*విషజ్వరాలు అంటే ... వైరల్ జ్వరాలు (Viral fevers) , ఈ విషజ్వరాలలో ఒక రకము డెంగూ జ్వరం .*
ఈ వ్యాధి కారక సూక్ష్మజీవి *ఆర్బోవైరస్* జాతికి చెందినది. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. కంటికి కనిపించదు .ఈ వైరస్ ఏయిడిస్ ఈజిప్టి జాతి దోమద్వారా రోగగ్రస్తుల నుండి ఆరోగ్య వంతులకు సంక్రమించును. ఈ దోమను టైగర్ దోమ అనికూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటి పూటనే కుట్టును. ఈ దోమలు కుట్టిన తర్వాత 5 నుండి 8 రోజులలో వ్యాధి లక్షణాలు కన్పించును.
*డెంగూ అనే డెన్ (DEN), గీ (gee) అని నాలుగు రకాల వైరస్లు . . . DEN -1 ,DEN-2 , DEN-3 , DEN-4 అనేవి ఆ వైరస్లు .*
రెండు రకాలు : -
1. సాదారణ రకము ,
2 . డెంగూ హెమరేజిక్ ఫీవరు (ప్రమాదకరమైనది),
డెంగూ వ్యాధి లక్షణాలు :-
1. ఉన్నట్టుండి జ్వరం ఉధృతంగా వచ్చుట
2. తలనొప్పి అధికంగా నుండును, ఎక్కువగా నొసటిపై తలనొప్పి కల్గుట
3. కంటిలోపల నొప్పి వచ్చి కంటి కదలికలను తగ్గించుట, కన్ను కదిలినప్పుడు నొప్పి ఎక్కువ అగుట
4. కండరాలు, కీళ్ళ నొప్పి కల్గుట
5. వాంతి అగునట్లు భ్రాంతి కల్గుట
6. నోరు ఎండిపోవును, ఎక్కువ దాహముండును
పై లక్షణాలు కలిగి ఉన్నచో వెంటనే మీ సమీపములో గల ఆసుపత్రినందు చూపించుకొని వ్యాధి నివారణ కొరకు చికిత్స పొందగలరు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కావున ప్రజలు వెంటనే స్పందించి జ్వర తీవ్రతను గుర్తించి పై తెలిపిన లక్షణాల నివారణ కొరకు వెంటనే తగిన చికిత్స పొందగలరు. ఈ విషయం సంబంధిత ఆరోగ్య శాఖాధికారులకు వెంటనే తెలియచేయవలెను.
వ్యాధి వ్యాపించే విధానము :-
1. ఈ వ్యాధి ఒక రకమైన ఆర్బోవైరస్ వలన సంక్రమించును
2. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఏడిస్ ఈజిప్టై అనే దోమ కాటు వలన వ్యాప్తి జరుగును
3. ఈ దోమలు పగలే కట్టును
4. ఈ రకమైన దోమలు మన ఇంటి పరిసరాలలో నీరు నిలుచుటకు ఆవకాశం వుండి, ఆ నీరు కనీసము వారం రోజులు నిల్వ ఉన్నచో, ఈ దోమలు వృద్ధి చెందును.
5. ఈ దోమలు గ్రుడ్డు పెట్టి పెరుగుటకు ఈ క్రింద తెలిపిన వస్తువులు / పరిసరాలు అనూకూలమైనవి. *ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్, పూలకుండీల క్రింద గల సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్, ఖాళీ డ్రమ్ములు, సన్ షేడ్స్ పై నిల్చిన వాన నీరు, బిల్డింగ్ ల పైన నిల్చిన వాన నీరు.*
1. ఇతర పనికిరాని, పగిలిపోయిన పస్తువులు
2. ఈ దోమ ఇంటిలో గల చీకటి ప్రదేశాలలో నివసించుచుండును
3. వాడకుండా వదిలి వేసిన పచ్చడి రోళ్ళు
4. ఫ్లవర్ వాజ్, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, పగిలిపోయిన కప్పులు, చెట్టు తొర్రలు మొదలైనవి.
ఎ) దోమల నివాసాలను తొలగించుట :-
నీరు నిల్వను, పనికిరాని కూలర్లను, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూలకుండీలు ఇతరత్రా కనీస అవసరాలకు ఉంచుకొని పనికిరాని వాటిని తీసివేయవలెను, ఇండ్లలోని మరియు వెలుపల నీటి నిల్వలను పాలపారబోయవలెను. నీటి ట్యాంకునకు మూతలుంచవలెను. నీటి నిల్వలు గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేయించుచూ వారంలో ఒక రోజు డ్రైడే (Dry Day) విధానము తప్పక పాటించుచూ రావలెను. అదే విధముగా జనవాసములందు సంఘీభావముతో పై కార్యక్రమములను పాటింపచేయవలెను.
బి) వ్యక్తిగత జాగ్రత్తలు :-
దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి విముక్తి పొందవచ్చును. పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించవలెను. అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి.
పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పబడునట్లు దుస్తులు వేయవలెను.
చికిత్స :-
స్వంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్, బ్రూఫెన్, కాంబిఫ్లామ్ మరియు అనాలజిన్ లాంటి మాత్రలు తీసుకోకూడదు.