మనం నిత్యం చూసే వృక్షాలు, పువ్వులు, కాయల్లో ఎన్నో ఔషదాలు దాగి ఉన్నవిషయం
తెలియదు. అయితే పురాతన కాలం నుండి భారతదేశంలో అనేక ఆయుర్వేద మందులను
మూలికలు మరియు వేర్లను ఉపయోగించి తయారు చేస్తున్నారు. కొన్ని పూలల్లో కూడా
అద్భుతమైన ఔషదాలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మందార ఒకటి. మందార
పువ్వు ఎరుపు, తెలుపు, పసుపు, పింక్ రంగులలో ఉంటుంది. ఆయుర్వేదం మందులలో
ఎక్కువగా ఎరుపు రంగు మందార పువ్వులను ఉపయోగిస్తారు.
మందార రసం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మందార పువ్వు రేకలు మరియు ఆకుల వలన ఉన్న ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మందారను ఉపయోగించటానికి ముందు, వాటిని శుభ్రం చేసి ఫ్రిజ్ లో ఉంచాలి.మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌందర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పతాయి. ఈ మొక్క నుంచి నూనె తీస్తారు. మందార నూనెతో తలవెంట్రుకలను కాపాడుకోవడమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మందార నూనెలో తేమ ఉంటుంది. కనుక చర్మం, కేశాలను మృదువుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలకు మరింత అందాన్ని, మెరుపుని ఇస్తుంది.
ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించుకోవచ్చు. జుట్టు రాలటం తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేశాలు తెల్లబడకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉంచేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. కేశాలకు వృధాప్య చాయలు దరి చేరకుండా చూస్తుంది. చర్మం నునుపుగా ఉండేలా చూస్తుంది.

1. మందార పూలను ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా
ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆరోగ్య నిపుణులు.
2. ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు.
3. విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు.
4. మందారపువ్వును హెర్బల్ టీ, కాక్టేల్ రూపాలలోను సేవించవచ్చు. పూలను ఎండబెట్టి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలంటే… నీటిని ఉడకబెట్టిన తర్వాత ఎండిన మందార పువ్వులను అందులో వేయండి. అందులో చక్కెర, కాస్త టీపొడి కలుపుకుని టీలాగా తయారు చేసుకోండి. దీంతో హైబిస్కస్ హెర్బల్ టీ తయారవుతుంది. ప్రతి రోజు దీనిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు.
5. అలాగే కాక్టేల్ టీ కొరకు దీనిని చల్లగా చేసి అందులో కొన్ని ఐసు ముక్కలు వేసుకుని తాగితే అదే కాక్టేల్ టీ. ఇలా ప్రతి రోజు తీసుకుటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు.
No comments:
Post a Comment