అంతేకాదు గడ్డలను కరిగించును, పక్వపరుచును. మేహశాంతిని కలుగజేసి
విరేచనమును బంధించును. నరాలకు బలం ఇచ్చి స్త్రీలకు మాసక్రమ ప్రదరం
(రుతురక్తమును) జారీ చేయును. దగ్గును, కషాయమును హరించును. కడుపు ఉబ్బరం,
గ్యాసులను నిర్మూలించును. శరీరంలోని క్రొవ్వును తగ్గించి, సన్నబడేటట్లు
చేస్తుంది మెంతులు.
మెంతులను పెరుగులోకి కలిపి (5గ్రాములు) నానించి మూడురోజులు రెండు పూటలా తీసుకుంటే రక్తవిరేచనములు తగ్గుముఖం పడతాయి. మెంతి పొడిని నీటితో ఉడికించి కడితే చీము గడ్డలు పగిలినొప్పి తగ్గుతుంది. అదే పిండిని ముల్లు గుచ్చుకున్న చోట కడితే నొప్పి తగ్గి ముల్లు బయటకు వస్తుంది. నానిన మెంతులను ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే బంక విరేచనములు తగ్గుతాయి. రక్త విరేచనములు కలిగినప్పుడు నిమ్మకాయంత వెన్నలో ఉల్లిపాయ ముక్కలను కలిపి రెండు రోజులూ రెండు పూటలా తింటే అమోఘంగా పనిచేస్తాయి.

No comments:
Post a Comment