Monday, May 6

వేపతో చర్మం తాజాగా...

  వేపలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికే కాదు అందానికీ మేలు చేస్తాయి. చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతాయి. వేడినీళ్లలో గుప్పెడు వేపాకుల్ని కలిపి మరిగించి, ఆ నీటితో రోజూ స్నానం చేస్తే మురికి పోవడంతో పాటూ చర్మగ్రంథులూ శుభ్రపడతాయి...
  1. వేపాకుల్ని ముద్దగా చేసి కాస్త పెసరపిండీ, చెంచా ఆలివ్‌ నూనె కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌ హెడ్స్‌, మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది. ఈ ఆకుల్ని మరగబెట్టి ఆ నీటిలో కొంచెం పెరుగు, సెనగపిండీ కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. ఇలా తరచూ చేస్తుంటే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.
  2. ఈ కాలంలో చుండ్రు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీనికోసం ఖరీదైన షాంపూలే వాడక్కర్లేదు. వేపాకుల పొడిని పాలల్లో నానబెట్టాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి, పావుగంట తరువాత తలస్నానం చేస్తే సరి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
  3. కాలంతో పనిలేకుండానే కొందరిని కాలిపగుళ్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఇలాంటప్పుడు బొప్పాయి గుజ్జులో చెంచా తేనె, చెంచా వేపాకుల పొడి కలిపి దాన్ని పాదాలకు పూతలా వేయాలి. పావుగంట ఆగి గోరువెచ్చని నీళ్లతో శుభ్ర పరుచుకోవాలి. దీనివల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి.

No comments:

Post a Comment