రాగులని మొక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసి బాగా ఉడికించి జారుగా జావకాచి తయారుచేసిన ఆహారపదార్ధం అంబలి .
ఇందులో రుచికోసం ఇష్టాన్నిబట్టి జీడిపప్పులు , వేరుశనగ పప్పులు , పచ్చకర్పూరం , జాజికాయ , కిస్మిస్ వంటివి కలుపుకోవచ్చు. లేదా ఉప్పు , కారం , కొంచం మోతాదులో మసాలా కూడా కలుపుకోవచ్చు . అంబలి ఆకలిని , రుచిని కలిగిస్తుంది. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వలన శక్తివంతంగా తయారవుతారు. ఇది చలువచేస్తుంది. అన్నహితాన్ని కలగజేస్తుంది.అలసటని పోగొడుతుంది.
రక్తపోటు ,
షుగర్ వ్యాధి ఉన్నవారికి , రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నవారికి , నీరసంతో
క్షీణించిన వారికి , అమితమైన వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా
ఉపయోగకరం .
అంబలి అంటే ధాన్యపు పిండితో కాచిన జావ మొలకెత్తిన ధాన్యంతో జావకాస్తే జీవనీయ విలువలు మర్రిన్ని శరీరానికి అందుతాయి. ధాన్యాలలోకెల్లా రాగులు శ్రేష్టం .
అందుకని రాగిఅంబలి గురించి మీకు తెలియజేస్తున్నాను. బియ్యపుపిండితో కూడా అంబలి చేసుకోవచ్చు . అది కెలోరీలు పెంచుతుంది . కొన్ని వ్యాధుల్లో అపకారం చేస్తుంది .
బలాకరంగా , వీర్యపుష్టిని ఇచ్చేదిగా రాగి అంబలి మేలు చేస్తుంది . ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా రాగి అంబలి తాగడం వలన శరీరదృడత్వం పెరుగుతుంది. స్థూలకాయం సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి ఉదయం రాగిఅంబలి తాగడం శ్రేయస్కరం.

No comments:
Post a Comment