మనదేశంలో రోజు రోజుకు డయాబెటస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువవుతున్నారు.
డయాబెటిస్ ప్రధానంగా టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఏ
తరహా షుగర్ వ్యాధి వచ్చినా దాంతో ప్రమాదమే. మనం నిత్యం తీసుకునే
ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి.
ఆవేంటో చూద్దాం...
– దాల్చిన చెక్కకు రక్తంలోని చక్కెరను అదుపు చేసే గుణం ఉంది. ఇందులో
ఇన్సులిన్ తరహా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలోని
గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. అయితే దాల్చిన చెక్కను ఎలా వాడాలంటే…
దీనికి చెందిన పొడిని 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక లీటర్ నీటిలో
వేసి మరిగించాలి. 20 నిమిషాల పాటు ఆ నీరు బాగా మరిగాక వచ్చే ద్రవాన్ని
వడకట్టి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తాగాలి. దీంతో
కేవలం కొద్ది రోజుల్లోనే షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది.
– టైప్-1 డయాబెటిస్‌ను సమర్థవంతంగా నయం చేసే గుణాలు తేనెలో
ఉన్నాయి. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా
తీసుకుంటే దాంతో వారి షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
– వెల్లుల్లిలో అలియం సాటివం అనే ఓ రకమైన రసాయనం సమృద్ధిగా
ఉంటుంది. ఇది టైప్-2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఇది వారి
రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది.
– నిత్యం ఉదయాన్నే పరగడుపున కొన్ని వెల్లుల్లి రేకుల్ని అలాగే పచ్చిగా తింటుంటే దాంతో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
– రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు కరివేపాకులోనూ
ఉన్నాయి. వీటిలోని ఔషధ కారకాలు డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నిత్యం
ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందుగా గుప్పెడు కరివేపాకు ఆకులను
తింటే దాంతో చక్కెర వ్యాధి నయం అవుతుంది.
– జామ ఆకులు కొన్నింటిని తీసుకుని నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి.
దీనికి 3 గ్రాముల జీలకర్ర పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో
కలిపి ఆ నీటిని వడకట్టి తాగేయాలి. ఇలా చేస్తే షుగర్ వెంటనే
అదుపులోకి వస్తుంది.
– ఉదయాన్నే పరగడుపున 8 గ్లాసుల నీటిని తాగి గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేసినా షుగర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
– మీఠీ పత్తి అని పిలవబడే ఓ మొక్క ఆకులు కూడా బ్లడ్ షుగర్‌ను
అదుపు చేస్తాయి. దీన్ని సహజ సిద్ధమైన తీపి పదార్థంగా షుగర్
వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు కూడా.
– బీట్‌రూట్ దుంప, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, కలబంద, వేప, తులసి
వంటి మొక్కల ఆకులను ఉదయం, సాయంత్రం తింటున్నా షుగర్ వ్యాధిని
అదుపులోకి తేవచ్చు.
– పొడపత్రి ఆకు చూర్ణం నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి అర గంట
ముందు నీళ్లలో కలిపి తాగాలి. దీని వల్ల కూడా షుగర్ అదుపులోకి
వస్తుంది.

No comments:
Post a Comment