చుండ్రును త్వరగా తొలగించుకోవాలంటే?
అబ్బా దురదా.. అమ్మా దురదా.. ఏం చేసేదిరా నాయనా ఓ వైపు దురద..మరో వైపు
భుజాలపై పొట్టులా రాలి నలుగురిలోకీ వెళ్ళాలంటే నామోషీగా ఉంటుంది.. ఇది
సంగతి.. చుండ్రుతో బాధపడేవాళ్ళు ప్రతీ ఒక్కరి చెప్పే బాధ..ఏన్ చేప్పేది ఎలా
వదిలించుకునేది..అర్ధం కాక నిత్యం సతమతవుతుంటారు..వీటి కోసం మార్కెట్లో
దొరికే క్రీములూ, షాంపూలు ,మరెన్నింటినో వాడుతుంటారు. కానీ పోయినట్ట్లే
పోయి మళ్ళీ అలాగే వచ్చేస్తుంది. అసలు చుండ్రు అంటే...
చుండ్రు అంటే స్కాల్ప్ పై పొడిగా, జిగురుగా ఏర్పడే పొర. దీనికి కారణాలు
బ్యాక్టీరియా, ఫంగస్ వీటి వల్ల స్కాల్ప్ పై పేరుకుపోయి చాలా ఇబ్బందిని
కలిగిస్తుంది. ఈ సమస్య నుంచీ బయటపడాలనుకుంటే చాలా రకాలైన సహజసిధ్ధగృహ
చిట్కాలు ఉన్నాయి. వాటి వల్ల చుండ్రును ఏవిధమైన ఇబ్బంది లేకుండా
తొలగించుకోవచ్చు.
చుండ్రు గురించి :-
సాధారణంగా చుండ్రు స్కాల్ప్ పై వచ్చి ఓ సమస్య. ఇది అందరినీ వారి వారి
జీవితాల్లో ఒక్కసారైనా ఇబ్బంది పెడుతుంది. నిజమేంటంటే ఇది ఒక తల పై
భాగానికి వచ్చే రుగ్మత. దీని అస్సలు శాస్త్రీయ నామం సెబోహైక్ డెర్మటైటిస్.
ఇది సాధారణంగా పొడి బారిన, ఆయిల్ చర్మం అదీ దురదతో కూడిన చర్మం తలపై
వస్తుంది. ఇది దురద అలాగే మంట వచ్చేలా చేస్తుంది. ఈ చుండ్రు మీ పరువు
మర్యాదలనే తీయటం కాక మీ ముఖం పై మొటిమలను వచ్చేలా చేస్తుంది.
చుండ్రు రకాలు (types of dandruff) :-
మొదటిగా చుండ్రు రావటానికి కారణం తలపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇంఫెక్షన్
రావటం వల్ల మొదలవుతుంది. దీనినే మలస్సేజియా అని అంటారు. తత్ఫలితంగా దురదా,
మంట, జుట్టు రాలంటం మొదలవుతాయి. దీనికి గల కారణాలు ఒకటి తల చర్మం పొడిబారటం
రెండవది వ్యాధులు . మొదటి కారణమైన పొడిబారటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది.
ఇక రెండవ కారణమైన వ్యాధులు ఇవి ఎలా వస్తాయంటే తలపై సరి అయిన సం రక్షణ
తీసుకోకపోవటం, తలస్నానం చేయకపోవటం, తలను పరిశుభ్రంగా ఉంచుకోలేకపోవటం,
సరియైన ఆహారం తీసుకోకపోవటం.
ఈ చుండ్రుని తొలగించుకునేందుకు కొన్ని చక్కని గృహ చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం..
చుండ్రును త్వరగా తొలగించుకునేందుకు కొన్ని గృహ చిట్కాలు
(Dandruff removal tips in Telugu)
బంతి, కొబ్బరి నూనె :-
ముందుగా కొన్ని 50 గ్రాములు బంతి ఆకుల్ని తీసుకుని వాటికి 250 మి.ల్లీ
కొబ్బరి నూనె కలిపి స్టవ్ పై ఉడికించాలి. దీనిలో 2 చిటికెడుల కర్పూరం
వేయాలి. అలా 15 నిముషాల పాటు ఉడికించాక ఒక బౌల్ లో దానిని తీసుకోవాలి. ఇక
రోజూ ఈ ఆయిల్ ను రాసుకోవాలి. కర్పూరం లో అవ్షధ గుణాలు ఫంగల్ కు వ్యతిరేకంగా
పని చేసి ఇంఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
మెంతులు :-
మెంతులు చుండ్రును తొలగిస్తాయి. 2 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని తీసుకుని
రాత్రి అంతా నానపెట్టి పొద్దున్నే వాటిని గ్రైండ్ చేసుకుని వాటికి 2 టేబుల్
స్పూన్స్ ఆపిల్ సైడర్ ను వెనిగర్ ను కలుపుకోవాలి. ఇలా చేసుకున్న
మిశ్రమాన్ని తలకు పట్టించుకోవాలి. ఆపిల్ సైడర్ లేకపోతే మీరు నిమ్మ రసాన్ని
వేసుకోవచ్చు.
పెసరపప్పు, ఆలివ్ ఆయిల్ :-
2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్
స్పూన్ ఆయిల్ ను ఒక బౌల్ లో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత తలకు పట్టించాలి.
ఇలా 15 నిముషాల పాటూ ఉంచుకుని చల్లని నీటితో కడుగుకోవాలి. ఇవి మన కిచెన్
లో ఉండేవే కాబట్టి మీరు తరచుగా పెట్టుకోవచ్చు.
బేకింగ్ సోడ, నీరు :-
ముందుగా 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్స్ నీటిని
తీసుకోవాలి. వీటిని చక్కగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. బేకింగ్ సోడ వల్ల
తలపై ఉన్న చుండ్రు అట్టలు అట్టలుగా మొత్తం రాలిపోతుంది. బేకింగ్ సోడా ఇలా
చాలా చక్కగా పని చేస్తుంది. అంతేకాదు ఒక్కసారో రెండుసార్లో వాడినంత మాత్రాన
ఫలితాలు ఆశించవద్దు. ఇలా తరచూ చేస్తేనే మంచి ఫలితాలుంటాయి.
తల దురదకు నిమ్మ:-
సాధారణంగా నిమ్మకాయ ఓ మంచి దివ్య అవ్షధం. అంతేకాక యాంటీ సెప్టిక్ కూడా.
కాబట్టి తలపై చుండ్రు ఎక్కువగా ఉండి దురద మిమ్మల్ని బాధిస్తే 3 టేబుల్
స్పూన్స్ నిమ్మ రసాన్ని తీసుకుని దానికి 1 టేబుల్ స్పూన్ ముల్తానా మట్టిని
కలిపి స్కాల్ప్కు పెట్టుకోవాలి. ఇలా వారానికి ఒకసారి పెట్టుకోవటం ఎంతో
మంచిది.
ఆపిల్ సైడర్, వెనిగర్ :-
మీ ఇంట్లో ఆపిల్ సైడర్ దొరుకితే అది ఖచ్చితంగా చుండ్రుని తొలగిస్తుంది.
కాకపోతే ఆపిల్ సైడర్ ను తిన్నగా తలకు పెట్టేయరాదు. దానికి నీటిని కలపాలి. 3
టేబుల్ స్పూన్స్ ఆపిల్ సైడర్ వెనిగర్ తో పాటు 3 టేబుల్ స్పూన్స్
మంచినీటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు పెట్టుకోవాలి. అయితే
వాష్ చేసుకునే ముందు కాటన్ బాల్ తో స్కాల్ప్ ని తుడుచుకోవాలి.
తల దురదకు అలోవేరా :-
మీ తలలో చుండ్రు వల్ల బాగా దురద వస్తే దానికి అలోవేరా బాగా
పనిచేస్తుంది. అలోవేరా ప్రతీ ఇంట్లో ఉండే మొక్కే. కాబట్టి అలోవేరా ఆకుల్ని
తీసుకుని దాని మధ్యలో ఉండే జెల్ ను తీసుకుని దానిని స్కాల్ప్ కి
రాసుకోవాలి. తర్వాత కొంతసేపు ఆగాక వాష్ చేసుకోవాలి.
