1.రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే కంటి సంబంధ సమస్యలు వెంటనే దూరమవుతాయి. క్యారెట్లలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి దృష్టి సంబంధ సమస్యలను పరిష్కరిస్తాయి. చూపు స్పష్టతను పెంచుతాయి.
2.ఇటీవల స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువైంది. దీనికి తోడు బయట తిరగడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆ ప్రభావం కళ్లపై కూడా పడుతుంది. రోజూ పగటి సమయంలో కనీసం 3 గంటల పాటు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ ఒత్తిడి నుంచి సులభంగా బయటపడవచ్చు.
3.రోజులో కొంత సమయం పాటు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతిని చూడండి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఎంతగానో హాయి కలుగుతుంది. ఇది కళ్ళకు పూర్తి స్థాయిలో హాయినిస్తుంది.
4.కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువగా ధరించే వారు రోజులో కొంత సమయం పాటు వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. దీని వల్ల లెన్స్‌ల ద్వారా కళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది.
5.కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేసేవారు అవసరమైతేనే వాటిని వాడాలి. లేదంటే దూరంగా ఉండాలి. వీలైనంత వరకు కంప్యూటర్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
6.కళ్లను నిత్యం కొంత సమయం పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి కలుగుతుంది.
7.రోజూ ఒక అరగంట పాటు గోరు వెచ్చని తడి గుడ్డతో కళ్లను సున్నితంగా ఒత్తినట్టు చేయాలి. ఇది కళ్లకు హాయినిస్తుంది.
కంటి చూపు పెరగడానికి: -
*********************************
పొన్నగంటికూర పచ్చిరసము లీటరు తీసుకొని అందులో త్రిఫలాల బరక చూర్ణము వేసి సన్నటి మంటపయి
అరళీటారు మిగులువరకు కాచి వడపోసుకొని అందులో పావు లీటరు ఆవునెయ్యివేసి సన్ననిమంటపయి నేయి మిగులువరకు కాచి నిలువచేసుకొని రోజు ఉదయం రాత్రి ఒక స్పూన్ బొజనానికి ముందు తీసుకొవాలి,
ఇలా రోజు క్రమం తప్పకుండా 3 నుంచి 6 నెలలవరకు చేస్తె మీ కంటి చూపు డెగ కంటి చూపు వలె అవుతుంది.
అలాగే రోజు స్వచ్చమైన ఆవునెయ్యిని బోజనంలో రోజు రెండు స్పూన్లు తీసుకొవాలి,
No comments:
Post a Comment