Saturday, December 3

క్యాబేజీ... క్యాన్సర్‌ నివారిణి..!

క్యాబేజీలో పోషకాలు ఎక్కువన్నది తెలిసిందే. అయితే ఇందులోని సల్ఫొరాఫేన్‌ క్యాన్సర్‌ వ్యాధుల్ని అడ్డుకుంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా, ఇందులోని 3, 3-డై ఇండోలిల్‌మీథేన్‌(డిఐఎమ్‌) రేడియేషన్‌ థెరపీ కారణంగా తలెత్తే దుష్ఫలితాలనూ నివారిస్తుందని జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు ఎలుకల్ని రేడియేషన్‌కు గురిచేసి వాటిలో కొన్నింటికి డిఐఎమ్‌ను ఇచ్చారట. మరికొన్నింటికి ఇవ్వలేదట. నెలరోజుల తరవాత చూస్తే డిఐఎమ్‌ ఇచ్చిన ఎలుకలు రేడియేషన్‌ను తట్టుకుని జీవించాయని తేలింది.
రొమ్ముక్యాన్సర్‌ కారణంగా తలెత్తే కంతుల పరిమాణం పెరగకుండా క్యాబేజీలోని ఎపిజెనిన్‌ అనే రసాయనం అడ్డుకుంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరికి చెందిన తాజా పరిశోధనల్లో తేలింది.
* క్యాబేజీలో అధికంగా ఉండే బీటాకెరోటిన్‌; ల్యూటెన్‌, జియాక్సాంథిన్‌, క్యాంఫెరాల్‌, క్యుయెర్సిటిన్‌... వంటి ఆంథోసైనిన్‌లూ యాంటీ ఆక్సిడెంట్లూ హృద్రోగాల్నీ కంటి కండరాల బలహీనతనీ క్యాటరాక్ట్‌నీ నిరోధిస్తాయి. రోజూ అరకప్పు ఉడికించిన క్యాబేజీని తింటే శరీరానికి అవసరమయ్యే విటమిన్‌-సిలో35 శాతం లభిస్తుంది. అలాగే 81.5 మై.గ్రా. కె-విటమిన్‌ కూడా లభ్యమవుతుంది. బీ విటమిన్‌- కె ఎక్కువగా ఉండే వంకాయరంగు, ఎరుపురంగుల క్యాబేజీ ఆల్జీమర్స్‌ వచ్చే ప్రమాదాన్నీ అడ్డుకుంటుంది. క్యాబేజీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం... వంటి ఖనిజాలు ఎముక సాంద్రతని పెంచి, ఆస్టియోపొరొసిస్‌నీ నివారిస్తాయి.

No comments:

Post a Comment