Sunday, September 4

వినాయక పత్రి లో ని ఆరోగ్య రహస్యాలు...

1. బృహతీ పత్రం (వాకుడు ఆకు) :- ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది.
2. మాచీ పత్రం (ధవనం):- ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది
3. బిల్వపత్రం (మారేడు ఆకు) :- మధు మేహం(షుగర్ వ్యాధి), విరేచనాలకు విరుగుడుగా పని చేస్తుంది
4. దూర్వాలు పత్రం (గరికె -గడ్డిజాతి) :- రోగ నిరోధకంగా పని చేస్తుంది
5. దత్తూర పత్రం (ఉమ్మెత్త):- ఊపిరితితులను వ్యకోచింపజేస్తుంది. ఉబ్బసం తగ్గేలా చూస్తుంది
6. బదరీ పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు
7. తుర్యా పత్రం(తులసి):- శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. జలుబు తగ్గిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి.
8. అపామార్గ పత్రం(ఉత్తరేణి): దగ్గు ,ఉబ్బసవ్యాధులపై బాగా పని చేస్తుంది.
9. చూత పత్రం(మామిడి ఆకు):- నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది. ఏనుగు తన దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఈ ఆకులే తింటుంది.
10. జాజి పత్రం(జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంబంధ వ్యాధులపై మంచి గుణం చూపిస్తుంది.
11. గండకీ పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది
12. అశ్వత్థ పత్రం (రావి ఆకు): చాల ఓషధగుణాలు ఉన్నాయి ఇందులో…. అనేక ఆయుర్వేద ఔషధాల్లో కలుపుతారు.
13. అర్జున పత్రం(మద్ది ఆకూ):- రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.
14. అర్క పత్రం (జిల్లేడు ఆకు) :- నరాల బలహీనత ఉన్నవారికిది దివ్య ఔషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.
15. విష్ణు క్రాంతం(పొద్దు తిరుగుడు):- దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది. ఇది చెంతఉంటే సౌందర్యశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదట.
16. దాడిమీ పత్రం (దానిమ్మ):-వాంతులు,విరేచనాలు, అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.
17. దేవదారు (దేవదారు చెట్టు):- దీని ఆకులు శరీర వేడిని తగ్గిస్తాయి. 

18. మరువక (మరువం):- మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
19. సింధువార పత్రం(వావిలాకు):- కీల్లనోప్పులకు మంచి మందు
20. శమీ పత్రం(జమ్మి చెట్టు):- నోటి వ్యాధులను తగ్గిస్తుంది
21. కరవీర పత్రం(గన్నేరు):- గడ్డలు,పుండ్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు.

No comments:

Post a Comment