వెనిగర్ :-
వెనిగర్ ఒక నేచురల్ యాసిడ్. దీనిని సరిపడే శాతంలో నీటితో కలుపుకోవాలి. ఈ
మిశ్రమాన్ని తలకు కాటన్ సాయంతో స్కాల్ప్ కి రాసుకోవాలి. వెనిగర్ చుండ్రుని
తొలగించటంలో బాగా పని చేస్తుంది.
ఆలివ్ ఆయిల్ :-
ఆలివ్ ఆయిల్ మీ చుండ్రును తొలగించటంలో ప్రధాన పాత్ర పోషించగలదు. ఆలివ్
ఆయిల్ ను రాసుకుని మస్సాజ్ చేసుకోవాలి. తర్వాతా వేచ్చటి టవల్ ను తలకు
చుట్టుకోవాలి. స్కాల్ప్ పై వేళ్ళతో మాత్రమే సుతిమెత్తగా మస్సాజ్
చేసుకోవాలి. ఎందుకంటే అతిగా రబ్ చేయటం వల్ల జుట్టు ఊడిపోయే ప్రమాదముంది.
కొబ్బరినూనే :-
కొబ్బరిలో చాలా యాంటీ ఫంగల్ తత్వాలున్నాయి. ఇవి చుండ్రు పై అధ్భుతంగా
పని చేస్తుంది. రోజూ తలకు పట్టించిన తర్వాత తలను మస్సాజ్ చేసుకోవాలి. ఇలా
చేసుకోవటం వల్ల చుండ్రు పోతుంది.
చుండ్రు తొలగించుకోవటానికి పెరుగు :-
పెరుగు అదీ 3-4 రోజులు పులిసిన పెరుగు చుండ్రును తొలగించగలదు. అందుచేత
పెరుగును స్కాల్ప్ కు పట్టించి 20 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా
ఎప్పుడో ఒకసారి చేయటం వల్ల సమస్య పోదు. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి
ఫలితాలోస్తాయి.
నివారణకు లిలాక్ :-
చుండ్రు లిలాక్ యాంటీ ఫంగల్ ప్రాడక్టు. దీన్ని నీం అని కూడా అంటారు. ఇది
స్కాల్ప్ పై ఉన్న ఫంగస్ను అలాగే బ్యాక్టీరియాపై బాగా పనిచేస్తుంది. మీకు
గనకు బాగా ఇట్చింగ్ అంటే దురద గనక ఎక్కువగా ఉంటే దీనిని స్కాల్ప్ పై
రాసుకుంటే అది తొలగిస్తుంది.
చుండ్రు రావటానికి గల కారణాలు
ఆయిల్ స్కిన్ ఏర్పడటానికి కారణం మన శరీరంలో ఉన్న సెబాసియస్ గ్లాండ్
ఎక్కువగా విడుదల అవ్వటం వల్ల ఈ జిడ్డుతనం వస్తుంది. అలాగే వాతావరణంలోని
దుమ్ము ధూలీ అలాగే తలపై ఏర్పడే పొర వల్ల ఈ చుండ్రు ఏర్పడుతుంది.
తల పరిశుభ్రత లేకపోవటం :-
సాధారణంగా ప్రతీ రెండు రోజులకోసారి తలస్నానం చేయాలి. అలా చేయకపోతే తలపై
దుమ్ము అలాగే జిడ్డుతనం పెరిగి ఫంగల్ ఇంఫెక్షన్ వస్తుంది. దీని వల్ల చాల
త్వరగా చుండ్రు వచ్చే అవకాశాలున్నాయి. ప్రతీ 3-4 రోజులకోసారి షాంపూ తోనో
కుంకుడుకాయలతో, షీకాకాయ తోనో తలస్నానం చేయాలి. తల పరిశుభ్రం గా ఉంటే చాలా
వరకు తలకు బ్యాక్టీరియా రాకుందా ఫంగల్ ఇంఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అందుకే
తల శుభ్రంగా ఉంచుకోవాలి.
