులువరకు కాచి వడపోసుకొని అందులో పావు లీటరు ఆవునెయ్యివేసి సన్ననిమంటపయి నేయి మిగులువరకు కాచి నిలువచేసుకొని రోజు ఉదయం రాత్రి ఒక స్పూన్ బొజనానికి ముందు తీసుకొవాలి,
ఇలా రోజు క్రమం తప్పకుండా 3 నుంచి 6 నెలలవరకు చేస్తె మీ కంటి చూపు డెగ కంటి చూపు వలె అవుతుంది.
అలాగే రోజు స్వచ్చమైన ఆవునెయ్యిని బోజనంలో రోజు రెండు స్పూన్లు తీసుకొవాలి,
Saturday, May 11
రోగనిరోధక శక్తికి జొన్న..
జొన్నల వాడకం ఈ నాటిది కాదు. చాలామందికి తెలియదు
కాని క్రీ.పూ 3 వేల ఏళ్ల కిందటి నుంచి మనుషులకు ప్రధాన ఆహారం.
బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నలోనే అధిక కాల్షియం ఉంటుంది. అంతేకాదు,
ఇనుము, ప్రొటీన్లు, పీచుపదార్థం వంటి పోషకాలు కూడా ఉంటాయి. పలు దేశాల్లో
చేపట్టిన వైద్య పరిశోధనల్లో తేలిన విషయం గుండె జబ్బుల్ని అడ్డుకునే శక్తి
జొన్నకు ఉంది...
- ప్రతి ఒక్కరి ఆరోగ్యానికీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కీలకం. జొన్నలో ఇవి పుష్కలం. ఇందులో మనకు మేలుచేసే పోలీఫెనిక్ కాంపౌడ్స్ అధికం. తరచూ జొన్నతో చేసిన పదార్థాలను తినడం వల్ల కొవ్వు సమస్య రాదు. చెడుకొవ్వును కూడా తగ్గించే గుణం ఈ గింజలకు ఉంటుంది.
- ఎముకలు బలిష్టంగా ఉండేందుకు పాస్పరస్ చాలా అవసరం. ఒక కప్పు జొన్నల్లో 550 మిల్లీగ్రాముల పాస్పరస్ లభిస్తుంది.
- జొన్నరొట్టెలు ఎన్ని తింటే అంత మంచిది. జొన్నల్లో నరాల బలహీనతను తగ్గించే గుణం ఉంటుంది. మరీ ముఖ్యంగా విటమిన్ 'బి' సమృద్ధిగా దొరుకుతుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
- వయసు పెరిగేకొద్దీ మతిమరుపు, కంటిచూపు మందగించడం సహజం. ఈ రెండు సమస్యలు తొందరగా రాకూడదంటే జొన్నలు ఎక్కువగా వాడాలి.
- జొన్నల్లో పిండి పదార్థం అధికం. జీర్ణశక్తిని పెంపొందించి అందుకు అవసరమైన హార్మోన్లను వద్ధి చేస్తాయి.
Wednesday, May 8
ఉలవల వల్ల మనకు కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
ఉలవలు గురించి మన దేశంలో తెలియని వారుండరు. ఉలవలు అంటే మన తెలుగు
వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక
దాన్ని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి
ఉంటాయి. ఈ క్రమంలోనే ఉలవలను తరచూ తింటుంటే దాంతో మనకు ఎన్నో రకాల
ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి.
ఉలవల వల్ల మనకు కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
1. ఉలవల్లో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది.
2. ఉలవలను కషాయం రూపంలో చేసుకుని తీసుకుంటే మలబద్దకం పోతుంది. కఫం బయటకు వెళ్లిపోతుంది. స్త్రీలకు రుతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎక్కిళ్లు తగ్గుతాయి. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగు పడుతుంది.
3. ఉలవలను రెగ్యులర్‌గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
4. ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి.
5. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్ర పిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి.
6. పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి.
7. ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. ఉలవలపై పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి.
8. ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి బయటకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలకు ఉలవలతో చేసిన ఆహారం నివారిస్తుంది. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి, కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Monday, May 6
వేపతో చర్మం తాజాగా...
వేపలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికే కాదు అందానికీ
మేలు చేస్తాయి. చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతాయి. వేడినీళ్లలో
గుప్పెడు వేపాకుల్ని కలిపి మరిగించి, ఆ నీటితో రోజూ స్నానం చేస్తే మురికి
పోవడంతో పాటూ చర్మగ్రంథులూ శుభ్రపడతాయి...
- వేపాకుల్ని ముద్దగా చేసి కాస్త పెసరపిండీ, చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్, మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది. ఈ ఆకుల్ని మరగబెట్టి ఆ నీటిలో కొంచెం పెరుగు, సెనగపిండీ కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. ఇలా తరచూ చేస్తుంటే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.
- ఈ కాలంలో చుండ్రు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీనికోసం ఖరీదైన షాంపూలే వాడక్కర్లేదు. వేపాకుల పొడిని పాలల్లో నానబెట్టాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి, పావుగంట తరువాత తలస్నానం చేస్తే సరి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
- కాలంతో పనిలేకుండానే కొందరిని కాలిపగుళ్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఇలాంటప్పుడు బొప్పాయి గుజ్జులో చెంచా తేనె, చెంచా వేపాకుల పొడి కలిపి దాన్ని పాదాలకు పూతలా వేయాలి. పావుగంట ఆగి గోరువెచ్చని నీళ్లతో శుభ్ర పరుచుకోవాలి. దీనివల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి.
Saturday, May 4
అవాంఛిత రోమాలకు...
అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పెదాల పై
భాగంలోనే వస్తుంటే చికాకు వేస్తుంది. వాటిని అత్యంత సులభంగా ఎలా
తొలగించుకోవాలో చూద్దాం...
- ఒక టేబుల్ స్పూన్ పసుపులోకి కొన్ని పాలు పోసి బాగా కలియబెట్టాలి. అది పేస్ట్‌లాగ తయారవుతుంది. అయిదు నిమిషాల తరువాత.. పై పెదవి పైభాగాన రాసుకోవాలి. అరగంటకు పొడిబారి చెక్కలాగ మారుతుంది. అప్పుడు దాన్ని మెల్లగా తొలగించుకుని చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
- పంచదారను ఒక నిమిషం పాటు పాన్ మీద వేగించాలి. చల్లారిన తరువాత.. అందులోకి నిమ్మరసాన్ని కలిపితే చిక్కటి పేస్టు అవుతుంది. దీని ద్వారా కూడా పెదవి పైనున్న రోమాలను వదిలించుకోవచ్చు.
- మరో సులువైన చిట్కా పసుపులోకి కొంత నీటిని కలిపి పేస్ట్‌లాగ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పై పెదవి మీదున్న రోమాలపై రాసుకోవాలి. అరగంట తరువాత పొడిబారుతుంది. వేలితో గట్టిగా అటూఇటూ రుద్దితే పొడిలా రాలిపోతుంది. కాసేపయ్యాక సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
- గుడ్డులోని తెల్లసొనలోకి కార్న్‌ఫ్లోర్, పంచదార వేసుకుని బాగా కలియబెట్టాలి. దీన్ని రోమాలున్న చోట రాస్తే సరి. కాసేపయ్యాక గట్టిపడుతుంది. దాన్ని మెల్లగా తొలగిస్తే రోమాలు తొలగిపోతాయి.
- పెరుగు, శనగపిండి, పసుపుల మిశ్రమం కూడా ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ పేస్టును రాసుకున్నాక పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండాలి. ఆ తరువాత రబ్బింగ్ చేసుకుని.. చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుంటే చక్కటి ఫలితం లభిస్తుంది.
Sunday, April 28
మధుమేహా నివారణకు...
- * రాచఉసిరి కాయలు ఎండించి వాటి చూర్ణం చేసి దానికి సమానంగా పసుపు కలిపి ఈ చూర్ణాన్ని ఉదయం , సాయంత్రం అరచెంచాడు చొప్పున తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.
- * ప్రతినిత్యం అరటి పువ్వు చూర్ణం 2 స్పూన్స్ తినుచున్న మధుమేహరోగం తగ్గును.
- * నల్లతుమ్మ బెరడు, నల్ల తుమ్మ జిగురు చూర్ణం చెంచా , అరకప్పు నీటిలో కలిపి తాగుచున్న మధుమేహం తగ్గును.
- * మర్రిచెట్టు బెరడు చూర్ణం చెంచా గాని బెరడు కషాయం ఒక పావుకప్పు రోజూ తీసుకొనుచున్న మధుమేహం నిశ్చయంగా తగ్గును. చాలా మంచి మందు.
- * ఉసిరికాయ కషాయం లేక ఉసిరిగింజల కషాయం రోజుకి అరకప్పుచొప్పున తాగవలెను.
- * లేత మామిడి ఆకుల చూర్ణం రోజుకి చెంచా చొప్పున తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.
- * బూరుగ చెట్టువేళ్ళ చూర్ణం అరచెంచాడు ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.
- * ప్రతినిత్యం త్రిఫల చూర్ణం రాత్రి సమయంలో ఆహారం తీసుకున్న రెండు గంటల తరువాత ఒక కప్పు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగుచున్నంతవరకు మధుమేహాం రాదు .
- చాలా మంది త్రిఫలా చూర్ణం అనగా
- కరక్కాయ పెచ్చులు ఒక భాగం , తాటికాయ రెండు భాగాలు , ఉసిరికాయ చూర్ణం నాలుగు భాగాలు తీసుకుని దేనికదే విడిగా చూర్ణం చేసి అన్ని కలుపుకుని ఒకే చూర్ణంగా ఒక గాజుసీసాలో నిలువచేసుకోవాలి . దీనిని ప్రతినిత్యం రాత్రి సమయం నందు ఒక కప్పు నీటిలో కలిపి వాడుకోవాలి . ఇది మదుమేహం రాకుండా అద్బుతంగా కాపాడును.
- * మదుమేహం 250 నుంచి 300 మధ్యలో ఉన్నప్పుడు 9 మారేడు ఆకులు ఉదయాన్నే పరగడుపున రాత్రి ఆహారానికి గంట ముందు తిని,మధ్యాహ్నం మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయ ప్రతి నిత్యం తింటూ బయటకు వెళ్ళు సమయంలో చిన్న దాల్చినచెక్క ముక్క నోటిలో వేసుకొని చప్పరింస్తూ ఉన్న తగ్గును
- వేడిని పెంచే ఆహారం తగ్గించాలి.
- నీడలో ఎండించి చూర్ణం చేసిన నేరేడు గింజల చూర్ణం , ఒక స్పూన్ పొడపత్రి చూర్ణం ఉదయాన్నే ఒక గ్లాసు గొరువెచ్చటి నీటిలో వేసి అలా ఉంచి రాత్రి ఆహారానికి గంట ముందు ఆ కషాయాన్ని త్రాగి, మరలా రాత్రి సమయము నందు పైన చెప్పిన మోతాదులోనే మరొక గొరువెచ్చటి చిన్న గ్లాసు నీటియందు చూర్ణాలు వేసి ఉదయాన్నే పరగడుపున తాగించాను . మధుమేహం పూర్తినియంత్రణ లోకి వస్తుంది.
- మధుమేహం లో వచ్చు అతిమూత్రవ్యాధికి నీడలో ఎండించిన తంగేడు పువ్వులను 10 తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న అతిగా మూత్రం పోవడం తగ్గును.
నువ్వులతో ఆరోగ్యం...
- నువ్వులతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. బీపీ, షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. నువ్వుల్లో మాంస కత్తులు, అమినోయాసిడ్‌లు సమద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం శాతం కూడా అధికంగా ఉంటుంది. నువ్వుల నూనె వాడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
- నల్ల నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తహీనతతో బాధపడేవారు, బలహీనంగా ఉండేవారు ఈ నువ్వులను ఆహారంగా తీసుకుంటే మంచిది. నువ్వుల్లో సెసమాల్ అనే యాంటీయాక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది.
- ఇది హృద్రోగం నుంచి కాపాడుడుతంది. నువ్వుల్లో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు శాతాన్ని నియంత్రిస్తుంది. నువ్వుల్లో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- రక్తనాళాలు, ఎముకలు, కీళ్ల్లు, సక్రమంగా పనిచేసేందుకు నువ్వులు ఎంతగానో దోహదపడుతాయి. నువ్వులను తరచూ ఆహారంగా తీసుకుంటే ఉబ్బసం నివారించవచ్చు. వీటిలో ఉండే జింక్, కాల్షియం ఎముకలను పటిష్టంగా ఉంచుతాయి.
- నువ్వు మొక్కలను కాల్చి, మసి చేసి పెరుగుతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే మూత్ర పిండాల్లో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. పల్లేరుకాయలు, నువ్వు పువ్వులు, తేనె సమపాళ్లలో మెత్తగా నూరి కేశాలు రాలినచోట రుద్దితే తిరిగి జుట్టు పెరుగుతుంది.
- నువ్వుల నూనె చర్మాన్ని మదువుగా ఉంచుతుంది. నూనె ముఖానికి రాసుకొని మర్దనా చేసి, శనగ పిండితో నలుగు పెట్టి, గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది. పాదాలకు పగుళ్లు ఉన్నచోట నువ్వుల నూనె రాసుకొని, సాక్సులు వేసుకుంటే పగుళ్లు తగ్గుముఖం పడుతాయి.
- నువ్వుల నూనెలో ఒమేగా 3, 6, 9 ప్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ ఇస్తాయి. నువ్వుల నూనెను తరుచూ తలకు మర్దన చేసుకుంటే తలలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. తద్వారా జుట్టుకుదుళ్లు దఢంగా తయారవుతాయి. జుట్టు పొడిబారడం, రాలడం, పలుచబడటం తదితర సమస్యలను దూరం చేస్తాయి.
కెఫిన్ పదార్థాలకు దూరంగా...
- తాజా ద్రాక్ష పండ్ల జ్యూస్ తాగడం వల్ల మైగ్రెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ను రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది.
- అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడే అల్లం మైగ్రెయిన్ నొప్పిని కూడా తగ్గిస్తుంది.
- దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకొని 30 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
- వెలుతురు ఎక్కువగా వచ్చే చోట కూర్చోవడం కూడా కొన్నిసార్లు అసౌకర్యానికి, తలనొప్పి పెరగడానికి కారణం అవుతుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కాసేపు లైట్లను ఆఫ్ చేసి విశ్రాంతి తీసుకుంటే చాలావరకు ఉపశమనం కలుగుతుంది.
- మైగ్రెయిన్ నొప్పిని తగ్గించే మరో తేలికైన పద్ధతి మసాజ్. తలనొప్పి బాధపెడుతున్నప్పుడు మెడ, తల భాగాన్ని మెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరిగి పెయిన్ తగ్గుతుంది. నిద్రలోకి జారుకుంటే చాలావరకు రిలాక్స్ అవుతారు. నొప్పి కూడా తగ్గుతుంది.
- కెఫిన్ ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే నొప్పి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
Saturday, April 27
మందార పువ్వు తో ఎన్నో ప్రయోజనాలు..!!
మనం నిత్యం చూసే వృక్షాలు, పువ్వులు, కాయల్లో ఎన్నో ఔషదాలు దాగి ఉన్నవిషయం
తెలియదు. అయితే పురాతన కాలం నుండి భారతదేశంలో అనేక ఆయుర్వేద మందులను
మూలికలు మరియు వేర్లను ఉపయోగించి తయారు చేస్తున్నారు. కొన్ని పూలల్లో కూడా
అద్భుతమైన ఔషదాలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మందార ఒకటి. మందార
పువ్వు ఎరుపు, తెలుపు, పసుపు, పింక్ రంగులలో ఉంటుంది. ఆయుర్వేదం మందులలో
ఎక్కువగా ఎరుపు రంగు మందార పువ్వులను ఉపయోగిస్తారు.
మందార రసం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మందార పువ్వు రేకలు మరియు ఆకుల వలన ఉన్న ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మందారను ఉపయోగించటానికి ముందు, వాటిని శుభ్రం చేసి ఫ్రిజ్ లో ఉంచాలి.మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌందర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పతాయి. ఈ మొక్క నుంచి నూనె తీస్తారు. మందార నూనెతో తలవెంట్రుకలను కాపాడుకోవడమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మందార నూనెలో తేమ ఉంటుంది. కనుక చర్మం, కేశాలను మృదువుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలకు మరింత అందాన్ని, మెరుపుని ఇస్తుంది.
ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించుకోవచ్చు. జుట్టు రాలటం తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేశాలు తెల్లబడకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉంచేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. కేశాలకు వృధాప్య చాయలు దరి చేరకుండా చూస్తుంది. చర్మం నునుపుగా ఉండేలా చూస్తుంది.

1. మందార పూలను ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా
ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆరోగ్య నిపుణులు.
2. ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు.
3. విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు.
4. మందారపువ్వును హెర్బల్ టీ, కాక్టేల్ రూపాలలోను సేవించవచ్చు. పూలను ఎండబెట్టి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలంటే… నీటిని ఉడకబెట్టిన తర్వాత ఎండిన మందార పువ్వులను అందులో వేయండి. అందులో చక్కెర, కాస్త టీపొడి కలుపుకుని టీలాగా తయారు చేసుకోండి. దీంతో హైబిస్కస్ హెర్బల్ టీ తయారవుతుంది. ప్రతి రోజు దీనిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు.
5. అలాగే కాక్టేల్ టీ కొరకు దీనిని చల్లగా చేసి అందులో కొన్ని ఐసు ముక్కలు వేసుకుని తాగితే అదే కాక్టేల్ టీ. ఇలా ప్రతి రోజు తీసుకుటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Friday, April 26
ఆరోగ్యానికి సబ్జాలు...
సబ్జా గింజలు చూసేందుకు పరిమాణంలో
చిన్నగా ఉన్నా అవి చేసే మేలు అంతా ఇంతాకాదు... ప్రతి రోజూ కొన్ని గింజల ను ఏదో
ఒక రూపంలో ఆహారంలో తీసుకుంటే ఎంతో ఆరోగ్యం. పలు అనారోగ్య సమస్యలూ
దూర మవుతాయి...
- సబ్జా గింజలను నీటిలో నానబెట్టాలి. అవి పది నిమిషాలకు జెల్‌లా మారిపోతాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్ సలాడ్స్, పండ్ల రసాలు, మజ్జిగ వంటి వాటితో కలిపి తినవచ్చు.
- అధిక బరువుతో బాధ పడేవారికి సబ్జా గింజలు చక్కని ఔషధం. ఎందుకంటే వీటిని స్వల్ప పరిమాణంలో తిన్నా చాలు ..త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతోపాటు ఎక్కువ సమయం ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
- సబ్జా గింజలను పైన చెప్పిన విధంగా నీటిలో వేసుకుని తింటే జీర్ణ సంబంధ సమస్యలు కూడా పోతాయి. ప్రధానంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉండడంతో మలబద్దకం బాధించదు. గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా పోతాయి.
- సబ్జాగింజలు గాయాలు మానడానికి కూడా సహాయపడతాయి. కొద్దిగా సబ్జా గింజలను తీసుకుని పొడి చేయాలి. దాన్ని గాయాలపై వేసి కట్టు కడితే అవి త్వరగా మానుతాయి. అంతేకాదు, ఇన్‌ఫెక్షన్లను కూడా దరి చేరనివ్వవు.
- సబ్జా గింజలను నీటిలో కలిపి తింటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న వారు కూడా ఇలా చేయవచ్చు. దీంతో సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
- రక్తాన్ని శుధ్ది చేసే గుణాలు సబ్జా గింజల్లో ఉన్నాయి. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది. బీపీ కూడా అదుపులోకి వస్తుంది.
- సబ్జా గింజలు శ్వాస సంబంధిత సమస్యలను దరిచేరనియ్యవు. గోరు వెచ్చని నీటితో కొంత తేనె, అల్లం రసం కలిపి దాంతోపాటు కొన్ని సబ్జాగింజలను కూడా అందులో వేసి ఆ మిశ్రమం తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి.
- ఉదయాన్నే సబ్జా గింజలను నీటిలో వేసుకుని తాగితే తద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. కీళ్ల నొప్పుల సమస్యతో బాధ పడుతున్న వారు సబ్జా గింజలను తింటే ఫలితం ఉంటుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు సబ్జా గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలర్జీలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి.
- సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే డిప్రెషన్ వెంటనే దూరమవుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి.
ఇలాయిచి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం...
సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. వీటిని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం...
1. భోజనం చేసిన తరువాత యాలకులు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు యాలకులను పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలిపి సేవిస్తే అసిడిటీ బారి నుండి ఉపశమనం లభిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.
2. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి.
3. ఆస్తమా వ్యాధితో బాధపడేవారు యాలకుల పొడిని పాలలో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
4. హైబీపీతో బాధపడేవారు ప్రతిరోజూ అన్నంలో యాలకుల పొడి కలిసి తింటే సమస్య అదుపులో ఉంటుంది.
5. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. మధుమేహ వ్యాధి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
6. కమ్మని సువాసన, రుచిని అందించే యాలకుల గింజలను పొడిచేసి ఈ పొడితో పళ్ళు తోముకుంటే చిగుళ్ళ సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. ముఖ్యంగా పళ్ల నుండి రక్తం రాదు.
7. తలనొప్పితో బాధపడేవారు యాలకుల పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలుపుకుని నుదిటిపై రాసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
8. కంటి చూపును మెరుగపరచుటకు యాలకులు చాలా మంచివి.

తంగేడు చెట్టు ఉపయోగాలు...
* ఈ చెట్టు యొక్క వేరు కషాయం కాచుకొని తాగిన నీళ్ల విరేచనాలు తగ్గును.
లేదా 4 గ్రాముల తంగేడు బెరడు నమిలి రసం మింగినా కూడా విరేచనంలో చీము వంటి
పదార్థం పొవడం తగ్గుతుంది .
* 5ml తంగేడు చెట్టు యొక్క బెరడు రసాన్ని రోజుకి ఒకసారి చొప్పున 3 రోజులపాటు తాగితే టాన్సిల్స్ సమస్య తొలగిపోవును .
* తంగేడు చెట్టు లేత ఆకు నమిలి మింగితే దగ్గు తగ్గును.
* తంగేడు చిగుళ్లు దంచి కడితే తేలు విషం విరిగి మంట తగ్గును.
* తంగేడు లేత ఆకుతో పాటు రెండు వెల్లుల్లి రెక్కలు , రెండు మిరియాలు కలిపి మెత్తగా నూరి ముద్దచేసి ఒకే రోజున మూడు మోతాదులు పెరుగు అనుపానంతో కలిపి ఇస్తే చీముతో కూడిన విరేచనాలు తగ్గుతాయి .
* తంగేడు ఆకుని నీడలో ఎండించి ఆ చూర్ణాన్ని గొరువెచ్చటి నీటితో రోజు తీసుకోవడం వలన మలబద్దకం తగ్గును.
* రేచీకటి తో భాదపడుతున్న వారు కోడి లేక మేక చేదుకట్టు , లివరు , మసాలా దినుసులు కలిపి మెత్తగా నూరి కోడికూర కాని మేకకూర కాని వొండుకొని తింటూ ఉంటే రేచీకటి బాధ నుంచి విముక్తం అవ్వుదురు .
* తంగేడు చిగుళ్లు మెత్తగా నూరి పెరుగులో కలుపుకుని పరగడుపున తాగితే నీళ్ల విరేచనాలు నశించును.
* తంగేడు చిగుళ్లు మజ్జిగలో నూరి పాదాల మడమలు కు రాస్తే కాలిపగుళ్ళు తగ్గుతాయి.
* తంగేడు చిగుళ్లు నేతితో వెచ్చచేసి కన్నులకు కట్టిన కంటి ఎరుపులు , పోట్లు నివారించును.
* మూత్రం బంధించి ఉన్నప్పుడు తంగేడు పువ్వులతో కషాయం పెట్టి దానియందు పంచదార చేర్చి ఇచ్చినచో మూత్రం వెంటనే బయటకి వెడలును.
* తంగేడు విత్తనాల చూర్ణం 3 గ్రాములు తీసుకుని దానియందు తేనే కలిపి పుచ్చుకొనిన అతిమూత్రం కట్టను.
* తంగేడు పువ్వులను నీడ యందు ఎండించి చూర్ణం చేసి సమంగా పంచదార కలిపి పూటకు 2 నుంచి 3 గ్రాముల చొప్పున తీసుకున్న యెడల అతిమూత్ర వ్యాధి నివారణ అగును. 40 దినములు పాటించవలెను .
* తంగేడు లేత చిగుళ్లు మాడుమీద వేసి గట్టిగా తలకు బట్ట కట్టిన యెడల తలపోటు , తలనొప్పి నయం అగును. మరియు నేత్రరోగాలు నివారించబడును .

Wednesday, April 24
లవంగాలు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం...
వంటకాల తయారీలో రుచికి, సువాసనకు ఉపయోగపడే సుగంధ ద్రవ్యంగానే కాక దైనందిన
జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకములైన అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం
చూపే ఔషధం లవంగాలు. ఇది మన శారీరక, మానసిక దోషాలను సమన్వయపరచి సమస్థితిలో
ఉంచే లక్షణం లవంగంలో ఉంది. లవంగాన్ని వేయించి ఔషధంలా వాడుకోవాలి. లవంగం
వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం...
1. లవంగాల చూర్ణం, మిరియాల చూర్ణాలను పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం, రాత్రి పూట 4,5 చిటికెల పొడిని పావు టీ స్పూను నెయ్యి, అర టీస్పూను తేనె కలిపి సేవిస్తుంటే శ్లేష్మం తెగి పడిపోతుంది. గొంతులో గురగుర తగ్గిపోతుంది. అంతేకాకుండా దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి.
2. లవంగాల చూర్ణంలో తగినంత నీరు చేర్చి మెత్తగా నూరి ముక్కుపై లేపనంగా పూస్తే ముక్కుదిబ్బడ సమస్య తగ్గుతుంది.
3. లవంగాల పొడి, జాజికాయల పొడి, జీలకర్ర పొడి, పంచదారలను ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం పూటకు ఒక గ్రాము పొడిని తగినంత తేనె కలిపి సేవించడం వల్ల రక్తవిరేచనాలు, జిగురు, బంక, కడుపునొప్పితో కూడిన విరేచనాలు, విరేచనాలు కొద్దికొద్దిగా ఎక్కువసార్లు కావడం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
4. లవంగాల చూర్ణానికి సమానంగా నల్ల జీలకర్ర చూర్ణాన్ని కలిపి ఉంచుకుని ప్రతిరోజు ఒకసారి తగినంత పొడిలో నీరు కలిపి పేస్టులా చేసి ముఖానికి పలుచగా పట్టించి అరగంట ఆగి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమల సమస్య పోతుంది.
5. ఐదు మి.లీ నువ్వుల నూనెలో ఒక లవంగాన్ని నలగగొట్టి వేసి ఆ నూనెను వేడి చేసి చల్లారాక రెండు మూడు చుక్కల నూనెను చెవిలో వేసుకోవడం వలన చెవిపోటు తగ్గుతుంది.

తలనొప్పి తగ్గడానికి...
1. జాజికాయ గంధము కనతలకు పెట్టిన తగ్గును
2. మునగాకు రసం మిరియాల పొడి కణతలకు రాస్తే తలనొప్పి తగ్గుతుంది.
2. మునగాకు రసం మిరియాల పొడి కణతలకు రాస్తే తలనొప్పి తగ్గుతుంది.
3. యూకలిప్టస్ ఆయిల్ కణతలకు రాసిన తలనొప్పి శిరోభారం తగ్గును.
4. మునగ జిగురును పాలతో కలిపి కణతలకు పట్టించిన తలనొప్పి త్వరగా తగ్గను.
5. ఆముదం ఆకులు కచ్చాపచ్చాగా దంచి తల మీద కట్టు కట్టుకున్నచో వేడి వలన వచ్చిన తలనొప్పి వెంటనే తగ్గుతుంది.
6. బచ్చలాకు మెత్తగా నూరి నుదుట , రసం రాయాలి.
Saturday, April 20
సీతాఫలం చెట్టు ఉపయోగాలు...
* శరీరం నందు మాంస శాతాన్ని పెంచును. బక్కపలచగా ఉండువారు ఈ పండు తీసుకోవడం వలన మంచి కండ పొందగలరు.
* శరీరం నందు వేడిని హరించును .
* సీతాఫలం చెట్టు యెక్క ఆకు రసం 3 నుంచి 4 చుక్కలు దంత రంధ్రములో వేసిన క్రిములు ఊడిపడును.
* ఈ చెట్టు ఆకురసం పుండ్లపై పూసి పిమ్మట ఆ ఆకును ముద్దగా నూరి పుండ్లపైన వేసి కట్టు కట్టిన పుండ్లు మానును .
* ఈ పసరు పుండ్లపై పూయుట వలన పురుగులు పట్టిన పుండ్లు లలో పురుగులు చచ్చిపోయి పుండ్లు శీఘ్రంగా మానును .
ఈ యోగాన్ని పశువుల పుండ్లుపై నేను ప్రయొగించాను . చాలా మంచిఫలితాలు వచ్చాయి . రసాన్ని పుండుపై పిండి ఆకువేసి కట్టాను .
* దీని గింజలు రుబ్బి తలకు పట్టించిన పేలు పోవును .
* శీతాఫలం చెట్టు యొక్క లేత ఆకుల కషాయం ఇచ్చునచో చిన్న పిల్లల లో పేగు మలద్వారం నుంచి బయటకి వచ్చు సమస్య తీరిపోవును .
* శీతాఫలం చెట్టు కాండం పైన ఉన్న చెక్క కషాయం ఇచ్చినచో జ్వరం , ఉబ్బసం ద్వారా వచ్చే దగ్గు మానును
* శీతాఫలం తీసుకోవడం వలన గుండెకు అద్బుత బలం చేకూర్చును .
* శీతాఫలం యొక్క పండు గుజ్జు గడ్డలపైన వేసి కట్టినచో గడ్డలు పగులును .
* దీనిఆకు పసరు గజ్జి , తామర నయం చేయును .
* దీని విత్తనాల పొడిని పేపర్లో కొంచం కట్టి బట్టల మధ్యలో పెడితే బట్టలకు పురుగుల సమస్య ఉండదు.
శీతాఫలం ఎక్కువ తీసుకోవడం వలన కలుగు దోషాలు -
* శరీరంలో శ్లేష్మము పెంచును.
* కొద్దిగా పైత్యం చేయును .
* జీర్ణక్రియ సరిగ్గా లేనివారికి జ్వరం తెచ్చును
* అతిమూత్ర వ్యాధి కలిగినవారు దీనిని వాడరాదు.
* గర్భిణి స్త్రీలు దీనిని అసలు తినరాదు. దీనికి గర్భస్రావం కలిగించే గుణము కలదు .
ఏ సిరిధాన్యం ఏ వ్యాధులను తగ్గిస్తుంది...
1. కొర్రలు (Foxtail Millet):- నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ధయిటిస్,
పార్కిన్సన్, ముస్క్యూలెర్ డిస్ట్రోఫీ, మూర్ఛరోగాల నుండి విముక్తి.
2. అరికలు (Kodo Millet):- రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయబిటిస్, | మలబద్ధకం, మంచినిద్ర.
3. ఊదలు (Barnyard Millet):- లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్), కొలెస్టరాల్ తగ్గించడం, కామెర్లు.
4. సామలు (Little Millet):- అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, సంతానలేమి సమస్యల నివారణ.
5. అండు కొర్రలు (Browntop Millet):- జీర్ణాశయం, ఆర్థయిటిస్, బి.పి. థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.
సిరిధాన్యాల వాడుటకు ముఖ్య సూచనలు:-
ఒక్క అండు కొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి.
మిగతా సీరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు.

సమయాభావం ఉంటే ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు.
ఈ సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు.
దేనికి అది విడివిడిగా వండుకోవాలి. కలగలిపితే ఏ రకమైన ప్రయోజనం కలుగదు.
ఏ ఆరోగ్య సమస్యలు లేనివారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్నే వాడాలి. తరువాత రెండు రోజులు వేరొక సిరిధాన్యాన్ని వాడాలి.
అలాగ ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున వాడుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో మొదలు పెట్టాలి.
వీటితోపాటు కషాయాలు కూడా తీసుకుంటే ఇంకా మంచిది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి సమస్యనుబట్టి ఈ సిరిధాన్యాలలో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావొచ్చును. ఉదాహరణకు, ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పైన వివరించిన పట్టికలో సూచించిన విధంగా వారికి అవసరమైన సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వాడుకుని తిరిగి ముందు ఎంపిక చేసుకున్న ధాన్యాలను మరల మూడు రోజుల చొప్పున వాడుకోవాలి.
ఉదాహరణకు, సుగర్, కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటే వారు అరికలు 3 రోజులు, ఊదలు 3 రోజులు తింటూ మిగతా 3 రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి. ఆ సమస్యతో పాటు ప్రాస్యేటు సమస్య కూడా ఉంటే సామలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్కరోజు తినాలి. పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చును. సముద్రపు ఉప్పు గానుగ నూనె వాడుకోవాలి..
