Monday, January 23

బరువు పెంచే సహజ ప్రోటీన్ షేక్స్...

రోజు తీసుకునే క్యాలరీల సంఖ్య పెంచుకోటానికి బరువు పెంచే ప్రోటీన్ షేక్స్ ప్రాచుర్యం పొందినవిగా చెప్పవచ్చు. మీరు ఆరోగ్యకర బరువు మరియు కండరాలను పెంచుకోవాలని అనుకుంటున్నారా! అయితే ప్రోటీన్ షేక్స్ లను ద్వారా మీ లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చని చెప్పవచ్చు.

బరువు పెరగటానికి ప్రోటీన్ షేక్స్ స్థూలపోషకాలుగా పేర్కొనవచ్చు, వీటితో పాటుగా కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు కూడా అవసరమే. బరువు పెంచే ప్రోటీన్ షేక్స్ లను ప్రోటీన్ పౌడర్ ల ద్వారా లేదా సహజ ప్రోటీన్ ఆధారితాల ద్వారా కూడా తయారు చేయవచ్చు. తీసుకునే క్యాలోరీల సంఖ్య పెరగటానికి రోజు తినే ఆహరం మరియు పండ్లతో పాటుగా ఈ ప్రోటీన్ షేక్స్ లను కూడా తీసుకోవాలి.


స్ట్రాబెర్రీ ఓట్మీల్ షేక్

ఒక డజన్ చల్లబరచిన స్ట్రాబెర్రీ, 1 కప్పు సోయా పాలు, ఓట్స్, అరటిపండు మరియు ఒక గరిట వెనిలా ప్రోటీన్ పౌడర్ కలిపి గ్రైండ్ చేయటం ద్వారా స్ట్రాబెర్రీ ఓట్మీల్ షేక్ తయారు చేసిన వారవుతారు. స్ట్రాబెర్రీ ఓట్మీల్ షేక్ శరీర బరువు పెరగటానికి సహాయపడటమే కాకుండా, శరీరానికి కావలసిన విటమిన్ 'C' ని కూడా సమకూరుస్తుంది.


అవకాడో షేక్

అవకాడో షేక్ తయారీ కోసం, పైనాపిల్, కొబ్బరినీరు, నిమ్మరసం మరియు సోయా ప్రోటీన్ పౌడర్ ను కలిపి గ్రైండ్ చేయండి. ఈ అవకాడో షేక్ పుష్కలంగా ప్రోటీన్ లను కలిగి ఉండటమే కాకుండా, అధిక మొత్తంలో అన్-సాచురేటేడ్ కొవ్వు పదార్థాలను, విటమిన్ 'K' మరియు పొటాషియంలను కలిగి ఉంటుంది.


చాక్లెట్ బనానా షేక్

చల్లగా ఉండే అరటిపండు, సోయా పాలు, బాదం వెన్న మరియు కోకా పొడితో పాటుగా చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ లను కలిపి గ్రైండ్ చేయటం వలన చాక్లెట్ బనానా షేక్ తయారు చేస్తారు. ఈ రకమైన షేక్ శరీర బరువు పెంచటమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంచే కొవ్వు పదార్థాలను, మెగ్నీషియం మరియు విటమిన్ 'E' లను కలిగి ఉంటుంది. ఆరోగ్యకర బరువు పెంచుకోవాలనుకునే వారు, చాక్లెట్ సిరప్ లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో అధిక కొవ్వు పదార్థాలు మరియు సంవిధానపరచిన చక్కెరలను కలిగి ఉండి, అధిక క్యాలోరీలు శరీరానికి అందించబడతాయి.


వేగన్ ప్రోటీన్ షేక్

చల్లబరచిన పైనాపిల్, కొన్ని బొప్పాయిపండు ముక్కలను, జనపనార ప్రోటీన్ పౌడర్ ను, అరటిపండు మరియు నీటిని కలిపి గ్రైండ్ చేయండి. ఈ విధంగా తయారు చేసిన ప్రోటీన్ షేక్ బరువు పెంచుకోవలనుకునే శాఖాహారులకు ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఎవరైతే మాంసకృత్తులను తినే ఆహార ప్రణాళికలో కలుపుకోరో, వారి కోసమే ఈ ప్రోటీన్ షేక్ అని చెప్పవచ్చు. మాంసం తినని వారిలో ఈ రకం ప్రోటీన్ షేక్ త్వరగా శరీర బరువు పెంచుతుంది.

ప్రోటీన్ షేక్ ల రూపంలో క్యాలోరీలను తీసుకోవటం వలన అనేక మార్గాలలో శరీర బరువు పెరుగుతుంది. బరువు పెంచే సహజ ప్రోటీన్ షేక్ లను ఇంట్లోనే చల్లబరచిన పండ్లు, ప్రోటీన్ పౌడర్, విత్తనాలు పాల ద్వారా సులభంగా తయారు చేసుకోవచ్చు. బాదం పప్పు, నువ్వుల గింజలు, ఆలివ్ ఆయిల్ నుండి ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను అందించే ఆహార పదార్థాలను ప్రోటీన్ షేక్ లలో కలుపుకొని అధిక క్యాలోరీలను పొందవచ్చు.

ప్రోటీన్ షేక్ ల ద్వారా శరీరానికి క్యాలోరీలను అందించి, శరీర బరువు పెంచేటమే కాకుండా, పోషకాలను కూడా అందిస్తుంది. ప్రోటీన్ షేక్ లను తీసుకున్న తరువాత కూడా శరీర బరువు పెరగని ఎడల పోషకాహార నిపుణుల సహాయం తీసుకోండి.

No comments:

Post a Comment