Thursday, May 23

అలసట తీర్చే కొబ్బరి నీళ్లు...

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకతి సిద్ధంగా లభించే కొబ్బరి బోండాలు శ్రేష్ఠమైనవి. పుష్కలమైన లవణాలు, పోషక విలువలు ఉండే కొబ్బరి నీళ్లు శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో ప్రతి ఒక్కరికీ దివ్యౌషధంలా పని చేస్తాయి...
  •   కొబ్బరి నీరు అలసట, వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నీళ్లల్లో లవణాలు, పోషక పదార్థాలు, రోగ నిరోధక శక్తి ఆధికంగా ఉంటుంది. రక్తం శుద్ధి అవుతుంది. కంటిచూపు మెరుగు పడటమే కాకుండా జ్వరం, జలుబు ఉన్నవారికి టానిక్‌లా పని చేస్తుంది. వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో మంట తగ్గిస్తుంది. శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది.
  •   ఈ నీటిలో పొటిషియం, సోడియం, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, కాఫర్‌, సల్ఫర్‌, క్లోరైడ్‌లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీటిలో ప్రొటీన్ల శాతం ఆవుపాలలో కంటే ఎక్కువగా ఉంటాయి.
  •   కొబ్బరి నీళ్లు రోజూ తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్‌ఎటాక్‌ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు.
  •   తక్కువగా నీరు తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తరచూ తాగడం వల్ల చిన్నసైజ్‌ రాళ్లు త్వరగా కరిగిపోతాయి. అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.
  •   కొబ్బరి నీళ్లను రెగ్యులర్‌గా తాగడం వల్ల డీ హైడ్రేషన్‌ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే కొబ్బరి నీళ్లు మంచిగా పని చేస్తాయి. అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.
  •   కొబ్బరి నీరు జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉంటే ఇలాంటి తిమ్మిర్లు వస్తాయి. అయితే కొబ్బరి నీరు పొటాషియం స్థాయిని పెంచుతుంది. దీంతో కండరాల తిమ్మిరి సమస్య ఉండదు.
  •   బాగా అలసిపోయినపుడు కొబ్బరి నీళ్లు తాగితే చాలు. మీరు వెంటనే కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు.
  •   ఈ నీటిని తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. జుట్టు నిగనిగలాడుతుంది. వీటన్నింటి కోసం మీరూ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే చాలు.

No comments:

Post a Comment