గిల్టు నగలు ఎలర్జీ ఉన్నవారు ధరించకూడదు.
వాటిని ధరిస్తే మెడనలుపుగా తయారవుతుంది. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు...
- చెంచా పెరుగులో నాలుగైదు చుక్కలు నిమ్మరసం కలిపి ఆ మిశ్రమముతో మెడకు మసాజ్ చేస్తే మెడ నలుపు పోతుంది.
- నిమ్మరసం, పాలు కలిపిన మిశ్రమాన్ని మెడకు రాసి పావుగంట తరువాత సున్నిపిండితో కడుక్కోవాలి. ఈవిధంగా రోజూ చేస్తే మెడ నలుపు తగ్గుతుంది.
- కొందరికి మెడ మడతలలో మురికి చేరి ఉంటుంది. సబ్బుతో ఎంత రుద్దినా పోదు. అటువంటి వారు పెరుగులో బియ్యప్పిండి కలిపి మెడకు రాసి ఐదు నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మెడ శుభ్రంగా ఉంటుంది.
- క్లెన్సింగ్‌క్రీమ్ మార్కెట్లో దొరుకుతుంది. ఆ క్రీమ్ దూదితో తీసుకుని మెడకు రాసి రెండు నిమిషాలాగి తుడిచేయాలి. దీనివల్ల మెడమీద మురికి, నలుపు పోతుంది.
- ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే మెడ లావు తగ్గుతుంది.
- మెడకు ఎక్కువ చెమట పడుతుంటే మీరు నగలు ధరించాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా! అటువంటప్పుడు ఆస్జ్రిజెంట్ లోషన్‌ని దూదితో తీసుకుని మెడకు రాసి ఐస్‌క్యూబ్స్‌తో రబ్ చేయండి. తరువాత టవల్‌తో అద్ది లైట్‌గా పౌడర్ జల్లుకోండి. తరువాత మీ ఇష్టం వచ్చినన్ని నగలు ధరించవచ్చు.

No comments:
Post a Comment