బిడ్డను కనడానికి సిజేరియన్‌ని ఎవరూ
ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో ఇది తప్పనిసరి అవుతుంది. తల్లీబిడ్డల
ప్రాణాలను దక్కించుకోవడానికి ఇదోక మార్గం. అయితే... నార్మల్ డెలివరీకంటే
సిజేరియన్ తర్వాత తల్లి శరీరంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. త్వరగా
కోలుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
- సిజేరియన్‌లో శరీరంలోని ఫూ ్లయిడ్స్‌ని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. సిజేరియన్ చేయించుకున్న వాళ్లు త్వరగా కోలుకోవాలంటే మెల్లగా కదలడం (ఇతరుల సహాయంతో) మొదలు పెట్టాలి.
- డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. దీని వల్ల త్వరగా కోలుకోవచ్చు.
- సర్జరీ జరిగిన శరీర భాగంలో తడి తగలకుండా జాగ్రత్త పడాలి.
- సర్జరీ తర్వాత చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి. లేదా వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సింపుల్ డైట్‌ని కొన్ని రోజులు ఫాలో కావాలి.
- మూత్ర విసర్జనకు ఏమాత్రం ఆలస్యం చేయొద్దు.
- సిజేరియన్ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ బరువు ఎత్తకూడదు. కొన్ని వారాలపాటు ఇది పాటించాలి. లేదంటే.. సర్జరీ అయిన శరీర భాగంలో ఒత్తిడి పెరుగుతుంది.
- నిద్రించే సమయంలో కుట్లు వేసి భాగంపై ఒత్తిడి పడొద్దు. ఇందుకు మరోవైపు తిరిగి పడుకోవాలి.
- సర్జరీ తర్వాత బిగుతుగా ఉండే జీన్స్, లెగ్గింగ్స్ వేసుకోకూడదు. ఇవి పొట్టపై ఒత్తిడి పెంచుతాయి. అంతేకాదు.. ఇది చాలా ప్రమాదకరం.
- సర్జరీ తర్వాత 40 రోజుల వరకు సెక్స్‌లో పాల్గొనకపోవడం మంచిది.
No comments:
Post a Comment