రెండు వారాలలో శరీర బరువు తగ్గించుకోవటం అంత
సులభం కాదు. కానీ ఇక్కడ తెలిపిన సూచనలను తూచా తప్పక పాటించటం వలన రెండు
వారాలలో శరీర బరువు తగ్గించుకోవచ్చు...
1. గ్రీన్ టీ తాగండి :-
గ్రీన్ టీ ని సులభంగా తయారు చేసుకునే మరియు త్వరగా శరీర బరువును
తగ్గించే ద్రావణం. రోజు దీనిని తాగటం వలన అద్భుతాలను గమనించవచ్చు. రోజులో 3
నుండి 5 సార్లు గ్రీన్ టీ తాగటం వలన దాదాపు 40 శాతం వరకు కొవ్వు పదార్థాలు
కరుగుతాయని పరిశోధనలలో పేర్కొనబడింది.
2.ఉదయాన వ్యాయామాలు :-
పగలు లేదా రాత్రి సమయంలో చేసే వ్యాయామాలు వలన కరిగే కొవ్వు కన్నా ఉదయాన
చేసే వ్యాయామాలలో మూడింతల కొవ్వు కరుగుతుందని పరిశోధనలలో
వెల్లడించబడింది. కావున మీరు వీలైనంత త్వరగా ఉదయాన లేసి, కనీసం ఒక 30
నిమిషాల పాటూ వ్యాయామాలను చేయండి. 3. ఎక్కువగా నడవండి :-
పీడియో మీటర్ ను కొని, రోజు 10,000 అడుగులు నడటం వలన 100 కెలోరీలు కరించబడతాయి. మీ జీవితంలో తక్కువ ప్రయత్నంలో సంవత్సరానికి 10 పౌండ్లు తగ్గించుకున్న వారవుతారు. అంతేకాకుండా, లిఫ్ట్, ఎస్క్లేటర్ వంటి వాటికి బదులగా మెట్ల ద్వారా వెళ్ళండి.
4. సరైన సమయం పాటు నిద్ర :-
రోజు 7 నుండి 8 గంటలు పడుకునే వారి కన్నా, 6 గంటల కంటే తక్కువ మరియు 8 గంటల కన్నా ఎక్కువ సమయం పడుకునే వారి శరీర బరువు పెరుగుతుందని క్యూబెక్ లో ఉన్న "లవాల్ యూనివర్సిటీ" వారి అద్యయనాలలో నిరూపించబడింది. కావున సరిపోయేంత సమయం పాటూ పడుకొని, అటూ అతిగా నిద్రపోకుండా, తక్కువ సమయం నిద్రపోకుండా చూసుకోండి.
5. భోజనానికి ముందు నీరు లేదా కూరగాయల రసం :-
భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు లేదా కూరగాయల రసం తాగటం వలన ఆకలి
తాగుతుంది. ఫలితంగా ఆహారాన్ని ఎక్కువ తినకుండా ఉంటారు మరియు బరువు
తగ్గాలనే మీ లక్ష్యం త్వరగా నెరవేరుతుంది.





No comments:
Post a Comment