Thursday, May 23

ఇంట్లోనే ఫేస్‌ప్యాక్స్‌...

   వేసవిలో ఎక్కువగా చర్మం కమిలిపోతుంటుంది. ముఖం, చేతులపై సూర్యకిరణాలు పడి చర్మంలో కాస్త తేడా వస్తుంది. మరి చర్మం కమిలిపోకుండా మన ఇంట్లోనే చేసుకునే ఫేస్‌ ప్యాక్‌లేంటో తెలుసుకుందాం...
  1.  చాలామంది చర్మం కమిలిపోయిందే అని బ్లీచింగ్‌ చేయించడం, లేదంటే వెంటనే ఇతర కాస్మొటిక్‌ ట్రీట్‌మెంట్స్‌ని వెతుక్కోవటం చేస్తుంటారు. వీటి వల్ల వెంటనే చర్మంలో మెరుగుదనం వచ్చినట్లు కనిపిస్తుంది. అయితే అది దీర్ఘకాలికంగా ఉండదు. అందుకే కాస్త సహనంతో ఎండ తాకిడికి గురైన చర్మాన్ని నేచురల్‌ హౌమ్‌రెమెడీస్‌తో నయం చేయవచ్చు.
  2. విరివిగా కూరల్లో వాడే టమాట చక్కటి బ్యూటీ ప్రోడక్ట్‌. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సన్‌టాన్‌ని తొలగించటంలో టమటా ముఖ్యపాత్ర పోషిస్తుంది. టమోటాని బాగా గుజ్జు చేసి దానికి ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఓట్స్‌ పిండి కలిపి మిక్స్‌ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత నీళ్లతో వాష్‌ చేసుకోవాలి. ముఖంలో కాంతి వస్తుంది.
  3. ముఖ వర్చస్సు పెంచడంలో నిమ్మరసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంతో పాటు, సమస్య ఉన్న మిగిలిన ప్రాంతాల్లో నిమ్మకాయని సగానికి కట్‌ చేసి డైరెక్ట్‌గా చర్మంపై అప్లై చేసుకోవచ్చు. నిమ్మరసానికి కాస్త తేనె కలిపి పట్టించుకోవచ్చు. డ్రై అయిన తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే స్కిన్‌ మెరిసిపోతుంది.
  4. సూర్యకిరణాలకు దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపర్చడానికి ఆలూ పర్ఫెక్ట్‌. ఇందులో ఉండే 'సి' విటమిన్‌ మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌లాగా ఉపయోగపడుతుంది. తొలుత ఆలుగడ్డపై ఉండే తోలు ఒలిచిన తర్వాత మెత్తగా చూర్ణం చేయాలి. దీనికి తగినంత నిమ్మరసం కలిపి కమిలిన ప్రాంతంలో అప్లై చేసి అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రపరచుకోవాలి. చక్కటి ఫలితం ఉంటుంది.
  5. శరీరానికి దోసకాయ చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే దోసకాయ అంటే అందరికీ ఇష్టం. ఇక ఇందులో ఉండే విటమిన్‌ 'సి' చక్కటి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. దోస ఫేస్‌ ప్యాక్‌ చేయటం చాలా సులువు. ముందు దోసకాయని జ్యూస్‌లాగా చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి. దీనికి తగినంత పరిమాణంలో నిమ్మరసం, రోజ్‌వాటర్‌ కలిపి మిక్స్‌ చేయాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ని ముఖంతో పాటు కమలిన చేతులకి అప్లై చేసుకోవాలి. అరగంట ఆగాక కడిగేసుకోవాలి. ఇలా ఓ నాలుగుసార్లు దోసకాయ ఫేస్‌ప్యాక్‌ని వాడితే మునుపటిలా స్కిన్‌లో గ్లో వస్తుంది.
  6. అలోవెరా చర్మకాంతికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎండకు వాడిపోయిన చర్మానికి చక్కటి గ్లో తెస్తుంది. డైరెక్ట్‌గా అలోవెరా రసాన్ని మాయిశ్చరైజ్‌ చేస్తే ముఖంలో వెలుగు రావటంతో పాటు సున్నితత్వం వస్తుంది.

No comments:

Post a Comment