మన వంటకాల్లో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంది.
సుగంధ ద్రవ్యాలు కలిపి వండిన వంటలతో పోలిస్తే ఇంగువ కలిపి వండిన వంట
రుచికరంగా ఉంటుంది. వాసనలోనూ తేడా ఉంటుంది. దీనిని పప్పు, చారు, సాంబార్,
పులిహౌర, శాకాహార వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. తాలింపు, పచ్చళ్లలో కూడా
దీనిని వాడతారు. ఒకప్పుడు ఇంగువ లేని వంటకమే ఉండేది కాదు. ఇప్పుడు దీనిని
చాలా మంది విస్మరిస్తున్నారు. అయితే.. ఇంగువ వంటకాల్లో మాత్రమే వాడుకునే
పదార్థమనే విషయం అందరికీ తెలుసు. ఇందులో ఔషధ గుణాలు కూడా అధికంగా
ఉన్నాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అదెలాగో తెలుసుకుందాం...
- పుచ్చుపళ్లతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు కాస్త ఇంగువను ఆ పంటిపై ఉంచితే అందులో ఉన్న క్రిములు మటుమాయమ వుతాయి.
- శరీరంలో ఎక్కడైనా ముల్లు గుచ్చుకుని అందులోనే ఉంటే ఆ ప్రాంతంలో ఇంగువ ద్రావకం పోయాలి. కాసేపటి తర్వాత అది దానంతట అదే బయటికి వచ్చేస్తుంది.
- ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, ఇతర చర్మ వ్యాధులతో బాధ పడుతున్నవారు కాసింత నీటిలో ఇంగువను కలిపి ఆ ద్రవాన్ని చర్మంపై పూస్తే ఉపశమనం కలుగుతుంది.
- ఊపిరితిత్తులు, ఉదర సంబంధమైన వ్యాధులకు ఇంగువ మంచి ఔషధం.
- మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ఇంగువ చూర్ణం తీసుకోవాలి.
- కడుపులో పురుగులు ఉంటే ఇంగువను నీళ్లలో కలిపి తీసుకోవాలి.
- రోజూ భోజనంలో ఇంగువ ఉండేలా చూసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
- ఇంగువ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
- నరాలను ఉత్తేజపరుస్తుంది.

No comments:
Post a Comment