Wednesday, September 21

వంటింటి చిట్కాలు :- గృహినికి ఉపయోగకరమైన...

1. ఉల్లిపాయలను తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే పొట్టు ఒలిచిన తర్వాత మధ్యలోకి కట్ చేసి నీటిలో వేసి పదినిమిషాల తర్వాత తరగాలి. 
2. బాదం పప్పును మరిగేనీటిలో పదినిమిషాలపాటు ఉంచి ఒలిస్తే పొట్టు సులభంగా వస్తుంది.
3. మార్బుల్ రాతి మీద కురగాయలను తరుగుతుంటే కత్తి పదును పోయి త్వరగా మొద్దు బారుతుంది. కాబట్టి చాపింగ్ బోర్డు వాడడం మంచిది. మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు అందుబాటులో ఉంటున్నాయి కాని ఉడెన్‌ చాపింగ్ బోర్డు వాడితే ఆరోగ్యానికి మంచిది. 
4. కూరలలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వేయించిన వరిపిండిని కలపాలి. పప్పులో ఒక స్పూను రిఫైన్‌డ్‌ ఆయిల్‌ లేదా రెండు వెల్లుల్లి రేకలు వేసి వండినట్లయితే గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గుతుంది. 
5. కూరగాయలను ఉడికించేటప్పుడు ముందుగా నీటిని వేడిచేసి అప్పుడు ముక్కలను వేయాలి. ఎక్కువ సేపు నీటిలో ఉండేకొద్దీ పోషకాలు నశిస్తుంటాయి. కాబట్టి నీటిలో ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇదొక పద్ధతి. 
6. పనీర్‌ ను బ్లాటింగ్‌ పేపర్‌ లో చుట్టి ఫ్రిజ్‌ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. పదిహేను రోజుల వరకు వాడవచ్చు. రెడీమేడ్‌ పనీర్‌ను ప్యాక్‌ ఓపెన్‌ చేసిన తరువాత వారం రోజుల్లో వాడేస్తే మంచిది. 
7. వంట త్వరగా పూర్తవ్వడానికి కూరగాయలను చిన్న ముక్కలుగా తరుగుతుంటారు. అలాంటప్పుడు వాటిలోని విటమిన్లు ఆవిరైపోతుంటాయి. అందుకే పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి. 
8. వంట చేయడానికి కూరగాయ ముక్కలు తరిగిన తర్వాత కడిగే అలవాటుంటే మాత్రం వెంటనే మానుకోవాలి. ఇలా చేయడం వల్ల విటమిన్లను నష్టపోతాం. 
9. కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత కూడా తెల్లగా ఉండాలంటే ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళలో రెండు టీ స్పూన్ల పాలు కలపాలి. 
10. చిక్కుళ్లు, పచ్చిబఠాణీలు, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ పంచదార కలిపితే సహజమైన రంగుని కోల్పోవు.

No comments:

Post a Comment