Tuesday, August 30

భోజనం చేసిన వెంటనే నీరు తాగుతున్నారా ?

మన శారీరక దఃఖాలకి ప్రధాన కారణం కడుపు, పొట్ట భాగము. మనకు వచ్చే శారీరక దుఃఖాలలో 90% పొట్ట వల్ల వచ్చేవి. 10% మిగిలిన అవయవాల వల్ల వచ్చేవి. అంటే మోకాళ్ళ వల్ల, భుజాల వల్ల, హృదయం వల్ల, మెదడు వల్ల ఇలాంటివి 10% మాత్రమే, మిగిలిన 90% రోగాలు పొట్ట వల్లే వస్తున్నవి. అన్ని రోగాలకి చికిత్స కంటే, రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానం అంటారు.
మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణం అయిన తర్వాతనే, అది రసంగా మారి, మాంసం, మజ్జ, రక్తము, వీర్యము, మేద, మలం, మూత్రము ఇలా తయారవుతాయి. కాబట్టి తినడం ఎంత ప్రధానమో సక్రమంగా జీర్ణమవటం అంతే ప్రధానము.
“భోజనాంతే విషం వారీ”, అంటే భోజనం చివర నీరు త్రాగడం విషంతో సమానము. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ అగ్ని( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన విషయం.
మనం నోట్లో మొదటి ముద్ద పెట్టుకోగానే లాలజలం ఊరుతుంది. వెంటనే ఆహారాన్ని పచనం చేయడానికి జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది. ఇదేసమయంలో మనం గటగటా నీళ్లు తాగితే, ఆ నీరు జఠరాగ్నిని చల్లబరుస్తుంది. ఇక తిన్న భోజనం అరగదు, కుళ్ళి పోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వలన విష వాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది. మొట్టమొదట గ్యాస్ ట్రబల్, గొంతులోమంట, గుండెలో మంట, ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలగునవి. చివరగా వచ్చేది క్యాన్సర్. ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు.

Monday, August 29

రాత్రికి రెండు చపాతీ లు..మీలో జరిగే మార్పులు మీరే చూడండి!

ప్రతి ఒక్కరు అందంగా, ఆరోగ్యం గా ఉండాలనే అనుకుంటారు. కాని వివిధ రకాలైన జంక్ ఫుడ్స్ తినడం వల్ల వారి శరీరాక్రుతి లో మార్పులు రావడమే కాకుండా లావుగా మారిపోయి రక రకాల వ్యాధులతో భాదపడుతున్న వారిని మనం చూస్తూనే ఉంటాం.అందుకే ఆరోగ్యంగా, అందంగా, చక్కగా బరువు తగ్గాలంటే తిరుగులేని ఆహారం రెండు చపాతీలు చపాతీలు తింటే చర్మ సౌందర్యం పెరగడమేమిటి అనుకుంటున్నారా? చపాతీలతో చర్మం నిగారిస్తుందని పరిశోధనల్లో తేలింది...
1.చపాతీలో జింక్, పైబర్ తదితర మినరల్స్ అధికంగా ఉండడంతో ఇవి చర్మానికి ఇతోధికంగా మేలు చేస్తాయి.
2.కీలకమైన విషయం ఏమిటంలో చపాతీలను తయారుచేసేందుకు వినియోగించే గోదుమల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ను ఇంక్రీజ్ చేస్తుంది.
3.ఇక రోటీల్లో సహజంగా ఉండే ఫైబర్, సెలీనియం కంటెంట్ కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ఇది క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతాయి
4.వీటన్నటికంటే ప్రధానమైంది చపాతీలు చక్కగా జీర్ణమై మరుసటి రోజు శరీరం యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. వెయిట్ పెరుగుతున్నామన్న ఆందోళనలో ఉన్నవారికి, ఒబేసిటీ సమస్యను ఎదుర్కొంటున్న వారికి చపాతీలు తిరుగులేని ఆహారమని చెప్పుకోవాలి.
5.రాత్రిళ్లు రెండు చపాతీలు మాత్రమే తింటే జీర్ణక్రియ ఆర్డర్ లోకి వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం స్వచ్ఛమైన గోదుమ పిండినే వాడి వీలైతే ఆయిల్ లేకుండా రెండు చపాతీలనే క్రమం తప్పకుండా రాత్రివేళ తిని చూడండి మంచి ఫలితాలను చూస్తారు.

Sunday, August 28

ఈ పండు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా..? తెలిస్తే ఇక అస్సలు ఆగరు..!!

చూడగానే ఎరుపు రంగులో నిగ నిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే ‘దానిమ్మ’ పండులో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పొడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా పెరిగే దానిమ్మ మన దగ్గర కూడా ఎక్కువగా లభిస్తుంది. దీన్ని తరచూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
1. దానిమ్మలో విటమిన్ ఎ, సి, ఇ, బి5, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్, బ్రెస్ట్, స్కిన్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.
2. దానిమ్మలో సహజ యాస్పిరిన్ గుణాలు ఉన్నాయి. రక్త సరఫరాను వేగవంతం చేయడంలో దానిమ్మ మెరుగ్గా పనిచేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే గుండె భద్రంగా ఉంటుంది.
3. ఎముకల ఆరోగ్యానికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారికి అత్యంత దివ్యమైన ఔషధం దానిమ్మ.

  4. లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. సంతాన సాఫల్యతను పెంచే శక్తి దీనికి ఉంది. గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీ మహిళలు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకుంటే ఎంతో మంచిది. దీని వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు తప్పుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
5. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను..
కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్ల విరేచనాలతో బాధ పడేవారికి ఇది మంచి మందు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అల్సర్లను నివారిస్తాయి, దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
6. రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు దానిమ్మ రసం విరుగుడుగా పనిచేస్తుంది. దానిమ్మ రసం అంగస్తంభన సమస్యలను కూడా తొలగిస్తుంది. శృంగార పేరితంగా పనిచేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. దానిమ్మ రసంలోని రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల జరిగే ప్రమాదాలను తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించే గుణం దీనికి ఉంది. రక్తనాళాలు మూసుకుపోకుండా చూస్తుంది.
7. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మూత్ర పిండాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధంగా పనిచేస్తుంది. వాపును అరికడుతుంది. దానిమ్మ ఆకుల నూనె రాసుకుని వాపు ఉన్న చోట కడితే కాళ్ల వాపులు తగ్గుతాయి.

శొంఠి లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

ఎండ పెట్టిన అల్లంను శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు...
  1. మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
    బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు
    పసి పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు. ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.
  2. ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది. ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుట్టును.
  3. అల్లం ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.
    కొన్ని వేల సంవత్సరాలనుండి అల్లంను జలుబు మరియు ఫ్లూ చికిత్స కోసము వాడుతున్నారు.
    అల్లం టీ తగడము వలన అజీర్తి తగ్గుతుంది.
  4. అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.
  5. అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  6. మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.
  7. గర్భిణీ స్త్రీలలో తలతిరుగడం, వికారము మరియు వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది.

అజీర్ణ నివారిణిగా వాము...

అజీర్ణ నివారిణిగా పరిగణించే వాము మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచటమే గాకుండా, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను కూడా రాకుండా కాపాడుతుంది. ఇది డయేరియాకు కూడా మంచి మందు. అలాగే శ్వాస సంబంధ సమస్యలను తగ్గించడమేగాక, గుండె దగ్గర ఉండే కండరాలకు మేలు చేస్తుంది. విపరీతమైన తలనొప్పి, జలుబు, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నపుడు ఒక చిన్నవస్త్రంలో కాస్తంత వాము వేసి మూటలాకట్టి వాసన పీల్చుకుంటే, నిమిషాల్లో ఉపశమనం కలిగిస్తుంది. వామును నీళ్లలో నానబెట్టి, ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
వాము, ధనియాలు, జీలకర్రలను దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వాము, మిరియాలు,ఉప్పు, సమాభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ప్రతి రోజు భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి. వామును కరక్కాయి. ఉసిరికాయ, తానికా యలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి. వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.వామును మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళనుకరి గిస్తుంది. ప్రసవానంతరం స్త్రీలు వాము వాడితే చనుపాలు వృద్ధి అవుతాయి.

Saturday, August 27

నానబెట్టిన ‘బాదం’తో ఆరోగ్యం!

ఆరోగ్యానికి బాదంపప్పు (ఆల్మండ్) మంచిది. అదే, నానబెట్టిన బాదంపప్పు అయితే మరింత మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ ఈ, పీచు (ఫైబర్) పదార్థం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ప్రొటీన్లు బాదంపప్పులో పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి, చక్కటి రక్త ప్రసరణకు, బ్లడ్ షుగర్ నియంత్రణకు, కండరాలు, నరాల పనితీరు సవ్యంగా సాగేందుకు బాదం ఎంతో మేలు చేస్తుంది. అయితే... నీళ్లలో నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మరింత పదిలంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే, బాదంపప్పు పై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూల్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదేకనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది. తద్వారా ఆ సమస్య బారిన పడకుండా ఉంటాము. ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని ఒంచి వేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. వాటిని ఒక ప్లాస్టిక్ కవరులో స్టోర్ చేయాలి. దరిదాపు ఒక వారం రోజుల పాటు వీటిని తినవచ్చు. 
నానబెట్టిన బాదంతో కలిగే లాభాలు...
* జీర్ణక్రియ సమర్థవంతంగా ఉండటానికి
* అధిక బరువును తగ్గించుకోవడానికి
* గుండె ఆరోగ్యం పదిలంగా ఉండటానికి
* చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి.. మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి
* యాంటిఆక్సిడెంట్లను పెంచుకోవడానికి
* కేన్సర్ వ్యాధిని దరిచేరనీయకుండా ఉండడానికి
* ట్యూమర్ల బారిన పడకుండా ఉండడానికి
* శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరించడానికి
* పుట్టుకతో వచ్చిన లోపాల నివారణకు (నానబెట్టిన బాదంలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఈ పనులను చక్కబెడుతుంది) నానబెట్టిన బాదం తీసుకోవడం ఎంతో మంచిది.

అన్ని రోగాలకు విరుగుడు మంత్రం ఆకాకరకాయలు...క్యాన్సర్ నుండి షుగర్ వ్యాధి వరకు.....!

మీకు ఆకాకరకాయల గురించి తెలుసా? కాకరకాయ జాతికే చెందిన వీటిని కొన్ని ప్రాంతాల్లో బొంతు కాకరకాయలంటారు. చూడడానికి కాకరకాయలాగే ఉంటాయి..కానీ పొడుగుగా కాకుండా రౌండ్ గా ఉండి వాటిపై చిన్నచిన్న బొడిపలుంటాయి. వాటిని మన వంటల్లో భాగంగా చేసుకుంటే షుగర్, క్యాన్సర్ , చర్మ వ్యాధులు, ఒబేసిటీ లాంటి అనేక వ్యాధులను ముందుగానే నివారించవొచ్చు.

ఆకాకరకాయలను తినడం వల్ల కలిగే లాభాలు మీకోసం:


  • గర్భిణులకు: ఆకాకరకాయల్లో ఫొలేట్‌లు అధికమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడతాయి.
  • షుగర్ వ్యాధిగ్రస్తులకు: ఆకాకరకాయ రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
  • క్యాన్సర్ వారికి: ఆకాకరకాయలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి. తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్‌ కారకాలను నాశనం చేస్తాయి.
  • ఆకాకరకాయలోని విటమిన్‌ ‘సి’ శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.
  • దీనిలో ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • దీనిలో లభించే విటమిన్‌ ‘ఎ’ కంటి చూపునకు మేలు చేస్తుంది.
  • మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.
  • జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
  • స్వల్ప కెలొరీలుంటాయి కాబట్టి లావు అవుతామనే బెంగే అవసరం లేదు..
  • ఫైబర్ , విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి.

ఇవి మీకు తెలుసా ?

• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

Friday, August 26

బిడ్డకు పాలు పట్టించడం వల్ల తల్లికి కలిగే లాభాలు...

బిడ్డ పుట్టిన మొదటి ఆరగంటలోపు తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. ఇవి కచ్చితంగా శిశువుకు పట్టాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలను అందుతాయి. ఇందులో మాంసకృతులు, విటమిన్ ఏ ఉంటుంది.
* వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవిత కాలం కాపాడుతాయి.
* శిశువు పేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జనకు తోడ్పతాయి.
* తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహ మాత్రమే.
* బిడ్డ పుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తేనే నాకించడం, పంచదార నీళ్లు ఇవ్వడం, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వడం చేయకూడదు.

బిడ్డకు పాలు పట్టించడం వల్ల తల్లికి కలిగే లాభాల:-

* తల్లులు చనుబాలు ఇవ్వడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.
* చనుబాలు ఇచ్చినందు వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుగుతారు.
* బిడ్డకు పాలు పట్టించడం వల్ల రొమ్ము, గర్భసంచి క్యాన్సర్లు రావు.
* తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియోపొరొసిన్ (ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది.
* తల్లి శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది.
* ఆరు నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా రోజుకు 8నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి.
* తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు.

తల్లిపాల వలన బిడ్డకు కలిగే లాభాలు:-

* తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి.
* నాణ్యమైన ప్రొటిన్లు, ఒమెగా 3,6 అలాగే 9బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడతాయి.
* ఈ పాలలో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
* ఇందులోని లాక్టోజ్ వల్ల కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి.
* తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటు వ్యాధుల బారినుంచి కాపాడుతాయి.
* బిడ్డ మనోవికాసానికి తోడ్పడుతాయి.
* బిడ్డ మృదువైన మల విసర్జనకు, మలబద్దకం సమస్య నివారణకు తోడ్పడతాయి. జీర్ణ మండలాన్ని వృద్ధి చేస్తాయి.
* తల్లిపాల ద్వారా బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధుల బారి నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.
* ఎలర్జీ, అస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులు రావు.
* బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే
గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.
* ఆహారంలో తీపి పదార్థాలు (స్వీట్లు కాదు) అంటే ప్రకృతి సహజంగా దొరికే పండ్లు శుభ్రంగా కడిగిన తర్వాత తినాలి.

ఇదిగో ఈ లిస్ట్ లో ఉన్న ఈ 11 పదార్థాలు కొవ్వును తగ్గించడంలో కింగ్ లాంటివి.

స్థూల‌కాయంతో బాధ ప‌డుతున్నవారినే కాదు, సాధార‌ణ బ‌రువు ఉన్న వారిని సైతం అధిక పొట్ట ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీంతో డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులు వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే శ‌రీరంలో ఏ భాగం సంగ‌తి ప‌క్కన పెట్టినా ప్రధానంగా అధికంగా ఉన్న పొట్ట‌ను త‌గ్గించుకోవాల‌ని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సుల‌భంగా అధిక పొట్టను త‌గ్గించుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
1. ఉద‌యం లేవ‌గానే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక నిమ్మకాయ‌ను పూర్తిగా పిండి ఆ మిశ్రమాన్ని తాగాలి. దీంతో కొద్ది రోజుల్లోనే అధికంగా ఉన్న పొట్ట త‌గ్గిపోతుంది. కొవ్వును క‌రిగించే గుణాలు నిమ్మర‌సంలో ఉన్నాయి. అయితే ఈ మిశ్రమానికి కావాల‌నుకుంటే కొంత తేనెను కూడా క‌లుపుకోవ‌చ్చు.
2. మ‌న శ‌రీరానికి మేలు చేసే అనేక ఆరోగ్యక‌ర ప్రయోజ‌నాలు అల్లంలో ఉన్నాయి. ఇది కొవ్వును క‌రిగించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత అల్లం ర‌సం క‌లుపుకుని తాగుతున్నా ఫ‌లితం ఉంటుంది.
3. శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే యాంటీ ఒబెసిటీ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. నిత్యం కొన్ని వెల్లుల్లి రేకుల‌ను ఉద‌యాన్నే తిన‌గ‌లిగితే చాలు. పొట్ట ద‌గ్గర పేరుకుపోయిన కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది.
4. బాదంప‌ప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును క‌రిగించ‌డంలో తోడ్పడుతాయి. ప్రతి రోజూ కొన్ని బాదం ప‌ప్పుల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది.
5. ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వేసి బాగా క‌ల‌పాలి. దీన్ని భోజనానికి క‌నీసం అరగంట ముందు తాగాలి. దీంతో ఆక‌లి బాగా త‌గ్గుతుంది. క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఈ క్రమంలో ఆహారం త‌క్కువ‌గా తింటారు. అంతేకాదు, కొవ్వును క‌రిగించే గుణాలు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌లో ఉండ‌డంతో బ‌రువు కూడా త‌గ్గుతారు.
6. కొన్ని పుదీనా ఆకుల‌ను తీసుకుని వాటిని బాగా న‌లిపి ర‌సం తీయాలి. ఆ ర‌సాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి ఉద‌యాన్నే తాగాలి. దీంతో పొట్ట ద‌గ్గర అధికంగా పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం కూడా పెరుగుతుంది. ఇది క్యాల‌రీల‌ను క‌రిగించ‌డంలో తోడ్పడుతుంది.
7. ఉద‌యం, సాయంత్రం భోజనానికి అర‌గంట ముందు అలోవెరా జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో బాగా క‌లిపి తాగాలి. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవుతుంది. పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌రిగిపోతుంది. శ‌రీరంలో అద‌నంగా కొవ్వు చేర‌దు. అంతేకాదు మ‌ల‌బ‌ద్దకం ఉన్నా పోతుంది.
8. భోజ‌నానికి ముందు పుచ్చకాయ ముక్కల‌ను తినాలి. దీంతో క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఇది మ‌నం తినే ఆహారాన్ని త‌గ్గించి బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.
9. బీన్స్‌ను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటున్నా ఫ‌లితం ఉంటుంది. ఇవి శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తాయి. జీర్ణక్రియ‌ను మెరుగు పరుస్తాయి. చాలా సేపు ఉన్నా క‌డుపు నిండిన భావన‌ను క‌లిగిస్తాయి. దీంతో ఆహారం తిన‌డం త‌క్కువై బ‌రువు త‌గ్గుతారు.
10. కీర‌దోస‌కాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో భోజ‌నానికి అర‌గంట ముందు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో తాగితే కొవ్వు క‌రిగిపోతుంది. ఇది క‌డుపు నిండిన భావ‌నను క‌లిగించి ఎక్కువ ఆహారం తిన‌కుండా చేస్తుంది.
11. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున బాగా పండిన 1 లేదా 2 ట‌మాటాల‌ను తినాలి. దీంతో పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు సుల‌భంగా క‌రిగిపోతుంది. ట‌మాటాల్లో ఉండే 9 ఆక్సో ఓడీఏ అనే ప‌దార్థం ర‌క్తంలో ఉన్న కొవ్వును తొల‌గిస్తుంద

Thursday, August 25

ఆరోగ్య పోషకాహారం చేపలు...

చేపల్ని వారానికి ఓసారై వంటల్లో చేర్చుకోవడం ద్వారా శరీరంలోని వ్యర్థమైన కొవ్వు తగ్గిపోతుందని.. తద్వారా మెరిసే మేనిఛాయతో పాటు బరువు తగ్గుతారు. నాజూగ్గా తయారవుతారు. ఇంకా చేపల్ని తీసుకుంటే యువతీయువకుల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందుతాయి. చర్మం నిగారింపును సంతరించుకోగా, వెంట్రుకలు మృదువుగా తయారవుతాయి.
ఇంకా చేపల్ని తీసుకోవడం ద్వారా కంటి చూపు చాలా బాగుంటుంది. దీంతోపాటు గుండె సంబంధిత జబ్బులను 36 శాతం మేరకు తగ్గుతుంది. చేపలు తినడం వలన అల్జీమర్స్ వ్యాధి, మానసికపరమైన ఒత్తిడి, రక్తపోటును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

పుచ్చ‌కాయ విత్త‌నాల‌తో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

పైకి ఆకుప‌చ్చ‌గా ఉన్నా లోప‌లంతా చూడ చ‌క్క‌ని ఎరుపు రంగులో ఉండే గుజ్జుతో తింటానికి క‌మ్మ‌గా ఉండే పచ్చ‌కాయ‌లంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌వు చెప్పంది. వాటిని ప్ర‌తి ఒక్క‌రు ఇష్టంగా తింటారు. వేసవి కాలంలోనైతే చ‌ల్ల చ‌ల్ల‌ని పుచ్చ‌కాయ తింటే ఆ మ‌జాయే వేరేగా ఉంటుంది. అయితే ఎవ‌రైనా పుచ్చ‌కాయను ఏ విధంగా తింటారు? కాయ‌ను కోసి అందులో ఉండే ఎర్ర‌ని గుజ్జును తింటూ మ‌ధ్య‌లో నోట్లోకి వ‌చ్చే విత్త‌నాల‌ను ఊసేస్తుంటారు. కొంద‌రైతే పంటి కింద ఆ విత్త‌నాలు ప‌డితే దాంతో ఏదో అనారోగ్యం క‌లుగుతుందేమో, అవి మన శ‌రీరానికి మంచివి కావేమోనన్న భ్ర‌మ‌లో కంగారు ప‌డుతుంటారు. అయితే మీకు తెలుసా? పుచ్చ‌కాయ‌లో గుజ్జే కాదు, విత్త‌నాలు కూడా మ‌నకు ఎన్నో ర‌కాల పోష‌కాల‌ను అందిస్తాయని. అంతేకాదు అవి మ‌న‌కు క‌లిగే వివిధ అనారోగ్యాల‌ను కూడా దూరం చేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉన్నాయి. వాటిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. పేగులు, జీర్ణాశ‌యంల‌లో ఉండే పురుగులను నిర్మూలిస్తుంది. వాపులు, ప‌చ్చ కామెర్లు వంటివి రాకుండా చూస్తుంది.
2. డై యురెటిక్ గుణాలు పుచ్చ‌కాయ విత్త‌నాల్లో పుష్క‌లంగా ఉన్నాయి. దీని వ‌ల్ల మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్ష‌న్లు దూర‌మ‌వుతాయి. పుచ్చ‌కాయ విత్త‌నాల‌తో త‌యారు చేసిన టీని నిత్యం తాగుతుంటే కిడ్నీ స్టోన్స్ క‌రుగుతాయి. మూత్రం సాఫీగా వ‌స్తుంది.
3. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాల కూడా పుష్క‌లంగానే ఉన్నాయి. ర‌క్త నాళాల‌ను వెడ‌ల్పు చేసి ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు పర‌చ‌డంలో ఇవి ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. హైప‌ర్ టెన్ష‌న్‌, యాంజినా పెక్టోరిస్‌, అథెరోస్లెరోసిస్ వంటి వ్యాధుల‌ను దూరం చేసే గుణాలు వీటిలో ఉన్నాయి.
4. జ్ఞాప‌క‌శ‌క్తిని మెరుగు ప‌ర‌చ‌డంలో, ఏకాగ్ర‌త‌ను పెంచ‌డంలో, గుండె ప‌నితీరును మెరుగు ప‌ర‌చ‌డంలో, కండ‌రాల క‌ద‌లిక‌ల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డంలో పుచ్చ‌కాయ విత్త‌నాలు బాగా ప‌నిచేస్తాయి.
ఇక ముందు మీరెప్పుడైనా పుచ్చ‌కాయ‌ను తింటే వాటిలోని విత్త‌నాల‌ను వృథాగా మాత్రం పారేయ‌కండి. వాటన్నింటినీ సేక‌రించి ఎండ బెట్టి మెత్త‌ని పొడిగా చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల మోతాదులో ఈ పొడిని తీసుకుని దాన్ని 2 లీట‌ర్ల నీటిలో 15 నిమిషాల పాటు మ‌ర‌గబెట్టండి. అనంత‌రం వ‌చ్చే ద్ర‌వాన్ని రెండు రోజుల పాటు నిరంత‌రాయంగా తాగండి. దాంతో వ‌చ్చే ఫ‌లితాల‌ను మీరే గ‌మ‌నిస్తారు. అలా రెండు రోజుల పాటు తాగిన త‌రువాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మ‌ళ్లీ రెండు రోజుల పాటు తాగాలి. త‌ర‌చూ ఇలా తాగుతుంటే మీకుండే అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

Wednesday, August 24

క్యారట్లు తినమనేది అందుకే..

వయసు పెరిగేకొద్దీ దృష్టి మందగించడం సాధారణం. తగినంత బీటా కెరోటిన్, జింక్‌, ఇ,సి విటమిన్లు తీసుకుంటే అరవయ్యేళ్ళు దాక కూడా 35 శాతం వరకూ దృష్టి మందగించే సమస్య ఉండదని తాజా పరిశోధన చెబుతోంది. సాధారణంగా వయసుతో వచ్చే ఈ సమస్యను ఏజ్‌రిలేటెడ్‌ మ్యాక్యులర్‌ డీజనరేషన్‌ అంటారు. పైన పేర్కొన్న పోషకాలను సప్లిమెంట్లుగా ఇచ్చినప్పుడు సమస్య తలెత్తడం తగ్గినట్లు పరిశోధన చెబుతోంది. బీటా కెరోటిన్ ముఖ్యంగా రాత్రి వేళల్లో బాగా కన్పించేలా చేస్తుంది. ఇది క్యారెట్లలోనే కాకుండా పాలకూర, బ్రాకోలి తదితరాల్లో ఉంటుంది. నట్స్ , వంట నూనెలు, గుడ్లు, ధాన్యాల నుంచి ఇ విటమిన్‌, సముద్ర ఆహార పదార్థాల నుంచి కోడి మాంసం, పాల ఉత్పత్తుల నుంచి జింక్‌, నిమ్మజాతి పండ్ల నుంచి విటమిన్‌ సి లభిస్తాయి. వయసు పెరుగుతోంది కాబట్టి ఇది మామూలే అనుకోకుండా ఈ ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకుంటూ దృష్టిలోపాలకు దూరంగా ఉండమని పరిశోధకుల సూచన.
ఇలా – మిలమిల మెరిసే కళ్ళను ప్రతి మహిళ ఇష్టపడుతుంది. రోజువారీ ఆహారంలో క్యారట్స్ తప్పనిసరిగా తీసుకోవడం వల్ల జుట్టు, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచవచ్చు. పచ్చిదానిలో కన్నా కూడా ఉడికించిన క్యారట్స్ లో మూడురెట్లు అధికంగా యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి.
అతి అనర్థదాయకమే..
పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం మంచిదే కానీ, పౌష్టికాహారం ఎక్కువ తీసుకోవడం కూడా ఒంటికి చేటు తెస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిర్దేశిత మోతాదును మరిచి అతిగా ఆహారం తీసుకుంటే పౌష్టికాహారం కూడా అనారోగ్యం పాలు చేస్తుందని అంటున్నారు. ఒంటిలో కొలెస్టరాల్‌ పెరిగి స్థూలకాయం బారిన పడాల్సిందే. పాలు ఎక్కువగా తాగేవారు, మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్ళు గుండె సంబంధిత వ్యాధులకూ గురికావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జింక్‌ఫుడ్‌ తినేవాళ్ళు ఎక్కువ కాలరీల శక్తిని తీసుకుంటారు. దీన్ని ఖర్చు చేయాలంటే తగిన వ్యాయామం తప్పనిసరి. అలా చేయలేని పక్షంలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. రెండో దశలో ఊబకాయం రావడం, బరువు పెరిగిపోవడం జరుగుతుంది. వీటి ఫలితంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగిపోతుంది. ఇది మూడో దశ, నాలుగో దశలో అత్రోక్లెరోసిన్‌ ఇతర హృదయ సంబంధ వ్యాధులు చుట్టుముడతాయి. ఇప్పటికే గుండె జబ్బులలో బాధపడేవారు కొలెస్ట్రాల్‌ రహిత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌ తగ్గుదలకు మందులేవీ లేవు. కొన్ని రకాల డ్రగ్స్‌ ఉన్నా, అవి క్యాన్సర్‌, గుండె సంబంధ, మానసిక వ్యాధులను కొనితెస్తాయి. కాబట్టి మిత ఆహారం, తగిన వ్యాయామమే కొలెస్ట్రారాల్‌ నివారణకు మందు.
ఇలా ట్రై చేయండి..
దంపుడు బయ్యం, పెసర పప్పు, ఎండు ఖర్జూరాలు, పెరుగు, బాదం, మజ్జిగ సమృద్ధిగా తీసుకోవాలి.
ఉడకబెట్టిన చేపలు గుండెకు, నాడీ వ్యవస్థకు మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజలు, మెంతికూర, తోటకూర, కరివేపాకు, ముల్లంగి శ్రేష్ఠం. ఉలవచారు మంచిది.
వేపుళ్ళు, ఇతర నూనె పదార్థాలు, ఉప్పు, పులుపు, కారం తగ్గించాలి.
కాచి చల్లార్చిన నీిని మాత్రమే తీసుకోవాలి.
ప్రతిరోజు వంద గ్రాముల వరకు పళ్ళు తీసుకోవాలి. ప్రొటిన్లు, పీచు, పిండ పదార్థాలు, కాల్షియం, పాస్ఫరస్‌, ఇనుము, సోడియం, పొాషియం, మాంగనీస్‌, కెరోటిన్‌, అస్కార్బిన్‌ ఆమ్లం, విటమిన్‌-సి, నీరు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి.
ఆకు కూరల్లో ఎంతో అవసరమైన పోషక విలువలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ రక్తహీనతలను నిరోధిస్తాయి కూడా.
ప్రతిరోజూ పాలు, వారానికి మూడుసార్లు కోడిగుడ్డు, ఒకసారి కొబ్బరి బొండాం తీసుకుంటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
డాక్టర్లు ఎక్కువ కాలరీలున్న ఆహారం తీసుకొవద్దని, భారీ శరీరాన్ని తగ్గించుకోవడానికి విధిగా వాకింగుకు వెళ్ళాలని వ్యాయామం చేయమని హెచ్చరించినా కానీ మన జిహ్వచాపల్యం దాన్ని లక్ష్యపెట్టదు. డై ట్ కొంతవరకే కంట్రోల్ చేస్తుంది.

Sunday, August 21

వంటింటి మెంతులు చేసే మేలు

మనం ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి హాస్పిటల్ వెళ్లి మందులు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ మందుల వల్ల నయం అవటం ఏమో కానీ, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. మన వంటిట్లో ప్రతి రోజు వాడే మెంతులు వల్ల మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మెంతులు రుచిలో చేదుగా ఉన్నా చక్కని సువాసనతో ఔషధగుణాలను కలిగి ఉంటుంది. మెంతులు చేసే మేలు గురించి తెలుసుకుంటే తప్ప కుండా అందరూ ముక్కున వేలేసుకుంటారు. ఇప్పుడు చూద్దాం… మెంతులు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయో…

  • ఒక కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూను అంతా మెంతి పొడిని వేసి ఒక ఐదు నిముషాలు మూత పెట్టి ఉంచాలి. మెంతి పొడిని వడపోసి ఆ మిశ్రమాన్ని ప్రతిరోజూ తాగడం వలన స్థూలకాయం సమస్య తగ్గుతుంది.
  • మెంతి పొడిని పెరుగులో కలిపి ముఖానికి పాక్ లా వేసుకుని, ఒక ఇరవై నిముషాల తర్వాత శుభ్రం చేసుకున్నట్లైతే చర్మం మీద ఉండే ముడతలు తగ్గుతాయి. మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
  • అరచెంచా మెంతి పొడిని పరికడుపుతో వేడినీటిలో కలిపి తీసుకోవడం వలన ఆడవారికి ఋతు సమస్యలు తొలగుతాయి. వారికి నెలసరి క్రమంగా వస్తుంది. అంతేకాక నెలసరి సమయం లో వచ్చే కడుపునొప్పి కూడా నివారించబడుతుంది.
  • నిప్పు వల్ల లేదా మంటల వల్ల పొరపాటున అగ్ని ప్రమాదం జరిగి గాయాలు అయినప్పుడు వెంటనే, మెంతులను మెత్తగా గుజ్జులా నూరి కాలిన చోట కట్టు వేస్తే, క్షణాల్లో మంట తగ్గిపోయి బొబ్బలెక్కకుండా ఉంటుంది. అంతే కాకుండా రోజూ రెండు పూటలా ఇలా చేస్తుంటే కాలిన గాయాలు కూడా త్వరగా మానిపోతాయి.
  • దెబ్బల వల్ల గాని, మరే ఇతర వాయు దోషాల వల్ల గాని మోకాళ్ళు, చీలు మండలు మొదలైన చోట్ల వాపులు కలిగినప్పుడు మన వంటింటి మెంతులు వజ్రాయుధంలా పనిచేస్తాయి. మెంతుల్ని ఒక పగలు నీటిలో నానబెట్టి రాత్రి గుజ్జులా నూరి వాపుల పైన దట్టం గా పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. ఇలా విడవకుండా చేస్తుంటే వాపులు, నొప్పులు హరించిపోతాయి.
  • ఒంట్లో అతిగా వేడి ఉన్న వారు తిన్న ఆహారం ఒంటబట్టక ఎండిపోయి నల్లగా మారిపోతారు. అలాంటి వారు ఒక కప్పు పెరుగులో ఒక చెంచా మెంతులను రాత్రి పూట వేసి, ఉదయం వరకు నానబెట్టి పరిగడుపున మెంతులతో పాటు పెరుగు కుడా తింటుంటే శరీరం లో ఉన్న వేడి తగ్గిపోతుంది.
  • మెంతులు జుట్టుకు అద్భుతమైన పోషకాలు. మెంతులను రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే రుబ్బి తలకు పట్టించుకుని ఒక అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల చుండ్రు వంటివి నివారించబడి, జుట్టు ఒత్తుగా, బలంగా, కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు జుట్టు వేగంగా పెరుగుతుంది. చిన్న తనంలోనే జుట్టు తెల్లబడటం సమస్య తగ్గుతుంది.
  • విరోచనాలు అవుతున్నప్పుడు ఒక స్పూను పెరుగుకు చిటికెడు మెంతుల చొప్పున, వెంటవెంటనే మూడు సార్లు తీసుకోవాలి. గంటకు ఒకసారి ఇలా చేయడం వల్ల విరోచనాలు వెంటనే తగ్గుముఖం పడతాయి.
మన వంటింట్లో ఉండే మెంతులు, ఇన్ని రకాల సమస్యలకి పరిష్కారంగా ఉంది అని ఆశ్చర్యపోతున్నారా..! పైన పేర్కొన్న సమస్యల్లో మీకేదైన ఉంటే ప్రయత్నించి చూసి సులభంగా లబ్ది పొందండి.

సెల్ ఫోన్ తో మీకు క్యాన్సర్ గ్యారంటి.

సెల్ ఫోన్…. ఇప్పుడు ఈ వస్తువు లేని ఇల్లు లేదు కాదు కాదు  దాదాపు మనిషి లేడు అంటే బాగుటుంది. ఎందుకంటే ఇప్పుడు  ప్రతి మనిషి దగ్గర సెల్ ఫోన్ అనేది ఒక నిత్య వస్తువు అయ్యింది అనే కంటే మనిషి జీవితంలో ఒక భాగం అయ్యింది అనొచ్చు. సెల్ ఫోన్ వలన ఎంత మేలు జరుగుతుందో అంతే కీడు కూడా జరుగుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వారి పరిస్థితి రోజు రోజుకు మరీ దారుణంగా ఉంటుందట!. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వచ్చిన సమయం నుండి ఫోన్ లోనే అన్ని అందుబాటులోకి రావడం, అలాగే ఫేస్ బుక్,వాట్సప్ వంటి ఆప్స్ తో నిత్యం సెల్ ఫోన్ చేతిలోనే ఉండటం వలన చాలా ప్రమాధం అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఈ సెల్ ఫోన్ నుండి నుంచి వెలువడే రేడియేషన్ తో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇటీవల జరిపిన అధ్యయనాలు చెబుతున్నాయి. యూఎస్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్టడీస్ ఎలుకల పై జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది.మగ ఎలుకల పై తొమ్మిది గంటలపాటు రేడియేషన్ ప్రభావం పడగా వాటిలో రెండు నుంచి మూడు శాతం క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి. మగ ఎలుకల విషయం ఇలా ఉంటే ఆడ ఎలుకలు మాత్రం రేడియేషన్ ప్రభావానికి గురి కాకపోయినా వాటి కంటే వేగంగా చనిపోతున్నాయి. దీని పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఇలా సెల్ ఫోన్ ని ఎక్కువ సమయం వాడటం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ కి గురై క్యాన్సర్ వచ్చే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని వారి పరిశోధనలో తేలింది. సిగ్నల్ తక్కువ ఉన్నప్పుడు, ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు మొబైల్ ఎక్కువ రేడియేషన్ ని విడుదల చేస్తుందని తెలిపారు, అదే పనిగా ఫోన్ మాట్లాడటం వల్ల కూడా రేడియేషన్ కి గురై అయ్యే అవకాశం ఉంది.కావున సిగ్నల్, ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు మొబైల్ ని వాడకండి.

మీ పిల్లలని ప్లాస్టిక్ బొమ్మలకి దూరంగా ఉంచండి.

మార్కెట్లో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ బొమ్మలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ బొమ్మలు రకరకాల రంగులతో పిల్లలని తొందరగా ఆకర్షిస్తాయి. జనాలని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రజకు వేటిపైనా మక్కువ పెంచుకుంటున్నారో, వాటినే ప్లాస్టిక్ బొమ్మల రూపంలో విడుదల చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. అవి కావాలని పిల్లలు మారాం చేసినప్పుడు అవి వారి కోసం తీసుకోక తప్పదు. కానీ, ఈ ప్లాస్టిక్ బొమ్మలు చిన్న పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
‘ఇంఫ్లూ ఎంజా’ అనే వైరస్ ఈ ప్లాస్టిక్ బొమ్మలకు అంటిపెట్టుకొని ఉంటుందని.. చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుతున్న సమయంలో వాటి నుండి వారి శరీరంలోకి ఈ వైరస్ సోకే అవకాశం ఉందని అమెరికాకి చెందిన జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని, దీని ప్రభావం వల్ల 24గంటల్లో చిన్నారులు అనారోగ్యానికి గురి అవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులకి ఈ ప్లాస్టిక్ బొమ్మలకి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఇకనైనా ఈ ప్లాస్టిక్ బొమ్మల కొనుగోలుకి స్వస్తి చెప్పి పిల్లల ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి.

పాలల్లో చక్కెర బదులు బెల్లంని కలుపుకొని తాగితే అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ప్రతి రోజు పాలు తాగుతుంటారు. వట్టి పాలు తాగలేము కదా అందుకే అందుకో కొద్దిగా చక్కర కలుపుకొని తాగుతారు. ఒకవేళ చక్కర వేయకపోతే  పాలు రుచిగా ఉండవు. కొందరు షుగర్ ఉన్నవారు మాత్రం కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగుతారు. ఒక్కప్పుడు పల్లెల్లో ఎక్కువగా పాలు, టీ, కాఫీలలో బెల్లాన్ని ఎక్కువగా వాడేవారు. మీరు చక్కరకు బదులు బెల్లం కలుపుకొని తాగటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు డాక్టర్స్. మరి పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:- పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వలన జీర్ణ క్రియ చాలా మెరుగుపడుతుంది. బెల్లం వలన పేగు సంబంధిత సమస్యలు కూడా నయం అవుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల:- పాలు ఆరోగ్యానికి చాలా మంచివి అలాగే బెల్లం కూడా చాలా మంచింది. పాలు, బెల్లం మిశ్రమం ఒక అద్భుతమైన ఔషధంగా మనకు పని చేస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే పోషాకాల వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మానవ శరీరంలోని అనారోగ్యాన్ని తగ్గిస్తుంది.
జాయింట్ పెయిన్స్:- పాలు తాగడం వలన ఎముకలు దృడంగా అవుతాయి. కానీ బెల్లం కలుపుకొని తాగడం వలన ఎముకలు  దృడంగా అవడమే కాకుండా మొకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి:- పాలు, బెల్లం మిశ్రమం వలన బాడీలో ఉండే కొవ్వును బెల్లం కరిగించేస్తుంది. అందువలన మనం ఎక్కువ కష్టపడకుండానే బరువు తగ్గొచ్చు. ఎందుకంటే బెల్లంలో పొటాషియం, పాలల్లో క్యాల్షియం ఉండటం వలన మనకు తెలియకుండానే బరువు తగ్గి చాలా స్లిమ్ గా తయారు అవుతారు.
చర్మానికి, జుట్టుకి :- ఈ మిశ్రమం వలన చర్మం చాలా కాంతివంతగా అవుతుంది. అలాగే జుట్టు సిల్కిగా మారుతుంది.
రుతుక్రమంలో కడుపు నొప్పి:- రుతుక్రమంలో కడుపు నొప్పితో బాధపడేవారు పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వలన కడుపులో బెల్లం వలన నొప్పి తక్కువై కడుపులో చల్లగా ఉంటుంది.
రక్తహీనత:- మహిళలలో ఎక్కువగా రక్తహీనత ఉంటుంది దానిని అరికట్టడానికి ఐరన్ టాబ్లెట్స్ వాడుతుమతారు. బెల్లంలో రక్త హీనతను అరికట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. దానితో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

సర్వరోగ నివారిణి అయిన”కలబంద”ని ఉపయోగించే పద్ధతులు...

‘కలబంద’ మనకు పరిచయం అవసరం లేని మొక్క. కానీ, ఇది చేసే మంచి పనుల గురించి అందరికి తెలిసుండదు. కలబంద చూడటానికి పిచ్చి మొక్కలాగా కనబడుతుంది. కానీ, ఇది చేసే మేలు అంతా.. ఇంతా.. కాదు. అందుకే, కలబందను సర్వరోగ నివారిణి అంటారు. కలబంద మొక్కని సర్వ రోగాలకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. మనదేశంలో సౌందర్య ఉత్పత్తులలోను, ఆయుర్వేద వైద్యంలోను దీనిని ఎక్కుగా ఉపయోగిస్తున్నారు. కలబంద నుండి రకరకాల లోషన్లు, క్రీమ్ లు, జ్యూస్‌, హెయిర్‌ ఆయిల్‌ లాంటి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీని ఉత్పత్తులు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి.
కలబంద వలన ఉపయోగాలు :-
  • జీర్ణవ్యవస్థలో పేరుకు పోయిన వ్యర్థ, విష పదార్థాలను బయటకు పంపుతుంది.
  • ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకును తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులను మటుమాయం చేస్తుంది.
  • కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
  • కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
  • శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.
  • కలబంధ అటు తరుణ వ్యాధులకు, ఇటు దీర్ఘ వ్యాధులకు కూడా అమోఘంగా పనిచేస్తుంది.
తల వెంట్రుకలకు, చర్మ సౌందర్యం కోసం :-
  • కలబంద గుజ్జుకు తగినంత పసుపును జోడించి ముఖానికి ఫేషియల్‌ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి ముఖం కాంతివంతం అవుతుంది.
  • కలబంద ఆకురసంతో నల్లమచ్చలు పోగొట్టవచ్చు.
  • కలబంద గుజ్జును తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా, మంచి నిగారింపును సంతరించుకుంటుంది.
  • తలకు కలబంద వాడడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు తెల్లబడడం, ఎర్రబడటం చుండ్రులను ఇది నివారిస్తుంది.
  • తలలో వచ్చే అనేక పుండ్లను దురదలను ఇది తగ్గిస్తుంది.
కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. చర్మ సంరక్షణ ర్యాసిస్‌, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవడం మొదలగు వాటికీ కలబంద మంచి ఫలితాలని ఇస్తుంది. 15 రకాల పోషకాలు మిళితమై మంచి శక్తి నిస్తాయి. దీని వల్ల కలిగే అనేక ఉపయోగాలను బట్టి, దీనిని అద్భుతమైన మొక్క, సహజ నివారిణి అని కూడా అంటారు. కలబంద ఆకులో నాలుగు పొరలు ఉంటాయి. మొదటి పొర మందంగా ఉండి మొక్కను రక్షిస్తుంది. రెండవ పొరలో ఉన్న పసరు చేదు రసము. మూడవది జిగురు పదార్థము. నాలుగవది జిగురు కలబందలోని లోపలి పొరలో ఉండే కలబంద జిగురు.

అల్లం జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు...

అల్లం దీనికి గురించి తెలియని వారు ఉండరేమో ఎందుకంటే మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఇది ఒక భాగం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అల్లం ఒకటి. భారతీయులు దాదాపు 5000 సంవత్సరాల నుంచి అల్లంని వంటల్లోనే కాదు.. అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మన పూర్వికులు దాని ప్రాధాన్యత తెలిసే మనం రోజు తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో ఇది మన శరీరంలోకి చేరే విధంగా అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు అదే అలవాటు మనకు చేశారు. కానీ రానురాను మనం అల్లం తక్కువ మోతాదులోనే వాడుతున్నాం అనే చెప్పాలి. అయితే అల్లం కాస్త ఘాటుగా ఉండటం వల్ల దాన్ని డైరెక్ట్ గా తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే.. జ్యూస్ రూపంలో అంటే.. ఒక కప్పు అల్లం రసం తీసుకోవడం వల్ల అమోఘమైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇలా తగినంత జ్యూస్ తీసుకోవడంవలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా!….ఒక్కాసారి చూద్దాం ….

  1. అల్లం వంటల్లో అద్భుతమైన రుచినే అందిస్తూనే కడుపులోని మంటను కూడా తగ్గిస్తుంది.
  2. విటమిన్స్ మరియు మాంగనీస్ మరియు కాపర్ వంటి విలువైన పోషకాలున్నాయి. దీంతో అద్భుతమైన వైద్యం చేవచ్చని నాటు వైద్యులు చెపుతారు
  3. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది
  4. రక్త శుద్దికి, అలాగే రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది.
  5. డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో అల్లం జ్యూస్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  6. అల్లంలో బయో యాక్టివ్ ఫెనోలిక్స్, నాన్ వొలాటైల్ ఉంటాయి.ఇవి కాన్సర్ ని నివారించడానికి ఉపయోగపడుతాయి.
  7. గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది
  8. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
  9. అల్లం వల్ల అల్సరు ఏర్పడదు. నోటి దుర్వాసనను పోగొడుతుంది, దంతాలను ఆరోగ్యముగా ఉండేలా చేస్తుంది.

Saturday, August 20

డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి మీకు తెలియని వాస్తవాలు

మద్యపాన వ్యసనం వలన అనేక లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం వలన అనేక ప్రమాదాలు జరిగి ఇతరుల ప్రాణాలకు ఆపద వాటిల్లుతుంది.
ప్రపంచంలో ప్రతి దేశంలో డ్రంక్ డ్రైవింగ్ వలన కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారికీ,వారు తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుందని భారీ జరిమానాలను విధిస్తున్నారు.
ఇది చాలా మంది జీవితాల్లో భరించలేని తీవ్రమైన విషయంగానూ మరియు పెద్ద ఆందోళనగాను ఉంది. ఇప్పుడు డ్రంక్ డ్రైవింగ్ గురించి కొన్ని నిజాలను తెలుసుకుందాం...

నిజం 1

దాదాపుగా 30 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రంక్ డ్రైవింగ్ వలన జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం వలన లక్షలాది మంది జీవితాలకు కోల్పోతున్నారు.

నిజం 2

మద్యం త్రాగినప్పుడు, శరీరం మద్యాన్ని వదిలించుకోవటానికి దాదాపుగా 6-7 గంటల సమయం పడుతుంది. కాబట్టి మద్యం మత్తు వదిలిన తర్వాత డ్రైవింగ్ చేయటం ఉత్తమం.

నిజం 3

మద్యం తీసుకున్నా తర్వాత మెదడు మీద మద్యం ప్రభావం కొన్ని గంటల వరకు ఉంటుంది.

నిజం 4

అనేక అధ్యయనాలలో డ్రంక్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు పగటి సమయం కన్నా రాత్రి సమయంలో ఎక్కువ జరుగుతున్నాయని తేలింది. ఈ ప్రమాదాల్లో 30 శాతం పగలు,70 శాతం రాత్రి సమయంలో జరుగుతున్నాయి.

నిజం 5

16-21 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఎక్కువగా మద్యం త్రాగి డ్రైవ్ చేస్తున్నారు.

నిజం 6

ఒక అధ్యయనం ప్రకారం, మద్యం ప్రమాదాల్లో మరణించిన వ్యక్తులలో 80 శాతం మంది సీటు బెల్ట్ వేసుకోకపోవటం మరియు ప్రాణరక్షక చర్యలను పాటించకపోవటం వలన జరుగుతున్నాయని తెలిసింది.

నిజం 7

మరో అధ్యయనంలో మద్యం త్రాగి నడిపిన కారు ప్రమాదాల్లో 80% మంది పురుషులు మరియు మిగిలిన 20% మంది స్త్రీలు అని తెలిసింది.

మీ పిల్లలు ఎత్తు పెరగటం లేదని భాద పడుతున్నారా..!

పిల్లలు వయసుతో పాటు ఎత్తు పెరగకుంటే వారితో పాటు తల్లితండ్రులకు కూడా అది ఒక పెద్ద భాదల తయారు అవుతుంది. ఎత్తు లేకపోవడం వలన పిల్లలు తమలో తాము చాలా కుమిలిపోతారని మరియు ఎగతాలికి గురి అవుతారు అని ఒక సర్వే తెలిపింది. అంతెందుకు మొన్నటికి మొన్న హైదరాబాద్లో మంచి ఎత్తు ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ అబ్బాయి ఇంకా ఎత్తు పెరగటం కోసం ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు పరేషాన్ అవుతున్న విషయం మనం టీవీలలో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం కధ!. 
 పిల్లలు పెరగకపోవటానికి రెండు కారణాలు ఉంటాయి:-
             1) వంశపారపర్యంగా సంక్రమించే జీన్స్ వలన  
             2) సరైన పోషకాహారం లభించకపోవడం వలన.
వంశపారపర్యంగా సంక్రమించే జీన్స్ వలన ఎత్తు పెరగకపోవడాన్ని కూడ కొన్ని సార్లు సరైన పోషకాహారంతో సరిదిద్దవచ్చు. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒక్కసారి చూద్దాం:-
1) పాలు :- ప్రతి రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వలన ఎత్తు పెరుగవుతారు దానికి కారణం పాలల్లో విటమిన్ బి12, ఢీ, అలాగే కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
2) బఠాణి :- బఠాణీలు రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరుగుతారు. ఇందులో ఫైబర్, ప్రోటిన్స్, మినరల్స్ దీంట్లో అధికంగా ఉంటాయి.
3) సోయాబీన్ :- సోయాబీన్ ప్రతి రోజు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచింది అలాగే ఎత్తు పెరగటం చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. ప్రతి రోజు కనీసం ఒక 70 గ్రామ్ లు తీసుకున్న తొందరగా పెరుగుతారు, ఇందులో ఫైబర్, కార్భోహైడ్రేట్స్ చాలా ఉంటాయి.
4) అరటిపండు :- అరటి పండులో చాలా మంచి ఆరోగ్య పోషకాలు ఉంటాయి. అలాగే సన్నగా ఉన్నవారు లావుగా అవ్వడానికి అరపండు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎత్తు పెరగటంలో, శిరోజాలు ఊడిపోవడం తగ్గిస్తుంది.
5) ఎర్ర ముల్లంగి :- ఎర్ర ముల్లంగి ఎత్తు పెరగటంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో ఉండే అనేక పదార్థాలు ఎత్తు పెరగటంలో సహాయపడుతాయి.
6) బచ్చలి కూర :- మానవ శరీరానికి ఆకు కూరలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. బచ్చలి కూర ఆరోగ్యం తో పాటు మనకు ఎత్తు ను కూడా ఇస్తుంది అందుకు కారణం ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉండటమే
7) బీన్స్ :- బీన్స్ లో ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదర్థాలు ఉంటాయి అవి ఎత్తు పెరగటంలో సహాయపడుతాయి.
8) బెండకాయ :- దీనిలో విటవిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎత్తు పెరగటంలో ఉపయోగపడుతాయి.

బీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల...

వాతావరణం హాట్ హాట్‌గా ఉన్నప్పుడు ఒక చ‌ల్ల‌ని బీర్ కొడితే ఎలా ఉంటుంది? ఆ మ‌జాయే వేరు క‌దా! అవును, మ‌రి. మ‌జాగానే ఉంటుంది. అయితే దాని టేస్ట్ తెలిసిన వారికే ఆ మ‌జా అందుతుంది. లేదంటే అంద‌దు. అంటే డ్రింకింగ్‌ అల‌వాటు ఉన్న‌వారైతేనే బీర్ టేస్ట్‌ను ఎంజాయ్ చేయ‌గ‌లుగుతార‌ని అర్థం. కానీ మోతాదుకు మించి తాగితే బీర్‌తోనూ అన‌ర్థాలు త‌ప్ప‌వు, బీర్ తాగడం అనేది ఇప్పుడు చాలా మాములు విషయం అయిపోయింది, ఒకప్పుడు మందు తాగాలంటే అది చాలా పెద్ద తప్పుగా భావించేవారు, కాని ఇప్పుడు ఫ్రెండ్స్ కలిసిన, క్రికెట్ మ్యాచ్ ఉన్న, పండగలకి చుట్టాలు వచ్చిన, వీకెండ్ అయిన ఖచ్చితంగా బీరు పొంగాల్సిందే అన్నట్టుగా మారిపోయింది కాలం.ఏదైనా సరే మోతాదుగా తీసుకుంటే ఎటువంటి అనర్దాలు ఉండవు, మోతాదు మించితేనే అనారోగ్యం పాలు కావాల్సివస్తుంది, కాని బీరుని మితంగా తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది,ఆరోగ్యంగా ఉన్న మ‌గ లేదా ఆడ మ‌నిషి రోజుకు 12 ఔన్సుల (దాదాపు 350 ఎంఎల్‌) మోతాదులో బీర్ తాగితే దాంతో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. 
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

గుండె జ‌బ్బులు:- హార్వ‌ర్డ్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ వారు చేసిన పరిశోధనల ప్రకారం, బీరులో పాలీఫినాల్స్ అన‌బ‌డే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి.బీర్‌ను త‌గిన మోతాదులో సేవిస్తే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతోపాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.బీరు రక్త నాళాలని గట్టి పడకుండా చూసి, ర‌క్తం గడ్డ‌క‌ట్ట‌కుండా కాపాడుతుంది,దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్స్ వంటివి వ‌చ్చేందుకు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

కిడ్నీల్లో రాళ్లు:- బీర్‌ను త‌ర‌చూ తాగడం వల్ల కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం కూడా త‌గ్గుతుంద‌ట‌. ఫిన్‌లాండ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ప్ర‌యోగాల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. అంతేకాకుండా శ‌రీరంలోని విష ప‌దార్థాలు కూడా బ‌య‌టికి వెళ్లిపోతాయ‌ట‌. ప్ర‌ధానంగా కాల్షియం పేరుకుపోవ‌డం వ‌ల్ల ఏర్ప‌డే కిడ్నీ రాళ్ల‌ను అడ్డుకోవ‌డంలో బీర్ ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ట‌.

ఎముక‌ల‌కు:- బీర్ల‌లో సిలికాన్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇది ఎముక‌ల పోష‌ణకు ఎంత‌గానో అవ‌స‌ర‌మ‌వుతుంద‌ట‌. కాబ‌ట్టి బీర్‌ను తాగితే అందులోని సిలికాన్ వ‌ల్ల ఎముక‌ల‌కు బ‌లం చేకూరుతుంది. 2009లో టఫ్ట్స్ యూనివ‌ర్సిటీ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తెలిసింది.

వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు:- బీర్‌లో విట‌మిన్ బి, ఈస్ట్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. దీని వల్ల బీర్ వెంట్రుక‌ల‌కు ఆరోగ్యాన్నిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెర‌గ‌డంలో బీర్ ఉపయోగ‌ప‌డుతుంది.

జ్ఞాప‌క‌శక్తికి:- రష్ యూనివ‌ర్సిటీ మెడిక‌ల్ సెంట‌ర్ వారు చేసిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం త‌ర‌చూ బీర్ తాగుతుంటే జ్ఞాప‌క‌శ‌క్తి సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు 23 శాతం వ‌రకు తగ్గుతాయ‌ట‌. అంతేకాదు బీర్ తాగ‌డం వ‌ల్ల మెద‌డులో కొత్త క‌ణాలు వృద్ధి చెందుతూ జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త, రీజ‌నింగ్ ప‌వ‌ర్ వంటివి పెరుగుతాయ‌ట‌. వృద్ధాప్యంలో అల్జీమ‌ర్స్‌, దెమెంతియా వంటి వ్యాధులను రాకుండా చూసుకోవ‌చ్చ‌ట‌.

ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌కు:- బీర్‌లో క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. త‌గిన మోతాదులో బీర్‌ను తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌.

డ‌యాబెటిస్‌:- బీర్ల‌లో ఉండే ఆల్క‌హాల్ ఇన్సులిన్ సెన్సిటీవిటీని అధికం చేస్తుంద‌ట‌. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ట‌. 2011లో హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ఓ రీసెర్చి ప్ర‌కారం త‌ర‌చూ త‌గిన మోతాదులో బీర్ల‌ను తాగుతున్న వారిలో టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు 25 శాతం వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ట‌. బీర్ల‌లో ఉండే సాల్యుబుల్ ఫైబ‌ర్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేస్తుంద‌ట‌.

ఎన్ని బెనిఫిట్స్ ఉన్న తక్కువ మోతాదులో తాగితేనే అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, అదే పనిగా ఎక్కువ మోతాదులో బీర్లు తాగితే హార్ట్ సమస్యలతో పాటు, కిడ్నీ సమస్యలు వచ్చే ఆవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు, సూపర్ స్టార్ రజినికాంత్ చెప్పిన్నట్టుగా భోజనం అయిన బీరు అయిన మితంగా తీసుకుంటేనే ఔషదం,  అమితంగా తీసుకుంటే విషం అని గుర్తుపెట్టుకోండి.

Friday, August 19

శిరోజాలు ఎక్కువ‌గా రాలిపోతున్నాయా..?

శిరోజాలు ఎక్కువ‌గా రాలిపోతున్నాయా..? అయితే ఉల్లిపాయ ర‌సంతో వాటిని మ‌ళ్లీ పెరిగేలా చేయ‌వ‌చ్చు…!

 నేటి త‌రుణంలో అందంగా ఉండ‌డం కోసం ప్ర‌తి ఒక్క‌రు వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబిస్తున్నారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా త‌మ అందాన్ని పెంచుకోవ‌డం కోసం ప్ర‌యత్నిస్తున్నారు. అయితే అందం విష‌యానికి వ‌స్తే ముఖంతోపాటు ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవ‌రైనా వాటిని చూసి ఆక‌ర్షింప‌బ‌డ‌తారు. ఈ క్ర‌మంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ ర‌సం బాగా ప‌నిచేస్తుంది. ఉల్లిపాయ ర‌సంతో వెంట్రుకల‌కు పోష‌ణ‌ను ఎలా అందించ‌వ‌చ్చో ఇప్పుడు చూద్దాం...

1. కొన్ని ఉల్లిపాయ‌ల‌ను తీసుకుని వాటిని మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను త‌ల కుదుళ్ల‌కు త‌గిలేలా రాయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే త‌ల‌పై ఊడిపోయిన వెంట్రుక‌లు మ‌ళ్లీ పెరుగుతాయి. అంతేకాదు వెంట్రుక‌లు దృఢంగా, ఒత్తుగా ఉంటాయి. ఉల్లిపాయ‌ల్లో ఉండే సల్ఫ‌ర్ అనే మూల‌కం జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది.
2. ఉల్లిపాయ‌ల‌ను బాగా దంచి ఆ మిశ్ర‌మంలో కొద్దిగా కొబ్బ‌రి నూనె లేదా ఇత‌ర ఏవైనా ఆయిల్స్‌ను క‌లిపి రాసుకోవాలి. దీంతో శిరోజాలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢ‌మై వెంట్రుక‌లు ఆరోగ్యాన్ని, కాంతిని సంత‌రించుకుంటాయి.
3. ఉల్లిపాయ‌లను మెత్త‌గా దంచి వాటి నుంచి తీసిన ర‌సంలో కొద్దిగా తేనె, నిమ్మ‌ర‌సం క‌లపాలి. ఆ మిశ్ర‌మాన్ని కుదుళ్ల‌కు త‌గిలేలా ప‌ట్టించాలి. అనంత‌రం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. రెగ్యుల‌ర్‌గా ఈ టిప్‌ను పాటిస్తే చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శిరోజాలు కూడా కాంతివంత‌మ‌వుతాయి.
ఈ చిట్కాల‌ను కేవ‌లం స్త్రీలే కాదు, పురుషులు కూడా పాటింవ‌చ్చు. దీంతో చ‌క్క‌ని శిరోజాలు వారి సొంత‌మ‌వుతాయి.
రోజంతా చురుగ్గా ఉండాలన్నా, జుట్టూ, గోళ్లూ వంటివి ఆరోగ్యంగా పెరగాలన్నా ఆహారంలో మాంసకృత్తుల పాత్రే కీలకం. అందుకోసం ఈ పదార్థాలు తీసుకోండి...

* సెనగలు:-
వీటిల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పీచుతోపాటూ ఆరోగ్యానికి మేలుచేసే కొలెస్ట్రాల్‌ని అందిస్తాయివి. వీటిలో మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం, జింక్‌ లాంటి పోషకాలుంటాయి. ఇవి ఎముకలకు మేలుచేస్తాయి. కప్పు సెనగలు తీసుకుంటే 18 నుంచి 22 గ్రాముల మాంసకృత్తులు అందుతాయి.

* పప్పుధాన్యాలు:-
ప్రతిరోజూ ఏదో ఒక పప్పును పిల్లలకు తినిపించాలి. కప్పు పప్పు ద్వారా పద్దెనిమిది నుంచి ఇరవైగ్రాముల మాంసకృత్తులు అందుతాయి.
* సోయా:-
మాంసాహారానికి దీటైన ప్రత్యామ్నాయంగా చెప్పే సోయాలో ప్రొటీన్‌శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదనంగా మరికొన్ని ఖనిజాలూ, విటమిన్లూ ఉంటాయి. ఈ గింజల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. కప్పు సోయా గింజల్ని తీసుకుంటే రోజువారీ అవసరాలకు సరిపడే ప్రొటీన్లు శరీరానికి అందుతుంది.
* పెరుగు:-
ఇది మాంసకృత్తుల్నే కాదు, శరీరానికి మేలుచేసే.. ప్రొబయోటిక్స్‌నీ అందిస్తుంది. చిన్న కప్పు పెరుగు తీసుకున్నా కూడా పది నుంచి పన్నెండు గ్రాముల మాంసకృత్తులు శరీరానికి అందుతాయి.
• కప్పు పాలకూర చాలు!
* పాలకూర:-

కప్పు పాలకూర సగం గుడ్డుతో సమానం అంటారు. ఇంకా సూటిగా చెప్పాలంటే కప్పు పాలకూర నుంచి ఏడు నుంచి పది గ్రాముల మాంసకృత్తులను పొందవచ్చు.

పాల‌ను ఏ స‌మయంలో తాగితే మ‌న‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో తెలుసా..?

సంపూర్ణ పౌష్టికాహారం అన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది పాలు. ఎందుకంటే దాంట్లో దాదాపుగా అన్ని రకాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయి. అందుకే పాల‌ను సంపూర్ణ ఆహారంగా ప‌రిగ‌ణిస్తారు. పాల‌లో మ‌న‌కు శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్లు ఎ, కె, బి12, థ‌యామిన్‌, నికోటినిక్ యాసిడ్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, సోడియం, పొటాషియం వంటి కీల‌క‌మైన పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. అయితే కొంత మంది పాల‌ను ఉద‌యం తాగితే కొంద‌రు సాయంత్రం, మ‌రికొంద‌రు రాత్రి తాగుతారు. ఈ క్ర‌మంలో అస‌లు పాల‌ను ఏ స‌మ‌యంలో తాగితే మంచిదో ఇప్పుడు చూద్దాం.
ఆయుర్వేద ప్ర‌కారం… పాలు మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. దీంతో మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. వేడి పాల‌ను నిత్యం తాగితే దాంతో అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ఆయుర్వేదం చెబుతున్న‌దేమిటంటే ఉద‌యం పూట పాల‌ను తాగ‌కూడ‌దు. ఎందుకంటే అవి అరిగేందుకు బాగా స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి పాల‌ను ఉద‌యం తాగ‌కూడ‌దు. మ‌ధ్యాహ్నం పూట పాల‌ను తాగ‌డం వృద్ధుల‌కు మంచిది. అయితే వారే కాదు ఎవ‌రైనా మ‌ధ్యాహ్నం పూట పాలు తాగ‌వ‌చ్చు. ఈ స‌మ‌యంలో పాల‌ను తాగితే మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. కిడ్నీస్టోన్ల స‌మ‌స్య రాదు. అదే సాయంత్రం పూట పాల‌ను తాగితే కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. అదేవిధంగా రాత్రిపూట పాల‌ను తాగితే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. చ‌క్క‌గా నిద్ర‌ప‌డుతుంది. ఉద‌యం లేచే స‌రికి శ‌రీరానికి ఉత్తేజం క‌లుగుతుంది. తెలుసుకున్నారుగా, పాల‌ను ఎప్పుడు తాగాలో! ఇంకెందుకాల‌స్యం, ఆ విధంగా మిల్క్ డైట్ ఫాలో అయిపొండి మ‌రి!

Thursday, August 18

విశ్రాంతిగా కూచున్నారా? అయితే ఒకసారి మణికట్టు దగ్గర వేళ్లతో అదిమి

విశ్రాంతిగా కూచున్నారా? అయితే ఒకసారి మణికట్టు దగ్గర వేళ్లతో అదిమి నాడిని పరీక్షించుకోండి. ఇప్పుడెందుకని అనుకోకండి. విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని బట్టి మన ఆరోగ్యస్థితిని, మున్ముందు తలెత్తే సమస్యలను అంచనా వేయొచ్చు మరి...
ఆరోగ్యస్థితిని అంచనా వేసే మార్గాల్లో నాడి చూసుకోవటం చాలా తేలికైంది. సమర్థవంతమైంది కూడా. కేవలం 30 సెకండ్లలోనే మన గుండె కండరం పనితీరును ఎంతో కొంత తెలుసుకునే వీలుంటుంది. మణికట్టు వద్ద బొటనవేలు కిందిభాగంలో గానీ మెడకు ఒక పక్కన గానీ రెండు వేళ్లతో ఒకింత గట్టిగా అదిమిపడితే ఎవరికి వారు నాడి కొట్టుకోవటాన్ని గమనించొచ్చు. విశ్రాంతిగా ఉన్నప్పుడు 30 సెకండ్ల సమయంలో ఎన్నిసార్లు నాడి కొట్టుకుంటుందో లెక్కించి, దాన్ని రెట్టింపు చేస్తే ఒక నిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎంత తక్కువగా ఉంటే శారీరక సామర్థ్యం అంత బాగుందని అర్థం. ఇలాంటివారికి గుండెపోటు వంటి జబ్బుల ముప్పు తక్కువ. అదే విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎక్కువగా ఉంటున్నకొద్దీ గుండె సమస్యల ముప్పూ పెరుగుతూ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

* ఎన్నిసార్లు కొట్టుకోవాలి?

పెద్దవాళ్లు విశ్రాంతిగా ఉన్నప్పుడు సాధారణంగా నిమిషానికి 60-100 సార్లు గుండె కొట్టుకుంటుంది. కానీ అంతకన్నా తక్కువగా.. 50-70 సార్లు కొట్టుకోవటమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. గుండె వేగం ఎక్కువగా గలవారిలో శారీరక సామర్థ్యం తక్కువగానూ.. రక్తపోటు, బరువు, రక్తంలో ప్రసరించే కొవ్వుల స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరికి అకాల మరణం ముప్పు పెరుగుతున్నట్టూ తేలింది. ముఖ్యంగా విశ్రాంతి సమయంలో నిమిషానికి 81-90 సార్లు నాడి కొట్టుకునేవారిలో తీవ్రమైన గుండెపోటు ముప్పు రెట్టింపు అవుతున్నట్టు బయటపడింది. ఇక 90 కన్నా ఎక్కువసార్లు గుండె కొట్టుకునేవారిలో ఈ ముప్పు మూడింతలు అధికంగా ఉంటుండటం గమనార్హం.

* వేర్వేరు సమయాల్లో..

గుండె వేగాన్ని ఒత్తిడి, ఆందోళన, రక్తంలో ప్రవహించే హార్మోన్లతో పాటు రక్తపోటు, ఆందోళన తగ్గటానికి వేసుకునే మందులు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని సరిగ్గా గుర్తించటానికి వారం మొత్తమ్మీద వేర్వేరు సమయాల్లో అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. చాలా సందర్భాల్లో 80 కన్నా ఎక్కువసార్లు కొట్టుకుంటుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

* ఎప్పుడు చూసుకోవాలి?

శారీరక శ్రమ, వ్యాయామం వంటివి చేస్తే 1-2 గంటల తర్వాత.. కాఫీ, టీ వంటివి తాగితే అరగంట తర్వాతే నాడి చూసుకోవాలి. ఉదయం పూట నిద్ర లేచాక మంచం మీది నుంచి దిగకముందే గుండె వేగాన్ని పరీక్షించుకోవటం ఉత్తమం.

* కొలెస్ట్రాల్‌ అదుపుతో మేలు

కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, రక్త ప్రసారం తగ్గుతుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ స్థాయులను అదుపులో ఉంచుకోవటం, వ్యాయామం ద్వారా గుండె వేగం పెరగకుండా చూసుకోవచ్చు.

ప‌దే ప‌దే ఎక్కిళ్లు వ‌స్తే..ఇలా చేయండి. వెంట‌నే త‌గ్గిపోతాయి.

ఆహార వాహిక‌లో ఏదైనా అడ్డం ప‌డిన‌ప్పుడు ఎవ‌రికైనా ఎక్కిళ్లు వ‌స్తాయి. స‌హ‌జంగా ఇవి కొంద‌రికి భోజ‌నం చేస్తున్న‌ప్పుడు వ‌స్తే మ‌రికొంద‌రికి నీళ్లు వంటి ద్ర‌వాలు తాగుతున్న‌ప్పుడు, ఇంకొంద‌రికి ఇత‌ర స‌మ‌యాల్లోనూ వ‌స్తాయి. అయితే ఈ ఎక్కిళ్లు సాధార‌ణంగా అప్ప‌టిక‌ప్పుడే త‌గ్గిపోతాయి. కానీ కొంద‌రికి మాత్రం ప‌దే ప‌దే ఆప‌కుండా అలా ఎక్కిళ్లు వ‌స్తూనే ఉంటాయి. ఈ క్ర‌మంలో అలాంటి ఎక్కిళ్ల‌ను త‌గ్గించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
1. భోజ‌నం చేసే స‌మ‌య‌లో ఆహారాన్ని వేగంగా తిన‌కూడ‌దు. దీని వ‌ల్ల నోట్లోకి గాలి ఎక్కువ‌గా వెళ్లి ఎక్కిళ్లు వ‌స్తాయి.
2. చిన్న అల్లం ముక్క‌ను తీసుకుని నోట్లో వేసుకుని బాగా న‌మిలి చ‌ప్ప‌రిస్తుంటే ఎక్కిళ్లు పోతాయి.
3. వెనిగర్‌ను తీసుకుని రెండు, మూడు చుక్క‌ల‌ను నాలుక మీద వేసుకోవాలి. దీంతో ఎక్కిళ్లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.
4. ఒక క‌ప్పు నీటిలో యాల‌కుల పొడిని వేసి ఆ నీటిని బాగా కాచాలి. అనంత‌రం వ‌చ్చే క‌షాయాన్ని తాగితే ఎక్కిళ్లు పోతాయి.
5. ఆవాల పొడిలో నెయ్యి క‌లిపి తింటున్నా ఎక్కిళ్లు త‌గ్గిపోతాయి.
6. ఏదైనా తీపి ప‌దార్థాన్ని నోట్లో వేసుకుని తిన్నా ఎక్కిళ్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.
7. ఎక్కిళ్లు వ‌స్తున్న స‌మ‌యంలో గాలిని బాగా పీల్చుకుని 30 సెకండ్ల పాటు గాలిని లోప‌లే బంధించాలి. అనంత‌రం శ్వాస‌ను వ‌ద‌లాలి. దీంతో ఎక్కిళ్లు పోతాయి.
8. నిమ్మ‌కాయ‌ను క‌ట్ చేసి ఆ ముక్క‌ల‌ను కొరుకుతూ తింటున్నా ఎక్కిళ్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.
9. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా తేనెను వేసి బాగా క‌లిపి తాగినా ఎక్కిళ్లు త‌గ్గిపోతాయి.
10. నిల‌బడి స‌గం వ‌ర‌కు శ‌రీరాన్ని బెండ్ చేసి ఆ భంగిమ‌లో నీటిని తాగాలి. దీంతో ఎక్కిళ్లు ఆగిపోతాయి.

మల్లె చేసే మేలెంతో...!

మల్లె టీ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తినీ పెంచుతుంది. వృద్ధాప్య లక్షణాలూ దరిచేరనివ్వదు. అంతేకాదు గుండెపోటూ, బ్రెయిన్‌ స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రిళ్లు కప్పు ఈ టీని తాగడం వల్ల కలత లేని నిద్ర సొంతమవుతుంది. ఇందులో జలుబూ, జ్వరం వంటి సమస్యల్ని నివారించే యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలెక్కువ. ఇందులోని కాచెన్స్‌ అనే గుణాలు (సీఏటీఈసీహెచ్‌ఐఎన్‌ఎస్‌) జీవక్రియల వేగాన్ని పెంచి, ఎక్కువ కెలొరీలు కరిగేలా చేస్తాయి. * మల్లె పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎక్కువ పనులతో అలసటగా ఉన్నప్పుడు ఈ నూనెను వాసన చూస్తే చాలు. మల్లె చర్మానికి రక్షణగా ఉంటుంది. మల్లె నూనె చర్మానికి తేమనందిస్తుంది. అంతేకాదు.. ఇది చర్మంలోని సాగేగుణాన్ని పెంచుతుంది. దాంతో చర్మం తాజాగా మారి, పొడిబారే సమస్య అదుపులో ఉంటుంది. చర్మంపై పేరుకునే రకరకాల మచ్చల్ని నివారించడంలోనూ ఈ నూనె కీలకంగా పనిచేస్తుంది.

డైటింగ్ చేసే వారు కామ‌న్‌గా చేసే మిస్టేక్స్ ఇవే… ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి..!

నేటి త‌రుణంలో అధికంగా బ‌రువు ఉన్న వారు త‌మ శ‌రీర బ‌రువును త‌గ్గించుకునేందుకు త‌ప‌న ప‌డుతుంటే స‌రైన బ‌రువు ఉన్న‌వారు దాన్ని నియంత్రించుకోవ‌డం కోసం శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎక్స‌ర్‌సైజ్‌లు, యోగాలు చేయ‌డం, కొవ్వులు త‌క్కువ‌గా, ప్రోటీన్లు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకోవ‌డంపై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు. ఇంకొంద‌రైతే ఏకంగా తిండి మానేసి దానికి డైటింగ్ అని పేరు పెట్టి బ‌రువు త‌గ్గేందుకు క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే డైటింగ్ అంటే తిండి పూర్తిగా మానేయ‌డం కాదు, తిండిని ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎంత ఎక్సర్‌సైజ్ చేయాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని డైటింగ్ అనే ప‌దం వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అధిక శాతం మంది డైటింగ్ పేరుతో కొన్ని పొర‌పాట్లు చేస్తున్నారు. వాటిని స‌రిదిద్దుకుంటేనే డైటింగ్ చేసిన దానికి ఫ‌లితం ఉంటుంది. లేదంటే ఫ‌లితం ఏమీ ఉండ‌దు. చాలా మంది డైటింగ్ పేరు చెప్పి చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం...
భోజ‌నం స‌రిగ్గా చేయ‌క‌పోవ‌డం / అస‌లే తిన‌క‌పోవ‌డం :– పైనే చెప్పాం క‌దా. తిండి అస్స‌లు తిన‌కుంటే దాన్ని డైటింగ్ అనుకుంటున్నార‌ని. అలా ఎంత మాత్రం కాదు. ఏ పూటైనా మ‌నం చేయాల్సిన భోజ‌నాన్ని మాత్రం మాన‌కూడ‌దు. కాక‌పోతే తిండి తిన‌బుద్ది కాక‌పోతే కొద్ది కొద్దిగా త‌క్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలి. ఇలా తిన‌డం వ‌ల్ల బ‌రువు అదుపులో ఉంటుంది. అంతేకానీ అస్స‌లు తిండి తిన‌క‌పోతే త‌రువాత వ‌చ్చే పూట‌కు సాధార‌ణం క‌న్నా ఎక్కువ‌గానే తింటారు. దీంతో బ‌రువు పెరుగుతుంది.
డైటింగ్ ఎక్కువ‌గా చేయ‌డం :– త‌క్కువ మోతాదులో ఆహారం తీసుకుంటూ ఎప్ప‌టి క‌ప్పుడు డైటింగ్ చేస్తుంటే స‌న్న‌బ‌డ‌డం మాట త‌రువాత సంగ‌తి. దాంతో కొంద‌రు ఇంకా బ‌రువు పెరుగుతార‌ట‌. అయితే త‌క్కువ క్యాల‌రీలు ఉన్న పండ్లు, కూర‌గాయ‌ల వంటి వాటిని తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ట‌.
ఎక్కువ‌గా వ్యాయామం చేయ‌డం :– బ‌రువు త‌గ్గాల‌నే తొంద‌ర‌లో కొంద‌రు ఎక్కువ‌గా ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తుంటారు. అయితే ఇది ఎంత‌మాత్రం క్షేమ‌క‌రం కాద‌ట‌. ఎందుకంటే ఎక్కువ‌గా ఎక్సర్‌సైజ్‌లు చేస్తే నీర‌సం, అల‌స‌ట‌, కండ‌రాలు ప‌ట్టేయ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అంతేకాదు బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వారంలో 1 కిలో క‌న్నా ఎక్కువ బ‌రువు త‌గ్గితే దాంతో ఆరోగ్య‌ప‌రంగా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అంటే ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ధ‌తిలోనే బ‌రువు త‌గ్గాల్సి ఉంటుంది.
ఫుడ్ స‌ప్ల‌మెంట్లు :– బ‌రువు త‌గ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డే ఫుడ్ స‌ప్లిమెంట్లు, టాబ్లెట్లు, ఫ్యాట్ క‌ట్ట‌ర్స్ వంటివి వేగంగా ప‌నిచేస్తాయ‌ట‌. దీంతో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. కానీ అది మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాద‌ట‌. నిదానంగా నెమ్మ‌దిగా బ‌రువు త‌గ్గాల‌ట‌.
చ‌క్కెర‌, కొవ్వులు :– బ‌రువు పెరిగిపోతామేమో అన్న భ‌యంతో కొంద‌రు పూర్తిగా చ‌క్కెర‌, కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం మానేస్తారు. కానీ మ‌న శ‌రీరానికి నిత్యం త‌గిన మోతాదులో అవి కూడా అవ‌స‌ర‌మే. కాట‌ట్టి వాటిని పూర్తిగా మానేయాల్సిన ప‌నిలేదు. త‌క్కువ మోతాదులో తింటే దాంతో మ‌న‌కు కావల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే చ‌క్కెర విష‌యానికి వ‌స్తే కృత్రిమంగా క‌న్నా ఆర్గానిక్ ప‌ద్ధతిలో త‌యారు చేసిందైతే బెట‌ర్‌.
ఆల్క‌హాల్‌, పొగ‌తాడం :– స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌కుండా మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వంటి ప‌నులు చేస్తే అది మ‌న శ‌రీరానికి అంత మంచిది కాదు. దీంతో బ‌రువు త‌గ్గాల‌నుకున్నా అంత ప్ర‌యోజ‌నం ఉండ‌దు.
నీరు :– రోజూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత నీటిని తాగ‌క‌పోతే అది మన జీవ‌క్రియ‌ల‌పై ప్ర‌భావం చూపుతుంది. ప్రధానంగా డీహైడ్రేష‌న్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. దీనికి తోడు డైటింగ్ కూడా ప‌ద్ద‌తి త‌ప్పుతుంది. నిత్యం ఉద‌యాన నిద్ర‌లేవ‌గానే క‌నీసం 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది.
టీ, కాఫీలు, జ్యూస్‌లు :– చ‌క్కెర క‌లిపిన జ్యూస్‌ల‌ను, టీ, కాఫీల‌ను అస్స‌లు తాగ‌కూడ‌దు. స‌హ‌జ సిద్ధ‌మైన జ్యూస్‌ల‌నే తాగాలి. దీంతో డైటింగ్ స‌క్ర‌మంగా జ‌రుగుతుంది.
ప్రోటీన్లు :– ప్రోటీన్ షేక్‌ల‌ను ఎక్కువ‌గా తాగితే మ‌న శ‌రీరం నుంచి అన‌వ‌స‌రంగా శ‌క్తి వృథా పోతుంది. నిత్యం మ‌నం చేసే ప‌ని, అందుకు త‌గిన స్థాయిని బ‌ట్టే ప్రోటీన్ల‌ను కార్బోహైడ్రేట్ల‌తో క‌లిపి స‌మ‌తూకంలో తీసుకోవాలి. అప్పుడే మనం చేసై డైటింగ్‌కు క‌రెక్ట్ ఫ‌లితం వ‌స్తుంది.
నిద్ర :– చివ‌రిగా నిద్ర విష‌యానికి వ‌స్తే ఏ వ్య‌క్తి అయినా నిత్యం 6 నుంచి 8 గంట‌ల పాటు క‌నీసం నిద్ర పోవాలి. లేదంటే శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల స‌మ‌తుల్య‌త దెబ్బ తింటుంది. దీని వ‌ల్ల డైటింగ్ చేసినా అంత‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. కాబ‌ట్టి క‌నీస నిద్ర త‌ప్ప‌నిస‌రి.

Wednesday, August 17

మీ వయసుని బట్టి ఎంతసేపు నిద్రపోవాలో తెలుసా ?

మనుషులకు నిద్ర, ఆహారం, నీళ్లు, ఆక్సిజన్ చాలా అవసరం. బతకాలంటే.. ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలపడానికి నిద్ర చాలా ముఖ్యమైనది. మన జీవితకాలంలో దాదాపు మూడో వంతు భాగం నిద్రకే కేటాయిస్తాం. మనమంతా రాత్రి బాగా నిద్రపట్టాలని.. నిద్రపోవాలని కోరుకుంటాం. అయితే కొంతమంది 8గంటలు లేదా 7గంటల నిద్ర సరిపోతుందని చెబుతూ ఉంటారు. ఇది కరెక్టేనా ? ఎవరైనా ఇంత సమయం నిద్రపోతే సరిపోతుందా ?
లేదు.. నిద్రపోయే సమయానికి కూడా అధ్యయనాలు చాలా విషయాలు చెబుతున్నాయి. మన వయసుని బట్టి.. ఎవరు ఎంత సమయం నిద్రపోవాలి అనే విషయం తేల్చాయి ఈ స్టడీస్. వయసుకి తగినంత సేపు నిద్రపోకపోతే... అది మన ఆరోగ్యం, జీవనశైలిపై దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి మీ వయసును ఇక్కడ చెబుతున్న క్యాల్కులేషన్స్ తో తెలుసుకుని.. ఇకపై సరిపోయేంత నిద్ర పొందేలా జాగ్రత్త పడండి. కొన్నేళ్లపాటు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. ఏ వయసు వాళ్లు ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ వయసుని బట్టి ఎంతసేపు నిద్రపోవాలో తెలుసా ?

పుట్టిన బేబీకి మూడునెలలు వచ్చే వరకు రోజుకి 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి.

4 నుంచి 11 నెలల పిల్లలు:- 4 నుంచి 11 నెలల వచ్చేవరకు పిల్లలు 12 నుంచి 15 గంటలు నిద్రపోయేలా జాగ్రత్త పడాలి.


1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలు:- 1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలు 11 నుంచి 14 గంటలసేపు నిద్రపోవడం ఆరోగ్యకరం.


3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు :- 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలపాటు నిద్రపోవాలి.


6 నుంచి 13 పిల్లలు :- 6 నుంచి 13 ఏళ్ల వయసు పిల్లలు 9 నుంచి 11 గంటలసేపు నిద్రపోవడం వాళ్ల ఆరోగ్యానికి మంచిది.


>14 నుంచి 17 ఏళ్లలోపు టీనేజర్స్ :- 14 నుంచి 17 ఏళ్లలోపు టీనేజర్స్ రోజుకి 8 నుంచి 10 గంటలపాటు నిద్రపోవాలి.:-


18 నుంచి 25 ఏళ్ల వయసు:- 18 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో ఉండేవాళ్లకు 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది.


26 నుంచి 64 ఏళ్ల వయసువాళ్లు :- ఇక 26 నుంచి 64 ఏళ్ల వయసువాళ్లు ఇదే తరహాలో 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. 65ఏళ్లు పైబడినవాళ్లు రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోతే సరిపోతుందని స్టడీస్ సజెస్ట్ చేస్తున్నాయి.