Saturday, May 27

ముడతలు తగ్గాలంటే...

ఎండకాలంలో ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి ఎన్నో ఇబ్బందులుంటాయి. ఎంత కడిగినా... చర్మం చమటతో, ముడతలుపడినట్టు కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే సహజ గుణాలు కల్గిన పదార్థాలను ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది...
  1. నిమ్మరసం: జిడ్డు చర్మం కలిగిన వారు నిమ్మరసంను ఉపయోగించాలి. ముఖాన్ని శుభ్రం చేసుకోవటానికి నిమ్మరసంలో ఐదు లేదా ఆరు చుక్కల నీటిని కలిపి ఓ కాటన్‌ ప్యాడ్‌తో ముఖానికి నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకున్న పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.జిడ్డు తొలగిపోవటంతో పాటు స్కిన్‌ ఫ్రెష్‌నర్‌గా పని చేస్తుంది.
  2. టమాట: ముఖంపై ఉన్న ముడతలను తొలగించటంలో టమాటలు ముఖ్యమైనవి. టమాటాలను సన్నగా కట్‌ చేసుకుని ముఖంపై రుద్దుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగితే చర్మంపై ఉన్న ముడతలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సరిపోతుంది.
  3. దోసకాయ: దోసకాయ రసం చర్మాన్ని రిఫ్రెష్‌ చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దోసకాయ రసాన్ని తాగినా.. ముఖానికి పట్టించినా..సరిపోతుంది. దోసకాయ రసాన్ని రోజూ తీసుకోవటం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోవటంతో పాటు తాజాదనంతో నిండి ఉంటుంది.
  4. గుడ్డు: గుడ్డులోని తెల్లసొన ముఖం ముడతలు పడకుండా కాపాడుతుంది. అలాగే చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వారు గుడ్డులోని తెల్ల సొనను ముఖానికి పట్టించిన పది నిమిషాల తర్వాత కడిగితే చర్మంపై ఉన్న ముడతలు క్రమంగా తగ్గుతాయి.
  5. ఆపిల్‌ వెనిగర్‌: ఆపిల్‌ వెనిగర్‌ చర్మానికి సహజ సిద్ధమైన టోనర్‌. ముఖానికి దీన్ని పట్టించటం వల్ల చమట, జిడ్డు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
  6. బేకింగ్‌ సోడా: బేకింగ్‌ సోడాలో కొద్దిగా నీరు కలుపుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించిన 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి.

నీళ్లతోనే ఆరోగ్యం...

మనలో చాలామందికి మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. వేసవి కూడా వచ్చేసింది కాబట్టే దాహంవేస్తే తప్ప నీరు తాగరు. నీరు మనదేహంలో ఎంతో ప్రముఖస్థానాన్ని వహిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎలాంటి పాత్ర వహిస్తుందో తెలుసుకుందాం...

మనశరీరంలో 60-70 శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే ఉంది. మన శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ పోషకాలను పంపేది నీరే. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహించేది నీరే. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్‌ వల్ల రకరకాల తలనొప్పులు, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు ప్రారంభమవుతాయి. అందుకే శరీరానికి తప్పనిసరిగా మంచినీరు అందించటం మనందరి ప్రథమ కర్తవ్యం. ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు తాగాలి. వ్యాయామం చేసే సమయంలో ప్రతీ ఇరవై నిముషాలకి లీటరులో మూడోవంతు నీరు తప్పనిసరిగా తాగాలి.
విమాన ప్రయాణం చేసేటప్పుడు ప్రతీ గంటకూ పావులీటరు నీరు తప్పక తాగాలి. మంచినీరు శరీరానికి అందకపోతే నీరసించిపోతాం. ఏకాగ్రత నశిస్తుంది. ఏ పనీ చేయలేం. కళ్లుబైర్లు కమ్ముతాయి. కాఫీ తాగే అలవాటున్న వారు అదనంగా రెండు కప్పుల నీరు తాగాల్సి ఉంటుంది. కారణం కాఫీలోని కెఫైన్‌ కారణంగా మూత్రం అధికంగా వచ్చి శరీరం డీహైడ్రేషన్‌కు దారితీసే అవకాశం ఉంది. ఓ రకమైన తలనొప్పి కూడా వస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా పనిచేయాలన్నా తప్పక పదిగ్లాసుల నీరు తాగాల్సిందే. అశ్రద్ధ చేయకండి. ఆహారం తిన్నాక రెండు గంటల తర్వాత నీరు తాగాలి. ఆహారంతో పాటు, ముద్దముద్దకు నీరు తాగడం మంచిది కాదు. గోళ్లు, జుట్టు, శరీరం అన్నిభాగాలూ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 8-10 గ్లాసులు నీరు తాగాల్సిందే. నీటిని కాచి, వడబోసి తాగితే ఆరోగ్యకరం.

Sunday, May 21

గులాబీ నీటితో...

