ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యంపై దుష్ప్రభావం
చూపుతోంది. ప్రతిఒక్కరూ ఏదోక శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు.
వీటిలో నడుము , వెన్ను, కాళ్ల నొప్పులు ముఖ్యమైనవి. దైనందిన జీవితంలో
ఇవొక రుగ్మతగా మారింది. దీన్ని నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని జాగ్రత్తలు
అవసరం...
- అధిక బరువు అనేది అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం. నడుము, కాళ్ల నొప్పులు రావడానికి కూడా ఇదే ముఖ్య కారణం. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు వల్ల నడుము, కాళ్లపై అధిక బరువు పడుతుంది. దీంతో నొప్పి వస్తుంది. శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవు.
- గంటల కొద్దీ కూర్చొని పనిచేసే వారు శారీరక నొప్పులతో బాధపడు తుంటారు. ముఖ్యంగా వెన్ను నొప్పి వీరిని సతాయిస్తుంది. ఇలాంటి వారికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వెన్నుకు ఆసరాగా ఉండే కుర్చీల్లో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మోకాళ్లు తుంటికి కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోకుండా అరగంటకోసారైనా నా రెండు నిమిషాల పాటు లేచి నిలబడాలి. అటూ ఇటూ నాలుగు అడుగులు వేయాలి.
- కొంతమంది డ్యూటీలో భాగంగా ఎక్కువసేపు నిలబడాల్సిన వస్తుంది. ఇలాంటి సమయంలో సాధ్యమైనంత వరకు తలను నిటారుగా పెట్టి, పొట్టను లోపలికి లాక్కుని నిలబడేందుకు ప్రయత్నించాలి. కూరున్నప్పుడు గానీ, నిలబడినప్పుడు గానీ అసౌకర్యంగా అనిపించినా కండరాలు బిగుసుకు పోయినట్టు అనిపిస్తే భంగిమను మార్చుకోవాలి.
- బరువులు ఎత్తే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నడుము నొప్పి, మెడనొప్పి వస్తుంది.
- బరువైన వస్తువులను పైకి ఎత్తేటప్పుడు నడుమును ముందుకు వంచకూడదు. ఎత్తాల్సిన వస్తువును శరీరానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మోకాళ్లను వంచి, పొట్ట కండరాలను లోపలికి లాక్కుంటూ పైకి లేపాలి.బరువు చేతిలో ఉన్నప్పుడు శరీరాన్ని పక్కలకు తిప్పకూడదు. వస్తువులను లాగడం కన్నా తోయడం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.
- ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నడుము, మెడ నొప్పులు వేధిస్తుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో శరీర పటుత్వం పెరుగుతుంది. కండరాలు బిగుసుకుపోవడం, వాపులు రావడం లాంటి సమస్యలు తగ్గుతాయి.

No comments:
Post a Comment