పిల్లలను చురుగ్గా ఉంచి, వారిలో మేథోవికాసం కలిగించడానికి క్యారెట్ చాలా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు...
- వండితే తినేందుకు కొంతమంది ఇష్టపడని క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చు. దీనివల్ల మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుంది.
- క్యారెట్‌లో విటమిన్ -ఎ ఉంటుంది. ఇది కంటిచూపునకు ఎంతో మేలు చేస్తుంది.
- పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల క్యారెట్‌లో రోగ నిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇందులోని రోగ నిరోధకశక్తి వలన కఠినమైన మొండి రోగాలు, దీర్ఘ వ్యాధులకు ఉపశమనంగా ఉంటుంది.
- క్యారెట్ ప్రకృతి సిద్ధమైన సహజ ఔషధంగా కూడా పనిచేస్తుంది.
- క్యారెట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరం ఎంతో చైతన్యవంతమవుతుంది.
- కాలిన గాయాలతో బాధపడేవారికి పచ్చి క్యారెట్ రసం గానీ, దాని పిప్పిగానీ కాలిన చోట రాసినట్లయితే, గాయం త్వరగా మానడమే కాక, చల్లగా ఉండి బాధ నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. అంతేకాక కాలిన గాయాల మచ్చలు కూడా త్వరగా మానిపోతాయి.
- చిన్నారులు క్యారెట్ జ్యూస్‌ను కొన్ని వారాలపాటు తాగితే వారికి కడుపునొప్పి సమస్య ఉండనే ఉండదు. ఎందుకంటే క్యారెట్ చిన్నారుల కడుపుల్లో ఉండే నులిపురుగులు మలం ద్వారా బయటికి వెళ్ళేందుకు దోహదపడుతుంది.
- క్యారెట్ జ్యూస్‌లోని పీచు పదార్థం పేగుల గోడలను శుభ్రం చేసి, మలినాలను బయటికి పంపించేస్తుంది.
- ఉదరకోశం, పిత్తం, వాతం, కఫం లాంటి సమస్యలకు కూడా క్యారెట్ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. క్యారెట్‌ను క్రమం తప్పకుండా ఆహారంతోపాటు తీసు కుంటే, ఇందులోని అధిక కేలరీలు చిన్నారుల మేధోవికాసానికి ఎంతగానో దోహదపడతాయి.
- క్యారెట్‌ను తీసుకోవడం వల్ల, దాని ప్రభావం మెదడుపై పనిచేసి, మెదడును ఉత్తేజపర్చడమే కాక, ఆలోచనాశక్తిని పెంచుతుంది.
- పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఇంటర్వ్యూ లకు వెళ్ళేవారు క్యారెట్ జ్యూస్‌ను తీసుకున్నట్లయితే, అది మంచి ఉత్ప్రేరకంగా పని చేసి, వాళ్ళను ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంచుతుంది.
- కీడాకారులు కూడా ఆటల్లో రాణించేందుకు క్యారెట్‌జ్యూస్‌ను సేవిస్తుంటారు. ఇది వారికి ఓ మంచి టానిక్‌లా ఉపయోగ పడుతుంది.
- రక్తహీనతను నివారించడానికి క్యారెట్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్ జ్యూస్ తప్పక సేవించాలి.
- క్యారెట్ల జ్యూస్, క్యారెట్‌ను పచ్చిగా అలాగే తింటే నోటి అల్సర్ నివారణ సాధ్య మవుతుంది.

No comments:
Post a Comment