సుగంధ పరిమళాలను వెదజల్లటంలో గులాబీ పాత్ర కీలకం. ఇది సౌంద్యర సాధనంగా కూడా అద్భుతంగా పని చేస్తుంది. గులాబీలోని ప్రతి భాగం ఔషధగుణాలను కల్గి ఉంటుంది. ఇవి ముఖ్యంగా చర్మాన్ని శుభ్రంగా, కోమలంగా ఉంచడంతో పాటు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవాలి అనుకునే వారు గులాబీ నీళ్ళను కింది విధంగా ఉపయోగిస్తే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది...
  • సహజంగా ముఖానికి ఏదైన మాస్క్‌ వేసుకుంటే తొలగించు కోవటానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తారు. అలా కాకుండా సహజ సిద్ధంగా మాస్క్‌ను తొలగించుకోవాలంటే గులాబీ నీటిని ఒక గ్లాసులో తీసుకుని దాంట్లో కాటన్‌ క్లాత్‌ ను ముంచి ముఖం పై ఉన్న మాస్క్‌ను నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం డీహైడ్రేట్‌ కాకుండా ఉంటుంది.
  • అలాగే చర్మం పై ఎక్కడన్నా కాలినా, కమిలినట్లు అనిపించినా, చిన్నగా గీరుకుపోయినా... గులాబీ నీళ్లలో కాటన్‌ క్లాత్‌ ముంచి ఆ ప్రాంతంలో ఉంచడం వల్ల మంట తగ్గి చర్మం చల్లగా, మృదువుగా మారుతుంది.
  • చర్మం ఎక్కువగా పొడిబారి చికాకు కలిగిస్తే ఇలా చేయండి. మాయిశ్చరైజర్‌లో గులాబీ నీళ్లను కలిపి చర్మానికి పట్టించండి. ఇలా పట్టించిన పది నిమిషాల్లోనే చర్మం మృదువుగా తయారవుతుంది.
  • ఎక్కువగా ఒత్తిడికి గురి అయితే రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి నీటిలో కొన్ని చుక్కల గులాబీ నీళ్లను కలిపి స్నానం చేస్తే చాలా రిలాక్స్‌ ఉంటుంది . 

ఇట్లా తినొద్దు...

మనం తినే ఆహారం మీద ఆరోగ్యం, అందం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆరోగ్యంతో ఉండాలన్నా, అందంగా కనిపించాలన్న మంచి ఆహారం తీసుకోవాలి. మీరు కడుపులోకి ఏం తీసుకుంటే అది మీ ముఖంలో ప్రతిబింబిస్తుంది. అందుకే తినకూడని ఆహార పదార్థాలేంటో చూద్దాం...
  1. ఫాస్ట్‌ ఫుడ్స్‌లో నూడిల్స్‌, స్మైలీస్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటివి తినడానికి రుచిగా అనిపించవచ్చు. అయితే వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ఆయిల్‌ మరియు సాల్ట్‌ అధికంగా ఉండటం వల్ల స్కిన్‌ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినే అలవాటును మానుకోవాలి.
  2. మాంసం తినడం, ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే భాగాలు తినడం వల్ల ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్‌ కు దారితీస్తుంది. వీటిలో శ్యాచురేటెడ్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని అధికంగా తినడంవ వల్ల ఫ్రీరాడికల్స్‌ పునరుత్పత్తి అవుతాయి. దీనివల్ల వయసుపైబడిన వారిలా కనిపిస్తారు.
  3. నిల్వ చేసిన ఆహారపదార్థాలు, చిప్స్‌లో ఉండే నూనె చర్మాన్నే కాదు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కాబట్టి చిప్స్‌, నిల్వ ఆహారపదార్థాలు వంటివి తీసుకోకపోవడం మంచిది.
  4. చాలా మంది ఆరోగ్యం, అందం కోసం ఫుడ్‌ సప్లిమెంట్‌ తీసుకుంటుంటారు. ఇది ఒకరకంగా శరీరానికి మంచిదే. అయితే సప్లిమెంట్‌ తీసుకునేటప్పుడు అకస్మాత్తుగా చర్మంలో మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఒక వేళ మీరు తిసున్న సప్లిమెంట్‌ క్వాలిటీ మీ శరీరానికి సరిపడకపోవచ్చు.
  5. పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. కానీ చర్మ తత్వాన్ని బట్టి అవి చర్మం మీద పనిచేస్తాయి. హార్మోనుల అభివృద్ధిలో కూడా కీలకం. పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. కానీ అధికంగా తీసుకోవడం వల్ల ఫలితంగా చర్మంలో మొటిమలు, మచ్చలు, పెరిగి తర్వగా వయసుపైబడిన వారిలా కనబడతారు.
  6. ఎండాకాలం కదాని,, చాలా మంది జ్యూస్‌లు ఎక్కువగా తాగుతుంటారు. జ్యూస్‌లు ఆరోగ్యానికి మంచివే. కానీ జ్యూస్‌ చేయడం వల్ల వాటిలోని ఫైబర్‌ కంటెంట్‌ పక్కకు పోతుంది. ఫైబర్‌ లోపం వల్ల కూడా చర్మం సౌందర్యం దెబ్బతింటుంది. శరీరంలో ఫైబర్‌ కంటెంట్‌ ఉంటే బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
  7. ఆల్కహాల్‌ ఉన్న ఏ డ్రింక్‌ తీసుకున్నా.. డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇవి చర్మంలోని తేమను తగ్గిస్తాయి. దాంతో చర్మం నిగారింపు తగ్గిపోతుంది.
  8. రోజువారి ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం డ్రైగా, డల్‌ గా మారుతుంది. కాబట్టి రెగ్యులర్‌ డైట్‌ లో ఉప్పు తగ్గించాలి.

Saturday, May 20

టమాటాతో అద్భుతం...

అకేషనైన్‌ చిన్నదైనా... పెద్దదైనా... బ్యూటీ పార్లరుకు వెళ్లటం ఓ అలవాటుగా మారిపోయింది. ఇలా ప్రతి చిన్న పార్టీకీ పార్లరుకు వెళ్లటం వల్ల రసాయనాల ప్రభావం ముఖంపై పడి చర్మం తొందరగా ముడతలు పడటం, రంగు మారటం వంటివి జరుగుతాయి. అలా కాకుండా సహజంగా ఇంట్లో ఉండే టమాటాలతో చర్మాన్ని, అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది...
  1. టమాటా గుజ్జులో కొద్దిగా బియ్యపు పిండి, కొంచెం పెరుగు కలుపుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకొని పది నిమిషాలయ్యాక చల్లటి నీటితో కడిగితే ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
  2. ముఖం నల్లగా, నిర్జీవంగా కనిపిస్తే ఇలా చేయండి. టమాటా గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి. అది ఆరిపోయాక చల్లటి నీటితో కడిగితే చర్మం రంగు మారి తాజాగా కనిపిస్తుంది.
  3. అలాగే ముఖంపై నల్లటి మచ్చలు ఇబ్బంది పెడుతుంటే టమాటా గుజ్జులో ముల్తానీ మట్టి కలిపి ముఖానికి పట్టించాలి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
  4. పార్టీకి వెళ్ళే కంటే పది నిమిషాల ముందు ముఖానికి ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. టమాటా గుజ్జులో కొద్దిగా గంధం పొడి కలుపుకొని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగితే చర్మం తాజాగా కనిపిస్తుంది. ఇది మంచి స్క్రబ్‌లా పని చేస్తుంది.
  5. అలాగే టమాటా గుజ్జులో కొన్ని పచ్చి పాలు కలిపి ముఖానికి పది నిమిషాలు పట్టించి తర్వాత చల్లటి నీటితో కడిగితే ముడతలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.

కురుల సంరక్షణకు...

అనారోగ్యంగా ఉన్నా... ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా.. వెంట్రుకలు తొందరగా ఊడిపోవటం, చాలా బలహీనంగా
ఉంటుంది. ఈ సమస్యలతో పాటు కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టు దృఢంగా, ఊడిపోకుండా కాపాడుకోవచ్చు...
  1. ఎక్కువగా వేడి చేసిన నీటితో స్నానం చేస్తే వెంట్రుకలు చిట్లిపోయి, పొడిబారుతాయి. అలాగే ఎక్కువగా ఊడిపోతాయి. స్నానం చేసేటప్పుడు చల్లటి లేదా గోరు వెచ్చటి నీటితో చేస్తే సరిపోతుంది.
  2. అలాగే ఎండలో ఎక్కువ సమయం ఉన్న జుట్టు పొడిబారుతుంది. అలా కాకుండా ఉండాలంటే జుట్టుకు మాయిశ్చరైజర్‌ లేదా కండీషనర్‌ రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎండ ప్రభావం వెంట్రుకలపై పడకుండా ఉంటుంది.
  3. నిద్ర లేమి వల్ల కూడా చర్మ, జుట్టు సమస్యలు వస్తాయి. నిద్ర సరిగ్గా పోకపోతే జుట్టు ఎక్కువగా ఊడిపోవటం, ముఖం నిర్జీవంగా కనిపించటం వంటివి జరుగుతాయి. కాబట్టి కచ్చితంగా రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోతే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు.
  4. వెంట్రుకలు ఆరబెట్టుకోవటానికి ఉపయోగించే పరికరాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వేడికి జుట్టు ఎక్కువగా చిట్లిపోతుంది. ఒక వేళ హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే వెంటనే కండీషనర్‌ లేదా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
  5. జుట్టుకు ఎక్కువగా టైట్‌గా, రబ్బరు బ్యాండ్‌ గట్టిగా పెట్టడం వల్ల కూడా వెంట్రుకలు చిట్లిపోతాయి. సమ్మర్‌లో వీలైనంత వరకు జుట్టును వదులుగా, ఫ్రీగా వదిలిపెట్టడం మంచిది.
  6. అధిక ఒత్తిడికి గురైనా కూడా వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతాయి. ఇలాంటి వారు మెడిటేషన్‌, యోగ వంటివి చేయటం మంచిది. 

Friday, May 19

జుట్టు సమస్య.. చిరాకే!

తల్లో దురద వస్తే ఆ బాధ చెప్పలేము. ఎవరితోనైనా మాట్లాడే సమయంలోనో, ఏదైనా ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడో తల దురద వస్తే కలిగే చికాకు ఇంతా అంతా కాదు. సాధారణంగా గోకి, తాత్కాలిక ఉపశమనం పొందుతాం. అలా గోకడం వల్ల తల మాడు ఎర్రబడటం, పుండ్లు తయారవడం, ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్‌ సోకడం వంటి వాటితో మొదలై, దురుద కలగడంతో పాటు, జుట్టు ఊడిపోతుంది. తల పొడిబారటం కూడా దురదకు ఒక కారణం కావచ్చు.
అయితే దురద, ఇన్‌ఫెక్షన్‌ సమస్యను పూర్తిగా తొలగించడానికి కొన్ని ఇంటి చిట్కాలున్నాయి..
  • గోరువెచ్చని కొబ్బరి నూనె, తలకు మసాజ్‌ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తలకు పట్టించిన కొంతసేపటి తర్వాత తలస్నానం చేయాలి. రెండు మూడు చుక్కల కొబ్బరి నూనెను, షాంపూతో కలిపి తలకు పెట్టి, తలస్నానం చేయాలి.
  • రోజువిడిచి రోజు తలకు కొబ్బరినూనెతో మసాజ్‌ చేయడం వల్ల తలలో ఎలాంటి సమస్యలూ రావు. ఫంగల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు తొలగిపోతాయి.
  • నువ్వుల నూనెలో మాన్పే గుణం ఉంటుంది. లూబ్రికేంట్‌లా ఉపయోగపడుతుంది. దీని వల్ల తలలో దురద మాయమవుతుంది. నువ్వుల నూనె వేడి చేసి, తలకు పెట్టి, 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ముఖ్యంగా రాత్రి రాసుకుని, ఉదయం తలస్నానం చేస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. దాంతో తలలో దురద తగ్గుతుంది.
  • మెంతులను మెత్తని పిండిలా తయారు చేసి, అందులో రోజ్మెరీ ఆయిల్‌ కలిసి, పల్చగా, ద్రావణంగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. తర్వాత షవర్‌ క్యాప్‌తో తలను పూర్తిగా కప్పి, అరగంట నుంచి గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.
  • పెరుగును గుడ్డులోని తెల్లసొనతో కలిపి, తలకు పట్టించిడం వల్ల మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఈ హెయిర్‌ ప్యాక్‌ దురదగా ఉండే జుట్టు సమస్యను నివారిస్తుంది. ఈ హెయిర్‌ ప్యాక్‌ను ఇలా రెండు వారాలకొక్కసారైనా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Wednesday, May 17

బీర్ లో 10 ఆశ్చర్యకరమైన విషయాలు...

బిజీ షెడ్యూల్ తో రోజంతా పనిచేసి సాయంత్ర అయ్యే సరికి బీరు తాగాలనిపిస్తుంది కొందరికి. అందేంటే, రిఫ్రెష్ అవ్వడానికి అని సాకు ఒకటి. ఏ ఆల్కహాల్ అయినా సరే మోతాదుకు మంచి త్రాగితే కాలేయం మరియు గుండె సంబంధిత సమస్యలు ఇంకా కొన్ని క్యాన్సర్లకు గురికావల్సి వస్తుంది. అయితే, తరచుగా కాకుండా అప్పుడప్పుడు తీసుకంటే అది ఆరోగ్యానికి మంచిది అని మీకు తెలుసా?సాధారణంగా ఆధునిక వినియోగం ప్రకారం మహిళలు రోజుకి 1(12ఔన్సుల) బీర్స్ మహిళలు మరియు రెండు పురుషులు వినియోగించవచ్చని భావిస్తారు. బీర్ ను నీరు, బార్లీ, హాప్ మరియు ఈస్ట్ తో తయారుచేస్తారు. ఇది ఫ్యాట్ ఫ్రీ, మరియు కొలెస్ట్రాల్ ఫ్రీ పానీయం ఎందుకంటే ఇందులో శరీరంలో కరిగే నార, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, భాస్వరం, బయోటిన్, క్రోమియం మరియు విటమిన్ బి6, బి12, మరియు ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ వంటి పోషకాంశాలు గణనీయమైన మొత్తంలో కలిగి ఉన్నాయి. 
 బీర్ మొత్తం ఆరోగ్యానికి మరియు అనేక వ్యాధుల నిర్మూలణకు సహాయపడుతుందని అనేక పరిశోధన అధ్యయనాలు నిరూపించబడ్డాయి. మరి ఈ బీర్ లోని సర్ప్రైజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం...
స్ట్రోక్స్ (పక్షవాతం)కు వ్యతిరేకంగా పోరాడుతుంది:-
అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ పక్రారం బీర్ త్రాగని వారికంటే, త్రాగే వారిలో 50% స్ట్రోక్ ప్రమాధాలను తగ్గిస్తుందని నిరూపించారు. బీర్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా గుండె, మెడ మరియు బ్రెయిన్ కు రక్తం ప్రసరణ మెరుగుపరుస్తుంది. దాంతో ఎటువంటి స్ట్రోక్ గురికాకుండా సహాయపడుతుంది.
అల్జీమర్స్ రిస్క్ తగ్గిస్తుంది: 
బీర్ లో ఉండే సిలికాన్ కంటెంట్, మెదడను ప్రమాధకరమైన అల్యూమినియం నుండి రక్షణ కల్పిస్తుంది. శరీరంలో అధిక శాతంలో అల్యూమినియం అల్జీమర్స్ వ్యాధికి గురిచేసే అవకాశం ఉంది. అంటే దాని అర్ధం, మతి మరుపు తగ్గించుకోవడానికి బీర్ త్రాగని వారు అలవాటు చేసుకోమని కాదు.


