Saturday, May 11

రోగనిరోధక శక్తికి జొన్న..

  జొన్నల వాడకం ఈ నాటిది కాదు. చాలామందికి తెలియదు కాని క్రీ.పూ 3 వేల ఏళ్ల కిందటి నుంచి మనుషులకు  ప్రధాన ఆహారం. బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నలోనే అధిక కాల్షియం ఉంటుంది. అంతేకాదు,   ఇనుము, ప్రొటీన్లు,   పీచుపదార్థం వంటి పోషకాలు కూడా ఉంటాయి. పలు దేశాల్లో చేపట్టిన వైద్య పరిశోధనల్లో తేలిన విషయం గుండె జబ్బుల్ని అడ్డుకునే శక్తి జొన్నకు ఉంది...

  1. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికీ యాంటీ ఆక్సిడెంట్స్‌ అనేవి కీలకం. జొన్నలో ఇవి పుష్కలం. ఇందులో మనకు మేలుచేసే పోలీఫెనిక్‌ కాంపౌడ్స్‌ అధికం. తరచూ జొన్నతో చేసిన పదార్థాలను తినడం వల్ల కొవ్వు సమస్య రాదు. చెడుకొవ్వును కూడా తగ్గించే గుణం ఈ గింజలకు ఉంటుంది.
  2. ఎముకలు బలిష్టంగా ఉండేందుకు పాస్పరస్‌ చాలా అవసరం. ఒక కప్పు జొన్నల్లో 550 మిల్లీగ్రాముల పాస్పరస్‌ లభిస్తుంది.
  3. జొన్నరొట్టెలు ఎన్ని తింటే అంత మంచిది. జొన్నల్లో నరాల బలహీనతను తగ్గించే గుణం ఉంటుంది. మరీ ముఖ్యంగా విటమిన్‌ 'బి' సమృద్ధిగా దొరుకుతుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
  4. వయసు పెరిగేకొద్దీ మతిమరుపు, కంటిచూపు మందగించడం సహజం. ఈ రెండు సమస్యలు తొందరగా రాకూడదంటే జొన్నలు ఎక్కువగా వాడాలి.
  5. జొన్నల్లో పిండి పదార్థం అధికం. జీర్ణశక్తిని పెంపొందించి అందుకు అవసరమైన హార్మోన్లను వద్ధి చేస్తాయి.

No comments:

Post a Comment