రాతిళ్ల్రు నిద్ర పట్టక ఇబ్బంది పడు తున్నారా.
బెడ్ ఎక్కిన తరువాత ఎంత ప్రయ త్నించినా నిద్ర రావడం లేదా. అయితే
సహజ సిద్ధమైన ఈ టిప్స్ పాటించి చూడండి...
- డమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎలాగంటే... ఎడమ వైపు పడుకుని చేతి వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి, ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శరీరంలో అధిక ఉష్ణోగ్రత వల్ల లేదా మెనోపాజ్ హాట్ ఫ్లషెస్ సమస్య వల్ల నిద్ర పట్టనప్పుడు ఈ పద్ధతి చాలా బాగా ఉపకరిస్తుంది.
- కండరాలకు విశ్రాంతి కలిగిస్తే శరీరం నిద్రపోయేందుకు సిద్ధమవు తుంది. ఇందుకు... వెల్లకిలా పడుకుని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు కాలి బొటనవేళ్లను పాదం కిందకి అదిమేలా వంచి యథాస్థితికి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు ఉపశమనం కలిగి నిద్ర మిమ్మల్ని పలకరిస్తుంది.
- కండ్లు మూసుకుని కనుగుడ్లను మూడుసార్లు గుండ్రంగా తిప్పాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. అంతేకాకుండా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ కూడా విడుదలవుతుంది.
- చేయాల్సిన పనుల జాబితాను పడక మీద గుర్తుచేసుకుంటే నిద్ర రాదు. అందుకని పడక మీదకు చేరే ముందు ఒక పేపర్ మీద చేయాల్సిన పనులన్నింటినీ రాయాలి. ఇలా చేయడం వల్ల మరుసటిరోజు ఉదయం నిద్రలేచే వరకు వాటిని బుర్రలోనుంచి పక్కకు నెట్టేయొచ్చు. Samsung Galaxy M20ర్రలో ఆలోచనల భారం దిగిపోయాక నిద్ర రాకపోవడం అనే సమస్యే తలెత్తదు.
- నిద్ర పోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. నిద్ర పట్టడం లేదు బాబోరు అంటుంటే ఇదేంటనుకుంటున్నారా.. అందులోనే ఉంది కిటుకు. దీన్నే 'స్లీప్ పారడాక్స్' అంటారు. ఇందులో భాగంగా కళ్లను విప్పార్చి 'నేను నిద్రపోవడంలేదు' అని పదేపదే అనుకోవాలి. సాధార ణంగా మెదడు ప్రతికూల విషయాలను సరిగా ప్రాసెస్ చేయదు. అందుకని మీరు నిద్రపోవద్దని చెప్పుకునే మాటల్ని నిద్రపోవడానికి ఇచ్చే సజెషన్స్‌గా భావిస్తుంది. కంటి కండరాలు కూడా అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు అని చెప్తున్నారు సైకోథెరపిస్టులు.
- బుర్రలో ఉన్న బాధల భారాన్ని బయటికి పంపేయాలంటే ప్రాపంచిక విషయాలను రివర్స్‌లో గుర్తుచేసుకోవాలి. మీరు ఆ రోజున మాట్లాడిన విషయాలు, చూసిన ప్రదేశాలు, విన్న ధ్వనులు.. వంటి అన్ని విషయాలను వెనక నుంచి ముందుకు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల మానసికంగా నిద్రకు సిద్ధమవుతారు. దాంతో నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఉండదు.
No comments:
Post a Comment