ఎముకలను బలంగా ఉంచుతుంది:-
బీర్ లో అత్యధికంగా సిలికాన్, కలిగి ఉంటుంది. మరియు ఎముకలను ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. సిలికాన్ బోన్ మినిరల్ డెన్సిటిని మరియు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
బ్రెయిన్ హెల్త్ :-
రష్ యూనివర్సిటి మెడికల్ సెంటర్ పరిశోధకలు జీవితంలో స్మృతి సమస్యలు అభివృద్ధి ప్రమాదంను తగ్గిస్తుంది చూపిస్తున్నాయి. బీర్ తగుమోతాదలో తీసుకంటే కొత్త మెదడు కణాల వృద్ధి వల్ల అల్జీమర్స్ సంఘటనాత్మక మరియు చిత్తవైకల్యం తగ్గుతుంది. అలాగ, బీర్ వల్ల మెమరీ, ఏకాగ్రత మరియు తార్కిక శక్తిని అభివృద్ధిపరుస్తుంది.


ప్రొస్టేట్ క్యాన్సర్:-
తగుమోతాదులో బీర్ తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. బీర్ లో క్సాంథోహోమోల్, క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి శక్తివంతమైన ప్రతిక్షకారినిగా ఉంటుంది. ఇది బ్లాక్స్ పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ అభివృద్ధి దారితీసే ఒక రసాయన చర్య. పురుషుల్లో రొమ్ముక్యాన్సర్ రాకుండా అవకాశాలను తగ్గిస్తుంది.
చుండ్రు నివారిస్తుంది:-
 బీర్ లోని హై విటమిన్ బి మరియు ఈస్ట్, వల్ల బీర్ ను ఒక బెస్ట్ నేచురల్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ గా సహాయపడుతుంది. ఒక బాటిల్ బీర్ వారంలో రెండు లేదా మూడు సార్లు తలకు స్నానం చేయడం వల్ల చాలా త్వరగా చుండ్రు సమస్యను నివారించుకోవచ్చు. తలమీద బీర్ సోసుకొన్న తర్వాత చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే బీరు వాసన కేశాల్లో అలాగే ఉంటుంది. అంతే కాదు ఇది జుట్టును మరింత మృదువైన మరియు మెరిసేలా చేస్తుంది.


గుండె సంబంధిత ప్రమాధాన్ని తగ్గిస్తుంది:-
హార్వాడ్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, బీర్ గుండె సంబంధిత వ్యాధులను 20% నుండి 40% వరకూ తగ్గిస్తుంది కనుగొన్నారు. అందుకు ముఖ్యంగా ఇందులో ప్రధానంగా శరీరంలో కరిగేటటువంటి ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఇంది ఎల్ డిఎల్ లెవల్స్ ను తగ్గిస్తుంది లేదా రక్తంలో చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. రెగ్యులర్ బేస్ లో బీర్ తీసుకోవడం వల్ల హెడిఎల్ ను పెంచుతుంది లేదా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇది రక్తం పల్చగా మార్చి హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది.
కిడ్నీ స్టోన్ తగ్గిస్తుంది:-
బీర్ కిడ్నీ స్టోన్(మూత్రపిండాల్లో రాళ్ళు)ఏర్పడకుండా సహాయపడుతుంది. ఫిన్ ల్యాండ్ స్టడీ ప్రకారం అతి తక్కువ మోతాదులో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 40 కిడ్నీలో రాళ్ళు ఏర్పడదని నిరూపించబడింది. బీర్ లో ఉండే అధిక నీటిశాతం(93%)మూత్రపిండాలు మంచిగా పనిచేయడానికి మరియు శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది.డీహైడ్రేన్ వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ప్రధానకారణం. కాబట్టి బీర్ లోని డ్యూరియటిక్ ఎఫెక్ట్ డీహైడ్రేషన్ కు గురికానివ్వదు.
చర్మం హైడ్రేషన్ లో ఉంటుంది:-
 బీర్ త్రాగడం వల్ల చర్మతేమగా ఉంటుంది. నిజానికి వర్కౌట్ తర్వాత బీర్ త్రాగడం వల్ల నీటి కంటే బీర్ వల్ల చర్మం మరింత తేమంగా ఉంటుంది. ఇది బీర్ లోని కార్బొనేషన్ వల్ల దాహంను పెంచడానికి మరింత సహాయపడుతుంది.
 
