పిల్లలు పెద్దయ్యాక ఆరోగ్యంగా ఉండాలంటే, చిన్నప్పటి నుంచే మంచి ఆహారం,
అవసరమైన ఆహారం తినిపిస్తూ ఉండాలి. శరీరానికి లాభాన్ని కూర్చే ఏ ఆహారమైనా,
చిన్నప్పుడు అలవాటు చేస్తేనే, ఓ వయసులోకి వచ్చాక కూడా ఆ అలవాటుని కంటిన్యూ
చేస్తారు. కాబట్టి పాలు మరవగానే కొన్ని ఆహారపు అలవాటు మొదలుపెట్టించాలి.
అందులో ఒకటి బొప్పాయి తినటం. మరి బొప్పాయి ఎందుకు తినాలని మీకో డౌట్
రావచ్చు.
* వాతావరణ మార్పిడి వలన, బయట ఎక్కువగా ఆడుకోవటం వలన పిల్లలకి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బొప్పాయిలో విటమిన్ సి ఉంతుంది. ఈ విటమిన్ పిల్లలలో ఇమ్యునిటినీ మెరుగుపరిచి, సాద్యమైనంతవరకు ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది.
* బొప్పాయిలో ఫైబర్ కూడా బాగా ఉండటం వలన, తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మెటబాలిజం సరైన ట్రాక్ లో ఉంటుంది.
* పిల్లలకు మలబద్ధకం సమస్య రావచ్చు. దీన్ని బొప్పాయితో కంట్రోల్ చేయవచ్చు. రోజుకి రెండుపూటలు కొంచెం కొంచెం బొప్పాయి తిన్పించి మన ప్రయత్నం చేయవచ్చు.
* బొప్పాయిని తేనెతో కలిపి ఇస్తే, అది పేగులను శుభ్రంగా ఉంచుతుంది. పిల్లలకు ఈ మిశ్రమం చాలా అవసరం.
* బొప్పాయిలో యాంటిఆక్సిడెంట్స్ బాగా దొరుకుతాయి. ఇవి చిన్నప్పటినుంచే శరీరానికి చాలా అవసరం.
* ఈ ఫలం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి మీ పిల్లల చర్మసౌందర్యం కోసమైనా బొప్పాయిని అలవాటు చేయండి.

No comments:
Post a Comment