* మందులు వేసుకున్న వెంటనే పండ్లరసాలు తాగితే ఆ మందులు అనుకున్న ఫలితాలు
ఇవ్వవని వెస్ట్రన్ ఆంటారియో విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
* రోజుకు కనీసం అరవైగ్రాముల పెరుగు తినేవారిలో చిగుళ్ల వ్యాధులు రావు. పెరుగులో ఉండే లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్లపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. తద్వారా చిగుళ్లు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి.
* ఇతరులతో పోలిస్తే ముతక ధాన్యాలు తినేవారిలో రక్తపోటు వచ్చే ముప్పు 19 శాతం తక్కువ.
* అధిక కొవ్వుతో బాధపడేవారు అవిసెనూనెను ఆహారంలో భాగం చేసుకుంటే... శరీరానికి హానిచేసే తక్కువ సాంద్రతగలిగిన కొవ్వు(ఎల్‌డీఎల్) త్వరగా కరిగిపోతుంది.
* అలా తింటేనే...క్యారెట్లలో ఉండే ఫాల్‌కారినాల్ క్యాన్సర్‌ను నిరోధిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. కానీ... వాటిని తరగకుండా ఉడకబెట్టి తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. తరిగినవాటితో పోలిస్తే పూర్తి క్యారెట్‌ను ఉడకబెట్టినప్పుడు ఫాల్‌కారినాల్ 25శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. క్యారెట్లను తరిగి ఉడకబెట్టడం వల్ల వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయి. క్యారెట్‌కు ప్రత్యేకమైన తియ్యటి రుచినిచ్చే చక్కెరలు సైతం కరిగిపోతాయట.
* తలకు రాసుకునే నూనె పరిమాణంలో తేనె తీసుకుని కుదుళ్లకు అంటేలా మర్దన చేయండి. అరగంట తర్వాత పొడిజుట్టుకు ప్రత్యేకించిన షాంపూతో స్నానం చెయ్యండి. వారానికొకసారి ఇలా చేస్తే... బిరుసుగా ఉండే జుట్టు మళ్లీ జీవంతో నిగనిగలాడుతుంది.
* రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు కలిపి నూరి ముద్దలాగా చేయండి. కుంకుడు గింజ పరిమాణంలో రోజూ ఈ మిశ్రమాన్ని తింటే అజీర్ణం దరిచేరదు.
* చెవిపోటు వచ్చినప్పుడు చెవిలో రెండుమూడు చుక్కల వెల్లుల్లిరసం వేస్తే కాస్తంత ఉపశమనం లభిస్తుంది.
* మిక్సీ నుంచి మసాలా వాసన వస్తుంటే ఎండిన బ్రెడ్‌ముక్కలు వేసి పొడి చెయ్యండి. వాసనలు మాయం.
* అల్లం తింటే.. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.అవును ఇది పనిచేస్తుంది. నిపుణుల ప్రకారం.. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి ఇస్తే త్వరగా మార్పు కనిపిస్తుంది.

No comments:
Post a Comment