డయాబెటిస్:-
తగుమోతాదులో బీర్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీర్ లో ఉన్న ఆల్కహాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. అది మధుమేహాంకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బీర్ లో సోలబుల్ ఫైబర్ ఉంటుంది. డయాబెటిస్ బీర్ ను ఎంపిక చేసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ను తగ్గిస్తుంది.

కొన్ని ఆరోగ్య చిట్కాలు...

Summer Tips...



Friday, May 12

అందం, ఆరోగ్యం...

పాలు సహజ సిద్ధమైన సప్లిమెంట్‌. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా ప్రోటీన్‌, కాల్షియం, కాపర్‌, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, విటమిన్‌ 'డి' 'కె' 'ఇ' లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా ఉపయోగపడుతాయి చెబుతున్నారు నిపుణులు...
  1. పాలు: జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు బాగా మరిగించిన పాలల్లో సగం చెంచా పసుపు పొడి వేసుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు, జలుబు నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు.
  2. మొటిమలకు: చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచటంలో పాల పాత్ర కీలకం. అలాగే మొటిమలను తగ్గించటంతో పాటు మచ్చలు రాకుండా కాపాడుతుంది. ఒక చెంచా పాలల్లో చిటికెడు పసుపు, సగం చెంచా తేనెను కలిపి ముఖంపై పెట్టుకోవాలి. ఇలా పది నిమిషాలు పెట్టుకున్న తరువాత చల్లని నీటితో కడిగితే సరిపోతుంది.
  3. డిటాక్సిఫికేషన్‌: సగం కప్పు పాలల్లో ఒక చెంచా పసుపు, కొద్దిగా తేనె, ఒక చెంచా లెమన్‌ జ్యూస్‌ను వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీళ్లను రోజూ ఉదయం పూట గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితం ఉంటుంది.శరీరంలో మలినాలన్ని పోతాయి.
  4. ఫెేస్‌ మాస్క్‌: పొడిబారిన ముఖానికి పచ్చిపాలను ఫేస్‌ మాస్క్‌లా పెడితే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా ఒక చెంచా చిక్కటి పాలల్లో చిటికెడు పసుపు, సగం చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ముఖంపై ప్యాక్‌ ఎండిపోయాక చల్లని నీటితో కడిగితే సరిపోతుంది.
  5. దురదకు: చర్మం దురద పెడితే ఎన్నో రకాల మందులను వాడుతుంటారు. అలా కాకుండా సహజ సిద్ధంగా ఇంట్లో ఔషధాన్ని తయారు చేసుకుంటే ఏలాంటి సైడ్‌ ఎఫెక్ట్సు ఉండవు. ఒక చెంచా పాలల్లో సగం చెంచా పసుపు, ఒక చెంచా కలబంద జెల్‌ను కలిపి దురద ఉండే ప్రదేశంలో పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల దురద తొందరంగా తగ్గిపోతుంది.
  6. నోటి శుభ్రతకు: నోటిలో వచ్చే అల్సర్‌ను తగ్గించటంలో కొబ్బరి, కొబ్బరి పాల పాత్ర కీలకం. దీని కోసం ముందుగా ఒక చెంచా కొబ్బరి పాలల్లో రెండు చెంచాల పసుపు, సగం చెంచా నీళ్లు, సగం చెంచా కొబ్బరి నూనెను కలపాలి. ఆ నీటిని నోటిలో కొద్ది సమయం ఉంచుకుని తరువాత పుక్కిలిస్తే సరిపోతుంది.

Thursday, May 11

మిఠాయిలు ఎక్కువ తింటే ముప్పే!

