- అరటి, బంగాళ దుంప ముక్కల మీద ఉప్పు నీళ్ళు చల్లి పావుగంట అయ్యాక వేపుడు చేస్తే ముక్కలు బాగా వేగుతాయి.
- వెల్లుల్లి రెబ్బల్ని గంటపాటు నీళ్ళల్లో నాన పెట్టి పొట్టు తీస్తే సులువుగా వస్తాయి.
- ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక తడి చేత్తో అద్దితే సరిపోతుంది.
- గుడ్లను ఉడికించే నీళ్ళల్లో రెండు చెంచాల వినెగర్ కలిపితే అవి పగిలిపోకుండా ఉంటాయి.
- పిండి వంటలు చేసేటప్పుడు బాణలిలో నూనె పొంగాకుండా ఉండాలంటే, మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి … అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
- సగానికి కోసిన ఆపిల్ ముక్కలు నల్లగా రంగు మారకుండా ఉండాలంటే, తెల్లని బాగంలో ఉప్పు రాయాలి.
- మిగిలిపోయిన బ్రెడ్ను కాసేపు ఓవెన్ లో ఉంచి పొడి చేసి పులుసులో వేసుకుంటే రుచిగా ఉంటుంది.
- పులిహొర చేసేటప్పుడు అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వెన్న కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది.
- పచ్చి కొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మ రసం పూస్తూ ఉంటె వారం వరకు తాజాగా ఉంటాయి.
- ఇంగువ గడ్డ కడితే, ఆ డబ్బాలో నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తే పొడిగా అవుతుంది.
- టమాటాలు వండటానికి ముందు పదినిమిషాల పాటు వేడినీటిలో నానపెడితే వంటకాలు రుచిగా ఉంటాయి.
- కోడిగుడ్డు పెంకులను కిటికీలు ventilators వద్ద పెడితే, క్రిమి కీటకాలు చేరవు.
- cauliflower తో వంటలు చేసేటప్పుడు అందులో కాసిని పాలు కలిపితే, వంట మరింత రుచిగా ఉంటుంది.
- కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిటికెడు ఇంగువ కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
- ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే, అవి త్వరగా పండుతాయి.
- పుదినా కొత్తిమీర చట్ని రంగు మారకుండా ఉండాలంటే చేసిన వెంటనే నిమ్మరసం పిండితే సరిపోతుంది.
- పెసర పిండిలో నిమ్మరసం కలిపి వెండి సామాగ్రిని రుద్దితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.
- పచ్చిమిర్చిని కొసాక పంచదార కలిపిన చల్లటి నీళ్ళతో చేతుల్ని కడిగితే మంటగా ఉండదు.
- ఆకు కూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే కూర సహజ రంగుని కోల్పోదు.
- బంగాల దుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి.
- వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
- ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే త్వరగా వేగుతాయి.
- గుడ్డులోని సొనకు పాలు కాస్త పంచదార కాస్త కలిపితే మరింత రుచిగా ఉంటుంది.
- కందముక్కలను ఉడికించే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే, అవి త్వరగా ఉడుకుతాయి.
- ఇంట్లో చేసుకునే తమటా సూప్కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్రూట్ ముక్క వేస్తే, రంగు పోషకాలు రెండు అందుతాయి.
- వంటకాలు తక్కువగా పీల్చుకోవాలంటే అందులో అరచెంచా వెనిగర్ని కలిపి చూడండి.
- కాచిన నెయ్యిలో నాలుగు మెంతులు వేస్తే కమ్మటి వాసన వస్తుంది.
- పచ్చి మిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయిన్చేతప్పుడు పేలకుండా ఉంటాయి.
- బియ్యం నిల్వ చేసిన డబ్బాలో, గుప్పెడు పుదినా ఆకులు వేస్తే పురుగులు పట్టవు.
- అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యం లేదా సెనగపప్పు వేస్తే మెత్త బడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
- వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలను వేస్తే, మంచి వాసన వస్తుంది.
Tuesday, September 20
వంట వార్పూ, వంటింటి పరిసుబ్రత మరియు ఇతర వంటింటి చిట్కాలు -3
Labels:
Kitchen Tips
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment