Friday, December 30

మధుమేహంకు మెంతులే ఔషధం..

మెంతుల వల్ల ఎన్నోరకాల ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులు మధుమేహం (షుగర్) గల వారికి క్రమం తప్పక వాడినట్లయితే అద్భుతమైన గుణముగా అనిపిస్తుంది. 100 గ్రాముల మెంతులు రాత్రి మజ్జిగలో నానించి మెత్తగా రుబ్బి నేతితో చారెలు చేసి ఉంచుకోవాలి. ఇవి నెలరోజులు వరకు నిలువ ఉంటుంది. ఈ గారెలు షుగరు వ్యాధికి వాడుతూ కాకరకాయ ముక్క పచ్చిది ఒక తులం ఉదయమే టిఫిను తిన్న తర్వాత తింటే ఇంగ్లీషు వైద్యములోని ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ గానీ, బిళ్లనుగానీ వాడకుండానే షుగరు కంట్రోల్‌ చేస్తుంది.
అంతేకాదు గడ్డలను కరిగించును, పక్వపరుచును. మేహశాంతిని కలుగజేసి విరేచనమును బంధించును. నరాలకు బలం ఇచ్చి స్త్రీలకు మాసక్రమ ప్రదరం (రుతురక్తమును) జారీ చేయును. దగ్గును, కషాయమును హరించును. కడుపు ఉబ్బరం, గ్యాసులను నిర్మూలించును. శరీరంలోని క్రొవ్వును తగ్గించి, సన్నబడేటట్లు చేస్తుంది మెంతులు.
మెంతులను పెరుగులోకి కలిపి (5గ్రాములు) నానించి మూడురోజులు రెండు పూటలా తీసుకుంటే రక్తవిరేచనములు తగ్గుముఖం పడతాయి. మెంతి పొడిని నీటితో ఉడికించి కడితే చీము గడ్డలు పగిలినొప్పి తగ్గుతుంది. అదే పిండిని ముల్లు గుచ్చుకున్న చోట కడితే నొప్పి తగ్గి ముల్లు బయటకు వస్తుంది. నానిన మెంతులను ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే బంక విరేచనములు తగ్గుతాయి. రక్త విరేచనములు కలిగినప్పుడు నిమ్మకాయంత వెన్నలో ఉల్లిపాయ ముక్కలను కలిపి రెండు రోజులూ రెండు పూటలా తింటే అమోఘంగా పనిచేస్తాయి.

Saturday, December 24

మనం వాడే టూత్ పేస్ట్ ఎంత ప్రమాదకరమో తెలుసా…?

మనం ఉదయం లేవగానే చేసే పని పళ్ళు తోముకోవడం. ఈ పళ్ళనుతోముకోవడం కోసం మనకు మార్కెట్ లలో చాలా టూత్ పేస్టులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి వలన మనకు చాలా ప్రమాదాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు!.

పేస్టుతో పళ్ళు తోముకుంటే ప్రమాదమా! అందరూ తోముకుంటున్నారు కదా! వారికి ఎలాంటి ప్రమాదం రాలేదు కదా! అని మాత్రం అనుకోకండి దాని ప్రభావం కచ్చితంగా మీ పై ఉంటుంది కావాలంటే పేస్టులో ఏముంటుందో ఒక్కసారి చూడండి.


టూత్ పేస్టు వలన ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయో తెలుసుకుందాం :
టూత్ పేస్టులో ఉండే కెమికల్స్ చిగుర్లలోకి వెళ్లి, రక్తంలో కలసి అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
టూత్ పేస్టులో పాలిథిన్ ఉంటుంది. ఇది విషంతో సమానం. దీని వలన బ్రెయిన్, హార్ట్ ,కిడ్నీ దెబ్బ తింటాయి.
టూత్ పేస్టులో మనకు తీపిగా ఉండేందుకు అస్పర్టేమ్ అనే పదార్థం కలుపుతారు. దీని వలన లుకేమియా, లింఫోమా,బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులు వస్తాయి.ఇది శరీరంలోకి ప్రవేశించగానే తలనొప్పి, చూపు మందగించడం,పార్కిన్ సన్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది.
టూత్ పేస్టులో నురగ రావడానికి డైతానోలమైన్ అనే కెమికల్ ని వాడుతారు. దీని వలన లివర్ మరియు కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
టూత్ పేస్టులో ఉండే సార్బిటాల్ అనే కెమికల్ విరోచనాలు. అజీర్ణం, గ్యాస్, వాపును కలిగిస్తాయి. అలాగే కొవ్వును తొందరగా కరగకూడ చేస్తుంది.
టూత్ పేస్టులో ట్రిక్లోసన్ అనే కెమికల్ ఉంటుంది దీని వలన గుండె, క్యాన్సర్, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయట.
టూత్ పేస్టుకి బదులు ఇవి వాడండి:
మీకు అందుబాటులో ఉంటే వేపపుల్లను వాడండి. దీని వలన మీకు చాలా లాభాలు ఉన్నాయి.
బేకింగ్ సోడాని మీ బ్రెష్ కు కాస్త అద్ది దానితో మీ పళ్ళను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
బేకింగ్ సోడా తో పాటు కొద్దిగా పెప్పర్ – మింట్ ఆయిల్ ను వాడితే మింట్ ఫ్లేవర్ తో ప్రెష్ ఫీల్ వస్తుంది.
దొడ్డు ఉప్పును పొడిగా చేసుకొని బ్రెష్ చేసుకుంటే చిగుళ్ల సమస్య రాదు. అలాగే దొడ్డు ఉప్పును నీళ్లలో కలిపి అందులో బ్రెష్ ను ముంచి పళ్ళు తోముకున్నప్రెష్ ఫీల్ వస్తుంది.
ఒకవేళ బ్రష్ చేసుకోవడం ఇష్టం లేకపోతె ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు. ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ తో ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు.
కోకోనట్ ఆయిల్ తో కూడా బ్రష్ చేసుకోవచ్చు దీని వలన యాంటీ ఫంగల్ లక్షణాలు, నోటి దుర్వాసన రాకుండా తోడ్పడుతుంది

Sunday, December 11

కొవ్వు ను తగ్గించే 12 గుడ్ ఫుడ్స్...

*1.పసుపు*
రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది.' లో డెన్సిటీ లిపొప్రొటైన్' (ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
*2.యాలకులు*
తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది.
*3.మిరప*
వీటిని (ఆహారంలో భాగంగా) తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. మిరపలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు.
*4.కరివేపాకు*
బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా కష్టపడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును ఊడ్చేస్తాయి ఇవి. కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే.
*5.వెల్లుల్లి*
ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.
*6.ఆలివ్ ఆయిల్*
వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
*7.క్యాబేజీ*
బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే మేలు.
*8.పెసరపప్పు*
కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలం. వీటితోపాటు విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. కందిపప్పు మోజులో పడి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే పెసరపప్పు తినడం తగ్గించొద్దు.
*9.తేనె*
మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు.
*10.మజ్జిగ*
గ్లాసుడు మజ్జిగలో 2.2 గ్రాముల కొవ్వు, 99 క్యాలరీలు దొరుకుతాయి. అదే పాలలో అయితే 8.9 గ్రాముల కొవ్వు 157 క్యాలరీలు ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి, ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉన్నాయి. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు.
*11.సజ్జలు*
అత్యధిక ఫైబర్ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే ఇలాంటి ఉపయోగమే కలుగుతుంది.
*12.చెక్కా లవంగాలు*
ఈ రెండూ లేకుండా మసాలా వంటలుండవు. భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్‌ల సమస్యలు రాకుండా చేస్తాయి. ఎల్.డి.ఎల్., ట్రైకోగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి.
 

ఇవన్నీ మీ డైలీ మెనూలో ఉండేలా చూసుకుంటే అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణకోశవ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. చక్కటి ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చు.

Friday, December 9

షుగర్ ను కంట్రోల్ లో ఉంచే మెంతులు...

* రక్తంలోని చక్కర నిల్వలను నియంత్రించి మధుమేహం రాకుండా చూడగల శక్తీ మెంతులకు ఉంది.
* వీటిలోని సపోనిన్ అనే రసాయనం ఆహారం ద్వారా ఒంట్లో చేరే చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
* మెంతి ఆకులోని పీచు ఆకలిని తగ్గించి బరువు పెరగకుండా చేస్తుంది.
* చనుబాలు పడని బాలింతలు మెంతులను ఏదోరూపంలో తీసుకుంటే చక్కగా పాలు పడతాయి.
* మెంతుల్లోని మ్యూసిలేజీ అనే పదార్ధం ఒంట్లో చేరిన ఫ్రీస్ రాడికల్స్ ను అడ్డుకొని కాన్సర్ రాకుండా చూస్తాయి.
మెంతుల్లోని గాలక్టోమన్నన్ అనే నీటిలో కరిగే స్వభావం వున్నా పీచు, జీర్ణక్రియను అవసరమైనంత మేరకు మందగింపజేసి అధిక చక్కెరలను గ్రహించకుండా చేస్తుంది. మెంతుల్లోని 4 హైడ్రాక్సీ ఐసోలూసిన్ అనే అమైనో ఆమ్లము టైప్ 1, టైప్ 2 మధుమేహాలను దరి చేరనీయకుండా చూస్తుంది.
వాడే పద్దతి..
* మెంతులను సన్నని సెగ మీద రెండు, మూడు నిమిషాల పాటు వేయించి,పొడి చేసుకుని దానిని కూరలు, వేపుళ్లలో, సలాడ్లలో చల్లుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
* చెంచాడు మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి మరునాటి ఉదయం మంచినీటితో తీసుకోవాలి.

* మెంతి మొలకలను సలాడ్ మీద చల్లుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
* రొట్టెలు, పరోటా, ఇడ్లీ, దోసె తయారీ పిండిలో మెంతి ఆకు తరుగు కలుపుకుంటే కావలసినంత పీచు దొరికినట్లే. (చేదుగా ఉంటాయి గనక కొంచం చాలు)
* మెంతులు, నిమ్మ రసం, తేనె కలిపి చేసే హెర్బల్ టీ విష జ్వరాలకు మందుగా పనిచేస్తుంది.
మెంతి టీ...
చెంచాడు మెంతులను మిక్సీ పట్టి, దానిని వేడినీటిలో మూడు గంటల పాటు నాననివ్వాలి. ఆ నీటిని టీ పొడితో కలిపి మరిగించి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం, రవ్వంత తేనె కలుపుకొని వేడి వేడిగా ఆస్వాదించాలి.

Wednesday, December 7

కొన్ని ఆరోగ్య చిట్కాలు...

* మందులు వేసుకున్న వెంటనే పండ్లరసాలు తాగితే ఆ మందులు అనుకున్న ఫలితాలు ఇవ్వవని వెస్ట్రన్‌ ఆంటారియో విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
* రోజుకు కనీసం అరవైగ్రాముల పెరుగు తినేవారిలో చిగుళ్ల వ్యాధులు రావు. పెరుగులో ఉండే లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్లపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. తద్వారా చిగుళ్లు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి.
* ఇతరులతో పోలిస్తే ముతక ధాన్యాలు తినేవారిలో రక్తపోటు వచ్చే ముప్పు 19 శాతం తక్కువ.
* అధిక కొవ్వుతో బాధపడేవారు అవిసెనూనెను ఆహారంలో భాగం చేసుకుంటే... శరీరానికి హానిచేసే తక్కువ సాంద్రతగలిగిన కొవ్వు(ఎల్‌డీఎల్‌) త్వరగా కరిగిపోతుంది.
* అలా తింటేనే...క్యారెట్లలో ఉండే ఫాల్‌కారినాల్‌ క్యాన్సర్‌ను నిరోధిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. కానీ... వాటిని తరగకుండా ఉడకబెట్టి తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. తరిగినవాటితో పోలిస్తే పూర్తి క్యారెట్‌ను ఉడకబెట్టినప్పుడు ఫాల్‌కారినాల్‌ 25శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. క్యారెట్లను తరిగి ఉడకబెట్టడం వల్ల వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయి. క్యారెట్‌కు ప్రత్యేకమైన తియ్యటి రుచినిచ్చే చక్కెరలు సైతం కరిగిపోతాయట.
* తలకు రాసుకునే నూనె పరిమాణంలో తేనె తీసుకుని కుదుళ్లకు అంటేలా మర్దన చేయండి. అరగంట తర్వాత పొడిజుట్టుకు ప్రత్యేకించిన షాంపూతో స్నానం చెయ్యండి. వారానికొకసారి ఇలా చేస్తే... బిరుసుగా ఉండే జుట్టు మళ్లీ జీవంతో నిగనిగలాడుతుంది.
* రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు కలిపి నూరి ముద్దలాగా చేయండి. కుంకుడు గింజ పరిమాణంలో రోజూ ఈ మిశ్రమాన్ని తింటే అజీర్ణం దరిచేరదు.
* చెవిపోటు వచ్చినప్పుడు చెవిలో రెండుమూడు చుక్కల వెల్లుల్లిరసం వేస్తే కాస్తంత ఉపశమనం లభిస్తుంది.
* మిక్సీ నుంచి మసాలా వాసన వస్తుంటే ఎండిన బ్రెడ్‌ముక్కలు వేసి పొడి చెయ్యండి. వాసనలు మాయం.
* అల్లం తింటే.. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.అవును ఇది పనిచేస్తుంది. నిపుణుల ప్రకారం.. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి ఇస్తే త్వరగా మార్పు కనిపిస్తుంది.

Monday, December 5

పైనాపిల్ తింటే బీపీ తగ్గిపోతుందట.. దంతాలకు ఎంతో మేలు చేస్తుందట..

కూరగాయలు, పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. . ఇందులోని పీచు మధుమేహానికి మందులా పనిచేస్తుంది. జీర్ణక్రియనూ పెంపొందిస్తుంది. ఇందులో సమృద్ధిగా దొరికే యాంటీఆక్సిడెంట్లు సంతాన సాఫల్యానికీ తోడ్పడతాయంటున్నారు నిపుణులు.
అలాగే పైనాపిల్ తీసుకోవడం ద్వారా బీపీని నియంత్రించుకోవచ్చు. ఇందులోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది. అలాగే పైనాపిల్‌లోని విటమిన్ సి.. అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. క్యాన్సర్‌ రోగుల్లో రేడియేషన్‌ కారణంగా తలెత్తే దుష్ఫలితాలను ఇందులోని బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ సమర్థంగా నివారించగలదు.
అలాగే పైనాపిల్‌లోని బీటా-కెరోటిన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నుంచి రక్షిస్తుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. పైనాపిల్ తీసుకోవడం ద్వారా ఆస్తమాను కూడా దూరం చేసుకోవచ్చు. కంటికి పైనాపిల్ ఎంతో మేలు చేస్తుంది.కంటి కండరాల క్షీణతనీ తగ్గిస్తుందని తేలింది. ఇది కీళ్లనొప్పుల్నీ తగ్గిస్తుంది. దంతాలూ చిగుళ్లూ వంటివి బలంగా ఉండేందుకూ ఇది దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Sunday, December 4

జామపండు - ఆరోగ్య రహస్యాలు

జామపండు తినటానికి అందరు ఇష్టతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆర్చర్యానికి గురవుతారు..!
1) అతితక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.
2) ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
3) వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.
4) A , B , C , విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
5) కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.
6) స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
7) జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
8) దీనిలో విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి , కంటికి చాల మంచిది.
9) అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
10) జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు , బీపి పెరగకుండా చేస్తాయి.
11) అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B 6 , B 9 ) , E , K విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.
జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.
* ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.
* గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
* జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Saturday, December 3

క్యాబేజీ... క్యాన్సర్‌ నివారిణి..!

క్యాబేజీలో పోషకాలు ఎక్కువన్నది తెలిసిందే. అయితే ఇందులోని సల్ఫొరాఫేన్‌ క్యాన్సర్‌ వ్యాధుల్ని అడ్డుకుంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా, ఇందులోని 3, 3-డై ఇండోలిల్‌మీథేన్‌(డిఐఎమ్‌) రేడియేషన్‌ థెరపీ కారణంగా తలెత్తే దుష్ఫలితాలనూ నివారిస్తుందని జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు ఎలుకల్ని రేడియేషన్‌కు గురిచేసి వాటిలో కొన్నింటికి డిఐఎమ్‌ను ఇచ్చారట. మరికొన్నింటికి ఇవ్వలేదట. నెలరోజుల తరవాత చూస్తే డిఐఎమ్‌ ఇచ్చిన ఎలుకలు రేడియేషన్‌ను తట్టుకుని జీవించాయని తేలింది.
రొమ్ముక్యాన్సర్‌ కారణంగా తలెత్తే కంతుల పరిమాణం పెరగకుండా క్యాబేజీలోని ఎపిజెనిన్‌ అనే రసాయనం అడ్డుకుంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరికి చెందిన తాజా పరిశోధనల్లో తేలింది.
* క్యాబేజీలో అధికంగా ఉండే బీటాకెరోటిన్‌; ల్యూటెన్‌, జియాక్సాంథిన్‌, క్యాంఫెరాల్‌, క్యుయెర్సిటిన్‌... వంటి ఆంథోసైనిన్‌లూ యాంటీ ఆక్సిడెంట్లూ హృద్రోగాల్నీ కంటి కండరాల బలహీనతనీ క్యాటరాక్ట్‌నీ నిరోధిస్తాయి. రోజూ అరకప్పు ఉడికించిన క్యాబేజీని తింటే శరీరానికి అవసరమయ్యే విటమిన్‌-సిలో35 శాతం లభిస్తుంది. అలాగే 81.5 మై.గ్రా. కె-విటమిన్‌ కూడా లభ్యమవుతుంది. బీ విటమిన్‌- కె ఎక్కువగా ఉండే వంకాయరంగు, ఎరుపురంగుల క్యాబేజీ ఆల్జీమర్స్‌ వచ్చే ప్రమాదాన్నీ అడ్డుకుంటుంది. క్యాబేజీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం... వంటి ఖనిజాలు ఎముక సాంద్రతని పెంచి, ఆస్టియోపొరొసిస్‌నీ నివారిస్తాయి.

ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి...

ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల ‘సి’ విటమిన్‌, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి.
ఉసిరితో ఎంతో మేలు :
ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ
సమస్యలను తొలిగిస్తుంది.
ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది.
హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది.
మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.
కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Friday, December 2

రాగి బిందెలలో నీళ్ళు నిలువ చేసుకుని తాగడం వల్ల...

రాత్రి పూట రాగి చెంబులో నీళ్ళు నిలువ చేసి పరకడుపున త్రాగడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మెదడు శక్తివంతంగా తయారవుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు క్రమపడుతుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రాగి పాత్రలను నిత్యం ఉపయోగంచడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి. రాగి పాత్రలలో వండిన వంటలను సేవించడం ద్వారా కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యవంతంగా పని చేస్తాయి.
చిన్న వయసులో జుట్టు తెల్లబడటం, చర్మం త్వరగా ముడతలు పడటం, వయస్సు పెరిగినట్లు కనిపించడం వంటి సమస్యలు దరిచేరకుండా నియంత్రిస్తాయి. ఊబకాయం, మలబద్దకం, గుండెపోటు వంటి సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. రాగి కడియం ధరించడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి బి.పి, కొలెస్ట్రాల్‌ను అరికడుతుంది.
రాగి బిందెలలో నీళ్ళు నిలువ చేసుకుని తాగడం వల్ల శరీరం బరువును పెంచే అనవసరమైన కొవ్వును బయటకు పంపేస్తుంది. రక్తప్రసరణను క్రమబద్దీకరించి మెదడును చురుకుగా పనిచేసేలా చేసి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. ఎదిగే పిల్లలకు అది ఎంతో ఉపకరిస్తుంది.

