- * అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
- * నిలువ పచ్చళ్ళకు ఆవ నూనెను వాడితే అవి ఎక్కువ రోజులు పాడవకుండా తాజాగా ఉంటాయి.
- * అరటి పువ్వులను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన, రంగు మారిపోతుంది.
- * పప్పులు, ధాన్యాలు, పిండి, బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులు వేస్తే పాడవకుండా ఉంటుంది.
- * టీ కప్ అడుగు భాగంలో టీ మరకలు పోవాలంటే ఉప్పు నీళ్ళతో కడిగితే మరకలు సులువుగా వదులుతాయి.
- * పచ్చి బఠానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
- * కాఫీ మరింత రుచిగా ఉండాలంటే డికాషన్‌లో చిటికెడు ఉప్పు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
- * బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
- * కూరలో చింతపండు రసానికి బదులు టమాటా గుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి. కూరల రంగు మారకుండా ఉంటుంది.
Sunday, September 18
వంటింటి చిట్కాలు:- కాఫీ డికాషన్‌లో చిటికెడు ఉప్పు వేస్తే...
Labels:
Kitchen Tips
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment