Saturday, February 4

సహజంగా బరువు పెరగటాన్ని ప్రోత్సహించే కూరగాయలు...

శరీర బరువు పెంచుకోటానికి కష్టపడే వారికి, శాఖాహార భోజనం లేదా వెజిటేరియన్ డైట్ ఏ విధంగానూ సహాయపడదని చాలా మంది అభిప్రాయం. అయితే ఈ ప్రతిపాదన సరైనది కాదనే చెప్పాలి. శాఖాహార భోజనం లేదా కూరగాయలు సాధారణంగా బరువు పెంచవు కానీ, చికెన్, గొడ్డు లేదా పంది మాంసాలతో పోలిస్తే, కొన్ని క్యాలోరీలను మరియు ప్రోటీన్ లను కూరగాయలు కలిగి ఉంటాయి. కానీ సరైన కూరగాయలతో కూడిన వెజిటేరియన్ డైట్ ని తినటం వలన తప్పక బరువు పెరగటమే కాకుండా, ఫిట్ గా మరియు ఆరోగ్యకర శరీరాన్ని పొందవచ్చు. 

మీరు శాఖాహరులా! శరీర బరువు పెంచుకోవాలి అనుకుంటున్నారా! అయితే పంది, చికెన్ మాంసం వలే క్యాలోరీలను అందించే ప్రత్యామ్నాయ కూరగాయలను పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోవాలి.

వెజిటేరియన్ డైట్ లో ప్రోటీన్ లను అందించే, ప్రాముఖ్యత కలిగిన అంశంగా గింజలను పేర్కొనవచ్చు. అన్ని రకాల గింజలను ఉదాహరణకు- బాదంపప్పు, పిస్తా, అక్రోటుకాయలు వంటి వాటిని పాటించే వెజిటేరియన్ డైట్ లో కలుపుకోవాలి. వీటిని స్నాక్స్ తినే సమయంలో లేదా భోజనంతో కలిపి కూడా తీసుకోవచ్చు.

విత్తనాలు, లెగ్యూమ్స్ మరియు వివిధ రకాల తృణధాన్యాలు కూడా అధిక మొత్తంలో ప్రోటీన్ లను కలిగి ఉంటాయి. వీటిని కూడా పాటించే వెజిటేరియన్ డైట్ లో కలుపుకొండి.

మీరు శరీర బరువు పెంచుకోవాలి అనుకుంటే మాత్రం- శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరమని తెలుసుకోండి. ఉదాహరణకు- కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా గల ఆహార పదార్థాలను కలుపుకోవటం వలన సత్తువ పెరుగుతుంది. వీటితో పాటుగా కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి అవసరమని మరవకండి. బీట్ రూట్, బంగాళదుంప వంటి వేరు సంబంధిత దుంపలు శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లను అందిస్తాయి.

ఐరన్ విషయానికి వస్తే, అల్పాహారంగా తృణధాన్యాలను, పచ్చని ఆకుకురాలను అనగా పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, తోటకూర వంటి వాటిని తీసుకోవాలి. శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచుకోటానికి అల్పాహారంగా బాహ్యపొరతో ఉడికించిన బంగాళదుంపను తినండి.


బరువు పెరుగుటకు పాటించాల్సిన ఆహార ప్రణాళిక

అల్పాహారంగా, అధిక పోషకాలను అందించే, 2 లేదా 3 బ్రెడ్ ముక్కలలో పాలకూర, టమోటా, ఉల్లిపాయ ముక్కలతో తయారు చేసిన సాండ్ విచ్ తినండి. పాలకూర మరియు పుట్టగొడుగులు ఆహారానికి మంచి రుచిని అందిస్తాయి. వీటితో పాటుగా ఒక గ్లాసు పాలు కూడా తాగటం మంచిదని చెప్పవచ్చు.

మధ్యాన్న భోజనంలో రైస్ నుండి పాస్తా లేదా రోటీ రూపంలో ఉండే గోధుమ, అధిక మొత్తంలో మినరల్, విటమిన్ లు కలిగిన క్యారెట్, బీన్స్ లేదా పచ్చని ఆకుకురాలను, కూరగాయలను తీసుకోవాలి.

భోజనాలకు మధ్యలో, రెండు లేదా మూడు సార్లు స్నాక్స్ తీసుకోండి. స్నాక్స్ గా పోషకాలను అందించే గింజలను తినటం మంచిది.

రాత్రి భోజనంగా, పచ్చని ఆకుకూరలతో చేసిన కర్రీ తో రైస్/ గోధుమలతో చేసిన రోటీ తీసుకోండి. తీసుకునే ఆహారానికి మంచి రుచిని జోడించుటకు, రాత్రి భోజనానికి ఒక కప్పు నిండా పెరుగు లేదా ఒక గ్లాసు పండ్ల రసాన్ని జోడించండి.

శాఖాహార భోజనం ద్వారా శరీర బరువు పెంచుకోలేమనే వ్యాఖ్యా పురాతన కాలం నుండి ప్రచారంలో ఉంది. అధిక క్యాలోరీలు అందించే ఆహార పదార్థాలను పాటించే ఆహార పదార్థాలకు కలుపుకోవటం వలన కొద్ది రోజులలోనే శరీర బరువు పెంచుకోవచ్చు.

No comments:

Post a Comment