నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం… ఆందోళన, మానసిక ఒత్తిడి, ప్రయాణాలు, ఎక్కువ సేపు నిలబడి
ఉండడం, ఇతర అనారోగ్య సమస్యలు తదితరాల కారణంగా నేడు అనేక మందిని
వెన్ను నొప్పి బాధిస్తోంది. దీంతో అలాంటి వారు చెప్పలేని బాధను
అనుభవించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆ నొప్పి ఇతర అనారోగ్య సమస్యలకు
కూడా దారి తీస్తోంది. అయితే కింద ఇచ్చిన పలు సహజ సిద్ధమైన టిప్స్‌ను
పాటిస్తే వెన్ను నొప్పిని ఎఫెక్టివ్‌గా తగ్గించుకోవచ్చు...
1. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో కొంత కర్పూరం వేయాలి. అనంతరం 5 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. చల్లారే దాకా ఆగి ఆ మిశ్రమాన్ని ఏదైనా బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని రోజూ సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు సమస్య ఉన్న ప్రాంతంలో సున్నితంగా మర్దనా చేస్తూ రాయాలి. దీంతో వెన్ను నొప్పి తగ్గుతుంది.
2. గోరు వెచ్చని నీటిలో కొంత యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. దీంతో వెన్ను నొప్పి మాత్రమే కాదు, ఇతర నొప్పులు కూడా తగ్గిపోతాయి.
3. కొంత గల్లు ఉప్పు (సముద్రపు ఉప్పు) తీసుకుని దాన్ని పెనంపై వేడి చేయాలి. అనంతరం ఆ ఉప్పు వేడిగా ఉండగానే దాన్ని ఒక శుభ్రమైన క్లాత్ పీస్‌లోకి తీసుకుని దాంతో సమస్య ఉన్న ప్రదేశంలో కాపడం పెట్టుకోవాలి. ఇలా చేసినా వెన్ను నొప్పి తగ్గుతుంది.
4. ఆవనూనెను వెన్నుపై పోసి బాగా మర్దనా చేయాలి. అనంతరం ఒక గంట ఆగి స్నానం చేయాలి. అయితే స్నానం వేడి నీటితో చేయాల్సి ఉంటుంది. దీంతో నొప్పి తగ్గుతుంది.
5. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల తేనెను కలిపి నిత్యం నిద్రకు ఉపక్రమించే ముందు తాగాలి. దీంతో నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు ఈ మిశ్రమం జలుబు, దగ్గులకు కూడా పనిచేస్తుంది.
6. అల్లం బాగా వేసి తయారు చేసిన టీని తాగినా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. హెర్బల్ ఆయిల్‌తో వెన్నును బాగా మసాజ్ చేసి, వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేసినా నొప్పి తగ్గుతుంది.
8. గల్లు ఉప్పుతో పైన చెప్పిన విధంగానే బియ్యంతో కూడా చేసినట్టయితే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

No comments:
Post a Comment