- పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి బరువు తప్పక పెరగాలి.
- పిల్లల భోజనాలలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- వైట్ బ్రెడ్ కి బదులుగా హోల్ గ్రైన్ బ్రెడ్ ను తినిపించండి.
- పాల ఉత్పత్తులు అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి.
బరువు తక్కువగా ఉన్న పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు గురవకుండా ఉండాలంటే వారి శరీర బరువు పెరగాల్సిందే. పిల్లల తల్లి-దండ్రులు వారి బరువు పెరగటానికి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. అది కూడా వారి శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరగకుండా, ఆరోగ్యకర మార్గాల ద్వారా బరువు పెరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మంచి పోషకాహరం :-
పిల్లలు ఎక్కువగా షుగర్ డిసెర్ట్ వంటి క్యాలోరీలు పూర్తిగా లేని వాటిని తీసుకోవటం వలన వారు బరువు పెరగలేరు. వీటికి బదులుగా మంచి పోషకాలు మరియు అధిక క్యాలోరీలు గల ఆహార పదార్థాలను వారికి అందించటం వలన శరీర బరువు పెరుగుతుంది. కావున తల్లి-దండ్రులు ప్రతి రోజు భోజనంలో పోషకాలు ఎక్కువగా గల ఆహార పదార్థాలను సమకూర్చాలి. మీరు ప్రేమించే మీ పిల్లల కోసం పోషకాలు అధికంగా గల ఆహార పదార్థాలతో ఆహార ప్రణాళికను తయారు చేసి వాటిని అనుసరించేలా ప్రేరేపించండి.పాల ఉత్పత్తులు :-
పాలు, పెరుగు, వెన్న, చీస్ వంటి పాల ఉత్పత్తులు అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా, కాల్షియం మరియు ఐరన్ లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ రకం పాల ఉత్పత్తులు అన్ని ఫుల్-క్రీమ్ పాలతో చేస్తారు. వీటిని పిల్లలకు తినిపించటం వలన వారి శరీరంలో ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు నిండేలా చేస్తాయి. వీటికి బదులుగా, పాల ఉత్పత్తులను స్మూతీస్ లలో కూడా కలుపుకొని తినవచ్చు.
హోల్ గ్రైన్స్ :-
హోల్ గ్రైన్ వీట్, గ్రానోలా, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు, కార్న్ బ్రెడ్ మరియు పాస్తా వంటి హోల్ గ్రైన్స్ సంబంధిత ఆహార పదార్థాలు పిల్లలలో బరువు పెంచుతాయి. "యూనైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్" వారు తెలిపిన దాని ప్రకారం, బరువు తక్కువగా గల పిల్లలలో హోల్ గ్రైన్స్ లను రోజులో ఆరు సార్లు తినిపించాలని తెలిపారు.క్యాలోరీల లెక్కింపు :-
ఆరోగ్యకర క్యాలోరీలను అందించే బోన్ లెస్ చికెన్ బ్రెస్ట్ లేదా చిలకడ దుంప వంటివు పిల్లల ఆహార ప్రణాళికలో కలపండి. ఫ్రై చికెన్, లేదా ఫాస్ట్ ఫుడ్ వంటి అనారోగ్యకర క్యాలోరీలను లేదా క్యాలోరీలు లేని ఆహారాలకు దూరంగా ఉంచండి. వైట్ బ్రెడ్ కు బదులుగా అధిక మొత్తంలో పోషకాలను అందించే హోల్ గ్రైన్ బ్రెడ్ ను తినిపించండి. ఇవి మాత్రమేకాకుండా, నట్స్, డార్క్ చాక్లెట్ మరియు పచ్చని ఆకుకూరలు, పండ్లను వారి ఆహార ప్రణాళికలో కలపండి. మీ పిల్లలకు సరైన స్థాయిలో క్యాలోరీలు అందించబడని ఎడల, అదనపు ఆరోగ్యకర ఆహారాలను లేదా పాటించే ఆహార ప్రణాళికలను మార్చండి.పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ మంచి పెరుగుదల ఉండాలని ప్రతి తల్లి-దండ్రులు కోతుకుంటారు. బరువు తక్కువగా ఉండే పిల్లలు తక్కువ సమయంలో ఆరోగ్యకర బరువు పెరగాలంటే కష్టమే. ఒకవేళ మీ పిల్లలు సాధారణ బరువు మరియు ఆరోగ్యంతో ఉండి, BMI ప్రకారం తక్కువ బరువుగా ఉంటే బరువులో పెరుగుదల తప్పని సరి అవసరం.
కావున వారి ఆరోగ్యం కోసం పోషకాహార నిపుణులను కలిసి మంచి ఆహార ప్రణాళికను తయారు చేసి అనుసరించేలా తగిన జాగ్రత్తలు తెసుకోండి.

No comments:
Post a Comment