- కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి.
- కోసిన ఉల్లిపాయలు సగమే వాడినప్పుడు పాడవటం పదేయ్యటం జరుగుతోందా? అయితే వాడగా మిగిలినదానికి కాస్త వెన్న రాసి చూడండి, తాజాగా ఉంటుంది.
- కప్ అడుగు బాగంలో టీ మరకలు ఎండిపోతే కాస్త ఉప్పు చల్లి నీళ్ళు పోసి నానా పెడితే అవి సులువుగా వదిలిపోతాయి.
- బెండకాయ, వంకాయ వంటి కూరలు రుచిగా ఉండాలంటే నూనె లో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే సరిపోతుంది.
- cooker అడుగుబాగం నల్లగా మారితే అందులో గ్లాస్ నీళ్ళు పోసి కాగితం పరిస్తే మరునాడుకి తెల్లబడుతుంది.
- గుడ్డులోని పచ్చ సొన వంట గది గట్టు మీద పడితే ఆ ప్రాంతంలో ఉప్పు చల్లి గంట తరువాత కాగితంతో తుడిస్తే మారక ఆనవాళ్ళు ఉండవు.
- దోసల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
- వేడిచేసిన గరిటతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా తాజాగా ఉంటుంది.
- బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పట్టదు.
- పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి వేస్తే సరిపోతుంది.
- పిండిలో పావు కప్పు వేయించిన సేమియా వేస్తే, గారెలు మరింత రుచిగా ఉంటాయి.
- అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.
- ఇడ్లీ దోస పిండి మరునాటికి పులవకుండా ఉండాలంటే, గిన్నె మీద తడి వస్త్రం కప్పాలి లేదా సోడా ఉప్పు వెయ్యాలి.
- మజ్జిగ పలచన అయితే పది కరివేపాకు రెబ్బలు, కాస్త ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే చిక్కపడతాయి.
- వెన్న కాచేటప్పుడు నెయ్యి తాజా గా ఉండి మంచి వాసన వస్తు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే గిన్నెలో ఒక తాజా తమలపాకు వేసి కాచితే సరి.
- పుదినా కొత్తిమీర చెట్నీ చేసేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
- వెల్లుల్లిని fridge లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి, పోట్టుకూడా సులువుగా వస్తుంది.
- కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, decoction లో చిటికెడు ఉప్పు వేసి చూడండి.
- పావుగంట పాటు వేడి నీళ్ళలో నాన పెడితే బాదం పొట్టు సులువుగా వస్తుంది.
- ఆపిల్ ముక్కల మీద నిమ్మ రసం రాస్తే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
- క్యాబేజీ కూర వండేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది.
- కూరలు చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.
- మరీ జిడ్డు పేరుకుపోయిన పాత్రలను తోమడానికి ఉప్పులో ముంచిన నిమ్మ చెక్కలతో తోమి పాత పత్రికలతో రుద్దితే సరి.
- ఒకసారి వేసిన వడ లని మళ్ళి వేయిస్తుంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి, దీన్ని నివారించేందుకు వడ లని ఒక నిమిషం మాత్రమె వేయించండి. ఆ వెంటనే tissue కాగితంపై ఉంచండి. అధిక నూనె సమస్య ఉండదు, వడలు కరకరలాడతాయి.
- ఆకు కూరలు ఉడికించిన నీటిని వృధాగా పారెయ్యకుండా soup ల తయారీలో వాడుకోవచు.
- ఫ్లాస్కులని ఎంత సుబ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగితే సరి.
- బొంబాయి రవతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
- కూరల్లో పులుసులో ఉప్పు కారం ఎక్కువయ్యినప్పుడు రెండు చెంచాల సెనగపిండిని వేయించి కలిపితే సరిపోతుంది.
- మరీ నిల్వ ఉంచిన సెనగపిండిని పారవేయ్యకుండా స్టీలు గిన్నెలు వెండి సామాన్లను తోమితే చక్కగా సుబ్రపడతాయి.
- వొంట గదిలో చీమలు బారులు తీరాయా? అయితే అవి ఉన్న చోట నిమ్మరసం చల్లండి.
- పాలలో మీగడ ఎక్కువగా రావాలంటే కాచడానికి ముందు పాల గిన్నెను చల్లటి నీటిలో ఉంచండి.
Sunday, September 18
వంట వార్పూ, వంటింటి పరిసుబ్రత మరియు ఇతర వంటింటి చిట్కాలు -2
Labels:
Kitchen Tips
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment