Sunday, April 28

నువ్వులతో ఆరోగ్యం...

  1. నువ్వులతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. బీపీ, షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. నువ్వుల్లో మాంస కత్తులు, అమినోయాసిడ్‌లు సమద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం శాతం కూడా అధికంగా ఉంటుంది. నువ్వుల నూనె వాడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
  2. నల్ల నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తహీనతతో బాధపడేవారు, బలహీనంగా ఉండేవారు ఈ నువ్వులను ఆహారంగా తీసుకుంటే మంచిది. నువ్వుల్లో సెసమాల్‌ అనే యాంటీయాక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది. 
  3. ఇది హృద్రోగం నుంచి కాపాడుడుతంది. నువ్వుల్లో ఉండే మోనోశాచురేటెడ్‌ కొవ్వు శాతాన్ని నియంత్రిస్తుంది. నువ్వుల్లో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
  4. రక్తనాళాలు, ఎముకలు, కీళ్ల్లు, సక్రమంగా పనిచేసేందుకు నువ్వులు ఎంతగానో దోహదపడుతాయి. నువ్వులను తరచూ ఆహారంగా తీసుకుంటే ఉబ్బసం నివారించవచ్చు. వీటిలో ఉండే జింక్‌, కాల్షియం ఎముకలను పటిష్టంగా ఉంచుతాయి.
  5. నువ్వు మొక్కలను కాల్చి, మసి చేసి పెరుగుతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే మూత్ర పిండాల్లో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. పల్లేరుకాయలు, నువ్వు పువ్వులు, తేనె సమపాళ్లలో మెత్తగా నూరి కేశాలు రాలినచోట రుద్దితే తిరిగి జుట్టు పెరుగుతుంది.
  6. నువ్వుల నూనె చర్మాన్ని మదువుగా ఉంచుతుంది. నూనె ముఖానికి రాసుకొని మర్దనా చేసి, శనగ పిండితో నలుగు పెట్టి, గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది. పాదాలకు పగుళ్లు ఉన్నచోట నువ్వుల నూనె రాసుకొని, సాక్సులు వేసుకుంటే పగుళ్లు తగ్గుముఖం పడుతాయి.
  7. నువ్వుల నూనెలో ఒమేగా 3, 6, 9 ప్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ ఇస్తాయి. నువ్వుల నూనెను తరుచూ తలకు మర్దన చేసుకుంటే తలలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. తద్వారా జుట్టుకుదుళ్లు దఢంగా తయారవుతాయి. జుట్టు పొడిబారడం, రాలడం, పలుచబడటం తదితర సమస్యలను దూరం చేస్తాయి.

No comments:

Post a Comment