వీటితో పాటు కొన్ని రకాల ఆకు కషాయాలు తీసుకుంటే ఇంకా మంచిది.
మహిళల సమస్యలకు గోంగూర ఆకుల కషాయం బాగా పనిచేస్తుంది.
రోగ నిరోధకశక్తి పెంపొందించకోవడానికి గరికే కషాయం పనిచేస్తుంది. కొత్తిమీర, పుదీనా, నిమ్మగడ్డి ఆకుల కషాయాలు ఎవరైనా వాడవచ్చును.
ఏ కషాయమైనా ఒకవారం మాత్రమే వాడాలి. ఒకదాని తరువాత ఒకటి వాడుకోవాలి. సుగర్ ఉన్న వారికి దొండ ఆకుల కషాయం, దాల్చిన చెక్క కషాయం మంచివి. ఇవి పరగడుపున తీసుకోవాలి.
కషాయం తయారు చేసే విధానం:-
రాగి పాత్రలో ఉంచిన 150-200 మి.లి. నీరు తీసుకుని, (రాగి పాత్రలలో వేడివంట చెయ్యకూడదు) వేరే గిన్నెలో నీరు మరిగించి, దానిలో మనకు అవసరమైన 5-6 ఆకులు వేసి నాలుగు నిమిషాలపాటు ఉంచి, స్టవ్ కట్టేసిన తరువాత 2 నిమిషాలు మూతపెట్టి, ఆ తరువాత వడగట్టి, ఆ నీటిని త్రాగాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చెయ్యాలి. ఉదయం పరగడుపున ఒకసారి, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఒక గంట ముందు తీసుకోవాలి.
రక్తహీనతకు 3 రోజులు అరికెలు. 3 రోజులు సామలు రోజుకి 3 పూటలు తినాలి. తరువాత 3 రోజులు ఒక్కొక్క సిరిధాన్యాం 3 పూటలు తినాలి.
దీనితోపాటు పరగడుపున క్యారెట్, ఉసిరి, జామ లేదా బీట్రూట్, రసం తీసుకోవాలి, సాయంత్రం 20 కరివేప ఆకులు, 1 గ్లాసు పల్చటి మజ్జిగతో మిక్సీలో వేసి తిప్పి, 15-20 నిమిషాల తరువాత, భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే ఒక నెలలో రక్తహీనత నివారింపబడుతుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు 3 రోజులు సామ బియ్యం, ఒక రోజు అరికెలు, ఒక రోజు ఊదలు, ఒక రోజు కొర్రలు, ఒకరోజు అండు కొర్రలు వండుకుని మూడుపూటలు అదే తినాలి. తిరిగి 3 రోజులు సామలు, తరువాత నాలుగు రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తినాలి. దీనికి తోడు మెంతి ఆకుల కషాయం ఒక వారం, పుదీన ఆకుల కషాయం ఒక వారం, తమలపాకుల కషాయం ఒక వారం రోజుకి 2-3 సార్లు తీసుకోవాలి.
గానుగలో స్వయంగా తీయించుకున్న కొబ్బరినూనె రోజూ ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తీసుకుటే 20 వారాలలో అన్నిరకాల మందులు మానివేయవచ్చును. రోజూ కనీసం అరగంట వాకింగ్ చెయ్యాలి.
Friday, April 19
వేసవి కాలం జాగ్రత్తలు...
వేసవి తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం.
రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు...
వేసవి చిట్కాలు:-
1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
6) కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.
12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
13. తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.
15. వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి
16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS packets పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.
19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
20. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకుని వెళ్ళండి

దాల్చిన చెక్క కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం...
కొద్దిగా
వగరుగా, తియ్యతియ్యగా, ఘాటుగా వుండే దాల్చిన చెక్క కొద్దిగా
వేడిచేసిచేయవచ్చును గానీ, కడుపులో వాతాన్ని అమాంతం తగ్గిస్తుంది!
అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని కల్గించడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని అన్నంలో ఆహారపదార్ధంగానే కాక, మెత్తగా దంచిన పొడినిగాని, నీళ్ళతోనూతీసిన రసంగానీ విడిగా తీసుకొంటే మనకు కావలసిన ఫలితాలన్నీ దక్కుతాయి.
దాల్చిన చెక్కు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుందో గమనించండి!
గొంతులో కఫాన్ని కరిగిస్తుంది. దగ్గు జలుబు ఆయాసం, ఎలెర్జీ వ్యాధులన్నిలోనూ మేలు చేస్తుంది.
వాత వ్యాధులన్నింటిలో దాల్చిన చెక్క రసంగాని, దాల్చిన చెక్క పొడినితీసుకొంటే వాతం తగ్గుతుంది. అందువలన నొప్పి తీవ్రత కంట్రోల్లోకి వస్తుoది.
పైత్యం చేసిన అన్ని సందర్భాల్లోనూ దాల్చిన చెక్క మంచిది. కడుపులో మo ట, గుండెలో మంట, కడుపులో నొప్పి, గ్యాస్ ట్రబుల్ వున్నప్పుడు దాల్చిన
చెక్క మేలు చేస్తుంది!
జిగట విరేచనాలు, నీళ్ళ విరేచనాలు, రక్తంతో కూడిన విరేచనాలు,అజీర్తివిరేచనాలు కట్టుకోవడానికి దాల్చిన చెక్క చక్కగా తోడ్పడుతుంది. వాంతులు కూడా తగ్గుతాయి.
కల్తీ కలిసిన వస్తువులు తిన్నార అనుమానం ఉన్నప్పుడు సరిపడిని వస్తువులు తిన్నప్పుడు దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది ఎలర్జీ తీవ్రతను కలిగించదు.
దాల్చిన చెక్క పొడినిగానీ, దాల్చిన చెక్క రసాన్నిగానీ తీసుకోండి
మైగ్రేన్ తలనొప్పిలో దాల్చిన చెక్కని రోజూ తినండి. తలనొప్పి తీవ్రత తగ్గుతుంది
గుండె జబ్బులున్నవారు దాల్చిన చెక్కని తీసుకుంటే గుండె బలంగా ఉంటుంది
లివర్ వ్యాధులు అన్నింటిలోనూ దాల్చిన చెక్క మంచిది. కామెర్లలో కూడా తీసు కోవచ్చు. లివరీని బలసంపన్నం చేస్తుంది.
కళ్ళకు కాంతినిస్తుంది. కంటి రోగాలతో బాధపడేవారు దాల్చిన చెక్కతీసుకోండివ్యాధులు త్వరగా తగ్గుతాయి.
శరీరానికి నీరు పట్టినప్పుడు దాల్చిన చెక్కని రోజూ తింటే నీరు తగ్గుతుంది.
