Thursday, May 23

అలసట తీర్చే కొబ్బరి నీళ్లు...

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకతి సిద్ధంగా లభించే కొబ్బరి బోండాలు శ్రేష్ఠమైనవి. పుష్కలమైన లవణాలు, పోషక విలువలు ఉండే కొబ్బరి నీళ్లు శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో ప్రతి ఒక్కరికీ దివ్యౌషధంలా పని చేస్తాయి...
  •   కొబ్బరి నీరు అలసట, వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నీళ్లల్లో లవణాలు, పోషక పదార్థాలు, రోగ నిరోధక శక్తి ఆధికంగా ఉంటుంది. రక్తం శుద్ధి అవుతుంది. కంటిచూపు మెరుగు పడటమే కాకుండా జ్వరం, జలుబు ఉన్నవారికి టానిక్‌లా పని చేస్తుంది. వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో మంట తగ్గిస్తుంది. శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది.
  •   ఈ నీటిలో పొటిషియం, సోడియం, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, కాఫర్‌, సల్ఫర్‌, క్లోరైడ్‌లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీటిలో ప్రొటీన్ల శాతం ఆవుపాలలో కంటే ఎక్కువగా ఉంటాయి.
  •   కొబ్బరి నీళ్లు రోజూ తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్‌ఎటాక్‌ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు.
  •   తక్కువగా నీరు తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తరచూ తాగడం వల్ల చిన్నసైజ్‌ రాళ్లు త్వరగా కరిగిపోతాయి. అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.
  •   కొబ్బరి నీళ్లను రెగ్యులర్‌గా తాగడం వల్ల డీ హైడ్రేషన్‌ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే కొబ్బరి నీళ్లు మంచిగా పని చేస్తాయి. అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.
  •   కొబ్బరి నీరు జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉంటే ఇలాంటి తిమ్మిర్లు వస్తాయి. అయితే కొబ్బరి నీరు పొటాషియం స్థాయిని పెంచుతుంది. దీంతో కండరాల తిమ్మిరి సమస్య ఉండదు.
  •   బాగా అలసిపోయినపుడు కొబ్బరి నీళ్లు తాగితే చాలు. మీరు వెంటనే కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు.
  •   ఈ నీటిని తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. జుట్టు నిగనిగలాడుతుంది. వీటన్నింటి కోసం మీరూ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే చాలు.

ఇంట్లోనే ఫేస్‌ప్యాక్స్‌...

   వేసవిలో ఎక్కువగా చర్మం కమిలిపోతుంటుంది. ముఖం, చేతులపై సూర్యకిరణాలు పడి చర్మంలో కాస్త తేడా వస్తుంది. మరి చర్మం కమిలిపోకుండా మన ఇంట్లోనే చేసుకునే ఫేస్‌ ప్యాక్‌లేంటో తెలుసుకుందాం...
  1.  చాలామంది చర్మం కమిలిపోయిందే అని బ్లీచింగ్‌ చేయించడం, లేదంటే వెంటనే ఇతర కాస్మొటిక్‌ ట్రీట్‌మెంట్స్‌ని వెతుక్కోవటం చేస్తుంటారు. వీటి వల్ల వెంటనే చర్మంలో మెరుగుదనం వచ్చినట్లు కనిపిస్తుంది. అయితే అది దీర్ఘకాలికంగా ఉండదు. అందుకే కాస్త సహనంతో ఎండ తాకిడికి గురైన చర్మాన్ని నేచురల్‌ హౌమ్‌రెమెడీస్‌తో నయం చేయవచ్చు.
  2. విరివిగా కూరల్లో వాడే టమాట చక్కటి బ్యూటీ ప్రోడక్ట్‌. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సన్‌టాన్‌ని తొలగించటంలో టమటా ముఖ్యపాత్ర పోషిస్తుంది. టమోటాని బాగా గుజ్జు చేసి దానికి ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఓట్స్‌ పిండి కలిపి మిక్స్‌ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత నీళ్లతో వాష్‌ చేసుకోవాలి. ముఖంలో కాంతి వస్తుంది.
  3. ముఖ వర్చస్సు పెంచడంలో నిమ్మరసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంతో పాటు, సమస్య ఉన్న మిగిలిన ప్రాంతాల్లో నిమ్మకాయని సగానికి కట్‌ చేసి డైరెక్ట్‌గా చర్మంపై అప్లై చేసుకోవచ్చు. నిమ్మరసానికి కాస్త తేనె కలిపి పట్టించుకోవచ్చు. డ్రై అయిన తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే స్కిన్‌ మెరిసిపోతుంది.
  4. సూర్యకిరణాలకు దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపర్చడానికి ఆలూ పర్ఫెక్ట్‌. ఇందులో ఉండే 'సి' విటమిన్‌ మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌లాగా ఉపయోగపడుతుంది. తొలుత ఆలుగడ్డపై ఉండే తోలు ఒలిచిన తర్వాత మెత్తగా చూర్ణం చేయాలి. దీనికి తగినంత నిమ్మరసం కలిపి కమిలిన ప్రాంతంలో అప్లై చేసి అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రపరచుకోవాలి. చక్కటి ఫలితం ఉంటుంది.
  5. శరీరానికి దోసకాయ చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే దోసకాయ అంటే అందరికీ ఇష్టం. ఇక ఇందులో ఉండే విటమిన్‌ 'సి' చక్కటి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. దోస ఫేస్‌ ప్యాక్‌ చేయటం చాలా సులువు. ముందు దోసకాయని జ్యూస్‌లాగా చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి. దీనికి తగినంత పరిమాణంలో నిమ్మరసం, రోజ్‌వాటర్‌ కలిపి మిక్స్‌ చేయాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ని ముఖంతో పాటు కమలిన చేతులకి అప్లై చేసుకోవాలి. అరగంట ఆగాక కడిగేసుకోవాలి. ఇలా ఓ నాలుగుసార్లు దోసకాయ ఫేస్‌ప్యాక్‌ని వాడితే మునుపటిలా స్కిన్‌లో గ్లో వస్తుంది.
  6. అలోవెరా చర్మకాంతికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎండకు వాడిపోయిన చర్మానికి చక్కటి గ్లో తెస్తుంది. డైరెక్ట్‌గా అలోవెరా రసాన్ని మాయిశ్చరైజ్‌ చేస్తే ముఖంలో వెలుగు రావటంతో పాటు సున్నితత్వం వస్తుంది.

Wednesday, May 22

నిద్ర రావడం లేదా ఈ టిప్స్‌...

రాతిళ్ల్రు నిద్ర పట్టక ఇబ్బంది పడు తున్నారా. బెడ్‌ ఎక్కిన తరువాత ఎంత ప్రయ త్నించినా నిద్ర రావడం లేదా. అయితే సహజ సిద్ధమైన ఈ టిప్స్‌ పాటించి చూడండి...
  1.   డమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎలాగంటే... ఎడమ వైపు పడుకుని చేతి వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి, ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శరీరంలో అధిక ఉష్ణోగ్రత వల్ల లేదా మెనోపాజ్‌ హాట్‌ ఫ్లషెస్‌ సమస్య వల్ల నిద్ర పట్టనప్పుడు ఈ పద్ధతి చాలా బాగా ఉపకరిస్తుంది.
  2.   కండరాలకు విశ్రాంతి కలిగిస్తే శరీరం నిద్రపోయేందుకు సిద్ధమవు తుంది. ఇందుకు... వెల్లకిలా పడుకుని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు కాలి బొటనవేళ్లను పాదం కిందకి అదిమేలా వంచి యథాస్థితికి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు ఉపశమనం కలిగి నిద్ర మిమ్మల్ని పలకరిస్తుంది.
  3.  కండ్లు మూసుకుని కనుగుడ్లను మూడుసార్లు గుండ్రంగా తిప్పాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. అంతేకాకుండా మెలటోనిన్‌ అనే నిద్ర హార్మోన్‌ కూడా విడుదలవుతుంది.
  4.  చేయాల్సిన పనుల జాబితాను పడక మీద గుర్తుచేసుకుంటే నిద్ర రాదు. అందుకని పడక మీదకు చేరే ముందు ఒక పేపర్‌ మీద చేయాల్సిన పనులన్నింటినీ రాయాలి. ఇలా చేయడం వల్ల మరుసటిరోజు ఉదయం నిద్రలేచే వరకు వాటిని బుర్రలోనుంచి పక్కకు నెట్టేయొచ్చు. Samsung Galaxy M20ర్రలో ఆలోచనల భారం దిగిపోయాక నిద్ర రాకపోవడం అనే సమస్యే తలెత్తదు. 
  5.  నిద్ర పోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. నిద్ర పట్టడం లేదు బాబోరు అంటుంటే ఇదేంటనుకుంటున్నారా.. అందులోనే ఉంది కిటుకు. దీన్నే 'స్లీప్‌ పారడాక్స్‌' అంటారు. ఇందులో భాగంగా కళ్లను విప్పార్చి 'నేను నిద్రపోవడంలేదు' అని పదేపదే అనుకోవాలి. సాధార ణంగా మెదడు ప్రతికూల విషయాలను సరిగా ప్రాసెస్‌ చేయదు. అందుకని మీరు నిద్రపోవద్దని చెప్పుకునే మాటల్ని నిద్రపోవడానికి ఇచ్చే సజెషన్స్‌గా భావిస్తుంది. కంటి కండరాలు కూడా అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు అని చెప్తున్నారు సైకోథెరపిస్టులు.
  6.  బుర్రలో ఉన్న బాధల భారాన్ని బయటికి పంపేయాలంటే ప్రాపంచిక విషయాలను రివర్స్‌లో గుర్తుచేసుకోవాలి. మీరు ఆ రోజున మాట్లాడిన విషయాలు, చూసిన ప్రదేశాలు, విన్న ధ్వనులు.. వంటి అన్ని విషయాలను వెనక నుంచి ముందుకు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల మానసికంగా నిద్రకు సిద్ధమవుతారు. దాంతో నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఉండదు.

సులువైన చిట్కాల‌ను నిత్యం పాటిస్తూ చ‌క్క‌ని కంటి చూపుని ఎలా పొంద‌వ‌చ్చో తెలుసుకోండి..!

      ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా ఈ స‌మ‌స్య ఎదుర‌వ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. ఇక యువ‌త‌, పెద్ద‌ల్లో అధిక శాతం మంది చిన్న వ‌య‌స్సులోనే కంటి అద్దాలు, కాంట‌క్ట్ లెన్స్‌లు ధ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారు నేత్ర సంర‌క్ష‌ణ‌పై దృష్టి సారించాల్సి వ‌స్తోంది. కొన్ని స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాలు పాటించటం వలన కంటి సంబంధ స‌మ‌స్య ఏదైనా సుల‌భంగా దూర‌మ‌వుతుంది. ఆ చిట్కాల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...


1.రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే కంటి సంబంధ స‌మ‌స్య‌లు వెంట‌నే దూర‌మ‌వుతాయి. క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ, బీటా కెరోటిన్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి దృష్టి సంబంధ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయి. చూపు స్ప‌ష్ట‌త‌ను పెంచుతాయి.

2.ఇటీవల స్మార్ట్‌ఫోన్లు, కంప్యూట‌ర్ల వాడ‌కం ఎక్కువైంది. దీనికి తోడు బ‌య‌ట తిర‌గ‌డం, ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటే ఆ ప్ర‌భావం క‌ళ్ల‌పై కూడా ప‌డుతుంది. రోజూ పగటి సమయంలో క‌నీసం 3 గంట‌ల పాటు క‌ళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ ఒత్తిడి నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

3.రోజులో కొంత స‌మయం పాటు ఆహ్లాద‌క‌ర‌మైన ప‌చ్చ‌ని ప్ర‌కృతిని చూడండి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు ఎంత‌గానో హాయి క‌లుగుతుంది. ఇది కళ్ళకు పూర్తి స్థాయిలో హాయినిస్తుంది.


4.కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌ల‌ను ఎక్కువ‌గా ధ‌రించే వారు రోజులో కొంత స‌మ‌యం పాటు వాటికి దూరంగా ఉండేందుకు ప్రయ‌త్నించండి. దీని వ‌ల్ల లెన్స్‌ల ద్వారా క‌ళ్ల‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది.

5.కంప్యూట‌ర్ల‌పై ఎక్కువ‌గా ప‌నిచేసేవారు అవ‌స‌ర‌మైతేనే వాటిని వాడాలి. లేదంటే దూరంగా ఉండాలి. వీలైనంత వ‌ర‌కు కంప్యూట‌ర్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయ‌త్నించాలి.

6.క‌ళ్ల‌ను నిత్యం కొంత సమ‌యం పాటు సున్నితంగా మ‌సాజ్ చేయాలి. ఇలా చేస్తే క‌ళ్ల‌కు విశ్రాంతి క‌లుగుతుంది.

7.రోజూ ఒక అరగంట పాటు గోరు వెచ్చ‌ని త‌డి గుడ్డ‌తో క‌ళ్ల‌ను సున్నితంగా ఒత్తిన‌ట్టు చేయాలి. ఇది క‌ళ్ల‌కు హాయినిస్తుంది.


కంటి చూపు పెరగడానికి: -
*********************************
పొన్నగంటికూర పచ్చిరసము లీటరు తీసుకొని అందులో త్రిఫలాల బరక చూర్ణము వేసి సన్నటి మంటపయి
అరళీటారు మిగులువరకు కాచి వడపోసుకొని అందులో పావు లీటరు ఆవునెయ్యివేసి సన్ననిమంటపయి నేయి మిగులువరకు కాచి నిలువచేసుకొని రోజు ఉదయం రాత్రి ఒక స్పూన్ బొజనానికి ముందు తీసుకొవాలి,

ఇలా రోజు క్రమం తప్పకుండా 3 నుంచి 6 నెలలవరకు చేస్తె మీ కంటి చూపు డెగ కంటి చూపు వలె అవుతుంది.

అలాగే రోజు స్వచ్చమైన ఆవునెయ్యిని బోజనంలో రోజు రెండు స్పూన్లు తీసుకొవాలి,

Saturday, May 11

రోగనిరోధక శక్తికి జొన్న..

  జొన్నల వాడకం ఈ నాటిది కాదు. చాలామందికి తెలియదు కాని క్రీ.పూ 3 వేల ఏళ్ల కిందటి నుంచి మనుషులకు  ప్రధాన ఆహారం. బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నలోనే అధిక కాల్షియం ఉంటుంది. అంతేకాదు,   ఇనుము, ప్రొటీన్లు,   పీచుపదార్థం వంటి పోషకాలు కూడా ఉంటాయి. పలు దేశాల్లో చేపట్టిన వైద్య పరిశోధనల్లో తేలిన విషయం గుండె జబ్బుల్ని అడ్డుకునే శక్తి జొన్నకు ఉంది...

  1. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికీ యాంటీ ఆక్సిడెంట్స్‌ అనేవి కీలకం. జొన్నలో ఇవి పుష్కలం. ఇందులో మనకు మేలుచేసే పోలీఫెనిక్‌ కాంపౌడ్స్‌ అధికం. తరచూ జొన్నతో చేసిన పదార్థాలను తినడం వల్ల కొవ్వు సమస్య రాదు. చెడుకొవ్వును కూడా తగ్గించే గుణం ఈ గింజలకు ఉంటుంది.
  2. ఎముకలు బలిష్టంగా ఉండేందుకు పాస్పరస్‌ చాలా అవసరం. ఒక కప్పు జొన్నల్లో 550 మిల్లీగ్రాముల పాస్పరస్‌ లభిస్తుంది.
  3. జొన్నరొట్టెలు ఎన్ని తింటే అంత మంచిది. జొన్నల్లో నరాల బలహీనతను తగ్గించే గుణం ఉంటుంది. మరీ ముఖ్యంగా విటమిన్‌ 'బి' సమృద్ధిగా దొరుకుతుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
  4. వయసు పెరిగేకొద్దీ మతిమరుపు, కంటిచూపు మందగించడం సహజం. ఈ రెండు సమస్యలు తొందరగా రాకూడదంటే జొన్నలు ఎక్కువగా వాడాలి.
  5. జొన్నల్లో పిండి పదార్థం అధికం. జీర్ణశక్తిని పెంపొందించి అందుకు అవసరమైన హార్మోన్లను వద్ధి చేస్తాయి.

Wednesday, May 8

ఉల‌వ‌ల వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

          ఉల‌వ‌లు గురించి మ‌న దేశంలో తెలియ‌ని వారుండ‌రు. ఉల‌వ‌లు అంటే మ‌న తెలుగు వారికి అమిత‌మైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్క‌సారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్ట‌రు. అంత‌టి చ‌క్క‌ని రుచిని ఉల‌వ‌చారు క‌లిగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఉల‌వ‌ల‌ను త‌ర‌చూ తింటుంటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి పోష‌కాలు అందుతాయి. ఉల‌వ‌ల వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
1. ఉల‌వ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ‌ను అందిస్తాయి. ఫైబ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. గుండె స‌మస్య‌లు రాకుండా ఉంటాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది.

 2. ఉల‌వలను క‌షాయం రూపంలో చేసుకుని తీసుకుంటే మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. క‌ఫం బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో క‌లిగే స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎక్కిళ్లు త‌గ్గుతాయి. నేత్ర స‌మ‌స్య‌లు పోయి దృష్టి మెరుగు ప‌డుతుంది.
3. ఉల‌వ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా తింటుంటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
4. ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి.
5. ఉలవ‌ల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల ఎదిగే పిల్ల‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వారి శ‌రీర నిర్మాణానికి ప‌నికొస్తాయి. ఆక‌లిని పెంచే గుణాలు ఉల‌వ‌ల్లో ఉంటాయి. మూత్ర పిండాలు, మూత్రాశ‌యంలో ఏర్ప‌డే రాళ్లు క‌రిగిపోతాయి. మ‌ల‌మూత్ర విసర్జ‌న‌లు సాఫీగా అవుతాయి.
 6. పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి.
7. ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. ఉలవలపై పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి.
8. ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి బయటకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలకు ఉలవలతో చేసిన ఆహారం నివారిస్తుంది. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి, కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Monday, May 6

వేపతో చర్మం తాజాగా...

  వేపలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికే కాదు అందానికీ మేలు చేస్తాయి. చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతాయి. వేడినీళ్లలో గుప్పెడు వేపాకుల్ని కలిపి మరిగించి, ఆ నీటితో రోజూ స్నానం చేస్తే మురికి పోవడంతో పాటూ చర్మగ్రంథులూ శుభ్రపడతాయి...
  1. వేపాకుల్ని ముద్దగా చేసి కాస్త పెసరపిండీ, చెంచా ఆలివ్‌ నూనె కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌ హెడ్స్‌, మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది. ఈ ఆకుల్ని మరగబెట్టి ఆ నీటిలో కొంచెం పెరుగు, సెనగపిండీ కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. ఇలా తరచూ చేస్తుంటే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.
  2. ఈ కాలంలో చుండ్రు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీనికోసం ఖరీదైన షాంపూలే వాడక్కర్లేదు. వేపాకుల పొడిని పాలల్లో నానబెట్టాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి, పావుగంట తరువాత తలస్నానం చేస్తే సరి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
  3. కాలంతో పనిలేకుండానే కొందరిని కాలిపగుళ్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఇలాంటప్పుడు బొప్పాయి గుజ్జులో చెంచా తేనె, చెంచా వేపాకుల పొడి కలిపి దాన్ని పాదాలకు పూతలా వేయాలి. పావుగంట ఆగి గోరువెచ్చని నీళ్లతో శుభ్ర పరుచుకోవాలి. దీనివల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి.

Saturday, May 4

అవాంఛిత రోమాలకు...

  అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పెదాల పై భాగంలోనే వస్తుంటే చికాకు వేస్తుంది. వాటిని అత్యంత సులభంగా ఎలా తొలగించుకోవాలో చూద్దాం...
  1. ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపులోకి కొన్ని పాలు పోసి బాగా కలియబెట్టాలి. అది పేస్ట్‌లాగ తయారవుతుంది. అయిదు నిమిషాల తరువాత.. పై పెదవి పైభాగాన రాసుకోవాలి. అరగంటకు పొడిబారి చెక్కలాగ మారుతుంది. అప్పుడు దాన్ని మెల్లగా తొలగించుకుని చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
  2. పంచదారను ఒక నిమిషం పాటు పాన్‌ మీద వేగించాలి. చల్లారిన తరువాత.. అందులోకి నిమ్మరసాన్ని కలిపితే చిక్కటి పేస్టు అవుతుంది. దీని ద్వారా కూడా పెదవి పైనున్న రోమాలను వదిలించుకోవచ్చు.
  3. మరో సులువైన చిట్కా పసుపులోకి కొంత నీటిని కలిపి పేస్ట్‌లాగ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పై పెదవి మీదున్న రోమాలపై రాసుకోవాలి. అరగంట తరువాత పొడిబారుతుంది. వేలితో గట్టిగా అటూఇటూ రుద్దితే పొడిలా రాలిపోతుంది. కాసేపయ్యాక సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
  4. గుడ్డులోని తెల్లసొనలోకి కార్న్‌ఫ్లోర్‌, పంచదార వేసుకుని బాగా కలియబెట్టాలి. దీన్ని రోమాలున్న చోట రాస్తే సరి. కాసేపయ్యాక గట్టిపడుతుంది. దాన్ని మెల్లగా తొలగిస్తే రోమాలు తొలగిపోతాయి.
  5. పెరుగు, శనగపిండి, పసుపుల మిశ్రమం కూడా ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ పేస్టును రాసుకున్నాక పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండాలి. ఆ తరువాత రబ్బింగ్‌ చేసుకుని.. చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుంటే చక్కటి ఫలితం లభిస్తుంది.