కొన్ని సార్లు ఆహారం విషయంలో
ఎన్నీ జాగ్రత్తలు పాటించినా అనారోగ్యం వెంటాడుతుంది. అలాంటి సమయంలో
పౌష్టికాహారం తీసుకున్నా ఫలితం కనిపించదు. ఎందుకంటే ఆ వ్యాధిని దూరం చేసే
యాంటీ ఆక్సిడెంట్ ఆహార పదార్థాలను తీసుకుంటేనే కొంచెం ఫలితం
కనిపిస్తుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది విటమిన్ 'కె'. ఇది గుండె సంబంధిత
వ్యాధులను, రక్తం గడ్డ కట్టడానికి, ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది.
ఇన్ని లాభాలున్న విటమిన్ 'కె' లభించే ఆహార పదార్థాలేంటో ఓ సారి
చూద్దాం...
- ఆకుకూరల్లో పుష్కలంగా విటమిన్ 'కె' లభిస్తుంది. అత్యధికంగా విటమిన్ 'కె' పాలకూరలో ఉంటుంది. పాలకూరను వారానికి మూడు సార్లు తిన్న శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇలా చేయడటం వల్ల శరీరానికి అవసరమైన 445 మై|గ్రామ్స్‌ల న్యూట్రీన్లు సమృద్ధిగా అందుతాయి.
- నల్లద్రాక్షల్లో కూడా విటమిన్ 'కె' సమృద్ధిగా ఉంటుంది. రోజూ ఒక కప్పు ద్రాక్ష పండ్లు తినటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- అలాగే కూరలో రుచి కోసం ఉపయోగించే కొత్తిమీర, కరివేపాకులో కూడా విటమిన్ 'కె' ఉంటుంది. ఈ ఆకుకూరలు ఎండిపోయినా కూడా విటమిన్లను కోల్పోకుండా ఉంటాయి.
- కూరగాయలలో ముఖ్యంగా బెండకాయలో విటమిన్'కె' ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. రెండు రోజులకు ఓ సారి తిన్నా ఆరోగ్యంగా ఉంటారు.
- గుడ్డులో కూడా విటమిన్ 'కె' పుష్కలంగా ఉంటుంది. రోజూ ఉడికించిన గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారు. గుడ్డులో ముఖ్యంగా ఐరన్, ప్రోటీన్లు, ఫోలిక్ ఆమ్లం ఉంటాయి.
- వేసవి కాలంలో ఎక్కువగా చిరుతిళ్ళు తినడానికే ఇష్టపడతారు. స్నాక్స్‌గా దోసకాయ ముక్కలను, క్యారెట్ ముక్కలను తినటం మంచిది. ఇవి శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. అలాగే అవసరమైన పోషకాలను అందిస్తాయి.
No comments:
Post a Comment