స్వీటు అంటే ఇష్టముండని వారుండరు. మోతాదులో ఎక్కువ, తక్కువ తేడా తప్ప మిఠాయిలంటే ఎవరికైనా పసందే. అయితే.. తక్కువ తింటే ఏం లేదు గానీ ఎక్కువ తింటేనే ఆరోగ్య సమస్యను ఎదుర్కొక తప్పదంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా స్వీట్ల వల్ల మానసిక ఒత్తిడి తీవ్రమవుతుందని ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌ పరిశోధకులు వెల్లడించారు. తీపి తినడంతో మెదడులోని హిప్పోకాంపస్‌ దెబ్బతింటుందని, దీంతో జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా కృతిమ తీపితో అనర్థాలు తప్పవని మరో అధ్యయనంలో తేలింది. లావుగా ఉన్నవారు ఆర్టిఫిషియల్‌ స్వీట్లు అధిక మొత్తంలో తీసుకుంటారని, వీటి వల్ల శరీరంలో గ్లూకోజ్‌ నియంత్రణ సరిగా ఉండదని వెల్లడైంది. అంతేకాదు.. గర్భిణులు కృత్రిమ స్వీట్నర్స్‌ వాడితే ఊబకాయులైన పిల్లలు జన్మిస్తారని తేలింది.

ఉప్పులోనూ పోషకాలెన్నో...

కూర ఎంత ఇష్టంగా చేసినా దాంట్లో చిటికెడు ఉప్పు తగ్గిన ఆ కూర నోటికి రుచిగా అనిపించదు. రుచి కోసం ఎన్ని ఫ్లేవర్స్‌ వేసినా చివరకు ఉప్పు దగ్గరకు రావాల్సిందే ! అలాగే కొన్ని రకాల ఉప్పులు న్యూట్రీషనల్‌ గుణాలను కలిగి ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అలాంటి కొన్ని ఉప్పుల గురించి తెలుసుకుందాం...
  1. ప్రతిరోజూ వంటలో ఉపయోగించే ఉప్పు వల్ల చాలా లాభాలుంటాయి. ఈ ఉప్పు ఆహారంలో తొందరగా కలిసి పోతుంది. దీంట్లో అయోడిన్‌ ఎక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్‌ సమస్యలు దూరం అవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం అయోడిన్‌ ఉన్న ఉప్పును తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండటామే కాకుండా పిల్లల మెదడు ఎదుగుదలకు తోడ్పడుతుందట.
  2. కేసరు ఉప్పు మంచి ఔషధం. దీంట్లో అయోడిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల ఎదుగుదలకు, చురుగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. కేసరు ఉప్పును ఆహారంలో వేసుకోవటం వల్ల వంటల రుచి కూడా బాగుంటుంది. ఇది ముఖ్యంగా అధిక రక్త పోటు, గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
  3. సముద్రపు ఉప్పు ఖనిజ లవణాలు, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్‌, జింక్‌, అయోడిన్‌ను కలిగి ఉంటుంది.
  4. సోడియం తక్కువగా ఉండే ఉప్పును ఉపయోగించటం వల్ల అధిక రక్త పోటు తగ్గుతుంది. ఉప్పులో సోడియం శాతం 30 శాతం కంటే తక్కువగా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.
  5. హిమాలయ రాయి నుంచి లేత గులాబీ రంగు ఉప్పును తయారు చేస్తారు. దీంట్లో మినరల్స్‌ ఎక్కువ శాతం ఉంటాయి. అలాగే ఈ ఉప్పు ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది.ఇది శరీరంలో పిహెచ్‌ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అలాగే శరీరంలోని మలినాలను బయటకు పంపించటంలో దీని పాత్ర కీలకం. 

Wednesday, May 10

తొక్క తియ్యకుండా తినేయండి!


నాలుకకు రుచిని, మనసుకు ఉల్లాసాన్ని, శరీరానికి శక్తిని ఇచ్చే పండ్లు అంటే అందరికీ ఇష్టమే. అయితే కొన్ని రకాల పండ్లని తొక్క తీయకుండా తింటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు...
  • ఈ సీజన్లో పుష్కలంగా లభించే మామిడి పండ్లను తొక్కతో సహా అలాగే తింటే కెరోటినాయిడ్లు , పాలీఫినాల్స్‌, ఒమెగా-3, ఒమెగా-6 యాసిడ్లు, పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు బాగా లభిస్తాయి. క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులను అవి దూరం చేస్తాయి.
  • యాపిల్‌ పండ్లలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు కూడా అధికమే. ఇవన్నీ పండులో ఎంత మోతాదులో ఉంటాయో, దాని తొక్కలోనూ అంతే స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ పండ్లను
  • తొక్క తీయకుండా తింటేనే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పియర్స్‌ పండ్లను తొక్క తీయకుండా తింటే, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో నూట్రియంట్లు శరీరానికి ఎక్కువ మోతాదులో అందుతాయి. వీటి తొక్కల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపులను, నొప్పులను తగ్గిస్తాయి.
  • సపోటా పండ్లను చాలా మంది తొక్క తీసి తింటారు. వీటిని శుభ్రంగా కడుక్కుని, తొక్కతో సహా తింటేనే మంచిది. దీనివల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. శరీరానికి పొటాషియం, ఐరన్‌, ఫోలేట్‌, పాంటోథెనిక్‌ యాసిడ్‌ వంటి కీలక పోషకాలు అందుతాయి.
  • ఫ్లమ్స్‌ పండ్లని కూడా తొక్క తీయకుండా తినాలి. ఆందోళనను, ఒత్తిడిని దూరం చేసే ఔషధ గుణం ఈ పండ్ల తొక్కల్లో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్‌ సి ఉండడం వల్ల, వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి.
  • కివీపండ్లను తొక్క తీయకుండా తినడం వల్ల శరీరానికి విటమిన్‌ సి ఎక్కువగా లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

కరివేపాకుతో మెరుపు...

కరివేపాకు కూరలో ఎంతటి సువాసన ఇస్తుందో ముఖానికీ అంతే సౌందర్యాన్ని తెస్తుంది. జుట్టుకూ పోషణనిస్తుంది. ఇందులోని ఎ,సి విటమిన్లు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి...
  1. కొబ్బరినూనెని వేడి చేసి అందులో గుప్పెడు కరివేపాకులు వేయాలి. దీన్ని తలస్నానం చేసేందుకు అరగంట ముందు జుట్టుకు రాసుకోవాలి. ఈ నూనె వల్ల జుట్టు నెరుపు సమస్య ఉండదు. కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి.
  2. పచ్చి కరివేపాకును నూరి ముద్దలా చేసి దానికి సరిపడా పెరుగు చేర్చి జుట్టుకు రాయాలి. ఇరవ్కె నిమిషాల తర్వాత గాఢత తక్కువున్న షాంపూతో కడిగేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రూ అదుపులో ఉంటుంది.
  3. కొన్ని కరివేపాకులను మెత్తగా చేసి దానికి చిటికెడు పసుపు చేర్చాలి. ఆ ముద్దని మొటిమలు ఉన్న చోట రాస్తే అవి తగ్గుతాయి. గుప్పెడు కరివేపాకును మెత్తగా చేసి దానికి చెంచా చొప్పున ముల్తానీమట్టీ, గులాబీ నీరు కలపాలి. ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది ముఖం మీద మచ్చలను, వలయాలను తగ్గించి మెరిసేలా చేస్తుంది. ముల్తానీమట్టి ముఖం మీద ఎక్కువగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. గులాబీ నీళ్లు సహజ రంగును ఇవ్వడంలో సాయపడతాయి.
  4. రెండు చెంచాల కరివేపాకు ముద్దకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి నల్లటి మచ్చలు ఉన్న చోట రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనివల్ల మొటిమల తాలూకు మచ్చలు మాయమవుతాయి.
  5. రెండు చెంచాల కరివేపాకు ముద్దకు మూడు చెంచాల ఆలివ్‌నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఆలివ్‌ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్‌, తేమ గుణాలు చర్మాన్ని మ దువుగా మారుస్తాయి. ు

Tuesday, May 9

కలబందతో ఆరోగ్యం...

కలబందతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు...
  • కలబంద ఉత్తమ యాంటీబ్యాక్టీరియల్‌, మంచి యాంటీ సెప్టిక్‌ కూడా. శరీరానికి తగిలిన గాయాలు, గాట్లు, మోకాళ్ల పగుళ్లను నయం చేస్తుంది.
  • కలబంద ఆకు నుంచి వచ్చే జెల్‌ని అధిక బాధ కలిగించే భాగంలో మర్దన చేస్తే నొప్పులు మాయమైపోతాయి.
  • కలబంద జెల్‌ వాడడం వల్ల మొటిమలు రాకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా వాపు, మంటలు, నొప్పుల నివారణగా ఉపయోగపడుతుంది.
  • ఈ సహజకరమైన మొక్క బయటి వాతావరణం వల్ల చర్మంలో వచ్చే పగుళ్లను తగ్గిస్తుంది.
  • చర్మానికి మృదుత్వం, నిగారింపుతో పాటు సౌందర్యాన్ని ఇస్తుంది. అందుకే సౌందర్య ఉత్పత్తుల్లో కలబందదే అగ్రస్థానం.
  • కలబంద చల్లదనాన్ని ఇవ్వటమే కాకుండా చర్మంపై మృతకణజాలాన్ని తొలగించి, కణాభివృ ద్ధి చెందడానికి ఉపయోగపడే ఔషధం.
  • కలబంద జెల్‌ని చర్మంపై రాస్తే సూర్య తాపాన్ని, హైపర్‌ పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది.
  • సోరియాసిస్‌, అలర్జీలు లాంటి చర్మసంబంధ వ్యాధుల్ని తరిమికొట్టే ప్రక తి మొక్క ఇది. చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది.
  • విందు కోసం చేసే వంటల్లో కలబంద కాస్త వేస్తే ఒంట్లోని వేడిని అమాంతం తగ్గిస్తుంది.
  • కలబందలోని ఎంజైమ్స్‌ల వల్ల ఆహారం బాగా జీర్ణమౌతుంది.
  • కలబంద కేవలం బ్యాక్టీరియా నాశినే కాదు ఫంగస్‌, వైరస్‌ని కూడా అంతమొందిస్తుంది.