పొడవైన, అందమైన మెరిసే జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది.
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే పొడవైన జుట్టును కాపాడుకోవడం ఆడవాళ్లకు
సవాల్ గా మారింది. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యల నుండి బయట పడటం చాలా
కష్టంగా మారింది. ఆరోగ్యమైన, బలమైన జుట్టు నిర్వహణకు కొన్ని సాధారణ వంట
ఇంటి నివారణలున్నాయి. జుట్టు సమస్యల పరిష్కారానికి కరివేపాకు బాగా
సహాయపడుతుంది. కరివేపాకులో బీటా – కెరోటిన్ మరియు ప్రోటీన్లు సమృద్ధిగా
ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉండడం వల్ల తలపై చర్మానికి
కావల్సిన తేమను అందించి చుండ్రు నుంచి విముక్తి కలిగిస్తాయి. కరివేపాకుతో
కొబ్బరి నూనె కలిస్తే జుట్టు పెరుగుదలలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
ఇలా చేయాలి:-
ఒక గిన్నెలో కరివేపాకు, కొబ్బరి నూనె వేయాలి. కరివేపాకు నల్లగా అయ్యేవరకు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద నుంచి దించి చల్లారాక జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత తేలికపాటి గాడతలేని షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా వారానికి రెండు సార్లు ఒక నెల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది. ఈ మిశ్రమంతో వెంట్రుకలు పెరగడమే కాకుండా చిన్న వయసులో జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.

హెయిర్ మాస్క్ ను తయారు చేయండి:-
కొన్ని తాజా కరివేపాకు ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమానికి పెరుగుతో కలిపి పేస్ట్ గా మార్చి తలపై చర్మానికి నేరుగా అప్లయ్ చేయండి. ఇలా 30నిమిషాల పాటు అలానే ఉంచి నీటితో కడిగేయండి. ఈ మాస్క్ ను ప్రతివారం ఒకసారి వాడడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడడే కాకుండా వెంట్రుకలు కాంతివంతంగా, మృదువుగా వస్తాయి.