స్త్రీ గర్భాశయ వ్యాధులన్నింటిలో దాల్చిన చెక్కకి మంచి ప్రభావం వుంది!
నెలసరి వచ్చే నొప్పి తగ్గుతుంది.
ఋతురక్తం సక్రమంగా అయ్యేలా చేస్తుంది!ఋతు దోషాల్ని పోగొడ్తుంది.తేలికగా ప్రసవం అయ్యేలా చేస్తుంది.
గర్భాశయ దోషాల్ని పోగొడుతుంది.
గొంతును శుభ్రం చేస్తుంది. గురగురని పోగొట్టి గొంతును శ్రావ్యంగా చేస్తుంది.దాల్చిన చెక్కని బుగ్గని పెట్టుకొని చప్పరిస్తూ వుంటే స్వరపేటికలో వాపు తగ్గతుంది.
తేనె కలిపి రోజూ తింటే 15 రోజుల్లో వీర్యవృద్ధిని కల్గిస్తుందని వైద్యశాస్త్రంలో ఉంది

అశ్వగంధ గురించి- ఔషధ ఉపయోగాలు...
అశ్వగంధ ని తెలుగులో "పెన్నేరు దుంప" అని పిలుస్తారు . దీనికి బల్య , వాజీకరి , కామరూపిణి అని రకరకాల పేర్లు కలవు.
పెన్నేరు క్షుప జాతి చెట్టు. భూమి నుంచి 4 అడుగుల ఎత్తువరకు పెరుగును . విశేషముగా కొమ్మలు కలిగి ఉండును. ఆకులు గుండ్రముగా ఉండును. ఆకులకు కొనలు కలిగి ఉమ్మెత్త ఆకుల వలే మందముగా ఉండును. తెల్లని పువ్వులు పూయును . కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా , పండిన తరువాత ఎర్రగా ఉండును. కాయ యందు చాలా బీజాలు ఉండును. దీనికి భూమిలో చిన్న ముల్లంగి దుంప వంటి దుంప పొడవుగా , మృదువుగా ఉండును. ఈ దుంపలను ఎండించి ఆవుపాలలో శుద్ది చేసి ఔషధాలలో ఉపయోగిస్తారు .
nపెన్నేరు దుంప కారముగా , వేడిగా , చేదుగా , బలాకరంగా ఉండును. ఈ అశ్వగంధకు ఇండియన్ జెన్సాంగ్ అనే పేరు కలదు. అనగా భారత దేశపు యొక్క సర్వరోగ నివారిణి అని పిలుస్తారు . తెలుగులో కూడా ఒక సామెత కలదు. " పేరులేని రోగానికి పెన్నేరే మందు " అని ఒక నానుడి.
ఔషధ ఉపయోగాలు -
* అశ్వగంధ యొక్క పచ్చి ఆకు రసం పూయుట వలన వ్రణాలు తగ్గును. గొంతు చుట్టు మాల వలే వ్రణాలు ఏర్పడే గండమాల అనే రోగం తగ్గును.
* రక్తమును శుద్ది చేయడం లో ఇది చాలా అద్బుతంగా పనిచేయును . కుష్టు , బొల్లి వంటి చర్మ సమస్యలతో ఇబ్బంది పడువారు చికిత్సా ఔషధాలతో పాటు దీనిని కూడా వాడుచున్న చర్మ సమస్యలు త్వరగా నివారణ అగును.
* శరీరములో వాతాన్ని పోగొట్టడంలో దీనికిదే సాటి.
* అశ్వగంధ వాడుచున్న త్వరగా ముసలితనం రానివ్వదు.శరీరం యొక్క కాంతిని పెంచును.
* అనేక రకాల వ్యాధుల వలన శరీరం బలహీనంగా అయ్యినవారు ఈ అశ్వగంధని వాడటం వలన మంచి శరీరపుష్టి వచ్చును. శరీరం నందు బలహీనత పోయి బలవంతులుగా తయారగును.
* మోకాళ్ల నొప్పులు , సయాటికా నొప్పులు , మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన సమస్యల నుంచి త్వరగా విముక్తి పొందుతారు.
* శరీరము నందు కఫం పెరిగి ఇబ్బంది పడే వారు అశ్వగంధని వాడటం వలన కఫ సంబంధ సమస్యల నుంచి విముక్తి చెందుతారు.
* పిండోత్పత్తి చేయు అవయవాలకు బలాన్ని ఇచ్చును. స్త్రీల గర్భాశయ దోషాలను నివారించి గర్భం ధరించే అవకాశాలను పెంచును.
* అశ్వగంధని నిత్యం వాడుట వలన శరీరం నందలి టాక్సిన్స్ మరియు వ్యర్ధ పదార్దాలను బయటకి వెళ్లునట్లు చేసి శరీరమును శుద్ది చేయును .
* అశ్వగంధ యొక్క పచ్చి దుంపను నూరి కట్టినను లేదా ఎండు దుంపను నీటితో నూరి కట్టినను మానని మొండి వ్రణాలు మానును .
* అశ్వగంధ ఆకులకు ఆముదం పూసి వెచ్చచేసి కట్టిన రాచపుండ్లు , గడ్డలు కరిగిపోవును.
* అశ్వగంధ ఆకుల యొక్క పలచటి కషాయం లొపలికి ఇచ్చుచున్న జ్వరాన్ని హరించును .
* మూత్రం బిగించి పొట్ట ఉబ్బి ఉన్న సమయంలో అశ్వగంధ పండ్లు తినిపించిన మూత్రం ధారాళంగా బయటకి వెడలును .
* నిద్రపట్టక బాధపడువారు అశ్వగంధ చూర్ణమును , ఆవునెయ్యి, పటికబెల్లం చూర్ణం మూడు సమాన బాగాలుగా తీసుకుని లేహ్యములా కలుపుకుని తినుచున్న సుఖవంతమైన నిద్రని తెచ్చును.
* బలం లేక ఎండిపోతున్న పిల్లలకు శుద్ది చేసిన పెన్నేరు చూర్ణం పాలలో కలిపి ఇవ్వవలెను. సంవత్సరం దాటిన పిల్లలు అయితే తేనెతో లేదా దేశివాళి ఆవునెయ్యితో ఇచ్చుచుండిన కృశించిన పిల్లలు బలిష్ఠులుగా తయారగును.
* పక్షవాతంతో బాధపడువారు ఈ అశ్వగంధ చూర్ణమును ఉదయం మరియు సాయంత్రం రెండుపూటలా తీసుకొనుచున్న నరాలకు సత్తువ చేయును .
* అతిరక్తం , తెల్లబట్ట వంటి సమస్యలతో బాధపడు స్త్రీలు ఈ అశ్వగంధ చూర్ణంను వాడుట వలన శారీక బలహీనతలు పోయి సమస్య నుంచి బయటపడుదురు.
ఈ అశ్వగంధ మరెన్నో రోగాలకు అద్భుతమైన ఔషధంగా పనిచేయును . థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ ఔషధం వాడుట వలన మంచి ఫలితాలు వచ్చును.
ఇప్పటివరకు మీకు చెప్పిన ఫలితాలు అన్నియు శుద్ధిచేసిన అశ్వగంధ వాడినప్పుడే వస్తాయి. 11 సార్లు నాటు ఆవుపాలతో మాత్రమే శుద్ది చేయవలెను . బయట మార్కెట్లో దొరికే అశ్వగంధ చూర్ణం పొలాల్లో నుంచి తీసుకొచ్చి చూర్ణం చేసినటువంటిది. అలాంటి చూర్ణం కేవలం 40 % ఫలితాలు మాత్రమే ఇస్తుంది నూటికి నూరు శాతం ఫలితాల కోసం శుద్ది చేసిన అశ్వగంధ చూర్ణం మాత్రమే వాడవలెను. బయట దొరికే చూర్ణం లేత కాఫీ రంగులో ఉండును. శుద్ది చేసినది క్రీం రంగులో ఉండును.
శుద్ది చేసిన అశ్వగంధ చూర్ణం అనుభవ ఆయుర్వేద వైద్యుల ద్వారా చేయించుకొని మాత్రమే వాడవలెను. ఖరీదు కొంచం ఎక్కువుగానే ఉండును.

దగ్గు హరించుటకు...
* పిప్పిళ్ల చూర్ణం , తేనెతో కలిపి సేవించిన దగ్గు హరించబడును.
* తిప్పతీగ కషాయంలో పిప్పిళ్ల చూర్ణం కలిపి సేవించిన దగ్గు తగ్గును.
* అల్లం రసంలో తేనె కలిపి సేవించుచున్న దగ్గు తగ్గును.
* ఉదయం సమయమున అల్లం రసం బెల్లంతోను , రాత్రుల యందు త్రిఫలా చూర్ణం తేనెతోను కలిపి తీసుకొనుచున్న దగ్గులు తగ్గును.
* లవంగాలు కాల్చి పొడిచేసి సేవించిన దగ్గు తగ్గును.
* మిరియాల చూర్ణంను వేడి నేతితో సేవించుచున్న దగ్గు తగ్గును.
* అరటిపండులో మిరియాల పొడి వేసి తినుచున్న దగ్గు తగ్గును.
* నిప్పులపైన వాము వేసి ఆపొగ పీల్చుతున్న దగ్గు తగ్గును.
* ఎండుజిల్లేడు ఆకులను చుట్టగా చుట్టి దానికి నిప్పు అంటించి ఆ పొగ లొపలికి పీల్చిన దగ్గు తగ్గును.
* గంటకొకసారి వెల్లుల్లిపాయ రేకును తినుచున్న దగ్గు తగ్గును.
* మోదుగు బెరడు కషాయాన్ని పూటకు పావుకప్పు చొప్పున తాగుచున్న దగ్గు తగ్గును.

Thursday, April 18
గ్యాస్ ట్రబుల్ అడ్డుకోవడమెలా..?
కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, గ్యాస్,బ్రేవ్ బ్రేవ్ మంటూ త్రేన్పులు.
కూర్చున్నచోట కూర్చోలేని పరిస్థితి. చికాకు, కోపం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్
లక్షణాలే. ఈ సమస్యను అధిగమించాలంటే ఇవి పాటించాలి.
1. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి.
2. ప్రతిరోజూ విధిగా వ్యాయామం చేయాలి.
3. పీచు పదార్థాలు ఎక్కువగా వున్న తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
4. టీ, కాఫీలు మానేయాలి.
5. మసాలాలు, వేపుళ్లు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ మానివేయాలి.
6. వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్లు సరిపడినంత తాగాలి.
7. నిల్వ వుంచిన పచ్చళ్లు తినడం మానేయాలి.
సమస్యను అడ్డుకునేందుకు ఏం చేయాలి?
*************************************************
* శొంఠి చూర్ణంతో పాత బెల్లం సమంగా కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తిని ఆ తర్వాత వేడి నీళ్లు తాగితే కడుపులో వున్న గ్యాస్ సమస్య పోతుంది.
* ధనియాలు, శొంఠి సమభాగాలు చూర్ణం చేసి కలిపి ఒక టీ స్పూన్ ప్రతిరోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటితో తీసుకుంటే కడుపులో చెడుగాలి పోయి సాఫీగా విరేచనం అవుతుంది.
* అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి ఒక టేబుల్ స్పూన్ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది

Wednesday, April 17
ఆరోగ్యానికి అమృతం మజ్జిగ
- ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు మజ్జిగలో ఒక చెంచా సొంఠి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- వాంతులయ్యేటప్పుడు మజ్జిగతోపాటు జాజికాయను గీసుకుని మజ్జిగలో కలుపుకుని సేవించండి.
- వేసవికాలంలో ప్రతిరోజు రెండుసార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో వేయించిన జీలకర్ర కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
- కాళ్ళ పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- ఊబకాయంతో బాధపడేవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయం సమస్యనుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తుంది.
- వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది.
- ప్రతి రోజు మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది.
- మజ్జిగ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్ అందుతుంది. వివిధ జబ్బులను రానీయకుండా మజ్జిగ శరీరాన్ని కాపాడుతుంటుంది.
మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజు మజ్జిగను తీసుకునేందుకు ప్రయత్నించండి.
Monday, April 1
300 వ్యాధులకు సింపుల్ మెడిసిన్ మునగాకు...
పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. అందుకే దీనిని సాంప్రదాయకైన మందుగానూ చెబుతుంటారు మన పెద్దలు.
ద్వారా పొందొచ్చు.
తేలింది. యాంటీ ట్యూమర్ గానూ ఆకు వ్యవహరిస్తుంది.
అద్భుతమైన ఔషద సంజీవని మన మునగాకు.
నీరు – 75.9 శాతం
పిండి పదార్థాలు – 13.4 గ్రాములు
ఫ్యాట్స్ – 17 గ్రాములు
మాంసకృత్తులు – 6.7 గ్రాములు
కాల్షియం – 440 మిల్లీ గ్రాములు
పాస్పరస్ – 70 మిల్లీ గ్రాములు
ఐరన్ – 7 మిల్లీ గ్రాములు
‘సి’ విటమిన్ – 200 మిల్లీ గ్రాములు
ఖనిజ లవణాలు – 2.3 శాతం
పీచు పదార్థం – 0.9 మిల్లీ గ్రాములు
ఎనర్జీ – 97 కేలరీలు
ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి.
☘ముఖ్యంగా
కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు
విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం
పెరుగుతుంది.
Subscribe to:
Posts (Atom)