Sunday, November 13

స్లిమ్‌గా ఉండాలంటే.. ఈ 10 చిట్కాలు ఫాలో చేయండి...

వింటర్లోనే కాదు సమ్మర్, రైనీ సీజన్‌లో స్లిమ్‌గా ఉండాలంటే చేయాల్సిందల్లా.. ఆహారంపై శ్రద్ధ చూపడం, వ్యాయామం చేయడమే.
* ఆహార పదార్థాలు తీసుకునేముందు వాటి కెలోరీలను లెక్కించుకోండి. ఓవర్ కెలోరీల ఫుడ్‌ను నివారించండి.
* వింటర్లో కాదు.. ఏ సీజన్లో అయినా ఫుల్‌గా మాంసం లాగించకండి. మాంసాహారం మితంగా తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరల్ని తీసుకోండి.
* ఇష్టానికి స్వీట్స్ తీసుకోకండి. ఓవర్ స్వీట్ ఫుడ్స్ ఒబిసిటీకి దారితీస్తాయి.
* వ్యాయామం చేయడం మరిచిపోకండి.
* ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఇవి కెలోరీల శాతాన్ని పెంచుతాయి.
* పరిమితంగా తీసుకోకుండా.. టేబుల్‌పై ఉన్నాయి కదా అంటూ ఇష్టపడినవన్నీ తినేయకండి.
* నీటిని ఎక్కువగా తాగండి.
* ఆల్కహాల్ సేవించకండి.
* ప్రోటీన్లు, న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకోండి.
* సమయం దొరికినప్పుడల్లా హాయిగా డ్యాన్స్ చేయండి.

No comments:

Post a Comment