- కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి, బద్రపరుచుకుని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వొస్తుంది.
- ఫ్లాస్క్ ని ఎంత సుబ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగ తో కడిగితే సరి.
- బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
- వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి.
- ఆమ్లెట్ కు అదనపు రుచి రావాలంటే సోనకు కొబ్బరి కోరు జోడించాలి.
- సూప్ ను పొయ్యి మీద నించి దించాక రెండు చెంచాల పాల మీగడ కలిపితే చిక్కదనంతో పాటు అదనపు రుచి తోడు అవుతుంది.
- తరిగిన బంగాళ దుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వినేగార్ చల్లితే చాలు.
- తేనె సీసాలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు చేరవ్.
- అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజా గా ఉంటుంది.
- బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
- సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.
- అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేస్తే సరి.
- వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా వస్తుంది.
- నిలవ పచల్లకు ఆవ నూనెను వాడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
- కాలిఫ్లోవేర్, పాలకూర వంటి వాటిని శుబ్రం చేయటానికి నీటిలో కొద్దిగా వినేగార్ కలపండి.
- కరివేపాకుని ఎండ పెట్టి పొడిచేసి కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.
- గుడ్లను ఉడికించే నీళ్ళల్లో కాస్త ఉప్పు వేస్తే అవి పగిలిపోకుండా ఉంటాయి.
- కిలో గోధుమలలో గుప్పెడు సనగలు చేర్చి మరపట్టిస్తే చపాతీలు తెల్లగా మరియు రుచిగా ఉంటాయి.
- బత్తాయి రసం తీసాక గింజలను వేరుచేసాక మిగిలిన గుజ్జులో పంచదార కలుపుకొని తింటే రుచికరంగా ఉంటుంది, చక్కటి పోషకాలు అందుతాయి.
- అరటిపండు పువ్వులను fridge లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన మారిపోతుంది.
- పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో గుప్పెడు వేపాకులు వేస్తే సరి.
- రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.
- పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా తయ్యరైతే దానిమీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే సుబ్రపడుతుంది.
- snack వంటకాల్లో కారానికి బదులు మిరియాల పొడిని వేస్తే రుచిగా ఉంటుంది.
- పచ్చి బటానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
- బియ్యం, తృణ ధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేఖలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి.
- గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బునీళ్ళలో వినేగార్ కలిపి రుద్దితే పోతాయి.
- వాడేసిన నిమ్మచేక్కలతో లంచ్ boxes ని రుద్దితే వాసన రాకుండా ఉంటాయి.
- ఇత్తడి రాగి పాత్రలను మగ్గిన అరటిపండు గుజ్జుతో తోమితే కోత్తవాటిలా మెరుస్తాయి.
- నిమ్మరసం లో ఉప్పు కలిపి వంట గది గట్టుని రుద్దితే జిడ్డు పోతుంది.
- పులుసు కూరలో చింతపండు రసానికి బదులు టమాటా గుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి.
Monday, September 19
వంట వార్పూ, వంటింటి పరిసుబ్రత మరియు ఇతర వంటింటి చిట్కాలు-1
Labels:
Kitchen Tips
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment