Monday, September 4

నిద్ర సరిగా లేకపోతే అనర్థమే!

ఆధునిక మానవ జీవితంలో విశ్రాంతికి ప్రధాన్యత తగ్గింది. కంటి నిండా నిద్ర పోయేందుకు కూడా చాలా మందికి సమయం ఉండటంలేదు. అయితే.. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు పరిశోధకులు. సరిగా నిద్ర లేకపోతే జీవక్రియ వ్యాధుల (మెటబాలిక్‌ డిసీజెస్‌)కు గురికావాల్సి వస్తుందని హెచ్చరి స్తున్నారు. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైన పలు అంశాలు ఆందోళన కలిగి స్తున్నాయి. 1,615 మందిని పరిశోధించగా సరైన నిద్రలేని వారు బ్లడ్‌షుగర్‌, బ్లడ్‌ప్రెషర్‌, బ్లడ్‌ కొలెస్ట్రాల్‌, థైరాయిడ్‌ లాంటి రుగ్మతలతో అత్యధుకులు బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరంతా ఆరు గంటలకు మించి నిద్రపోని వారే. వీరు స్థూలకాయ సమస్యను కూగా ఎదుర్కొంటున్నారని పరిశోధకులు గుర్తించారు.

No comments:

Post a Comment