అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పెదాల పై
భాగంలోనే వస్తుంటే చికాకు వేస్తుంది. వాటిని అత్యంత సులభంగా ఎలా
తొలగించుకోవాలో చూద్దాం...
- ఒక టేబుల్ స్పూన్ పసుపులోకి కొన్ని పాలు పోసి బాగా కలియబెట్టాలి. అది పేస్ట్‌లాగ తయారవుతుంది. అయిదు నిమిషాల తరువాత.. పై పెదవి పైభాగాన రాసుకోవాలి. అరగంటకు పొడిబారి చెక్కలాగ మారుతుంది. అప్పుడు దాన్ని మెల్లగా తొలగించుకుని చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
- పంచదారను ఒక నిమిషం పాటు పాన్ మీద వేగించాలి. చల్లారిన తరువాత.. అందులోకి నిమ్మరసాన్ని కలిపితే చిక్కటి పేస్టు అవుతుంది. దీని ద్వారా కూడా పెదవి పైనున్న రోమాలను వదిలించుకోవచ్చు.
- మరో సులువైన చిట్కా పసుపులోకి కొంత నీటిని కలిపి పేస్ట్‌లాగ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పై పెదవి మీదున్న రోమాలపై రాసుకోవాలి. అరగంట తరువాత పొడిబారుతుంది. వేలితో గట్టిగా అటూఇటూ రుద్దితే పొడిలా రాలిపోతుంది. కాసేపయ్యాక సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
- గుడ్డులోని తెల్లసొనలోకి కార్న్‌ఫ్లోర్, పంచదార వేసుకుని బాగా కలియబెట్టాలి. దీన్ని రోమాలున్న చోట రాస్తే సరి. కాసేపయ్యాక గట్టిపడుతుంది. దాన్ని మెల్లగా తొలగిస్తే రోమాలు తొలగిపోతాయి.
- పెరుగు, శనగపిండి, పసుపుల మిశ్రమం కూడా ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ పేస్టును రాసుకున్నాక పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండాలి. ఆ తరువాత రబ్బింగ్ చేసుకుని.. చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుంటే చక్కటి ఫలితం లభిస్తుంది.
No comments:
Post a Comment