చర్మ రుగ్మతలు :-
అన్ని అంగాలకూ రుగ్మతలు వచ్చినట్టే చర్మానికీ కూడా చాలా రకాలైన రుగ్మతలు
వస్తాయి. అవి ఏ రకంగా వస్తాయనేది. వ్యక్తిగత పరిశుబ్రత, వాతావరణ మార్పులు
లాంటివి కారణమవుతాయి. ఎప్పటికప్పుడు పరిశుబ్రత పాటిస్తే చుండ్రుకు దూరంగా
ఉండవచ్చు. చర్మరుగ్మతలు సాధారణంగా వంశపార్యతను బట్టి కూడా వస్తాయి.
ఆహారలేమి :-
ఇదీ ఒక ప్రధాన కారణమే. ఆహార అలవాట్లు సరిగ్గా పాటించకపోవటం కూడా కారణం కావచ్చు. ఆహర లేమి వల్ల కూడా చర్మం రుగ్మతలకు గురి అవ్తుంది.
చర్మంపై తామరా, ఫంగస్ :-
చర్మం పై దురదా తామర కారణంగా వస్తుంది. అలాగే ఫంగల్ ఇంఫెక్షన్ వల్ల తామర
వచ్చే అవకాసం ఉంది. స్కాల్ప్ పరిశుబ్రత పాటిస్తే ఇవి వచ్చే అవకాశాలు
తక్కువ. రోజూ షాంపూ వాడటం వల్ల మీరు తామరకు దూరంగా ఉండవచ్చు.
లావెండర్ ఆయిల్ :-
లావెండర్ ఆయిల్ తలపై చక్కగా పనిచేస్తుంది. లావెండర్ ఆయిల్ లేదా ఆలివ్
ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ స్కాల్ప్ పై చక్కగా పని చేస్తుంది. ఆయిల్
రాసుకుని సర్క్యులర్ పొజిషన్లో మస్సాజ్ చేసుకుంటే చాలా చక్కగా చుండ్రును
తొలగిస్తుంది.
టొమోటో జ్యూస్ :-
టొమోటో జ్యూస్ పీహెచ్ సమతుల్యతను ఉంచేందుకు ఉపయోగపడుతుంది. టొమోటో
జ్యూస్ లో ఉండే పోషకాలు చర్మంపై చక్కగా పనిచేస్తాయి. టొమోటో జ్యూస్ ను తలకు
పట్టించి తర్వాత చక్కగా మస్సాజ్ చేసుకోవాలి. దీనిని ఒక గంట ఉంచుకుని
తర్వాత వాష్ చేసుకోవాలి.
పెరుగు :-
పెరుగు యాంటీ బ్యాక్టీరియా గా పని చేస్తుంది. అదీ పులిసిన పెరుగు చాల
మంచిది. కాబట్టి 3-4 క్రితం పెరుగును తలకు పట్టించాలి. అంతేకాక ఇది చర్మం
పై ఉన్న మృత కణాలను తీసివేస్తుంది.
ఆపిల్ :-
ఆపిల్ చుండ్రును తగ్గించగల పండు. దీనిలో ఉన్న ప్రోక్యానిడిన్ బీ-2
వెంట్రుకలు పెరిగెందుకు బాగా తోడ్పడుతుంది. ఆపిల్ ఒక్క జుట్టు రాలటానే ఆపదు
అలాగే చుండ్రును కూడా తొలగిస్తుంది. ఆపిల్స్ ను తీసుకుని పేస్ట్ గా
చేసుకుని తలకు పట్టించాలి. 15 నిముషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
అల్లం :-
అల్లం తో నువ్వుల నూనే కలిపి తలకు రాసుకుంటే అది చుండ్రును నివారిచగలదు.
ఇది వెంట్రుకల పెరుగదలకు అలాగే ఊడతాన్ని, చుండ్రును తగ్గిస్తుంది. ఆయిల్
ను తలకు పట్టించి మస్సాజ్ చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.
టీ ట్రీ ఆయిల్ :-
టీ ట్రీ ఆయిల్ ను చర్మ సమస్యలకు మన పూర్వీకులు మంచిదని వాడేవారు.
కాస్మెటిక్స్ తో మీరు విసుగు చెందినట్ట్లైతే మీరు ఈ టీ ట్రీ ఆయిల్ ను
వాడితే మంచిది. దీనిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియా గా పనిచేస్తుంది. ఇది
చుండ్రును తొలగిస్తుంది.
చుండ్రు నివారణకు హెన్నా :-
హెన్న(గోరింటాకు) చుండ్రును సమర్ధవంతంగా తొలగించగలదు. ఇది యాంటీ
బ్యాక్టీరియా కండీషనర్ గా కూడా పని చేస్తుంది. హెన్న తీసుకుని దానిలో
కొన్ని చుక్కలు నిమ్మ రసాన్ని అలాగే ఆలివ్ ఆయిల్ ను కలిపి తలకు
పట్టించుకోవాలి. ఒక గంట పాటు ఉంచుకుకున్న తర్వాత తలస్నానం చేయాలి. ఇది
చుండ్రును తొలగించటంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.
తులసి ఆకులు :-
తులసి ఆకు అన్ని విధాల శ్రేష్టమైనది. అందుకే ప్రతీ ఇంటా భక్తి పరంగా
కావచ్చు. ఓ మంచి ఔషధం గా కావచ్చు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే
దీనిలో యాంటీ బ్యాక్టీరియా అలాగే యాంటీ ఫంగల్ తత్వాలు ఉన్నాయి. తులసి
ఆకులకు ఒక టేబుల్ స్పూన్ ఆంల ఆకుల్ని తీసికుని మిక్స్ చేసుకోవాలి. ఈ
మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిముషాల పాటూ ఉంచుకుని తర్వాత వాష్
చేసుకోవాలి.
పెరుగు :-
పెరుగు చాలా మంచిది. దీనిలో మిరియాల పొడిని కలిపి తలకు పెట్టుకుంటే
మంచిగా పనిచేస్తుంది. తలకు పట్టించుకున్న తర్వాత ఒక గంట ఉంచుకుని తర్వాత
వాష్ చేసుకోవాలి.
కోడిగ్రుడ్డు :-
కోడిగ్రుడ్డులో పోషకాలు చాలా ఉన్నాయి. ఇది తలపై చక్కగా పని చేస్తుంది.
ఒక గ్రుడ్డు ని తీసుకుని పగలగొట్టి దానిని తలకు పెట్టుకుని ఒక గంట ఆగాక
వాష్ చేసుకోవాలి. ఇలా ప్రతీ 3 రోజులకోసారి చేయాలి.
ఆస్పిరిన్ :-
ఆస్పిరిన్ టాబ్లెట్ చుండ్రుకు బాగా పని చేస్తుంది. ఒక ఆస్పిరిన్
టాబ్లెట్ ను తీసుకుని దానిని ఒక రుమాలు(కట్చీఫ్) లో చుట్టి దానిని
విరగగొట్టలి. అలాగే ఆ కట్చీఫ్ లోనే పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని నీటిలో
కలుపుకొని తలకు రాసుకోవాలి . 2 నిముషాలు మాత్రమే ఉంచి తర్వాత వాష్
చేసుకోవాలి.
తేనె కొబ్బరి నూనె :-
2 టేబుల్ స్పూన్స్ కొబ్బరినూనె తేసుకుని దానికి కొన్ని చుక్కలు తేనె
వేసి దీనిని తలకు రాసుకోవాలి. మీకు గట్టిగా పేస్ట్ లా కావాలంటే దీనికి
పెరుగు కూడా కలపవచ్చు. 10 నిముషాలు ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి.
తేలికపాటి షాంపూ :-
తేలికపాటి షాంపూలనే వాడాలి. ఎందుకంటే రసాయనాలు ఎక్కువ ఉండటం వల్ల అవి
స్కాల్ప్ పై చాల దుష్ఫలితాలు చూపించే అవకాశం ఉండీ అలాగె బాగా ఎక్కవగా
మరిగిన వేడి నీటిని వాడరాదు. దీని వల్ల కూడా చుండ్రు వచ్చే అవకాశాలున్నాయి.
No comments:
Post a Comment