Sunday, June 9

గ్యాస్‌ సమస్యకు చెక్‌...

Oppo F11 Mobiles 
అల్లం:- గ్యాస్‌ సమస్యకు మంచి మందు అల్లం. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. తిన్నగా నమలలేకపోతే చక్కెర కలుపుకుని తినొచ్చు.
వెల్లుల్లి:- గ్యాస్‌ సమస్యకు వెల్లుల్లి చాలా చక్కటి సహజసిద్ధమైన మందు. దీనిని తిన్నగా నమలాలి. లేదా వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర విత్తనాలు, జీలకర్ర గింజలు తీసుకుని ఐదు నిమిషాల పాటు నీళ్లలో ఉడికించాలి. ఈ ద్రావణాన్ని తాగితే గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు
దాల్చిన చెక్క:- దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూస్‌ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్‌ సమస్య పోతుంది.
కొబ్బరి నీళ్లు:- గ్యాస్‌ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు మంచిమందు. ఇందులో అసాధారణ ప్రోటీన్లు ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
కొత్తిమీర:- అజీర్తి నిర్మూలనకు కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒక గ్లాస్‌ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
నిమ్మరసం:- గ్యాస్‌ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మరసం ఎంతో మేలు. ఒక కప్పు ఉప్పులో నిమ్మరసం, అరస్పూన్‌ బేకింగ్‌ సోడా కలిపి తాగాలి. ఈ రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది.

Saturday, June 1

ఆరోగ్యం మనచేతుల్లోనే

రోజూ వ్యాయామం, పోషకాహారం, సరియైన నిద్ర మనం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతాయి. అంతే కాదు కొన్ని చిన్నచిన్న పనులే అయినప్పటికీ మన ఆరోగ్యంపై అవి ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇవి పాటించి చూడండి...
  1. నడక:- చీటికి మాటికీ వాహనాలను బయటకు తీయడం మానెయ్యండి. ఆఫీసులో భోజన సమయంలో గానీ ఇంటికి దగ్గర్లోని దుకాణానికి వెళ్లాల్సినపుడు గానీ కాసేపు నడవడం ప్రారంభించండి. ఇలా తక్కువ సేపు నడిచినా శరీరం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది.
  2. మెట్లు ఎక్కటం:- ఇంట్లో గానీ, ఆఫీసులో గానీ మెట్లు ఉంటే 'ఆ... ఏం ఎక్కుతాం లే' అని అనుకోకుండా కాస్త కాళ్లకు పని చెప్పండి. ఒక్కరోజుతోనే ఆగకుండా దాన్నొక అలవాటుగా మార్చుకోండి. క్రమంగా మెట్లను ఎక్కే, దిగే సంఖ్యనూ పెంచుకోండి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
  3. మరోగ్లాసు నీరు:- చాలా మంది దాహం వేసినప్పుడే నీరు తాగుతుంటారు. కానీ మనకు దాహం వేయటానికన్నా ముందే నీరు తాగడం మంచిది. తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సరిగా ఉంటుంది. కీళ్ల కదలికలు సాఫీగా సాగుతాయి. వెన్నుపాము, ఇతర సున్నితమైన కండరాలకు రక్షణ లభిస్తుంది. మూత్రం చెమట, మలవిసర్జన రూపంలో వ్యర్థాలు తేలికగా బయటకు వెళ్లిపోతాయి.
  4. నిటారుగా కూచోవటం:- వెన్ను ముందుకు వంగిపోకుండా నిటారుగా కూచుంటే నొప్పుల బారిన పడకుండా చూసకోవచ్చు. అలాగే నడుస్తున్నప్పుడూ భుజాలు వెనక్కి తల పైకెత్తి ఉండేలా చూసుకున్నా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం సొంతమవుతాయి.
  5. త్వరగా నిద్రించడం:- రాత్రిపూట గాఢంగా ఏడెనిమిది గంటలు పడుకోవడం గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉందనడానికి సూచిక. గాఢ నిద్ర మూలంగా శరీరం కొత్త శక్తిని పుంజుకోవడమే కాదు.. ఆహార అలవాట్లు గాడి తప్పకుండానూ ఉంటాయి. నిద్రలేమితో ఆకలిని తగ్గించే హార్మోన్ల ఉత్పత్తి పడిపోతుంది. ఇది ఎక్కువ ఆహారాన్ని తినడానికి, బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.
  6. ఒంటికాలిమీద నిలబడటం:- పది సెకండ్ల పాటు ఒక కాలుమీద నిలబడి, తర్వాత మరోకాలుమీద నిలబడటం చాలా తేలికైన వ్యాయామం. ఇది రోజువారీ పనులకు అవసరమైన శరీర నియంత్రణ, కదలికల వంటివి మెరుగుపడేలా చేస్తుంది.
  7. వారం వారం బరువు తూచుకోవడం :- బరువు తగ్గడానికి గానీ దాన్ని నియంత్రించుకోవడానికి గానీ ప్రతీ వారానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దాన్ని కాగితం మీద రాసుకొని ఎంత మేరకు దాన్ని చేరుకున్నారో చూసుకోండి. ప్రతీవారం ఒకే రోజున, ఒకేసమయాన, ఒకేరకం దుస్తులను ధరించి తూచుకుంటే తగ్గిన బరువు కచ్చితంగా తెలుస్తుంది.
  8. కేలరీల మోతాదుపై కన్ను:- ఉదయాన్నే ప్రోటీన్‌తో కూడిన పీచు అధికంగా గల అల్పాహారాన్ని తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలివేయకుండానూ అలసిపోకుండా పనులు చేసుకోవడానికీ తోడ్పడుతుంది. కేలరీల మోతాదు అధికంగా గల పదార్థాలు బరువు పెరగడానికి దారితీస్తాయి. కాబట్టి తక్కువ కేలరీల ఆహారం మీద దృష్టి పెట్టండి. వెన్నతీసిన పాల పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు తినటం అలవాటు చేసుకోవాలి. కొవ్వు ఎక్కువగా లేదా కృత్రిమ తీపి పదార్థాలకు బదులుగా తాజా పండ్లు తినడం మేలు.