గుండె నొప్పి రాకూడదా.. అయితే జాజికాయ వాడండి..!


జాజికాయ విలువైన ద్రవ్యము. మెత్తని కలపజాతికి చెందిన మ్రొక్క. దీని చెక్కతో పెట్టెలు తయారు చేస్తారు. జాజి చెట్టు కాయలు ఉసిరిక కాయలు పరిమాణంలో ఉంటాయి. వీటి గింజలు పొగాకు విత్తనాల వలె తెల్లగా ఉంటాయి. వీనిని గసగసాలు అనే పేరుతో పిలుస్తారు.
జాజికాయలో కామెర్ల వ్యాధిని తగ్గించే స్వభావం ఉంది. నాలుకమీది పాచిని పోగొట్టి జిగటను తొలగిస్తుంది. పిల్లలకు కలిగే నీళ్ళ విరేచనాలను తగ్గిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్దకాన్ని తొలగిస్తుంది. శరీరానికి కాంతిని కలిగిస్తుంది. గుండె నొప్పిని తొలగించి బిపిని కంట్రోలు చేయగలుగుతుంది. అయినా దీని ఎక్కువగా వాడితే మిక్కిలి మత్తునూ, నిద్రనూ కలిగిస్తుంది.
జాజికాయ మాదక (మత్తును) కలిగిస్తుంది. జ్వరాన్ని తగ్గించి దప్పికను అరికడుతుంది. జాజికాయ పొడిని, ఆవుపాలతో గానీ, మేకపాలతో గానీ తగుమాత్రంగా తీసుకుంటే మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. జాజికాయ, సొంఠి అరగదీసి కణతలకు పట్టు వేస్తే సాధారణ తల నొప్పేగాక మైగ్రేన్‌ కూడా తగ్గుతుంది.
జాజికాయను కిళ్ళీలో ఒక చిన్న ముక్కను వాడుతారు. అది నోటి దుర్వాసనను అరికడుతుంది. జాజికాయ ముక్కను నములుతుంటే పండ్లలోని క్రిములు కూడా నశించే అవకాశముంది. దీని గంధం 2-3బొట్లు చెవిలో పిండితే సాధారణ చెవిపోటుకు పనిచేస్తుంది.
జాజికాయ గొప్ప పవర్‌ గల వస్తువు. సంభోగ శక్తిని పెంచుటలో దీనికిదే సాటి. కొన్ని వైద్య గ్రంతాలు దీన్ని మహాయోగమని పేర్కొన్నారు. జాజికాయను తుమ్మ జిగురు, ధనియాల రసు, ఫేనము, గులాబీ రసం వీటిలో దేనిలోనైనా వాడుకోవచ్చు

Thursday, December 1

పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి...

పాల‌ను తోడు వేసి త‌యారు చేసే పెరుగంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రైతే భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తినంది అస్స‌లు సంతృప్తి చెంద‌రు. భోజ‌నం అసంపూర్తిగా ముగిసిన‌ట్టుగానే భావిస్తారు. అయితే దీని మాట ఎలా ఉన్నా పెరుగుతో మ‌న‌కు అనేక ర‌కాల లాభాలే ఉన్నాయి. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో పెరుగుతో క‌లిపి ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తింటే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సులభంగా దూరం చేసుకోవ‌చ్చు. ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...


1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.
4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.
7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.
8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.
9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.
10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.