చిలకడ
దుంపలు అంటే కొందరికి చిన్నచూపు ఉంటుంది. అది సరికాదని, దీనివల్ల ఎన్నో
ఆరోగ్య సంబంధ ప్రయోజనాలున్నాయని పౌష్టికాహార నిపుణులు సూచిస్తారు. సమతుల
ఆహారంలో చిలకడదుంపలకే అగ్రస్థానం. వీటిలో తగినన్ని క్యాలరీలు మాత్రమే కాదు,
బోలెడన్ని పోషకాలున్నాయి. సాధారణంగా సంప్రదాయ పండుగల సందర్భంగా, ఉపవాస
దీక్షల తర్వాత సమతుల ఆహారం కోసం వీటిని తింటారు. ఉపవాస సమయాల్లో, ఆ తర్వాత
కూరగాయలు, గింజ ధాన్యాలకు బదులుగా ఎండించిన డ్రైఫ్రూట్స్ గింజలు,
విత్తనాలు, పాలు, చిలకడదుంపలు, పెండలం, బంగాళాదుంపలు లాంటివి వాడతారు.
చిలకడ దుంపలలో ఉండే అద్భుతమైన పోషకాలను పరిశోధించిన పౌష్టికాహార నిపుణులు
ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. సువాసనలు
వెదజల్లుతూ చిలకడదుంపలు పలురంగులలో వివిధ ప్రాంతాల్లో పండుతాయి. వంగ పండు,
ఎరుపు, పసుపుపచ్చ, తెలుపు చిలకడ దుంపలు లభిస్తాయి. విత్తనరకాలు, భూసారం,
వాతావరణం, ఖనిజ లవణాల లభ్యత తదితర అంశాల ఆధారంగా వీటి రంగు ఉంటుంది.
ఎర్రగా ఉండే దుంపలు సువాసన వెదజల్లుతుంటాయి. ప్రత్యేకించి వీటిని ఉడికించేటప్పుడు వచ్చే పరిమళం కొందరు బాగా ఇష్టపడతారు. ఎరుపురంగు చిలకడ దుంపలలోని బీటా కెరోటిన్ మూలంగా ఈ రంగు వచ్చి ఉంటుంది. బీటాకెరోటిన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎరుపురంగు అధికంగా కనిపిస్తుంది. ఇన్ని పోషక విలువలున్న చిలకడదుంప తింటే లావు అవుతామనే అపోహ కొందరిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమేనని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో గ్లిసోమిక్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువసేపు పొట్టనిండుగా అనిపించవచ్చు. అందువల్ల మితిమీరి తినకూడదు.

No comments:
Post a Comment